23, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3466

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్"

(లేదా...)

"మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్"

58 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    నానాయోధులు చావు తప్పి పరువుల్ నగ్నమ్ముగా పెట్టగన్
    సూనుండాదట సోదరిన్ ముదమునన్ చూపించగన్, హాయిగా
    కానంగానట కాంగ్రెసోత్తములహో గాంధీది వంశంబునన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పేరంటములో:

    గానంబుల్ పలుచేయగా వనితలే కంగారు లేకుండగన్
    ఫేనంబున్ కడు కల్గు క్షీరమునహో వేగంబుగా పాత్రనున్
    పానీయంబని త్రాగగా మురియుచున్ బంగారు నా పౌత్రియౌ
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి


  3. మీసాల మగవాడు :)



    దాని మగనిపై మక్కువ
    మీనాక్షికి, మీసమెంతొ మేలుగ నొప్పెన్
    వానికి యనుచు మురిసి య
    ద్దానికి హత్తించు నూనె తనరారంగన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మానిని చేపట్టుచు లా
    ఠిని, పోలీసు విధిలోన ఠీవిగ రౌడీ
    లను శిక్షించెడి క్రమమున
    మీనాక్షికి మీసమెంతొ మేలుగనొప్పెన్

    మీసం పౌరుష లక్షణమను కొన్నచో


    ఆనందంబిడు వేల్పుబోనమునకై
    యన్యోన్య సాహాయ్యమున్
    నానాపాట్లను దేవదానవులు మాన్యంబైన పీయూషమున్
    పానంబున్ వడిసేయగా నురుకగా
    పంచంగ విచ్చేసినన్
    మీనాక్షింగని మేలుమేలనిరహో, మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన కందము

      మానిని లాఠిని చేగొని
      పూనిక రౌడీలబట్టి పూజలు సేయన్
      చానలు మెచ్చుచు బలికిరి
      మీనాక్షికి మీసమెంతొ మేలుగనొప్పెన్

      తొలగించండి
    2. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి


  5. మీనాక్షి పెండ్లి చూపుల నాటి ముచ్చట్లు :)


    యానామందున దక్కె భర్త యని సాయంత్రమ్ము దీవించిరా
    మీనాక్షిం గని, మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్
    దానింద్రిప్పుట నైజమే యనుచు విస్తారంబుగా ద్రిప్పగా
    దానిన్ చక్కగ వాడు దువ్వి క్షణమందారేడు మార్లున్ భళీ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ( మీనాక్షి అనే అమ్మాయి భీముని పాత్రలో
    జీవించి ప్రేక్షకుల మన్నన లందుకున్నది )
    మానిని భీముని పాత్రను
    మానుగ నటియించి జనుల మనముల దోచన్ ;
    మేనుల మరచుచు ననిరిటు
    " మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్ ."

    రిప్లయితొలగించండి
  7. మానంబే సకలంబనంగ నిజ ధీమంతాదులౌనేతలున్
    నానాడందరు పడ్డ కష్టములు నీనాడందరున్ దెల్వగన్
    తానాజీ వలె రూపమొంద నువిదన్; తత్క్రీడ వీక్షించ మున్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్


    వానాకాలము వద్దురా యనగనీ వానల్వడన్; జిహ్వ జి
    వ్వనంగన్ దగ వేడి వేడి రుచులన్ వాంఛింప తావీయకన్
    నానాకష్టములొంది సంతజని మీనంబుల్ గొనన్ నత్తరిన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జివ్వనంగన్' అన్నచోట గణభంగం.

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మానసమును మెచ్చించుచు
    యా నెలతలు నాడినట్టి నాటకమందున్
    భానుజుని వేషమందున
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్.

    ఆనందమ్మును గూర్పగా దలచుచు న్నావీధినిన్ కోమలుల్
    జానైవ్యాపితమైన భారతమునున్ చందమ్ముగా నాడగా
    నానావేషము లెంచి ప్రేక్షకులటన్నాహ్లాదమున్ కర్ణుడౌ
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మెచ్చించుచు నా నెలతలు...' అనండి.
      'జానైవ్యాపిత'?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు.
      జానై = అందమునై ; వ్యాపిత = వ్యాప్తిచెందిన - ఈ అర్థంలో వాడినాను. అయిననూ, పద్యాన్ని మారుస్తాను క్రింది విధంగా.
      ఆనందమ్మును గూర్పగా దలచుచు న్నావీధినిన్ కోమలుల్
      గానాలాపనతోడ భారతమె విఖ్యాతమ్ముగా నాడగా
      నానాప్రేక్షకకోటియున్నెలమితో నానాటకమ్మందునన్
      మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

      తొలగించండి
  9. నానా పాత్రలు దాల్చుచు
    మానిని రంగ స్థల మున మన్నన బడసెన్
    తానొక వేషము వేయగ
    మీనాక్షి కి మీస మెంతొ మేలుగ నొప్పెన్

    రిప్లయితొలగించండి
  10. నేనొక పిల్లిని పెంచితి
    మీనాక్షిగ పేరుపెట్టి మిగుల ముదమ్మున్
    మానక నాచుట్టు తిరుగు
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్.

