28, సెప్టెంబర్ 2020, సోమవారం

సమస్య - 3500

కవిమిత్రులారా,
(మీ అందరి సహకారంతో సమస్యల సంఖ్య 3500 చేరుకున్నది. ధన్యవాదాలు.)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాసికంటె మేలు రాసి గనఁగ" 

(లేదా...)
"వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ"

69 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    మోసిరి శీర్షమందునను ముప్పుల నోర్చుచు మోదమొందుచున్
    వ్రాసిరి కైపదమ్ములిట వందలు వేలుగ శంకరార్యులే
    చేసిరి మేటి యజ్ఞమును చెన్నుగ పద్యపు ద్వారబంధమున్
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మోసితి శీర్షమందునను ముప్పుల నోర్చుచు మోదమొందుచున్
    వ్రాసితి పూరణమ్ములిట వందలు వేలుగ జంకులేక, నే
    చేసితి మేటి యజ్ఞమును చెన్నుగ హైదరబాదునందునన్
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ

    రిప్లయితొలగించండి

  3. Flashback:

    కంది శంకరయ్యఅక్టోబర్ 22, 2017 2:18 PM

    ఎంత సుదిన మిది?
    ఉదయం నుండి ప్రశంసల జల్లులో తడిసి ముద్దయినాను. బ్లాగులో, వాట్సప్ సమూహంలో, ఫేసుబుక్కులో, ఫోను ద్వారా నాకు శుభాకాంక్షలు, అభినందనలు గద్య పద్యాల రూపంలో తెలుపుతూనే ఉన్నారు.

    గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారు, వారి సోదరి గుఱ్ఱం సీతాదేవి గారు తమ కుటుంబ సభ్యులతో ఇంకా అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, మాచవోలు శ్రీధర రావు గారు వ్యక్తిగతంగా మా వృద్ధాశ్రమానికి వచ్చి నాకు సన్మానం చేసి వెళ్ళారు.
    ఈరోజు నేను పొందిన ఆనందాన్ని, తృప్తిని, (కించిత్తు గర్వాన్ని) మాటల్లో వివరించలేను.
    మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

    నిజానికి 2500 సమస్యలు అయ్యాక బ్లాగును ఆపివేయడమో, ఎవరికైనా అప్పగించడమో చేద్దామనుకున్నాను. కాని మీ అందరి సహకారం, ప్రోత్సాహం, ప్రశంసలు నూతనోత్సాహాన్ని నింపాయి. నా ఓపినంత బ్లాగును నిర్వహిస్తూనే ఉంటాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🏽 నమస్కారము . కంటిన్యూ చేయడం వలన నాబోటి వారికి శంకరాభరణం లో పాల్గొనే అవకాశం దక్కింది
      ధన్యవాదములు

      తొలగించండి
  4. గౌతమబుద్ధుని ఆబిర్భావము

    యదార్ధభూయిష్టమౌ మృత్యువును కనుగొని బుద్ధుడవ్వగా ఇంట్లో భోగాలేటికి? ఆ వీధిలోనే రాసి ఉన్నది అని అంటున్నాడు..
    ఆ కుప్పలే ధనమని భావిస్తున్నడో ఆ.కుప్పలే మృతకర్పటములేమో , ఆ కుప్పలే లోకంలో కష్టాలేమో ..

    యద్భావం తద్భవతి

    ఉ||
    చేసిన కార్యముల్ మనకు జేర్చును పుణ్యము పాపరాసులన్
    చూసిన మృత్యువాతముల శోకముచెందుట బుద్ధుడవ్వగన్
    బాసలుజేయ గౌతముడు సాగెను వీధికి నిట్లు జెప్పనీ
    వాసియనంగనేల దలవాకిట గంపడు రాసిగొప్పదౌ

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  5. వాసికంటె మేలు రాసి గనఁగనగు
    ననుచు రెండు బోల్చ ననువు గాదు
    గానము సలుపంగ గావలె వాసియె
    దానము సలుపంగ దగును రాసి

    రిప్లయితొలగించండి
  6. సమస్య :-
    "వాసికంటె మేలు రాసి గనఁగ"

    *ఆ.వె**

    వందగు కవితలను వ్రాసిన వారికి
    మెరుపుల కవి బిరుద మిత్తుమనగ
    వారమింక కాక వ్రాసి బిరుదు పొందె
    వాసికంటె మేలు రాసి గనఁగ
    .........‌‌.......‌‌✍️చక్రి

