21, సెప్టెంబర్ 2020, సోమవారం

సమస్య - 3493

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్"

 (లేదా...)
"సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్"

32 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    సారంగంబును నెక్కి రాజు చనగన్ జంబమ్ముగా వేటకున్
    నారీరత్నము జూచి ప్రేమగొనుచున్ నందమ్మునన్ రమ్మనన్;...
    గారాబొందగ జూచి మోదమునతా గర్వంబుగా మెచ్చగన్
    సారంగంబు;...నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్ 😊

    సారంగము = ఏనుగు

    రిప్లయితొలగించండి
  2. శకుంతల
    ఆరామమందు కోయిల
    కీరాలాపముల నడుమ కెఱలగ కోర్కెల్
    తారస పడ వేటాడుచు
    సారంగము రాజు,గూడి సత్పుత్రుగనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదీ శకుంతలే! భరతుడు సింహాలతో ఆడుతూ , వాటిని లొంగదీసుకుంటూ
      ఉంటే భర్తతో కలసి ఆనందంగా చూస్తున్నది

      ధీరుండా బాలుడు బహు
      వీరోచితముగను సుంత భీతిని లేకే
      తీరుగ నధిరోహించగ
      సారంగము, రాజుగూడి సత్పుత్రు గనెన్

      తొలగించండి
    2. ఆరామంబున ప్రేమగా చిలకకున్
      హాస్యోక్తులన్ నేర్పుచున్
      నారీరత్నము హంసనున్ నడకలన్
      నాజూకుగా మించుచున్
      ధీరోదాత్తుడు దారితప్పి యట
      కేతెంచంగ వేటాడుచున్
      సారంగంబు, నరేంద్రు గూడి కనియన్
      సత్పుత్రు లోకోత్తరున్

      తొలగించండి
  3. [9/20, 3:01 PM] Rohit: ఏనుగు మీద వేటకెళ్ళిన శంతనుడూ, ఆయన ఏనుగూ భీష్ముని చూసారు

    శా||
    ధీరున్ దిగ్గజహృద్బలాఢ్యుడను దేదీప్యంబుగన్ వెల్గుచున్
    వీరంబున్ ధనువిద్యలందు మరుగన్ భీష్మున్ నదీతీరమున్
    క్రూరారణ్యము శంతనున్ గజమునారోహించి వేటాడునా
    సారంగంబు, నరేంద్రు గూడి గనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    ఆదిపూడి రోహిత్
    [9/20, 3:21 PM] Rohit: 2వ పూరణ.. ఇందాక ఏనుగు అన్న అర్థంలో మొదటి పూరణ..కురంగము అన్న అర్థం లో రొండవపూరణ.. ఇది కూడా భీష్ముని నేపధ్యమే

    శా||
    నీరున్ నీలపు చర్మసౌష్ఠవమునన్ నీరేజపత్రేక్షణన్
    నారీశ్రేష్ఠకురంగదేహియగు కన్యన్ మత్స్యగంధిన్ గనన్
    చేరెన్ శంతనుడా వశన్ వలచియున్ జేరన్ సభన్ యోషితా
    సారంగంబు, నరేంద్రు గూడి గనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నారీరత్నము ప్రేమనున్ క్షితిపతిన్ నందమ్మునన్ రమ్మనన్;...
    సారంగంబును జూచి యాశ్రముననున్ సత్పుత్రి కంపించగన్
    ప్రారబ్ధంబున రాజు చేత పడుచున్ ప్రాణంబునున్ వీడగా
    సారంగంబు;...నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్ 😊

    సారంగము = తుమ్మెద

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    శకుంతలోపాఖ్యానం :
    (సారంగమును వేటాడ వెంటాడిన దుష్యంతుడు
    శకుంతల అందాన్ని చూచి సారంగము(ధనుస్సు ,లేడి)ను వదలి
    ఆమె మోహములో పడ్డాడు.
    ఆతణ్ణి వలచి పుత్రుని కనిన శకుంతల
    ముని శాపము వలన రాజు తనను మరచుటచే
    ఘోరముగా మోసగింప బడెను)
    __________________________

    స్త్రీ రంగును మెచ్చి విడువ
    సారంగము; రాజుఁ గూడి - సత్పుత్రుఁ గనెన్
    గౌరాంగన ముని పుత్రిక !
    ఘోరంబుగ మోసపోయె - గుటిలుడె మరువన్ !
    __________________________
    రంగు = అందము; సారంగము = లేడి, ధనుస్సు; గుటిలుడు = రాజు

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. B-1)

