13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3485

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భరతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్"

 (లేదా...)
"భరతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్"

37 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    మరువను గోరి హృత్తునను మాయల మారిది నాట్యకత్తెనున్
    విరసము నొంది త్రాగుచును విస్కిని మెండుగ రాణిపుత్రుడే
    సరసపు మాటలన్ గొనుచు చక్కగ పల్కెను మత్తునందునన్:
    "భరతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్"

    రిప్లయితొలగించండి
  2. బెదరకు నేనె యన్నిటికి పెన్నిధి నిశ్చయమర్జునా ! యనన్
    సదమల విశ్వరూపమున సంశయ మార్పిన గీతవాక్కులున్
    వదలక నంత్య యాత్రలకు వాడగ నేడు నహో ! యిదేమి చౌ
    కదనము దెచ్చిపెట్టె గద కంజదళాక్షుని శాంతివాక్యముల్


    చరణము లంటి వేడగను జానకి నాథుడు నాదరించె నా ;
    విరమణ లేక నింద్రజితు విక్రమ మంతము జేసె వీరతన్ ;
    ధరజన మొప్ప రామ హృది తాపము నార్ప దశాస్యు జంపగన్ ;
    భరతుని , శీర్షమున్ దునిమి , భ్రాతకు దోడ్పడె లక్ష్మణుండొగిన్.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. మరచుచు నిద్దుర నశనము
      వరముల గొన్నట్టివాని వారిదనాదున్
      అరుదగు మాయావిద్యల
      భరతుని లక్ష్మణుడు దునిమె భ్రాతయె మెచ్చన్

      తొలగించండి
    4. అరుదగు పాదుకల్ గొనుచు నన్నకు
      మారుగ రాజ్యమేలగన్
      నిరవధి భక్తిపూర్వకపు నీమము దాల్చగ నారచీరలన్
      భరతుని శీర్షమున్ దురిమి భ్రాతకు దోడ్పడె లక్ష్మణుండొగిన్
      త్వరపడి శ్రోతయిట్టులనె త్రాగిన మైకము నిండియుండగా
      భరతుని శీర్షమున్ దునిమి భ్రాతకు దోడ్పడె లక్ష్మణుండొగిన్

      శీర్షమున్ దురిమి = కొప్పుదీర్చి
      భరతుడు కూడ 14 యేండ్లు రామలక్ష్మణులతో పాటు నందిగ్రామం లో వనవాసం చేశాడు. అలా అలంకరించుకోవడంలో లక్ష్మణుడు సహాయపడ్డాడని ఊహ!
      🙏🙏🙏

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అదో రకమైన క్రమాలంకారమున:

    కరమున గైకొనన్ మురిసి కమ్మగ జేరెను రామ పాదుకల్;...
    కరచుచు మేఘనాదునట గండర గండుని వోలె పోరుచున్
    పరచుచు దేవతాస్త్రమును భండన మందున వాని శీర్షమున్;...
    భరతుని శీర్షమున్;. దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెరిమను జూపుచు మెచ్చెను
    భరతుని లక్ష్మణుడు; దునిమె భ్రాతయె మెచ్చన్
    దురమున నాలక్ష్మణుడే
    పురణించిన విక్రమమున పౌలస్త్య సుతున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెరిమను జూపుచు మెచ్చెను
      భరతుని లక్ష్మణుడు; దునిమె భ్రాతయె మెచ్చన్
      దురమున నాలక్ష్మణుడే
      పరపగు శౌర్యమును జూపి పౌలస్త్యు సుతున్.

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. గురువులు జెప్పినదేదియు
      సరగున శిశ్యుండు జెప్ప, చరణము మార్చన్
      కొరవడె నర్థంబిట్టుల
      భరతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్!!

      ***మీ సూచన మేరకు సవరణతో..!

      తొలగించండి
  7. సమస్య :
    భరతుని శీర్షమున్ దునిమి
    భ్రాతకు దోడ్పడె లక్ష్మణుండొగిన్

    (మబ్బుల మధ్య దాగినఇంద్రజిత్తుమాయా జాలాన్ని ఛేదించి వధించిన సౌమిత్రి )
    అరదము డిగ్గి శీఘ్రముగ
    నంబరవీథిని మేఘమందు న
    బ్బురముగ దాగి శాతశర
    భూషితుడైన దశాస్యునందనున్
    బరమశిలీముఖంబులను
    బైటకు దెచ్చుచు దౌష్ట్యజాలసం
    భరతుని శీర్షమున్ దునిమి
    భ్రాతకు దోడ్పడె లక్ష్మణుండొగిన్ .