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా నమస్కారం చాలా చాలా సంతోసముగా ఉన్నది
    మూడు వేల అయిదు వందల‌ సమస్యలు బ్లాగు పూర్తి చేసుకున్న సందర్భములో

    మీ యొక్క కృషి అసామాన్య ము

    ఇటువంటి బ్లాగు రాబోదు ఎప్పుడూ న భూతో న భవిష్యతి

    పది వేలు మార్కు‌చేరు కోవాలని అప్పుడు వరకు మీరు ఆరోగ్యము గా ఉండాలని భగవంతుని ప్రార్థన చేయు చున్బాను

    పూసపాటి

    రిప్లయితొలగించండి
  8. ( "పాండవులతో యుద్ధమా!"అని అధైర్య
    పడుతున్నధృతరాష్ట్రునితో దుర్యోధనుడు
    ఆసలు మోసులెత్తె గద
    యన్నిట మిన్నలు తాత గుర్వులున్ ;
    నా సుసఖుండు కర్ణుడును ,
    నా కృతవర్మయు , ద్రౌణియున్ , గృపుల్ ,
    మీసలు ద్రిప్పు తమ్ములును ,
    మీరిన లక్షల సైన్యముండగా
    వాసి యనంగ నేల ? దల
    వాకిట గన్పడు రాసి గొప్పదే !
    ( ద్రౌణి - అశ్వత్థామ; సుసఖుడు - మంచి మిత్రుడు )

    రిప్లయితొలగించండి
  9. ఈనాటి శంకరా భరణము వారి‌ సమస్య

    వాసి కంటె మేలు రాసి గనగ



    రాయ భారము‌ సమయములో చక్రధారితో భీముడు పలుకు‌ సందర్భము

    ఇచ్చిన పాదము‌ ఆట వెలది‌
    తేట గీతిలో నా పూరణ



    కలరు శత సోదరులు నీకు,తలచ మాదు

    నకులు డొక్కడు చాలుగా నామమడచ

    కలరు ద్రోణుడు,భీష్ముడు కర్ణ కృపులు

    మాకనుచు కడు గర్వపు మత్తు లోన

    తూల వలదు పార్ధు డొకడు
    చాలు వారి

    నెదురు కొనగ ఘనమగు సైనికులు కోట్ల

    మంది గలరంచు మురియంగ మట్టు బెట్ట

    గలను గా వారలను ,వాసి కంటె మేలు

    రాసి గనగ నని మురిసి రణము చేయ

    భంగ పడుదువు రారాజ ,భరణి లోన

    ననుచు నాదు పలుకుల నో నల్లనయ్య

    తెలుప మనుచు పలికెనుగా వలలు డపుడు

    రిప్లయితొలగించండి
  10. విరియ కాసినట్టి తరువును గాంచుచు
    మంచి కాయలందు నెంచ మితమ
    టంచు పలుక నాగ్రహించుచు చెప్పితిన్
    వాసికంటె మేలు రాసి గనగ.

    రిప్లయితొలగించండి
  11. వ్రాసినాడను ఎన్నియో పద్యములను
    పెక్కు సభలలో పాల్గొంటి వేదికలను
    కాకు లెన్నైన కూయనీ కవిని నేను
    వాసికంటెను మేలగు రాసి గనఁగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వ్రాసియున్నాడ నెన్నియో..." అనండి.

      తొలగించండి
  12. వాసి యటంచుఁ బల్కెదవు పమ్ము క్షుధార్తిని మాన్ప జాలునో!
    యే సిరి మూటఁ గట్టునొ! గతించెడుఁ బ్రాణము నిల్పజాలునో!
    కూసెను కారుకూతల నకుంఠితనీచుడు నిట్లు దుష్టసం
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ?

    దుష్టసంవాసము కలవాడు దుష్టసంవాసి

    మీ సేవలు తెలుగు సాహితీమూర్తికి అత్యంతావశ్యకములై యున్నందున ఆ మాతృమూర్తి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదింస్తుందని భావిస్తూ


    మీ సాహిత్యక్షేత్రంలో చిన్న అంకురం

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  13. గురువుగారికి 3500 సమస్యల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అభినందన వందనములు.