    రిప్లయితొలగించండి
  11. నానా పాట్లును పడుచును
    నే నాడితి నాటకమ్ము నెలతగ యొకచో
    ఛీ! నగుబాటాయె ననగ
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్

    రిప్లయితొలగించండి
  12. ఆననమున కనులు వెలిగె
    మీనాక్షికి; మీసమెంతొ మేలుగ నొప్పెన్
    భానుసమానుడగు పతికి;
    ఆ నవదంపతుల జూడ హ్లాదము నిండెన్!

    రిప్లయితొలగించండి
  13. మీనంబులవంటికనులు
    "మీనాక్షికి, మీసమెంతొ మేలుగ నొప్పెన్
    మీనాక్షిమగడుశివునికి
    చానకుశివునికికుదిరెనుచక్కనిజోడీ

    రిప్లయితొలగించండి


  14. మోచేతిమీసము అదృష్ట సూచకమట



    ఆనుచు మోచేతిపయిన
    మీనాక్షికి, మీసమెంతొ మేలుగ నొప్పెన్!
    చానకు పరువంపు వయసు
    వానికి మోజాయె దాని పై పెండ్లాడెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    ఈ పద్యమును చదివి ఎంతమంది *మేలు మేలు* అంటారో చూడాలి మరి

    ఏనా అందనిదానఁగాను., మరి మీరేమో వయోభేదవి..
    జ్ఞానంబించుకలేదు.,మూతిపయి మీసంబుల్ మెలిన్ ద్రిప్పువా....
    రే నా పొందును పొంద *మేల* నుడు., నేనెవ్వానినో పిల్తునన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. ఆనా డచ్చట నిద్రబోవు చెలికిన్ హాస్యార్థమై బాలికల్
    మేనున్ రంగులతోడ దిద్ది రటపై మించంగ నుత్సాహ మ
    ద్దానిన్ లేపిరి యద్దమందు ముఖమంతన్ జూపి తామప్పు డా
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్.

    రిప్లయితొలగించండి
  17. .............శంకరాభరణం.........
    23/08/2020..ఆదివారం

    సమస్య
    *** ****

    మీనాక్షింగని మేలు మేలని రహో మీసంబంలన్ గల్గినన్

    నా పూరణ. శార్ధూలము
    **** *****

    నానా రీతిగ తెల్లవారు వగ లన్యాయమ్ముగా నీయగన్

    తానెంతో పగతో ననిన్ జరిపె నేతాజీ సుభాష్ బోస్ కదా!

    తానా పాత్రను వీధి నాటకమునన్ దాల్చంగ పూబోణి..,యా

    మీనాక్షింగని మేలు మేలని రహో మీసంబంలన్ గల్గినన్

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  18. తానొక యుత్తమ యిల్లాఁ
    లానారి పనులను మున్గ, రారమ్మనగా
    తానెదిరించగ మగనిని
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్.

    -యజ్ఞభగవాన్

    రిప్లయితొలగించండి
  19. ఆనాటి భీముడెవ్వరు
    ఈనాటి తుపాకిరాముడేచూడుడుభల్
    తానేవేషము వేసిన
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్.
    2)
    గానంగ చోద్యమయ్యెను
    మీనయ్యనువాని వేషమేసిన దెవరే
    ఈనంగనాచియేనా
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్.

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆనందమ్మును గూర్పగా దలచుచు న్నావీధినిన్ కోమలుల్
    గానాలాపనతోడ భారతమె విఖ్యాతమ్ముగా నాడగా
    నానాప్రేక్షకకోటియున్నెలమితో నానాటకమ్మందునన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
  21. మానుగమగవేషమిడగ
    మీనాక్షి కి మీసమెంతొ మేలుగ నొప్పెన్
    చానయు కాదని పలికిరి
    నానావిధములుగ జనులు నాడున గనుచున్

    రిప్లయితొలగించండి
  22. చీనాంబరమొప్పెను గన
    మీనాక్షికి; మీసమెంతొ మేలుగ నొప్పెన్
    ఆ నిటలాక్షున కాహా
    మానౌ చిత్తరువు జూడ మది పులకించెన్

    రిప్లయితొలగించండి
  23. రీనా!వినుమాయీయది
    మీనాక్షికిమీసమెంతొమేలుగనొప్పెన్
    గనదగునెవ్వరువ్రాసిన
    గనినంతనెవేగబడక కాంచుమునిజమున్

    రిప్లయితొలగించండి

  24. పిన్నక నాగేశ్వరరావు.