    శకుంతలోపాఖ్యానం :
    (సారంగమును వేటాడ వెంటాడిన దుష్యంతుడు
    శకుంతల అందాన్ని చూచి సారంగము(ధనుస్సు ,లేడి)ను వదలి
    ఆమె మోహములో పడ్డాడు.
    శకుంతల కూడా అతనిని వలచి
    సూర్యుడు మరియు తన పెంపుడు లేడి చూచుచుండగా
    గాంథర్వవివాహము చేసికొనెను.
    పిమ్మట లోకోత్తరుడైన కుమారుని కనెను.)
    __________________________

    సారంగంబును ద్రుంచబోయి విడచెన్ - సారంగమున్ సాంతమున్
    సారంగాక్షిని గాంచి ప్రశ్రయమునన్ - సామాన్య కుండీరుడై !
    సారంగాక్షియు చెట్ట పట్టె ప్రియునిన్ - సప్తాశ్వుడున్, సాక్షిగా
    సారంగంబు ! నరేంద్రుఁ గూడి కనియెన్ - సత్పుత్రు లోకోత్తరున్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  7. ఈ నాటి శంకరాభరణం వారి సమస్య

    సారంగము రాజు కూడి సత్పుత్రు గనెన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణ. సీసములో



    అధిక రతి సుఖపు సుధలనా స్వాదించ
    తలచి కిందన ముని తనదు‌ సతిని

    జింకగా మార్చి తా జింకయై వనములం
    దురమించ గా పాండు శరము వలన

    నసువులు బాయచు నొసగె శా
    పమును వె

    రచుచు సారంగము,రాజు కూడి

    సత్పుత్రు గనెనెట్లు సాధ్వి యా కుంతి,వ
    చింపగ వలయును శీఘ్ర గతిని

    యనుచు శిష్యుడొకడు తప సిని యడుగగ

    శాప ముబడసిన పతికి‌ సంతు‌ నిడగ

    దలచి‌ వరముల మహిమచే
    ధర్మ గతిని

    సంతు పొందెనని తెలిపె
    సత్య వాక్కు



    కిందన మహర్షి శాపము‌‌ పొందిన తర్వాత పాండు రాజు ద్వారా సంతానము ఎట్లు కుంతికి కలిగినది అని ఒక శిష్యుని సందేహము నకు ఒక. ముని సమాధానము ఇచ్చు సందర్భము

    రిప్లయితొలగించండి
  8. తారా పథమున పున్నమి
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
    ఆ రేయెండన కోరిక
    పారె జనులకింటి నుండి వయాళి కేగన్

    సారంగము = రాత్రి
    రాజు = చంద్రుడు

    రిప్లయితొలగించండి
  9. సారంగము కంట పడగ
    సారంగము నెక్కుపెట్టి శరమును విడువన్
    సారంగము స్త్రీయై యా
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  10. 🙏🏻🙏🏻
    కం.
    నారి శకుంతల దానా
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
    కారణ జన్ముడు భరతుని
    పేరున నీదేశ మేలి పెంపువహించెన్.

    సారంగము-రాత్రి

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    సారంగమ్మొక పుత్రునిన్ బడసి సత్సంతుష్టయై యుండగా
    సారంగమ్మొకడేగుదెంచి గొనిపోన్ సారంగపుత్రున్., నృపున్
    సారంగమ్మడుగంగ సాయమతడున్ జంపంగ సారంగమున్
    సారంగమ్ము నరేంద్రుఁగూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్ !!

    ఒక జింక( సారంగము) .. పిల్లను ప్రసవించి.. ఆనందంలో ఉంది. ఇంతలో ఒక ఏనుగు ( సారంగము) వచ్చి ఆ జింకపిల్లను ఎత్తుకొని పోతుంటే.. జింక ( సారంగము) రాజును సాయమడిగింది. రాజు ఆ ఏనుగును ( సారంగము) చంపేశాడు. అప్పుడు జింక ( సారంగము) రాజుతో కలసి తన కొడుకును (కనియెన్) చూసుకొంది.

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. కోరి పరిణయ మ్మాడెను
    వారిరుహాననఁ నృపుండు ప్రమదమ్మున, సిం
    గారించిన నొక గదిలో
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్. . .
    సారంగము ......... రాత్రి

    రిప్లయితొలగించండి
  13. [21/09, 8:57 am] విరించి: *శకుంతల దుశ్యంతుని గాంచి మోహించిననే ఊహతో* . . . .
    ఔరా యెంతటి కామరూపి యతడే యంభోజుడా? యంచు కాం
    తారంబందు వసించు కన్యకయె తాఁ దర్కించుచున్ మోహమున్ మారాజున్ గని ప్రేముడించెనట కామావేశమే హెచ్చగా
    సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్.