    రిప్లయితొలగించండి
  14. విద్యనేర్చుకొనగ వివిధమౌ గ్రంధముల్
    చదువుచుండవలెనుఛాత్రుడెపుడు
    నిర్విరామ శ్రమము నుర్విని మేల్గూర్చు
    వాసికంటె మేలు రాసి గనఁగ

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణలు

    శంకరాభరణస్యందనం అప్రతిహతముగా 3500సమస్యలతో దూసుకుపోతోంది.
    రథసారథి శ్రీ శంకరయ్య గారికి అభినందనలు 💐🙏ఈ ప్రయాణంలో ఎందరెందరినో పద్యకవులుగా తీర్చిదిద్దుతోంది..
    కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
    శుభమస్తు 💐💐🙏🙏
    భాసురశంకరాభరణపద్యసమూహమునందునెందరో
    వ్రాసెడివారలుండిరి ప్రభాతమునన్ రసపద్యమాలికల్.,
    దోసములున్న., దాను శ్రమతో సవరించును శంకరయ్య., జి..
    జ్ఞాస యొకింత యుండుట విశాలమతిన్ కృషి జేసి చేసి ప్రో...
    ద్భాసితులౌచునిచ్చట ప్రభాకరశాస్త్రులవంటివారనా...
    యాసముగా రచింతురిపుడద్భుతపద్యములెన్నొ., పొత్తముల్
    సేసిరి స్వీయపద్యములఁ, జేతులనెత్తి నమస్కరింపుడ..
    భ్యాసము కూసు విద్య యను పల్కునకిద్ది యుదాహృతంబు., వి...
    ద్యాసముపార్జనమ్మునకు దప్పునె కష్టము? నేర్చువేళలో
    వాసి యనంగనేల? తలవాకిట గన్పడు రాసి గొప్పదౌ!!

    (శ్రీ ప్రభాకరశాస్త్రి గారి పేరును పద్యములో యథావసరం స్వేచ్ఛగా వాడుకొన్నందుకు వారు నన్ను మన్నింతురు గాక🙏)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మరొక పూరణ 🙏😊

      పడక సీనులో సుయోధనుని ఆలోచన..

      ఏ సుఖమౌను? కృష్ణుడొకడే రథమందు నిరాయుధుండునై
      భాసిల బొమ్మవోలె., యదువంశ్యులు శూరులు నగ్నితేజులౌ
      భాసురయోద్ధలన్ గొనినవానికె దక్కు జయమ్ము., పోరులో
      వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. చిన్నిఁదెరను దెఱచి చిత్రాలు దిలకించి
    నాడిఁదెలిపి జనులు నడచుకొంద్రు
    అంతులేనికథల యంతరమెఱుగగ
    వాసికంటె మేలు రాసి గనఁగ

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారి సమస్యాపూరణల సంఖ్య 3500 పూర్తియైన సందర్భముగా శుభాభినందనలు. నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ప్రఖ్య నొంది నట్టి పద్యపుస్తకములు
    చదివి ధారణమును సలిపినంత
    మేటి కైత లల్లు మెలకువ గల్గును
    వాసి కంటె మేలు రాసి గనగ.

    రిప్లయితొలగించండి
  19. వాసి కన్న మేలు రాసిగనగ నంచు
    పలుక దగదు మాదు భాగ్య మనగ
    నాల్గు వేలు మించి నవ్యత వెలుగొందు
    శంక లేక టంచు శంక రార్య !

    రిప్లయితొలగించండి
  20. శంకరాభరణం లో సమస్యలు నేటితో 3500 కు చేరుకున్న సందర్భంగా గురువర్యులకు అభినందన వందనములు. అసనారె

    రిప్లయితొలగించండి
  21. కాసిని కాసులన్నిడుచు కంఠము నిండుగ సారబోసినన్
    వేసిరి వోట్లనన్నిటిని భేషని మంత్రిని జేయగాననున్
    దోసము లెంచగా బుధులు తోరపు నష్టము లేదుగా నిటన్
    వాసి యనంగనేల దలవాకిట గన్పడు
    రాసిగొప్పదౌ

    రిప్లయితొలగించండి


  22. నాణ్యతసలు లేని నకిలి నగలు కొని
    *వాసి కన్న మేలు రాసి యనగ*
    మొరక తనమె గాని బుద్ధివంతులనెడి
    మాట గాద దెపుడు మహిని జూడ.