    గానము చేయుచు పద్యం
    బా నాటకమందు భీమ పాత్ర ధరించెన్
    రాణించె వేషధారణ
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్.

    రిప్లయితొలగించండి
  25. తానీదుచు సంద్రమ్మున
    రాణీగ సువర్ణ వర్ణ రాజస మొప్పన్
    తూనీగల్లెను దిరిగెడు
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్

    రిప్లయితొలగించండి
  26. ఆ నీలాకాశ నిభ
    మ్మా నీలాభ్ర సదృశమ్ము నా మీసమ్ముం
    దా నరసె భర్త యందున్
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్


    ఆనందమ్ము నిజాత్మ లందుఁ గర మేపారంగ సంపత్క రీ
    శానీ దివ్య కృపార సాత్త వర కాసారమ్మునం దిర్గెడిన్
    నానా జాతి వరాండజ ప్రతతి విన్యాస ప్రపూర్ణంబునన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    [అక్షి = ద్వయము]

    రిప్లయితొలగించండి
  27. కందం
    తానొక నాట్యమయూరిగ
    నానారూపాల నర్ధనారీశ్వరుడై
    రాణించఁగ సగమందున్
    మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్!

    శార్దూలవిక్రీడితము
    కూనల్ లేరన నార్తితో మధురలో గొల్వంగ సర్వేశ్వరిన్
    దానే కూతుగ నింటఁ బుట్టెనని తద్నామంబునే గూర్చుచున్
    సూనన్ దీర్చఁగ సుందరేశు సగమౌ సొంపారు రూపంబునన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
  28. 23.08.2020
    అందరికీ నమస్సులు 🙏

    *కం*

    మానము కాపాడ దలచి
    మానక నే పనిని తాను మగవాని వలెన్
    వైనము రోసమున నిలుపు
    *"మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  29. శా:

    నానా కష్టములోర్చి విద్యనరయన్నైపీయ సై నిల్వగన్
    మానంబెంచక స్త్రీల పట్ల నతిగా మాట్లాడు దుర్మార్గులన్
    కేనారమ్ము లనూడ దీసి నికపై కే యన్న దండించెడిన్
    మీనాక్షింగని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    కే=ఒక విధమైన అరుపు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. పానమ్మారవ ప్రాణమంచు పతి యాపానమ్ములో నుండగా
    జ్ఞానమ్మెంతయొ కల్గినట్టి సతి యజ్ఞానుండెయౌ పాయియౌ
    ప్రాణేశుం గొనితేను తా బురుష రూపంబందు తా వెళ్ళగా
    మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
  31. ఈనారక్తముమర్గుచున్నదిదిగోయీవేళయోపుత్రకా!
    మీనాక్షింగనిమేలుమేలనిరహోమీసంబులన్ గల్గినన్
    కానిగాననిమీసముల్ గనియహోగంపంతజేయంగనౌ
    నేనాడైననునీకుహానిగలుగన్ నీడేర్చెనేగార్యముల్

    రిప్లయితొలగించండి
  32. ఆనాడాడిన నాటకమ్మునను నాట్యమ్మున్ రహిన్ జేయగా
    తానానందముతోపలాశనునిగా దైర్యమ్ముతోఁ , దున్మగా
    శ్రీనాథుండట మోహినై నిలువగా జేకొట్టుచున్ బ్రేక్షకుల్
    మీనాక్షిం గని, మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్

    రిప్లయితొలగించండి
  33. జ్ఞానానందముగోరిభక్తతతిజిజ్ఞాసార్తులర్థార్థులున్
    మీనాక్ష్యాలయప్రాంగణంబునమహామృత్యుంజయున్శంభునిన్
    మీనాక్షింగనిమేలుమేలనిరహో;మీసంబులన్గల్గినన్
    ధ్యానావస్థితద్వారపాలకులసందర్శించిహర్షించరే

    రిప్లయితొలగించండి
  34. ఆనందంబు జనించ గోపుర విహారా
    రామ సుక్షేత్రము
    న్నా నాగేశుడు సుందరేశు దరి నా
    నాశోభలన్ వెల్గెడిన్
    మీనాక్షిం గని మేలు మేలనిరహో; మీసంబులన్ గల్గిన
    న్నానృత్యంబుల ద్వారపాలకుల యాహ్వానంబు రంజిల్లగన్!


    రిప్లయితొలగించండి
  35. జ్ఞానానందమయుండుశంకరుడుసాక్షాదర్థనారీశుడై
    సానిన్గొగొల్చెడుశక్త్యుపాసకులకున్సాక్షాత్కరించెన్శివా
    మీనాక్షింగనిమేలుమేలనిరహో;మీసంబులన్గల్గినన్
    జ్ఞానాకారుడుదర్శనంబిడెమహాశైవార్చకాశాఖకున్

    రిప్లయితొలగించండి