10, సెప్టెంబర్ 2020, గురువారం

దత్తపది - 171

కవిమిత్రులారా,
జుట్టు - కన్ను - ముక్కు - చెవి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. హనుమంతుని లంకాదహన ఘట్టం...🙏🏻🙏🏻🙏🏻

    మ||
    గెలువన్ జానకి జాడ వాయుసుతుడున్ గీజుట్టుచున్ ప్రాంతమున్
    పలు దైత్యాదులకన్నుపట్టు వదలింపన్ జ్వాలలన్ రేపగన్
    స్థలమూలోజ్వలముక్కుకాడలను నిస్సారంబు గావించగన్
    వెలుగన్ జూచె విభిన్నవర్ణములయన్ భీమాగ్ని లంకాపురిన్!

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    గీజు = పీకులాట, ఉట్టు = పొంగుట
    అన్నుపట్టు = గర్వము
    ఉక్కుకాడ = భవనాన్ని ఎత్తు ఇనుప కాడలు

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా కిట్టింపు:

    రావణాసురుడు:

    ఆముక్కంటికి సేవజేసి రణమున్ హ్లాదంబుగా జొచ్చుచున్
    రామున్ సైన్యము జుట్టుముట్టి ఘనమౌ రాకాసి రౌద్రంబుతో
    "నాముందెవ్వడు నిల్వజాలడ"నుచున్ "నాకన్న నౌత్సాహియై"...
    కాముండౌచును భ్రాంతినిన్ నిలిచె విజ్ఞానంబు కోల్పోవుచున్

    (ఇదే ఎక్కువ...ఇంతకన్న చేతకాదు)

    😊

    రిప్లయితొలగించండి
  3. మండోదరి ఉవాచ
    శూర్పణఖ కన్నుకుట్టగ సీతదెచ్చి
    పెద్దల హితవు పెడచెవి బెట్టితీవు
    సూర్యవంశపు వీరుడు జుట్టుముట్టి
    ముక్కడంచును రణమున మూల్యమదియె

    రిప్లయితొలగించండి
  4. నేటి శంకరా భరణము వారి సమస్య

    కన్ను,జుట్టు,చెవి, ముక్కు


    పై పదములు అన్యార్ధములో
    ఉపయోగించి రామాయణములో
    పూరణము

    సీసములో నా పూరణ

    అసురల మాయాలా ?? ఆర్తితో
    లక్ష్మణా సీతా యనుచు పిలిచె, వినబడెను

    నాకు,నీ కేమాయె, నాదు నాధు నికాప
    దల్ జుట్టు ముట్టెగా,త్వరిత గతిని

    వెడలక యిచట నీ వెటుల తా‌ త్సారము
    జరుపుచు నుంటివి సంది యమ్ము

    కలుగుచు నుండెను కాంక్ష నా పైకల్గె ,ముక్కుటము దాల్చగ మోహ మేల

    కలిగె, తెలిసెగా నేడు నీ కన్ను మొఱకు,

    అన్న భార్య జననిగాదె,కన్ను‌ లిపుడు

    మూసు కొనిపోయెనా యేమి ముప్పు కల్గు

    లక్ష్మణా యని జానకీ రమణి పల్కె


    ముక్కుటము = నారదుస్తులు

    కన్నుమొఱకు = వంచన

    రిప్లయితొలగించండి
  5. జుట్టు - కన్ను - ముక్కు - చెవి
    సిగ చుట్టుకొనుము జుట్టును
    తగ కాటుక కన్నులకును ధరియించుమికన్
    తగిలించు ముక్కుకు బాసర
    సొగసుగ దుద్దులు చెవులకు సుందరవదనా!

    రిప్లయితొలగించండి
  6. ‘ముక్కు’టము దాల్చిన రఘు రాముని మనసున
    వెతలు ‘జుట్టు’కొనగ సతికై వెదకు వేళ
    పక్షి జో’కన్ను’తించి యవస్థ నెరిగి
    కతముగారు కనులతోడ గాం’చెవి’భుడు

    ముక్కుటము = నారబట్ట
    కతము = నీళ్ళు
    జోక = సహాయము

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    రావణునితో...

    అగ్నిజలముక్కువోలెనా యనిలజుండు
    చెలగి యెగురుచు దోచె విశృంఖలముగ!
    చోద్యముగ మంటలీలంకఁ
    జుట్టుకొనగ
    కాలెననుచును భటులు వీకన్నుడివిరి!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. యాగము కన్చు శృంగముని నంగన లందరు "జుట్టు" ముట్టుచున్
    రాగము మీర "ముక్కు"లిడి రంజిల పాటల నాటలాడుచున్
    బాగగు పల్కులాడుచును వాసిగ "కన్ను"లవిల్తు చేష్టలన్
    దాగుడుమూత లాడుచు తాపము పెం"చె వి"భాండపట్టికిన్

    ముక్కులు = భక్ష్య విశేషము
    కన్నుల విలుతుడు = మన్మథుడు

    రిప్లయితొలగించండి
  9. కక్ష తో జుట్టు ముట్టగ కపి వరుండు
    జంపె వీ కన్ను సి నుసిగ చతురు డగుచు
    వణకు చున్ తాము క్కు చు మూల్గి పరుగు లిడగ
    గాచె విడువు మo చని వేడ కరుణ తోడ

    రిప్లయితొలగించండి
  10. [10/09, 8:42 am] విరించి: *సీతమ్మను గాంచివచ్చిన మారుతి ఆ విషయం శ్రీరామునకు తెలుపు సందర్భము* ......
    నీ కొరకన్నుల మిన్నయె
    శోకించుచునుండె వనము జుట్టు దనుజ స్త్రీ
    లే కాపుండిరి, ముక్కుట
    మేకట్టె, వచించె విదుడు మేవడి తోడన్.