    పసయు లేని యట్టి పద్యములను వ్రాసి
    *వాసి కన్న మేలు రాసి యనగ*
    సముచితమన బోరు శంకరార్యులిచట
    వాసికిత్తురెపుడు ప్రథమ శ్రేణి

    రిప్లయితొలగించండి
  23. నాసిరకంపు మండములు నాణ్యము లైనవటంచు పెండ్లిలో
    వేసిరి, యొక్కటైనను నవీనకలాపము లేకపోయెనే
    మోసము చేసిరే యనుచు ముద్దియ యేడ్వగ నేవచించితిన్
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ

    రిప్లయితొలగించండి
  24. రోసితి ధర్మ పన్నములు రూకలె సత్యమటంచు బల్కుచున్
    నాసి రకంపు వైద్యమున నమ్మిన రోగుల డబ్బు బీల్చగా
    జూసెడి వైద్యుడే యనును చోద్యముగా నిటువంటి మాటలన్
    "వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ"

    రిప్లయితొలగించండి
  25. అందరికీ నమస్సులు 🙏
    28 09.2020

    నా పూరణ యత్నం..

    *ఆ వె*

    ప్రక్కలున్న వారి ప్రాణంబు దీయుచు
    ధనము నాశ జూపి మనల సతము
    మోసగించు నట్టి వేషగాడౌ సహ
    *"వాసికంటె మేలు రాసి గనఁగ"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  26. వేసిరిపాతపొత్తములవేడుకసేసిరిభోగిమంటలన్
    చూసిరిగ్రంథరాజములుజోస్యముహాస్యముచందమామలున్
    దోసమటంచుపాతవనిద్రుంచగమంచిచెడున్గణించకన్
    దాసినవెన్నియోగితకితాబులుబూడిదయయ్యెవారికిన్
    *వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ"*

    రిప్లయితొలగించండి
  27. వాసిగ వ్రాసిరెల్లరును పద్యములింతకు పూర్వమీ భువిన్
    చేసిరికొత్త ప్రక్రియలుశీఘ్రముగా ప్రజమెచ్చతెల్గులో
    బాసలు పెక్కు నేర్చి పరభాషయె గొప్పదటంచు నయ్యదే
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ"

    రిప్లయితొలగించండి
  28. ముప్పదైదు నూర్ల ముత్యంపు సరులను
    కంది వారి సభను కవులు గూర్ప
    వాసికంటె మేలు రాసి గనఁగ నందు
    రేల పద్య విద్య మేలు గాంచె

    రిప్లయితొలగించండి
  29. మూడువేలయైదుమురిపెముగనువ్రాయ
    కవివరేణ్యులొగిని ఘనముగాదె
    కందిశంకరయ్య గారికరకరిని
    వాసికంటెమేలురాసిగనగ

    రిప్లయితొలగించండి
  30. గ్రాసములేక మానవులు కాంచుచునుండ బుభుక్షఁ బాపగా
    చేసిరి పెక్కుశోధనలు శీఘ్రమె హెచ్చుగ పంటఁదీయగన్
    కాసులు రాల్చి రైతులకు కమ్మని తిండి జనాళి కివ్వగా
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ

    రిప్లయితొలగించండి
  31. ఆటవెలది
    శంకరార్యు బ్లాగు సంరంభమందునన్
    మీరు వ్రాసిరెన్నొ వారు మెచ్చ
    నచ్చువేయుడయ్య యందదు నంతటి
    వాసికంటె! మేలు రాసిగనఁగ

    ఉత్పలమాల
    చేసితిరెన్నొ పూరణలు శ్రీగురుదేవులు భేషుభేషనన్
    బాసితిరెందుకో తమరు వాటిని పుస్తకరూపమీయగన్
    నా సలహావినన్ రయమె నందము! వారల మెప్పు మించెడున్
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ!