    రిప్లయితొలగించండి
  8. తరుణి శకుంతల కన్నదె
    వరినంటిని? మేఘనాథుఁ భండన మందున్
    పొరిమార్చినదెవ్వడనగ
    భరతుని, లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్

    రిప్లయితొలగించండి
  9. దురమునకని శంకపడెను
    భరతుని లక్ష్మణుఁడు, దునిమె భ్రాతయె మెచ్చన్
    కర మరుదగు శౌర్యముతో
    సుర వైరిని యింద్రజితుని సోకు కులజునిన్

    రిప్లయితొలగించండి
  10. పరమదయాబ్ధిసోమపరిపాలనసేయగపాదరక్షలన్
    గరుణనొసంగుమంచుగొన గారవమొప్పగమెప్పునెక్కెలే
    *భరతునిశీర్షమున్; దునిమి భ్రాతకుఁదోడ్పడె లక్ష్మణుండొగిన్*
    స్థిరముగయుద్ధమందుదనజేశునిసైన్యముపారద్రోలియున్

    రిప్లయితొలగించండి
  11. 🙏🏻🙏🏻 గురువు గారికి పూర్తి స్వస్థత చేకూరుగాక🙏🏻🙏🏻

    గిరికంటకధరుడగు నిం
    దురుపైనే గెలిచినట్టి దురహంకారీ,
    ఉరు యోధుడింద్రజితుని,
    భరతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్

    గిరికంటకము-వజ్రాయుధం
    భరతుడు-ఆయుధధారిగా జీవించేవాడు
    (పారమార్థిక పదకోశం)

    ధర్మరాజు యుద్ధంలేకుండా శాంతియుతంగా కృష్ణ రాయబారము జరిపినా యుద్ధమాగలేదని
    -నిన్నటి పూరణము.

    కదనము మాకు సమ్మతము గాదయ కేశవ! యీవెరుంగు, వ్రే
    కదనము వృద్ధి నొందగ, విఘాతము గల్గక చూడు మన్న, చ
    క్కదనమునన్ సపత్నులను కావ యుధిష్ఠురుఁ డెంత కోరినన్,
    కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్

    కదనము-పాపము,
    వ్రేకదనము-గౌరవము
    చక్కదనము-ఋజుభావము
    కదనము-యుద్ధము.

    రిప్లయితొలగించండి
  12. ఇరువున నున్న సహోదరు
    లిరువురు రావణు దునుమిన దెవరని యడుగన్
    వెరగుగ మాటా డిరిటుల
    “భరతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్”

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    గరుడుడు నాగపాశముల ఖండన జేసి విముక్తు జేయ., సం...
    గరమున క్రుద్ధుఢై ప్రలయకాలకృతాంతుని మాడ్కి శత్రుదు...
    స్తరుడన వాడిబాణముల ధ్యాననిమగ్నుని మేఘనాధు దం....
    భ రతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. సుర సేవించుచు నొక్కడు
    పొరపాటుగ పల్క దొడగె పొంతన లేకన్
    దురమున నావేశ ము తో
    భరతుని లక్ష్మణుడు దునిమె భ్రాత యె మెచ్చ న్

    రిప్లయితొలగించండి
  15. ఈ నాటి శంకరాభరణం వారి సమస్య.

    భరతుని లక్ష్మణుడు దునిమె భ్రాతయె మెచ్చన్


    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ సీసములో


    తండ్రి యాఙ్న బడసి తరుణి సీతాదేవి
    జతకూడ నడవికి సంతసముగ

    వచ్చితి గా, రాజ్య పాలనమును నేను
    చేయజాలను నీవు శీఘ్ర గతిని

    వెడలి పాలనమును వెరవక చేయగా
    వలయునని తిరిగి పంపె నపుడు

    రాముడు భరతుని,లక్ష్మణుడు దునిమె
    భ్రాతయె మెచ్చ నా పడతి శూర్ఫ



    ణకను బట్టి ముక్కు చెవులన్ ,
    నవత తోడ


    నరచుచు రుధిర ధారలు కురియు చుండ

    రక్కసి వదనమును చూచి రమణి సీత

    భయము తో వడకి ధరణి పైన బడెను


    నవత.= బాధ

    రిప్లయితొలగించండి
  16. తిరమగుబ్రేమనుజూచెను
    భరతునిలక్ష్మణుడు,దునిమెభ్రాతయెమెచ్చన్
    సురలనుమనుజులబ్రోవగ
    కరవాలునలక్ష్శణుండుకర్వరునణచెన్

