26, ఆగస్టు 2020, బుధవారం

సమస్య - 3469

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె"

(లేదా...)
"నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్"

62 కామెంట్‌లు:

యెనిశెట్టి గంగా ప్రసాద్ చెప్పారు...

సీతనపహరణమ్మున చింతగలిగె
శాంత మేమాత్రమునులేక శక్తులుడుగ
కదనరంగాన మరణము గాంచు నపుడు
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె!!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"శ్రీ రాముని దయ చేతను..."

నడిరేయి సరదా పూరణ:

దాస్యమ్మున్ వడి పారద్రోలగనహో తంటాలనున్ సైచుచున్
సస్యశ్యామలమైన గ్రామముననున్ శ్లాఘమ్ములన్ పొందగన్
నాస్యంబైనది శైత్యమున్ విడువగన్ నాటమ్మునన్ చీదుచున్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

రామలీల నాటకములో:

దోస్యమ్మున్ విడి నేల కూలగనయో దుర్మార్గులన్ పోరుచున్
నాస్యంబందున శ్వాసమున్ విడుచుచున్ నందమ్ము కోల్పోవగన్
హాస్యంబున్ భళి చేసి లక్ష్మణునకున్ హన్మానునున్ పంపుచున్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

seethadevi gurram చెప్పారు...

లాస్యంబాడగ మీసముల్ యమిత
నిద్రావస్థలో మోముపై
హాస్యంబించుక గాదు వానిని
సునాయాసంబుగా లేపగన్
నస్యంబిమ్మని రావణుండడిగె, విన్నాణంబుగా రామునిన్
దాస్యుండౌనటు జేయగాదగిన నీ
తమ్ముండు మేల్కాంచగా

sitharamayya solasa చెప్పారు...

నగరియందు రామకథను
నాటకముగ
వేయువేళన నందలి వేషధారు
లందరును సేద గొనుచుండ నందునున్న
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె

seethadevi gurram చెప్పారు...

చైత్ర నవమినాడు పగలు రాత్రియనక
గ్రామమందున నాడగ రామకథను
నిదురకాగక తేనీరు పెదవినిడుచు
రావణుడు నస్యమిమ్మని రామునడిగె

Zilebi చెప్పారు...



నాటకమొకటి మధ్యన నాలుగైదు
నిమిషముల వ్యవధానము; నిమ్మళమ్ము
గాన పాత్రధారులు మాట కలిపి రపుడు
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె



జిలేబి

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

నస్యమును బీల్చు నలవాటు నాపలేక
రమ్యముగ నాడుచుండెడి రావణవధ
నాటకము మధ్య సెదదీరు నట్టి వడిని
రావణుడు నస్యమిమ్మని రాము నడిగె.

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సమస్య :
నస్యంబిమ్మని రావణుండడిగె వి
న్నాణంబుగా రామునిన్

( సురభి నాటక కళాకారులు గాత్రసౌలభ్య
దాయకమైన నస్యంకోసం తెరలో ...)
ఆస్యంబందున నెన్నొ భావముల నా
టాడించి సంతోషమన్
సస్యాలన్ రసికావతంసుల మదుల్
సమ్మోహముల్ జేయుచున్ ;
లాస్యాలన్ జరిపించు పద్యముల నా
లాపింప భావించుచున్ ;
" నస్యం బి " మ్మని రావణుండడిగె వి
న్నాణంబుగా రామునిన్ .
(ఆస్యము - ముఖము ; సస్యాలన్ - పైరు లతో ; లాస్యాలన్ -సుకుమారనాట్యాలను)

vsnmhari చెప్పారు...

ఆస్యంబందు బొగాకు చుట్ట, యుదరం బందున్ సురా యుక్తుడై
లాస్యం బెల్లెడ జేయువా డొకడు వాలాయంబుగా వాగుచున్
హేస్యాలా! వినుమంచు బల్కెను గదా యీరీతి "యుద్ధంబునన్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్"

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

లాస్యంబాడెను రామరూపకమునన్ లంకేశుడై గొప్పగా
నస్యంబున్ గొను వాడుకన్ నిలుపలేనాతండు నావేళనున్
నస్యంబందున బాధరేగి వ్యవధానంబందునన్ వేడుచున్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామాయణంలో నస్యమా?

Zilebi చెప్పారు...



