29, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3501

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్" 

(లేదా...)
"గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్"

43 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    అర్భకుడౌచు కంపమున హాయిగ నుండక, కోవిడందునన్
    నిర్భర రీతినిన్ కనగ నీరజ నేత్రయె ముక్కు మూయుటన్
    దుర్భరమాయెనంచువడి త్రొక్కుచు తన్నుచు తల్లి కుక్షినిన్
    గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  2. దుర్భర కరోన దగులగ
    గర్భముతోనున్న తల్లి గడబిడ బడగా
    నర్భకుడైనట్టి శిశువు
    గర్భములో నున్న బిడ్డ గ్రక్కున దుమ్మెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు గురువర్యా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
    2. సవరణతో (శిశువు, బిడ్డ పునరుక్తి యయినందు వల్ల)

      దుర్భర కరోన దగులగ
      గర్భముతోనున్న తల్లి గడబిడ బడగా
      నర్భకుడైనట్టి తనదు
      గర్భములో నున్న బిడ్డ గ్రక్కున దుమ్మెన్

      అన్నయ్యకు ధన్యవాదములతో 🙏🙏🙏

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Jai Amrutanjan!

    గర్భము దాల్చి క్రొత్తగను గాభర నొందుచు ఖర్గపూరునన్
    నిర్భర రీతి తొయ్యలియె నివ్వెఱ వోవుచు వానలందునన్
    దుర్భరమాయె శైత్యమని తుందిని పూయగ నంజనమ్ము నా
    గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్

    తుంది = కుక్షి

    రిప్లయితొలగించండి
  4. సమస్య :
    గర్భమునందు నున్న పసి
    కందు గబుక్కున దుమ్మె బిట్టుగన్

    (కరోనా కష్టకాలంలో చిరువ్యాపారం పోయి
    రాబడి లేని భర్త చూలు తీయిస్తానని భార్యతో అంటుంటే కడుపులోని బిడ్డ ...)
    " నిర్భరమైన జీవితము
    నీతిగ నీడ్చుచు నుండగా మహా
    దుర్భరమైన చీకటుల
    దుల్పె కరోన ; యికెట్లు బిడ్డ యా
    విర్భవమైన ? భ్రూణమును
    వెంటనె కూల్తు " ననంగ భర్త ; స్త్రీ
    గర్భమునందు నున్న పసి
    కందు గబుక్కున దుమ్మె బిట్టుగన్ .
    ( నిర్భరమైన - అధికమైన ; భ్రూణము - చూలు )

    రిప్లయితొలగించండి
  5. నిర్భయ భయమున చచ్చిరి
    దుర్భర మరణమును దలచి దురితులు భీతిన్
    అర్భకులకు సకినముగా
    గర్భములో నున్న బిడ్డ గ్రక్కున దుమ్మెన్

    రిప్లయితొలగించండి
  6. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలింప ప్రార్థన.

    ప్రాసలు దుష్కరమ్మయిన వానిని సైతము ప్రీతి నెంచుచున్
    భాసిలు శంకరాభరణ బ్లాగున వీడక నాలుగేండ్లుగా
    చేసితి నెన్నొ పూరణలు! చిత్రముగా యిపు డొక్క సారికే
    వాసి యనంగ నేల! దలవాకిట గన్పడు రాసి గొప్పదౌ!
    (సరదాగా పూరించి నందుకు గురువర్యులు మన్నింప ప్రార్థన)

    రిప్లయితొలగించండి
  7. ఆర్భాటమేల కుశలమె
    గర్భములో నున్న బిడ్డ, గ్రక్కునఁ దుమ్మెన్
    దౌర్భాగ్యుడొకడు నేనును
    గర్భవతియు నాసుపత్రికై వెడలు తరిన్.

    రిప్లయితొలగించండి
  8. నిర్భీతిని నిద్రించగ
    గర్భములో నున్న బిడ్డ, గ్రక్కున దుమ్మెన్
    దుర్భర గంధము సోకగ
    నర్భకు దల్లి! శిశువంత యడలుచు కదలెన్

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    అర్భకురాలికారునెలలాయెను గర్భము దాల్చి, వైద్యులీ
    గర్భిణి నేలపై నడువగా వలదంచు వచించియుండగా
    దుర్భరశైత్యబాధగొని తొయ్యలి *యూగగను మ్మనీటిలో*..
    *గర్భమునందు నున్న పసికందు*., గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. దుర్బర జీవితము గడిపి
    నిర్భయముగ చెట్ల క్రింద నిద్రించు తరిన్
    దుర్బర శీతల ధాటికి
    గర్భము లో నున్న బిడ్డ గ్రక్కున దుమ్మెన్

    రిప్లయితొలగించండి
  11. దుర్భరమయిన పడిసెమున
    గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్
    గర్భవతి యాసమయమున
    దౌర్భాగ్యము జరుగు నంచు దలచుచు వగచెన్

    నిర్భయముగ మెదలాడెను
    గర్భములోనున్న బిడ్డ ; గ్రక్కునఁ దుమ్మెన్
    గర్భవతి యాక దలికకు
    దౌర్భాగ్యము జరుగు నంచు దలచుచు వగచెన్

    రిప్లయితొలగించండి
  12. 29.09.2020
    అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ యత్నం..

