1, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3474

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్"

 (లేదా...)
"ఎన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో"

94 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    తన్నుకు చావగా జనులు దండుగ మాలిన సీటు కోసమై...
    సన్నుతి నొందు నోటులను చక్కగ పంచగ రెండు వైపులన్
    పన్నుగ దుడ్డులుండగను భారత దేశపు రాజకీయమం
    దెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  2. అన్నా! యీవెరుగవె, సం
    పన్నులదే రాజ్యమెప్డు భారతమందున్
    పన్నాగంబుల బన్నుచు
    ఎన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్.

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ పార్టీలకు విరాళాలు. ..

    దన్నుగ వాణిజ్యముగల
    మిన్నాగులు జేరి వారు మిగుల ధనము నా
    పన్నుల వలె యిచ్చుచు హా
    ఎన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కన్నుల నీరు నింపుచును క్షామపు రోజుల మెండు వడ్డికిన్
    పన్నుగ నప్పుచేయుచును భార్యల పుస్తెల తాకటిచ్చుచున్
    దున్నుచు నేలనున్ సతము దుఃఖము తీర్చగ వోటువేసి తా
    మెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  5. To learn who rules over you, find out who you are not allowed to criticize.

    ఉ||
    మిన్నకనున్న విప్లవము, మీరిన భీతిని జేర్చు వారలే,
    యున్నతి జెంది లోకజనులోర్వ మరింత ధరిత్రి యేడ్వగన్
    దున్నకు కొమ్ములన్నటుల ధూర్తులు మంత్రులు వారి భృత్యులౌ
    ఎన్నికకానివారె ప్రజనేలుదురీ జనతంత్ర భూమిలోన్!

    రోహిత్ ఆదిపూడి 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  6. పన్నులు వడ్డన చేయుచు
    మన్నతులడిగిన జనులకు మతి లేదనగా
    మన్నిక కొరవగు మంత్రులు
    ఎన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్

    రిప్లయితొలగించండి
  7. సమస్య :
    ఎన్నిక కానివారె ప్రజ
    నేలుదురీ జనతంత్రభూమిలో
    ( ఎగ్గుసిగ్గులు మాని ఒక్కసుగుణమైనా లేక
    ధనం వెదజల్లి గెలిచి నాయకత్వం వెలగబెట్టే ధూర్తులే అధికులు నేడు )
    అన్నియు సున్నలే చదువు
    లందున ; డబ్బది మాత్రముండెనే !
    ఎన్నియొ కేసులుండినను
    నేమియు జంకును గొంకు లేవటే !
    మన్నిక లేని వారలయి
    మత్తులుగా గుణగణ్యరాశిలో
    నెన్నిక కానివారె ప్రజ
    నేలుదురీ జనతంత్రభూమిలో .
    (గుణగణ్యరాశి - లెక్కింపదగ్గ సద్గుణ
    సమూహం;జనతంత్రము-ప్రజాస్వామ్యం)

    రిప్లయితొలగించండి
  8. పన్నుచు బన్నాగంబుల
    ఛిన్నాభిన్నమును జేసి శీలమునంతన్
    విన్నాణంబున తిన్నగ
    నెన్నిక కానట్టివారె ఏలుదురు ప్రజన్

    మిన్నగ రబ్రిదేవి మహి మీకు సమానమె పాలనంబునన్
    దన్నుగ నుందుమేమికను తాయిని జేయగ ముఖ్యమంత్రిగన్
    చెన్నుగ మీరుజైలునకు చింతను బొందక యేగగాదగున్
    ఎన్నిక కానివారె ప్రజనేలుదు రీజన తంత్రభూమిలో !

    రిప్లయితొలగించండి
  9. తన్నొక బొమ్మను జేసియు
    చెన్నుగ నాడించ గలుగు శేముషి పరులై
    యన్నిట తామే యగుచును
    నెన్నిక కానట్టి వారి యేలుదురు ప్రజ న్

    రిప్లయితొలగించండి
  10. గున్నేనుగు దండనుగొని

    యన్నిదిశలలో తిరుగుచు నర్హుని మెడలో

    చిన్ని సరము వేయు నపుడు
    ఎన్నిక కానట్టి వారె యేలుదురు ప్రజన్


    పూర్వము రాజ్యం లో వారసుడు లేనప్పుడు నిర్ణయం భగవంతుని కి వదలి ఏనుగు కు ఒక దండ ఇచ్చి రాజ్యం మొత్తం తిప్పేవారు అది ఎవరి మెడలో వేస్తే వారె ప్రజలను ఏలేవారు

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తిన్నని మార్గము వీడుచు
    పన్నాగముతో ధనమును బంచుచు నెపుడున్
    తెన్నును గూడని విధమున
    నెన్నిక కానట్టి వారి యేలుదురు ప్రజన్.