    రిప్లయితొలగించండి
  14. ఘోర శరమునకు జ చ్చె న్
    సారంగము : రాజు గూడి సత్పుత్రు గనెన్

    సారస నేత్రి శకుంతల
    కోరిక దుష్యo తు వలన కూరిమి మీరన్

    రిప్లయితొలగించండి
  15. వీరాంగనగజగామిని
    పారంబునువెదకువారిపాలిటప్రభునిన్
    కోరంగాతలదెచ్చెను
    సారంగమురాజుఁగూడిసత్పుత్రుగనెన్

    రిప్లయితొలగించండి
  16. శారద రాత్రముఁ మలయ స
    మీరము రేపగ మరు లెలమిని పరవశయై
    ఆ రమ జేరెను సంవా
    సారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
    (సంవాసము = సంభోగము అనే భావములో)

    రిప్లయితొలగించండి
  17. సారంగమునాయువతికి
    మీరంగాబెండ్లివయసుమెచ్చగరాజున్
    వారలెయేకముగాగా
    సారంగమురాజుగూడిసత్పుత్రుగనెన్

    రిప్లయితొలగించండి
  18. ధీరుండై భరతుండు ప్రీతి వని నుద్దీపించుచున్ మించుచున్
    సారంగమ్ములతోడనాటల కడున్ సంప్రీతితోనుండగా
    సారంగాక్షి మహర్షిపుత్రి యచటన్ సంతృప్తితో, కాంచగా
    సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    రిప్లయితొలగించండి
  19. సారంగంబునునెక్కివేటకుదగన్సాకారమున్జేయనౌ
    జారుండాతడుగాంచభామనునటన్ సారంగనామంబునున్
    మీరన్ మోహమువారికప్పుడుమైకమ్ముదాగ్రమ్మగా
    సారంగంబునరేంద్రుగూడికనియెన్ సత్పుత్రులోకోత్తరున్

    రిప్లయితొలగించండి
  20. ఆరామమందురాజును
    గారవముగబెండ్లియాడెగాంధర్వవిధిన్
    నారీమణి పురుషులలో
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  21. సారంగినిఁ గూడి మసలి
    తా రక్షితమై సతమ్ము తద్దయుఁ బ్రీతిన్
    వారని ప్రేమను జూపఁగ
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్


    పారావార పరీత భూవలయముం బాలించు రాజన్యునిన్
    వీర శ్రేష్ఠ వరుండు నా భరతు సంవేద్యున్ సవజ్రప్రభా
    సారౌన్నత్య శచీ మనోహర సమాజ్ఞప్తాప్సరో మేనకా
    సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    [సారంగంబు = చిత్రమైన వర్ణము కలది]

    రిప్లయితొలగించండి
  22. కందం
    నీరజ నేత్ర శకుంతల
    నేరక గాంధర్వ విధిని నెన్నుచు మనువున్
    దీరిన కన్నులుఁ బోలఁగ
    సారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    శార్దూలవిక్రీడితము
    మేరన్ గానక యా శకుంతలనటన్ మెచ్చంగ దుశ్శంతుఁడున్
    దారన్జేయుదు నిన్ను నాకనుచు గాంధర్వంబునన్జేకొనెన్
    మీరన్ జాలుటరాని బేలయగుచున్ నేత్రంబు లొప్పారనై
    సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    రిప్లయితొలగించండి
  23. కోరుచు మనసున సంతతి
    వీరుడు గజరాజు మీద విరహము తీరన్
    గేరుల గుంపుననొక్కతి
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  24. ప్రహ్లాదుని జననము:

    శా:

    ఘోరంబైన తపస్సు; బ్రహ్మ నొసగన్ కోర్కెంటు కోరంగనై
    సారంబెంచిన దానవుండు నెపుడున్ సాగింప కయ్యంబులన్
    భారంబున్ గని నారదుండు దెలుపెన్ భాగమ్ము లీలావతిన్
    సారంగంబు నరేంద్రు గూడి కనియెన్ సత్పుత్రు లోకొత్తరున్

    దానవుడు=హిరణ్యకశిపుడు =నరేంద్రుడు
    లీలావతి =హిరణ్యకశిపుని భార్య= సారంగము( జింక)

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. పారావారగభీరమౌ ప్రణయమేపారంగదుష్యంతునిన్
    *సారంగంబులుపూవుదేనియలకై సారించు చందంబునన్
    నారీరత్నముకణ్వునాశ్రమమునన్ నందంబు పెంపొంద నా
    #సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్
    *తుమ్మెదలు # రాత్రి

    రిప్లయితొలగించండి