25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3497

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామారెడ్డికి వధాన నైపుణి గలదే"
(లేదా...)
"రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్"
(యతిని గమనించండి)
(శతావధాని కొండపి మురళి గారు పంపిన సమస్య)

64 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    ధీమంతుండయి హైద్రబాదునను తా దీటైన గర్వమ్ముతో
    భామల్ మధ్యను కూడుచున్ నగవుచున్, బ్రహ్మాండమౌ తీరునన్
    దోమల్ గూడను దోమలన్ తరుముచున్ తోరంపు తాపమ్మునన్
    రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్ 😊

    రిప్లయితొలగించండి
  2. శా||
    నీమింపంగను పృచ్ఛకావళినధోనీరంబునన్ ప్రశ్నలన్
    ధీమాగానటు ఛందముల్దెలియకన్ దేలన్ సమస్యల్ పరం
    ధామా! దత్తపదిన్ కటా యనుచితద్రవ్యంబులన్ వేయగన్
    రామారెడ్డియొనర్పజాలడవధానక్రీడనేనాటికిన్

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గ్రామమ్మందున తా కరోన వెఱనున్ కంపమ్మునన్ దాగుచున్
    హామీలేనిది వైఫయిన్ కొనగనున్ హైరాణనున్ సైచుచున్
    ధీమాగా సెలుఫోనునన్ జరుపగన్ తీండ్రించి జాలమ్మునన్
    రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్!

    రిప్లయితొలగించండి
  4. సమస్య :
    రామారెడ్డి యొనర్పజాల డవధా
    నక్రీడ నేనాటికిన్

    (అవధానికి సామర్థ్యప్రదాత్రి శారదాదేవి)
    ఏమాశ్చర్యము ! భావనాబలము నెం
    తెంతంచు వాక్రుచ్చెదన్ !
    ధీమాగా నొనరించు నాతడు మహా
    ధీమంతులే మెచ్చగా ;
    సామర్థ్యంబిడు శారదాంబ దయ య
    శ్రాంతంబు లేకుండినన్
    రామారెడ్డి యొనర్పజాల డవధా
    నక్రీడ నేనాటికిన్ .
    ( అశ్రాంతంబు - నిరంతరం )

    రిప్లయితొలగించండి
  5. అరకొర పాండితి నొందియు
    నిరతము తెలుగు కవితలను నెరపుచు కాశీ
    పురమందున నివసహించు మ
    న రమారెడ్డికి వధాన నైపుణి గలదే

    రిప్లయితొలగించండి
  6. ఏమో నలుగురు ననుటయె
    సుమ్మా నే నెటు తెలుపుదు సోదియు నీకున్
    నమ్మకము నాకు లేదా
    రామారెడ్డికి వధాన నైపుణి గలదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో యతి? "నమ్మకము లేదు నాకున్..." అనండి.

      తొలగించండి
  7. నీమాటల్ కడు చిత్రమె
    భామా! చాలించవె, ఘన పండితు డతడీ
    గ్రామంబందున చేయ
    న్రామారెడ్డికి వధాన నైపుణి గలదే.

    రిప్లయితొలగించండి
  8. ఏమేమీ యసమానసత్కవనసాహిత్యార్థశబ్దావళీ
    ప్రాముఖ్యప్రకటోపయోగధిషణాభ్రాజిష్ణుడై యొప్ప, వా
    ణీమాన్యాత్మతనూజరత్న
    మటులన్ నిర్దుష్టమర్మోక్తిలో
    న్రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి పూరణ

      చయ్యనఁ జీరకొంగు మృదుహస్తమునన్ బిగివట్టి లాగి యం
      దియ్యని మోము వంచి నును దేరిన వాతెర ముద్దడన్ చి చీ
      నెయ్యము గాదు గా దనగ నెమ్మి హసించి విరాళి నొందు నిం
      టయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా

      కంజర్ల రామాచార్య

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ

      శ్రీ గురుభ్యో నమః 🙏

      శ్రీమద్భారతి చేరదీసి చనుబాల్ చెన్నార ద్రాగింప వా..
      గ్ధీమాధుర్యములబ్బెనా యనగ సందీపించు స్వీయప్రభన్
      శ్రీమంతంబుల పద్యరత్నముల., కీర్తింగోరి నిస్సారతన్
      రామారెడ్డి యొనర్పజాలడవధానక్రీడనేనాటికిన్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

      తొలగించండి
  10. ధీమంతుడువిద్యలలో
    కామారెడ్డినవసించు కడుసరసుండున్
    రామావతారుకన్న
    న్రామా రెడ్డికి వధాన నైపుణి గలదే

    రిప్లయితొలగించండి

  11. కొసరు సరదా పూరణ:

    "వివాహ భోజనంబు"

    నీమంబెంచక పప్పునున్ పులుసునున్ నెల్లూరివౌ లడ్డులున్
    ధీమాతో వడలున్ జిలేబి మురుకుల్ త్రేపించు మాగాయనున్
    చేమల్ దుంపల వేపుతో నవియలన్ చేదోడుగా మెక్కగన్
    రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్

    రిప్లయితొలగించండి
  12. రామారెడ్డి వధానిశేఖరులు పూర్ణప్రాభవోపేత ని
    స్సీమప్రౌఢిమతో వధానములఁ దాఁ జేయున్ రసస్ఫూర్తితోఁ
    గైమోడ్పుల్ ఘటియింతు వారికిఁ, జమత్కారమ్ము లేకుండగన్
    రామారెడ్డి యొనర్పజాల డవధానక్రీడ నేనాటికిన్.
    ................... శతావధాని కొండపిమురళీకృష్ణ

    రిప్లయితొలగించండి
  13. యేమాత్ర మనకు మీల
    న్రామారెడ్డికి వధాన నైపుణి గలదే.
    యేమా ధారణ, ధిషణా
    తామిక తప్పున బడితిరి తప్పౌ యతితోన్,

    రిప్లయితొలగించండి
  14. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'ఏమాత్ర' మని ప్రారంభించండి. యడాగమంతో పద్యాన్ని ప్రారంభించరాదు.

    రిప్లయితొలగించండి
  15. భామారత్నములెందరో రతి సుఖంబందించు చుండగ నా

    ధామంబున్ ఘనమైన భోజ నము మోదంబున్ లభించంగ నా

    క్షేమంబిచ్చట నాకు ముఖ్య మని నిక్షేపంబుగా నుండు శ్రీ

    రామారెడ్డి యొనర్ప జాలడ వధాలంకార మేనాటికిన్

    రిప్లయితొలగించండి
  16. ఏమాధార, మనీష, నేడు కనలే మెచ్చోట నీ పాండితిన్
    సీమన్ బుట్టి సరస్వతీ కరుణతో చెన్నొందు సింహమ్ము చూ
    సోముండే యవధానవిద్యల, బుధుల్ చూడంగ రాకుండినన్
    రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్

    రిప్లయితొలగించండి
  17. ధీమంతులు నుతియింపగ
    నేమాత్రము తొణక కుండ నేకాగ్రత తో
    ధీమాగా మెప్పు గ మ
    న్రా మారెడ్డి కి వధాన నైపుణి గలదే?

    రిప్లయితొలగించండి
  18. సీమన్నేర్చినపద్యవిద్యనిపుణిన్శ్రీమంతునాకావ్యునిన్
    ధీమంతుండవధానిశేఖరుడనన్దీండ్రించివాకృచ్ఛదా
    న్రామారెడ్డియొనర్పజాలఁడవధానక్రీడనేనాటికిన్
    గామాసక్తులుక్రోధపూరితులుదక్షత్వంబుబ్రశ్నింపగా

    రిప్లయితొలగించండి
  19. మామా సూటిగ జెప్పుము
    మోమాటము వీడకున్న ముప్పగునయ్యా
    యేమడిగినఁ దెలియదను
    న్రామారెడ్డికి వధాన నైపుణి గలదే

    రిప్లయితొలగించండి
  20. భామా!చెప్పుమునాకు
    న్రామారెడ్డికివధాననైపుణిగలదే
    మీమాంసయెయీవిషయము
    నేమోనమ్మకములేదునేమాత్రమునున్

    రిప్లయితొలగించండి
  21. యేమా! యీ కవి తడబడె
    భామా మణి చెంతనుండ భయమందె నొకో
    భ్రమలన్ ముంచగ నెంచె
    న్రామారెడ్డికి వధాన నైపుణిగలదే!!