    రిప్లయితొలగించండి
  32. వాసిగగందిశంకరులబాయనినుత్సుకనుండగల్గుటన్
    నాసనువ్రాయుచుంటిమిటయద్భుతరీతినిబద్యరాసులన్
    వాసియనంగనేలదలవాకిటగన్పడురాసిగొప్పదౌ
    యాసిరిచాలుజన్మకిలనాశివపార్వతులీయనాశిసుల్

    రిప్లయితొలగించండి
  33. రాతి నైన నీవు రత్నమ్ముగా మలు
    చఁ గల వయ్య మించి సద్గురువర
    వాఁ డొసంగు నట్టి వస్తు చయం బంత
    వాసి కంటె మేలు రాసి గనఁగ

    [అంతవాసి = శిష్యుఁడు]


    దోసము లెంచ కిందుఁ బరితోషము నొందుమ వీడి శంకనున్
    వాసికి నెక్కు దీవు పరిపాలన మందును గార్య మెద్దియుం
    జేసిన నిచ్చు సత్ఫలముఁ జెన్నుగ నియ్యది దుష్ట తిధ్యమా
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ

    రిప్లయితొలగించండి
  34. మీసముఁ ద్రిప్పిశాత్రవుల మిత్తినిజేర్చరణాంగ ణమ్మునన్
    రాసులురాసులై తలలురక్తములోడుచు త్రెళ్ళుచుండగా
    నాశమునొంద సైన్యతతి నందమునొందకనిట్టు లూరకే
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ

    రిప్లయితొలగించండి
  35. పూరణ తేటగీతి లో

    తే॥గీ॥
    మూడువేల యయిదు నూర్లు ముగియ జేసి
    పూరణకు సమస్యలనిడి పూర్తి జేయు
    మనగ , శంకరాభరణమునందు మంది
    వారి నెరతనము కొలది వాంఛతీర

    కవితలను మొదలిడి వాసి కంటె మేలు
    రాసి గనగ యనుచు వేగ రచన సలుప
    తప్పులను దిద్ది యొప్పుగ తారు మారు
    పరచు శంకరార్యునకు నా వందనములు

    రిప్లయితొలగించండి
  36. ఉ:

    కాసులు దండు కొందురట గాలము వేయ నెలెక్షనార్థమై
    వీసము ఖర్చు చేయకనె పేకల మేడలు గట్టి చూపగన్
    మోసము దెల్వ తల్చెనట బొత్తిగ నమ్మగ రాదటంచనిన్
    వాసి యనంగనేల దల వాకిట గన్పడు రాశి గొప్పదౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ:

      కోసుల దూరమెంచి యొన గూర్చును సౌఖ్యము లెల్ల యంచనిన్
      గ్రాసము తక్కువైన సరి ఖండము మారగ జంభమెంచి నా
      యాసము గూర్చనా కొలుపె యచ్చరు వొందగ బల్కె నీవిధిన్
      వాసియ నంగనేలదలవాకిట గన్పడు రాసి గొప్పదౌ

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  37. కందిశంకరార్యు శంకరాభరణాన
    పద్యరచన నేర్వ పదిలముగను
    ఎట్లుచెప్పగలము లేనిది యిట్లని
    ‘వాసికంటె మేలు రాసి గనఁగ‘

    రిప్లయితొలగించండి
  38. ప్రాసలు దుష్కరమ్మయిన వానిని సైతము ప్రీతి నెంచుచున్
    భాసిలు శంకరాభరణ బ్లాగున వీడక నాలుగేండ్లుగా
    చేసితి నెన్నొ పూరణలు! చిత్రముగా యిపు డొక్క సారికే
    వాసి యనంగ నేల! దలవాకిట గన్పడు రాసి గొప్పదౌ!
    (సరదాగా పూరించి నందుకు మన్నింప ప్రార్థన)

    రిప్లయితొలగించండి
  39. కవిత లెన్నొవ్రాసి కవులసంఘములలో
    బిరుదు లందుకొనుచు వరలుచుండ
    పరుగు లెత్తు చుండ్రి పరుగున సభలకు
    వాసికంటె మేలు రాసి గనఁగ!



    రిప్లయితొలగించండి
  40. మూసనబోసినట్లుగను ముద్దుగ వ్రాయగ నెన్నియో కథల్
    వ్రాసిన కావ్యసంపదల రమ్యతలేకయు రక్తిగట్టకన్
    వాసిగ సంఘసంస్క్రతియె సర్వులకెల్ల ప్రశంసపత్రముల్
    వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ!!

    రిప్లయితొలగించండి
  41. దోస మెఱుంగుచున్ ప్రకట
    దుస్తర విస్తర పద్యమాలికల్
    హాస వికాసితోజ్జ్వల వి
    హారరుచిన్ రచియింప బూనగన్
    ప్రాస యతుల్ విధిన్దెలియ వ్యాకరణమ్మునెఱింగి వ్రాయుటే
    వాసి యనంగ; నేల దల
    వాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ?!

    రిప్లయితొలగించండి