    తిన్నని త్రోవలన్ విడిచి తేకువ జూపని రీతులెంచుచున్
    పన్నిన మోసపూరితపు పద్ధతి సొమ్ములు బంచుచున్ సదా
    వన్నువనైన మార్గమును పాయుచు సక్రమమైన తెన్నునన్
    ఎన్నిక కానివారె ప్రజనేలుదు రీజన తంత్రభూమిలో !

    రిప్లయితొలగించండి
  12. కె.వి.యస్. లక్ష్మి:

    తిన్నగ గెలవను నేర్వరు
    ఎన్నిక బూటకమె నిపుడు యెగ్గులు లేకన్
    మిన్నగ డబ్బును బంచుచు
    నెన్నిక కానట్టి వారి యేలుదురు ప్రజన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేర్వరు+ఎన్నిక' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'బూటకమె+ఇపుడు' అన్నపుడు నుగాగమం రాదు. 'ఇపుడు+ఎగ్గులు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
      "తిన్నగ నేర్వరు గెలువగ నెన్నిక బూటకమె యిప్పు డెగ్గులు లేకే..." అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. మీ సూచనలద్వారా చాలా నేర్చుకున్నాను. ధన్యవాదములు.

      తొలగించండి
    3. తిన్నగ నేర్వరు గెలువగ
      నెన్నిక బూటకమె యిప్పు డెగ్గులు లేకే
      మిన్నగ డబ్బును బంచుచు
      నెన్నిక కానట్టి వారె యేలుదురు ప్రజన్.

      తొలగించండి
  13. మన్నియ నెంచుకొనమనగ
    చెన్నుగ పరిపాలనమును జేయుట లోనన్
    నన్నిట దుర్మార్గులుగా
    నెన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లోనన్+అన్నిట=లోన నన్నిట' అవుతుంది.

      తొలగించండి
  14. రిప్లయిలు
    1. మన్నికలేదేమాటకు
      అన్నిటతామేనిలబడియలజడిఁజేతుర్
      కన్నులనీరేజనులకు
      ఎన్నికకానట్టివారెయేలుదురుప్రజన్

      తొలగించండి
  15. ఆంగ్లేయుల్ నెఱి క్రీస్తుదైవమునఁ దా బ్రార్థింతు రాశీస్సుకై
    యాంగ్లేయమ్మున, నల్ ఇలాహిని నరబ్బందున్ దగం గొల్త్రు ప్రా
    క్బంగ్లాదేశ మహమ్మదీయు, లవురా భక్తాగ్రణుల్ శూలికిన్
    క్లీం గ్లీం గ్లౌం వరబీజవర్ణములతో కేల్మోడ్తురీ హిందువుల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  16. మన్నన మానవత్వములు మచ్చునకైనను నుండబోవు నా
    పన్నులఁ గాంచలేరు ధనవంతుల పక్షముఁ బూని విత్తమున్
    దన్నుగఁ బంచి మద్యమునుఁ దాపుచు గెల్చిన సద్గణమ్ము లం
    దెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  17. అన్నిట వాక్ స్వతంత్రమును నందరి కిచ్చిరి రాజ్యకర్తలున్
    పన్నగ నెత్తులున్ కుటిల పాండితి నందున మేటి జ్ఞానులై
    తిన్నగ హత్యచేయుటల తేకువ చూపి, పరోపకార మం
    దెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెన్నుగ మాటమార్చుచును, ఛీయన నవ్వుచు కాళ్ళుపట్టుచున్
      కన్నుల క్రౌర్యతన్నణచి కానుక లిచ్చుచు డబ్బుపంచుచున్
      యెన్నన నన్ను కాదనచు నీతతి గెల్తురు సత్యశీలతం
      దెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పంచుచున్+ఎన్నన' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి


  18. ఎన్నైన పనికి రారే
    యెన్నిక కానట్టివారె, యేలుదురు ప్రజన్
    మన్నిక గలవా రె సుమా
    దన్నుగ నిలిచి కడ గండ్ల దాటి జిలేబీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. పన్నాగమ్ముల నెన్నియొ
    పన్నుచు సరకము ధనమ్ము బంచెడి ధూర్తుల్
    మన్నన లేని, సజావుగ
    నెన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్

    రిప్లయితొలగించండి
  20. ఎన్నగదేశంబునసం
    పన్నులదేరాజ్యమిపుడు పరికింపంగన్
    యెన్నడు నిజాయితీగా
    నెన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరికింపంగన్+ఎన్నడు' అన్నపుడు యడాగమం రాదు. "పరికింపంగా నెన్నడు..." అనవచ్చు.