    *** అవధానానికి తన భార్యామణి హాజరైన సందర్భంలో సరదాగా.....

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. రామారెడ్డివధానుల
      ధీమంతమ్మగు వధాన ధీషణనొందన్
      నామము చేతనె దక్క?
      న్రామా రెడ్డికి వధాన నైపుణి గలదే?

      సాధన లేకుండా కేవలం వారి పేరు చేతనే అవధానవిద్య సిద్ధించునా...?అనే అర్ధం లో నా పూరణ
      --- శ్రీరామ్ 10 వ తరగతి

      తొలగించండి
  23. ఏమీమాటలుబల్కుచుంటివియహోయేమాయెనీకిప్పుడు
    న్రామారెడ్డియొనర్పజాలడవధానక్రీడనేనాటికిన్
    రామారెడ్డినిజూచితేరమ!యిటన్ రాద్ధాంతమున్ జేయ,యో
    భామా!పాడియె?నీకునిట్లుగనుటన్ ,వాచాలునీవైతివే?

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. వేమార్లన్న నసత్యమౌను గద నీవీ రీతిగా బల్కుట
      "న్రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్"
      భామా నీ పరియాచకంబులును నీ వాచాలతన్ మానుమా
      ఆమూలాగ్రము నాంధ్ర భాష నతడే యాపోసనన్ బట్టెనే
      రామారెడ్డి వధానమన్న రసధారావాహినౌ నద్దియే

      తొలగించండి
  25. గ్రామమ్మందు వధాన మేర్పరచగా గ్రామస్తులే కోరగా
    భామా నీవిటులేల పల్కితివి నీవవ్వారితో యచ్చట
    న్రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్
    సామాన్యుండతగాడుకాదుగద శాస్త్రాలెన్నొ తానేర్చెనే.

    రిప్లయితొలగించండి
  26. ఏమని పొగడుదు నాతని
    సామ వచన కోవిదుండు స్వజనావలికిన్
    క్షేమము లెల్ల నొసఁగెడిన్
    రామారెడ్డికి వధాన నైపుణి గలదే!


    శ్రీమంతావలి దోహలమ్ము నిజ చిత్తేచ్చా బలాధిక్యమున్
    సామంతాధిక సాహ్యమున్న ధరలో సద్విద్యలన్ నేర్వరే
    యేమీ మాటలు బ్రాహణుం డయిన నింకిద్ధాత్రి రెడ్డైననున్
    రామా! రెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్

    రిప్లయితొలగించండి
  27. ఆ మిత్రుండిట స్వస్థతన్ గొనుచు , నాహ్లాదమ్ము గొల్పన్ వడిన్
    ప్రేమన్ మీర వధానముల్ నెఱప తా స్వీకారమున్ దెల్పిన
    "న్రామారెడ్డి యొనర్ప జాల డవధానక్రీడ నేనాటికిన్,
    ధామంబున్ విడి రాడ"టంచు బలుకన్ ధర్మమ్ము కాబోదిలన్

    రిప్లయితొలగించండి
  28. ధీమంతుడు వాక్పటిమను
    సామీరిని మించువాడు సజ్జనవరుడౌ
    రామారెడ్డిది పేరిడ
    రామా! రెడ్డికి వధాన నైపుణి గలదే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో
      ధీమంతుడు వాక్పటిమను
      సామీరిని మించువాడు సజ్జనవరుడౌ
      రామారెడ్డి సమాహ్యన్
      రామా! రెడ్డికి వధాన నైపుణి గలదే?