    రిప్లయితొలగించండి
  11. 10, సెప్టెంబర్ 2020, గురువారం
    దత్తపది - 171
    జుట్టు - కన్ను - ముక్కు - చెవి

    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    రామాయణార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

    నా పూరణ. తే.గీ.
    **** *** **

    కన్ను గొలుపు సౌందర్యము గాంచ...జుట్టు
    కొనగ విస్ఫార వాంఛలు మనమున...నిలి
    చె విరిబోడి శూర్పణఖయె శ్రీపతి సము
    ఖమున.ముక్కుట ధారి యా కమలనయను
    డతివ ప్రతిపాదనను ద్రోసె సతిని జూపి!

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  12. పాపములు *జుట్టు* కొనునిన్ను పార్థివేంద్ర
    పోరు నీదు మూ *కన్ను* లుమును రఘుపతి
    వీడు *ముక్కు* సంకల్పము, పాడుబడును
    లంక, *చెవి* నిడి నామాట రణము నిలుపు
    అసనారె

    రిప్లయితొలగించండి
  13. ముక్కుటమ్మును గట్టినముదితజూచి
    కన్నుకుట్టినరావణుగసినిబెంచి
    చెల్లిమాటనునికపెడచెవినిబెట్టి
    చోరబుద్ధినిసీతనుజుట్టుముట్టె

    రిప్లయితొలగించండి
  14. తన పైకి దుముకు ఖరుని భటులను గాంచి రాముఁడు తలఁచిన విధము:

    తా ముక్కునఁ దే జుట్టుచు
    మోము లలర వారి కన్ను పొదవ రయమునన్
    రామునిఁ జేరఁ దలఁచె విధి
    నేమని యందుఁ బడి రిట్టు లీ రనలమునన్

    [ఉక్కు = బలము; తేజు +ఉట్టుచు =తేజుట్టుచు : తేజము కాఱుచు; వారికి +అన్ను =వారి కన్ను: అన్ను = ఒళ్లెఱుఁగమి; ఈరు = మీరు ]

    రిప్లయితొలగించండి
  15. బిట్టుగారోదనముసల్పి*జుట్టుముట్టి
    రాము వీ*కన్నుతించుచు రాజ్యమెల్ల
    *ముక్కుటముదాల్చివనములదిక్కుబోయి
    వీడవలదంచు విలపిం*చె, విన్నవించె.

    రిప్లయితొలగించండి
  16. సీతను జుట్టుముట్టి దనుజేశుని యానతి కన్నుగుట్టగా
    మాతనుముక్కిడుల్ చెవిటి మానిను లందరు నొక్క పెట్టునన్
    భీతిని గొల్పి రావణుని గోరి వరించి తరించు మంచుని
    ర్భీతిని బోధసేసిరి పవిత్ర కులాంగన పాటు లిట్టివే

    రిప్లయితొలగించండి
  17. సీతను జుట్టుముట్టి దనుజేశుని యానతి కన్నుగుట్టగా
    మాతనుముక్కిడుల్ చెవిటి మానిను లందరు నొక్క పెట్టునన్
    భీతిని గొల్పి రావణుని బేర్మి వరించి తరించు మంచుని
    ర్భీతిని బోధసేసిరి పవిత్ర కులాంగన పాటు లిట్టివే

    రిప్లయితొలగించండి
  18. కందం
    నీకన్నులమిన్న ననుచు
    సోకులతో లక్ష్మణాఖ్యుఁ జుట్టుకొనంగన్
    గోక ముకు చెవుల్, ముక్కుచు
    వీకన్ శూర్పణఖ పనిచె వింశతిబాహున్

    రిప్లయితొలగించండి
  19. వనమును (జుట్టు) ముట్టి ఋషి వర్యుల యాగము లడ్డగించునా
    దనుజుల జంప రాము ఘనతన్ గడ(కన్ను)తియించి దాపసుల్
    ఘనమగు (ముక్కు)టంపు పటకంబుల నాతని సత్కరించి దీ
    వనల నొసంగి రంత ముని వాటిక దో(చె వి)రాజమానమై
    (కడక = పట్టుదల, ముక్కుటము = నార)

    రిప్లయితొలగించండి
  20. తే.గీ.

    కన్ను కుట్టగ రావణు కాంక్ష మీర
    ముక్కుటమ్మును ధరియించి మునిని బోలి
    పంచె విదులుచు భిక్షను పంచ వేడె
    జూడ జానకి , భుజములు జుట్టు జేర్చి
    అపహరించెను పోగాల మండ జేర

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  21. అశోక వనములో సీతామాతను హనుమ చూచిన సందర్భము

    క్షుద్ర రక్కసి మూకలు *జుట్టు*ముట్టె
    సీత రక్షింప*కన్ను*దిటి చేతలగుచు
    కవచ*ముక్కు*గ మారెనాక్రందనమున ----
    చూ*చె వి*బుధుడు హనుమ!అశ్రువులు జార!!

    రిప్లయితొలగించండి