      తొలగించండి


  21. కందోత్పల

    అనుకున్నను చేయగలరె
    పని యెన్నిక కానివారె? ప్రజ నేలుదు రీ
    జనతంత్ర భూమిలో మే
    ల్మినిబడయగ నెన్నికల గెలిచిన ప్రముఖులే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    కన్నులు నెత్తికెక్కు., తనకంటె ఘనుండెవరంచు దల్చు., సం....
    పన్నుల కొమ్ము గాయుచు నమాయకులన్ బెదిరించి పీల్చు., స్వీ..
    యోన్నతినెంచు., దుష్కృతుల యోచన జేయును., లేకపోవుచో
    నెన్నిక., కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  23. పెన్నిధి గా తలంచి గెలిపించగఁ బేదలు, దుష్టబుద్దితో
    కన్నులు నిప్పులన్ గురియ కల్లరు లౌ పగదారులందరున్
    చెన్నగు శాసనమ్ములను చేయగ నీయక దొడ్డిదారిలో
    నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  24. ఎన్నగ పక్ష పాతమున కించుక ప్రేమము తోడ్పడంగ తా
    నెన్నిక నెగ్గియున్ సుతుని కే పరి పాలన మప్ప జెప్పగా
    మిన్నక దేశసంపదను మ్రింగఁగ గోరుచు సాగి తాముగా
    ఎన్నిక కాని వారె ప్రజ నేలుదురీ జనతంత్ర భూమిలో!

    రిప్లయితొలగించండి
  25. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణ ను కూడా పరిశీలింప ప్రార్థన.
    బంగ్లా తూరుపు వోలెను
    బంగ్లా పశ్చిమము గలదు! భారత నారీ
    మంగ్లీ, వినుమిది, పశ్చిమ
    బంగ్లా దేశీయు లెల్ల భర్గుని భక్తుల్
    (మంగ్లి అనేది ఒక యువతి పేరు)
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి


  26. తిన్నగ మేలు చేయుటకు తీరగు మార్గము లేని పెద్దలా
    యెన్నిక కానివారె; ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో
    దన్నుగ సేవచేసెడు విధానము నేర్చు కుశాగ్ర బుద్ధులే
    మన్నిక జేర్చగా వలయు మంచిని పెంచు ప్రధానులే సుమా


    జిలేబి

    రిప్లయితొలగించండి

  27. పిన్నక నాగేశ్వరరావు.

    పన్నాగము మదినిడుకొని
    వెన్నవలెను మాటలాడి ప్రేమ వెలార్చున్
    పన్నుగ ఋజుమార్గంబున
    నెన్నిక కానట్టి వారె యేలుదురు ‌ప్రజన్.

    రిప్లయితొలగించండి
  28. మన్ననలేదుసంఘమునమానినులన్ననులెక్కసేయడే
    మన్ననుమూగనోముసమయానికిస్పందనసున్నకన్నవా
    రన్ననుప్రీతిసత్యమిదిరాపరమార్థమువారసత్వమం
    దెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  29. 01.09.2020
    అందరికీ నమస్సులు 🙏

    *కం*

    మిన్నౌ రీతిన సాయము
    లెన్నో తామొచ్చి జేయు రేడౌ ఘనుడున్
    కన్నుల రెప్పై నిలుచా
    *"ఎన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యంపై నా సూచనలను వాట్సప్ లో చూడండి.