      తొలగించండి
  29. శ్రీ రామా రెడ్డి గారికి బులుసు వేంకట రామ మార్తి గారు అవధాన క్రీడకు ప్రేరణ. వారి పేరును రామా మూర్తి అని చెప్పాను.

    శా:

    నేమంబెంచుచు సంస్కృతాంధ్రముల నన్వేషించె విద్వాను గన్
    రామామూర్తిడ ప్రేరణమ్మునట ప్రారంభింప నేకాగ్రతన్
    సీమల్ దాటెను ప్రాభవమ్ము తనదౌ చిత్రంబు లేకున్నచో
    రామారెడ్డి యొనర్ప జాలడ వధానక్రీడ నేనాటికిన్

    ఏకాగ్రత=అవధానము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదా కు వ్రాసిన పూరణ
      శా:

      రామా యేమని సెప్ప మంద్రునకటా రాత్రంత గోలే కదా
      నేమంబేదియు లేక మత్తు గొను పానీయంబులన్ గ్రోలుచున్
      సీమల్ దాటగ కైపునన్ మదిని రాజేయంగ తా నిట్లనెన్
      రామా రెడ్డి యొనర్ప జాలడవధాన క్రీడ నేనాటికిన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. రెండవ పద్యంలో స్వగతంగా చెప్పిన మాటగా పూరణ

      తొలగించండి
  30. కామారెడ్డినివాసివిద్యలకునున్ కాణాచిగానొప్పునా
    ధీమంతుండుకుశాగ్రబుద్ధియగుసందీపుండు మేల్బంతి తా
    నామంత్రింపగనెట్టిదుష్కరవధానంబైననీడేర్చగ
    న్రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్

    రిప్లయితొలగించండి
  31. రామాయణము చదివినను
    రాముని సతి జననపు వివరమరయ లేడే
    యమనుచు తెలుప గనగు
    న్రామారెడ్డికి వధాన నైపుణి గలదే

    రిప్లయితొలగించండి
  32. కందం
    సామర్థ్యము విలసిల్లన్
    రామారెడ్డికి వధాన నైపుణి గల దే
    ప్రామాణిక దోషమ్ము ల
    సామాన్యుండన దొరలవు శారద కృపతో

    శార్దూలవిక్రీడితము
    సామర్థ్యమ్ము గలుంగ మేటి కవియై సాధించె బాల్యమ్మునన్
    బ్రామాణ్యమ్ములు లేవులేవు రసహీనంబైన పద్యమ్ములన్
    సామాన్యమ్ముగ జెప్పినాడనఁగ, నాషామాషిగా వేదిపై
    రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్!

    రిప్లయితొలగించండి
  33. ఏమిటి నిజమేన,యీమహి
    ని విడచి
    యస్పిబాలు‌ వెడలె నన్న మాట

    నేను వింటి నిజమా,నేను కలను కను
    చుంటిని యేమో? వసుధను వీడి

    వెడలితివి హతోస్మి విడచి మ
    మ్మిచ్చోట
    వెడలితి వేలనో వేల కోట్ల

    గొంతులు ధరణిలో‌ గొల్లు మనుచు నుండె
    బాలసుబ్రమణ్య బ్రాహ్మణుండ!

    ఘంటసాలను కూడి గానమ్ము చేయంగ
    వేగముగ దివికి వెడలి నావ?