కందివారివ్వాళ సెలవా :)


లాస్యాయొక్కతె నాట్యమాడి నిలిపెన్ లావైన కాయంపు వా
డాస్యోటన్ తన కొప్పుపైన తురిమెన్ డ్రామా జిలేబీయమే!
హాస్యమ్మాయె ప్రధానమైన కథ ! బాహాటమ్ముగా మధ్యలో
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్!


జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
'నాస్యంబు'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
'నాస్యంబు'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మీసముల్+అమిత' అన్నపుడు యడాగమం రాదు. "మీసముల్ మిగుల..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సేదదీరు'ను 'సెదదీరు' అన్నారు. "నాటకము మధ్య విశ్రాంతి నందువేళ" అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

విరించి చెప్పారు...

వీధి నాటకములు వేయు బృంద మొకటి
పట్టణానికి పయనించు పాళమందు
దారి మధ్యన విశ్రాంతి గోరు వేళ
రావణుఁడు నస్యమిమ్మని రాము నడిగె.

BULUSU V S MURTY చెప్పారు...

నాటకమునకు వేళాయె నడువమన్న
ఏమి నాటకమో కాని యిపుడు ముందు
జలుబు విపరీత మాయెను జర నొసగుము
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

నస్యమున కల వాటైన నాయకుండు
హాస్య మాడుచు నొకపరి యనియె నిట్లు
సమరమును నిల్పి వాంఛ తో సరస ముగను
రావణుడు నస్య మిమ్మని రాము నడిగె

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మొదటి పాదం లో నస్య మలవాటు గానున్న నాయకుండు అని సవరణ చేయడమైనది

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


🙏

నాస్య = [నాసా+యత్, నాసాయాం భవమ్] ముక్కులో వుండునది.

....ఆంధ్రభారతి

(కిట్టింపు)

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

హాస్యంబించుకలేదు., కష్టపడి సన్న్యాస్యాకృతిన్ జేరి., నే.
నాస్యాస్ఫారితభీతికారకుడనై యాశించితిన్ జానకిన్
సస్యంబీమె., రణమ్ము జేయుటకునై సౌమాంచితంబైనదౌ
నస్యంబిమ్మని రావణుండడిగె విన్నాణంబుగా రామునిన్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

విరించి చెప్పారు...

సస్యంబుల్ విరివిన్ ఫలించె ననుచున్ సంతృష్టులై వేడ్కగా
లాస్యంబాడగ నిశ్చయించుకొనిరా రామాయణమ్మున్ జనుల్
హాస్యాలాడుచు వారుకూడిరట యభ్యాసంబుకై నత్తరిన్
నస్యంబిమ్మని రావణుండడిగె విణ్నాణంబుగా రామునిన్.

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏🙏

seethadevi gurram చెప్పారు...

లాస్యంబాడగ మీసముల్ ప్రబల
నిద్రావస్థలో మోముపై
హాస్యంబించుక గాదు వానిని
సునాయాసంబుగా లేపగన్
నస్యంబిమ్మని రావణుండడిగె, విన్నాణంబుగా రామునిన్
దాస్యుండౌనటు జేయగాదగిన నీ
తమ్ముండు మేల్కాంచగా

BVVHBPrasadarao చెప్పారు...

లంకకును చేటుఁదెచ్చిన రాజెవండు?
శాస్త్రి యేమని పల్కె భేషజముతోడ?అవని వీడగ కైకేయి యెవనినడిగె?
రావణుడు-నస్యమిమ్మని-రామునడిగె

Raja Rao చెప్పారు...

కె.వి.యస్. లక్ష్మి:

రాము రాజు ననెడివారు రక్తి గూడి
రామ రావణ పాత్రలు రమ్యముగను
నటన జేయుచు తెరచాటు నందు రాజు
రావణుడు నస్య మిమ్మని రాము నడిగె.

Raja Rao చెప్పారు...

గురువుగారికి నమస్కారములు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జర' అన్యదేశ్యం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"అభ్యాసార్థులై" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Surya చెప్పారు...

నస్యంబున్ దగ బీల్చు వాడితడయో నాకెట్లు ప్రాప్తించె నా
లస్యంబాయెను నాటకంబు నిక నారంభింపుడో యన్గనే
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
హాస్యంబైనను హద్దు దాట నపహాస్యంబౌనయో జూడగా

subbarao చెప్పారు...