      తొలగించండి
  30. ఎన్నో కలలను దేలెద
    రెన్నిక కానట్టివారె; యేలుదురు ప్రజన్
    ఎన్నికలల నెగ్గి జనుల
    మన్నన నొందిన ప్రముఖులె మంచిని పంచన్

    రిప్లయితొలగించండి
  31. మన్నికలేదేమాటకు
    అన్నిటతామేయనుచునునేలుదురంతన్
    కన్నులనీరేజనులకు
    ఎన్నికకానట్టివారెయేలుదురుప్రజన్

    రిప్లయితొలగించండి
  32. మన్నునయరాచకంబుల
    నెన్నికకానట్టివారెయేలుదురుప్రజన్
    బన్నమునొనరుచుబనులకు
    మన్ననమదిగాననీడుమచ్చునకైనన్

    రిప్లయితొలగించండి
  33. మన్నన గూర్చు యెన్నికల మార్గము బట్టక మారు దారిలో
    సన్నుతి జేసి నాయకుల సన్నిధి జేరుచు వారి ప్రాపునన్
    కన్నులు గప్పి లోకులకు కార్యములన్నిట గాలు మోపుచున్
    ఎన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  34. ఉ:

    దన్నుగ నిల్చితిమ్మనుచు దండిగ డబ్బులు వెచ్చ బెట్టుచున్
    సన్నుతి జేసి వోటరును సాంతము కిక్కుల ముంచి లేపుచున్
    ఖిన్నత నొంద నర్థి భుజకీర్తులు గొప్పలు బోవు చుండగన్
    నెన్నిక కాని వారె ప్రజ నేలుదు రీజన తంత్ర భూమిలో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిల్చితిమి+అనుచు' అన్నపుడు ద్విత్వమకారం రాదు.

      తొలగించండి
  35. పన్నాగము లెందుకు నా
    సన్నము కాఁగ సమయమ్ము జనకాయము చే
    మన్నన నొందిరి గద వీ
    రెన్నిక కానట్టివారె? యేలుదురు ప్రజన్


    సన్నము రాజభక్తి యిల సద్గుణ ధర్మ పరత్వ చిత్తు లే
    ల్కొన్నను మెత్తురే ప్రజలు కోరిన కోర్కులు తీర్చకున్నచో
    సన్నుత యేమి సెప్పుదును సజ్జన భావము లందు నించు కే
    నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  36. ఎన్నియొ పాపకార్యముల నింపుగ జేసెడి దుష్టులైన సం
    పన్నులు మాయమాటలను వాసిగ జెప్పుచు కుట్రలన్ సదా
    పన్ను దురాత్ములే కదర ప్రస్థుత మెన్నికలందు నీతిగా
    నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  37. మిన్నుగసంపదల్ గలుగమీరెడుగర్వముతోడనాదొరల్
    మన్నునునేలుచుండుటనుమానసమందుననిట్లుతోచెడిన్
    నెన్నికకానివారెప్రజనేలుదురీజనతంత్రభూమిలో
    నెన్నికయైనవారుభువినేలుటయుత్తముగాదెయారయన్

    రిప్లయితొలగించండి
  38. సున్నావిలువలుతగులే
    కున్నాసంఖ్యలనుజేర కూడునువలువే
    అన్నకు నధికారంబున
    యెన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్

    రిప్లయితొలగించండి
  39. కందం
    మన్నించి ప్రజాస్వామ్యము
    దన్నుగఁ బ్రజసేమమెంచు దక్షుల నెన్నన్
    బన్నిన వ్యూహంబననగు
    నెన్నిక, కానట్టివారె యేలుదురు ప్రజన్

    (కాన+అట్టివారె= కానట్టివారె)

    రిప్లయితొలగించండి
  40. కం
    ఎన్ని నియమములు పెట్టిన
    ఎన్నికలను సరిగ నిర్వహించరు కనగా
    ఎన్నికలందున నియతిగ
    ఎన్నిక కానట్టి వారె యేలుదురు ప్రజన్

    ✍️తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  41. ఎన్నడునెండకన్నెరుగకెన్నడుశీతలమందిరంబులన్
    చెన్నుగనుండువారెటులజేయగనోపును సేవ పేదకున్?
    మిన్నగ కాసులన్ విసరి మెల్లగనందలమెక్కి నేరుగా
    నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  42. ఉత్పలమాల
    ఎన్నఁగ నొప్పఁగా దగని హీన చరిత్రులు నిల్చియుండగన్
    మిన్నగ నొక్కఁ గూర్చి రొక మీట నయిష్టముఁ దెల్పు రీతిగన్
    దన్నుగ నిల్చువారలను దక్షులనెంచుచు 'నోట' నొక్కగా
    నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో

    రిప్లయితొలగించండి
  43. పన్నుచు కుయుక్తులు సతము
    తిన్నగ మాట్లాడ లేని దేభ్యులె యిలలో
    మిన్నగ కాన్కలొసంగుచు
    ఎన్నిక కానట్టి వారె యేలుదురు ప్రజన్.

    రిప్లయితొలగించండి