    నాగయ్యతో కూడి త్యాగరాజ
    కృతులు
    నాలపింప వెడలి నావ? మంగ

    ళము పల్లి వారితో గమకము
    లేమైన కొత్తవి చర్చించ కోరి నావ

    పాడుతా తీయగా పాటను వినిపించ
    మనుచు నమర లోకమందు నెవ్వ

    రైనను‌ కోరినారా?భానుమతి కీర్త
    నలను నీవు వినగ దలచి వెడలి

    నావ? ఎస్పీ బాలు నడిసంద్ర మందు యీ
    చిత్ర సీమను త్రోసి చేరె దివికి

    నను నపభ్రంసలు వినబడు
    చుండగా
    నెటుల వెడలినావు నెమ్మి తోడ

    స్వర్గమునకు,నమ్మ శక్యము కాకుండె
    నింకను మనసుకు, శంక కలుగు

    చుండె ,నేవిన్నది శుధ్ద యబధ్ధమౌ
    నని,పొరబాటున నిను శచి పతి

    కొనిపోయె నాయేమి? కోట్ల మందికి గుండె
    లన్ని నొక్క క్షణము లయలు‌ తప్పె

    నీవు లేవను వార్త నెవ్వరు
    నమ్మజా
    లగ లేరు జనులెల్ల వగచి వగచి

    కనుల నీరంతయు కడలిని
    చేరుచుం
    డెను గదా నిజమిది‌ ఘనుడ , గాన

    గంధర్వు డా యిది‌ గారడీ‌ ననుచుంటి
    పరమ శివునకును,భార్య పార్వ

    తమ్మ నీ పాటను తనకు ము
    దమ్ముగ
    వినిపించమని కోర ప్రేమ తోడ

    నిను పిలిపించెను నీల కంఠుడుతన
    కైలాసమునకు, ముఖ్యమని తలచి

    సుబ్బలక్ష్మమ్మకు నబ్బురముగ తోడు
    నిడగ శ్రీహరి పిల్చె నిన్ను‌ విష్ణు

    సాన్నిధ్యమునకు, నిజము గాదె
    నవ సం
    గీతపు బాణీలు జాతికి నిడ

    యా బ్రహ్మ పిలిపించె నానందముగ నిన్ను
    సత్యలోకమునకు సంతసముగ,


    నిజమిది తెలుగువాని ఘనత
    విశ్వమం
    త తెలిపితివి నీవు ధన్య జీవి

    వయ్య నీవు, తెలుగు వారి కెవరు సాటి
    రారని‌ తెలిపిన బ్రహ్మ వయ్య,

    పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు
    కనులు తెరిచి భువి కాంచి నట్టి

    ప్రతి జీవి కనులను పరమేష్డి
    సన్నిది
    కై మూయ తప్పదు ఖల్వ మందు

    ఘంటసాల పిదప కుంటు పడును చిత్ర
    సీమ యనితలచ శీఘ్రగతిని

    కంఠము నందించి ఘనమైన
    చిత్ర జ
    గమ్మును నోర్మితో కాచి నావు,

    భక్తి పాటలను శుభమ్ముగా యెన్నియో
    భాషలలో పాడి పరవశమ్ము

    జనుల గళమునందు సమకూర్చి
    నట్టి థ్ర
    ష్టవు యీవు జగతిలో సంబరముగ

    యెన్ని యవార్డులు యెంత కీర్తి బడసి

    సంగీత సాహిత్య సంప్రదాయ

    విలువలకు నెపుడు పెద్ద పీ టను వేసి
    మన తెలుగు రహి ఘనత తోడ

    పదుగు రెదుట నీవు పంచి ముదము పొంది
    నావుగా, నీదు గానమును వినని

    జనులు లేరు జగతిన్ ,సప్త
    స్వర సరము
    లో కోహినూరువే! లోకమందు

    యెనలేని కీర్తిని ఘనముగా
    పొంద నీ
    శక్తిని పొగడగా సాధ్య మెవరి



    తరము, శ్రీపతి వంశమెంత తప మిచట

    చేసెనో, తెలుగు శిశువా, చేయు
    చుంటి

    శిరసు వంచి నమస్సులు , భరత మాత

    బిడ్డడా గొనుమంజలి ప్రేమ తోడ

    రిప్లయితొలగించండి
  34. రామయ్యా యేమిది యో
    నామాలేరానియట్టి అల్పజ్ఞునకున్
    సోమరిపోతుగ మారి
    న్రామారెడ్డికి వధాన నైపుణి గలదే


    రిప్లయితొలగించండి