నాటకంబునువేయుచు నడుమనడుమ
రావణుడు నస్యమిమ్మనిరామునడిగె
పొడెమునలవాటు గలవారుపుచ్చటుడివి
యడుగుకొందురు జగతిని విడువలేక

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.

నస్య మలవాటు కల్గిన నటులు వారు
సమయమెంతయో గడచె నస్యమ్ము పీల్చి
యనుచు కౌతుకమ్మును నాపుకొనగ లేక
నాటకము మధ్యలో తెరచాటు కేగి
రావణుడు నస్యమిమ్మని రామునడిగె.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వింత నా కిందుఁ దోఁచదు సుంత యేని
రామ రావణు లనిశమ్ము రామ రామ
ప్రీతి నొందుదు రిద్దఱు పీల్చి పీల్చి
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె


సస్యశ్యామల భారతావనినె దుశ్చారిత్రు దుర్బ్బుద్ధి కా
మ స్యాలభ్య మనోరథ మ్మగునె సంభావ్యంబు నిత్యం బనా
లస్యన్ సీతను దప్తకాంచన మయ శ్లాఘ్యమ్ము వైదేహి దౌ
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

[నస్యము = ముక్కున ధరించు ముక్కుపుడక; కామ స్యాలభ్య మనోరథము: అలుక్సమాసము ]

subbarao చెప్పారు...

లాస్యంబొందిననాటకంబున నహోలజ్జావిహీనుండునై
నస్యంబిమ్మనిరావణుండడిగెవిన్నాణంబుగారామునిన్
నస్యంబించుకబీల్చబాడగుగదానాళాలుశీఘ్రంబుగా
నస్యంబక్కటప్రాణహానియునుదానైజేర్చునాశమ్మునున్

chandrashekhar yelisetty చెప్పారు...

ఒక నాటకం లో భాగంగా గురు శిష్యుల సంభాషణ గా ఈ పద్యము:

శా:

శిష్యున్డా యిటు రమ్మటంచు బిలువన్ శ్రీ రామ వేసమ్ముకై
హాస్యంబూనిన మోముతో నిలుచ నాహార్యంబు గైకొన్మనెన్
యిస్యానా, మరి మీరు రావణుడునై యింపారు టెట్లన్నచో
నస్యంబింమ్మని రావణుండడిగె విన్నాణంబుగా రామునిన్

ఇస్యానా=ఉపకారము (నిఘంటు శోధన)

వై. చంద్రశేఖర్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనగ' అన్నదానిని 'అన్గ' అనరాదు. "ఆరంభిపగా గోరగా..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పుచ్చటుడివి'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మోముతో నిలువ... గైకొమ్మనెన్.." అనండి.

శ్రీహర్ష చెప్పారు...

హాస్యస్ఫోరక మైన ఘట్టమును నేనావేదికన్ జూచితిన్
లాస్యంబా! తెర వెన్క యంకమున పాత్రల్ వీడి వైరంబునే
సస్యోత్పన్నము లైన సారములతో సంధించుచున్ సఖ్యతన్
*నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
హాస్యమేలేని యాహార్యమనఁగఁ బల్కె
"జలుబు బాధమించె తమరి శరపుధాటి"
పలుకులెంచఁగ తెరపైన వర్తకమన
"రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె!"

శార్దూలవిక్రీడితము
ఆస్యంబుల్ వగపించి శైత్యమున మీ యస్త్రోద్ధతిన్ మించనెన్
హాస్యస్ఫోరకమించుకైనఁ గన నాహార్యంబునన్ లేకయే
లాస్యంబేమని చింతఁజేయ తెరపై ప్రాకట్యనన్ దీరుగన్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

(వాణిజ్య ప్రకటనకర్తలకు పౌరాణిక పాత్రలొక లెక్కా వారితో ఏమైనా పలికించఁ గలరు...)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదములు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నస్యమొకపట్టుదట్టింప నాశమగును
మేనిలోనున్న రుగ్మతల్, మేలుగూర్చు
నంచునాటకమారంభమవకమున్నె
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నస్యమును పీల్చు వాడట నయముగాను
నాటకములు వేయుచు మధ్యన నాయకుడగు
పాత్రధారిని వైరియౌ పంక్తి గళుడు
రావణుడు నస్యమిమ్మని రామునడిగె.

Raja Rao చెప్పారు...

గురువు గారికి నమస్కారములు