    రిప్లయితొలగించండి
  17. వరబల దర్పితునిఁ బురం
    దరజిత్తుని మేఘనాథు దైత్యవరేణ్యున్
    ధరణిసుర గణ బలవ దశు
    భ రతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్


    సురపతి జేతృ దైత్యకుల శూర వరేణ్యుని భండనమ్ములో
    ఖరతర కంకపత్రములు కాయము సీల్చఁగ వహ్నితుల్యముల్
    శరములు సేసి యత్తరి ప్రసారము రావణ పుత్రు రాక్ష సే
    భ రతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్

    రిప్లయితొలగించండి
  18. శరణన నమ్మడు పూర్తిగ
    భరతుని లక్ష్మణుడు, దునిమె భ్రాతయుమెచ్చన్
    పరవీర మేఘనాథుని
    శరమున లోకాలుబొగడ సంగరమందున్.

    రిప్లయితొలగించండి
  19. అరయగ తండ్రియాజ్ఞ యని నాతడు కానల కేగ సీతతో
    పరిణతి నెక్కె రాజ్యమును పాలన జేయగ రామపాదుకల్
    *భరతుని శీర్షమున్! దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్*
    వెరువక మేఘనాదునరివీర భయంకరుడౌచు నాజిలో

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  20. భరతుడులక్ష్మణుండనగభ్రాతలెయౌదురుగాదె?యెట్లుగా
    భరతునిశీర్షమున్దునిమిభ్రాతకుదోడ్పడెలక్ష్మణుండొగిన్ గరివరరక్షకుండగుచుగాసటబెట్టగనోర్చునేదమిన్
    నిరవగుగానిపాదమునునిచచ్చుటన్యాయమెనీకుసోదరా!!


    రిప్లయితొలగించండి
  21. మరలగబనిచెన్ రాముడు
    భరతుని, లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్
    దురముననరివీరవరుల
    నిరువురు శ్రీరామచంద్రుకిష్టులెజూడన్

    రిప్లయితొలగించండి
  22. దురమున నింద్రజిత్తు తన దుష్కరబాణ పరాహతమ్ములన్
    దరికొనునగ్నికీలలనతద్దయునొవ్వగజేసి యుద్ధతిన్
    దురమగజూడ శాత్రవుల దుర్మతిరావణుసూతి, గర్వసం
    భరతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్

    రిప్లయితొలగించండి
  23. దురమున నింద్రజిత్తు కడు దోర్బలుడై చెలరేగుచుండగా
    పరుగులు తీయుచుండనట వానర మూకలు భీతినొందుచున్
    సరగున మోహరించి వడి శల్యములన్ విడి, గెల్పునెంచు లో
    భ రతుని, శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మణుడు , స్థపతి, అతని భ్రాతలది విగ్రహాల వ్యాపారం. వారి వ్యాపార శైలిని గూర్చి ఈ పద్యము:

    చం:

    పరుగున జేరె లక్ష్మణుని పణ్యము కూర్చగ రామ శిల్పమై
    మరివొక రూప మున్నదనె మార్పుకు నొగ్గిడ శీర్ష భాగమున్
    సరియని దెల్ప నా స్థపతి సాక్షము గ్రాహకుడంచు శీఘ్రమే
    భరతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్

    పణ్యము=బేరము
    మరివొక రూపము=భరతుని ఊహా విగ్రహము.

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. కందం
    పురికొల్ప విభీషణుఁ డ
    ధ్వరమున గలనింద్రజిత్తు వారించుచు దు
    స్తర శరమున మాయా లో
    భ రతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్

    చంపకమాల
    బిరబిర నాంజనేయుఁడు విభీషణు లాదిగ వీరులెందరో
    దరికొన హోమకార్యమును దబ్బున వీడిన మేఘనాథు దు
    స్తర ఫణిరూప శస్త్రమునఁ దారక రాముని మ్రొక్కి దంభలో
    భ రతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్

    రిప్లయితొలగించండి
  26. దురమున మాయాజాలపు
    శర విన్యాసముల సేన సతమతమొందన్
    దురితుం డింద్రజితున్ దం
    భ రతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్

    రిప్లయితొలగించండి
  27. పరమ వినీతు డై నిలిచి వత్సలతన్ కనపర్చితాకెనా
    తరణి కులొద్భవుండయిన దాశరథుండు,రణమ్ము నందు నా
    శిరమును ద్రుంప నింద్రజితుజెచ్చెర కూలెడి రీతిచేయుచున్
    భరతుని శీర్షమున్;దునిమి భ్రాతకుదోడ్పడె లక్ష్మణుండొగిన్.

    రిప్లయితొలగించండి