    *కం*

    దుర్భర స్థితిలో నుంటిమి
    గర్భము మనకేల ననుచు గదమాయించన్
    అర్భకులము మనమనగనె
    *"గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్"*

    *కం*

    గర్భము రాదని దలచెన
    నిర్భీతిగ తప్పుజేసి నిలిచితివిచటీ
    గర్భము తొలగింపమనగ
    *"గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  13. నిర్భయమౌస్థితిన్ బ్రతుకు నిశ్చలపై కొనసాగుచుండగా
    దుర్భరమై కరోన వడి తొయ్యలి ముక్కున చేరి నొంచగా
    గర్భిణి యౌ పడంతి భయకంపితయై, విచలింప భీతితో
    గర్భమునందు నున్న పసికందు, గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

    గర్భము లోనున్న బిడ్డ గ్రక్కున తుమ్మె

    ఇచ్చిన పాదము కందము
    నా పూరణము సీసములో

    సుభద్ర కు పద్మ వ్యూహపు మెళుకువలు అర్జునుడు తెలుపు చుండగా ఆమె మెల్లగా నిదుర లోకి జారు కుంటుంది అది గమనించక అర్జునుడు లోపలికి‌ ఎలా ప్రవేశించాలి ఎలా ఎదుర్కొనాలి అని చెబుతూ ఉంటాడు ఆవిడ నిదుర పోయినా లోపల ఉన్నగర్భస్త శిశువు ఉత్సాహంతో ఊ కొడుతూ వింటాడు బయటకు వచ్చు విధానము తెలియ పరచ బోవు సమయములో చక్రధారి సుభద్ర కు నిదురలో ఒక‌ తుమ్మును సృష్టించు తాడు దానితో అది అప శకునముగా భావించి అర్జునుడు బయటకు వచ్చే మార్గము చెప్ప లేక తప్పిదము చేస్తాడు అన్న భావన




    పద్మము రేకుల వలె నుండు వ్యూహము,
    మొదటి రేకు నడుమ ముఖ్యు డొకడు

    కాచుచు నుండును గజ తురం గంబుల
    పైన యోధ శతము భయము లేక

    కాచుచుండును గాదె, ఘనమైన
    వామ ది
    శ గజమున్ ముందు గా చంప వలయు,

    మార్గము కనబడ, భార్గవుని పగిది
    దక్షిణ గజరాజు తలను నఱుక

    దక్షిణ దిక్కున దారి కన్పించుగా
    ననుచు సుభద్ర కు నర్జునుండు

    ఘన పద్మ వ్యూహపు
    గాధ తెలుపుచుండ
    యుజ్జు జవాబిడె నూహు
    యని ప

    లుకుచు నా గర్భము లోనున్న బిడ్డ,గ్రక్కున తుమ్మెనప్పడు కోమ లాంగి

    నిదుర లోన, శుభము కాదని తలపోయు

    చున్ కిరీటి వికల మనస్కుండు నగుచు


    పత్ని గర్భస్త శిశువుకు భండనంపు

    తంత్రమును తెలుపక చేసె తప్పిదమును

    ఉజ్జు = ఉత్సాహము

    రిప్లయితొలగించండి
  15. ప్రయత్నం :

    సుభద్ర గర్భములోనున్న అభిమన్యుడు, అర్జునుడు చెప్పే పద్మవ్యూహము గురించి వినకుండా చయుటకు శ్రీకృష్ణపరమాత్మ తుమ్మినట్లు భావన..

    కందం
    దుర్భర పద్మవ్యూహము
    నిర్భరమొ వినఁగ సుభద్ర నిద్దుర బోయెన్
    యర్భకుడూకొనఁ జూపుచు
    గర్భములోనున్న బిడ్డ, గ్రక్కునఁ దుమ్మెన్!

    ఉత్పలమాల
    గర్భిణి తమ్మిమొగ్గరము కావలెఁ జెప్పుమటంచుఁ గోరెనా?
    నిర్భరమయ్యెనో తనకు నిద్దురఁ బోవుచు నుండె నర్జునా!
    దుర్భరయుద్ధతంత్రము నెదోయని యూకొనెనంచు జూపుచున్
    గర్భమునందు నున్న పసికందు, గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  16. నిర్భయమునుగలిగించెను
    గర్భములోనున్నబిడ్డ,గ్రక్కునదుమ్మెన్
    నార్భాటంబుననేజన
    దౌర్భాగ్యుడురమణమూర్తితూలుచుమిగులన్

    రిప్లయితొలగించండి
  17. నిర్భరదీనావస్థయె
    గర్భమునందుండుబిడ్డ కదలికలందున్
    దుర్భరవేదనహెచ్చగ
    గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్

    రిప్లయితొలగించండి
  18. దుర్భాగ్యపు సమయంబిది
    నిర్భాగ్యపు కోవిడు ధరణిని వేధించెన్
    దుర్భరమని వగచె దరుణి
    గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్

    రిప్లయితొలగించండి
  19. దుర్భరగర్భవాసమన దుఃఖపుహేతువు తల్లిబిడ్డకున్
    గర్భమునందునుండగనె ఖర్మముకాలికరోన సోకగన్
    గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్
    నిర్భరవేదనాభరితనేత్రములశ్రులధారగట్టగన్

    రిప్లయితొలగించండి
  20. దుర్భరపు టార్తి నంత
    ర్గర్భ కన ముదమ్మొసంగెఁ గరముం బుత్రా
    విర్భావ మొక పరి సదన
    గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్


    నిర్భయ మేఁగి రందఱును నేరక బాలు నవస్థ లోనికిన్
    దుర్భరమై నసా బిలపు దోయికి వాసన పర్వుచుండఁగా
    నర్భకు పాన్పు నందు రుచిరార్తవ మాలను నుంచ మాలికా
    గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  21. ఈ రోజుల్లో కార్పొరేట్ పాఠశాల పరిస్థితి :

    ఉ:

    నిర్భయమైన వైఖరిని నించుచు వార్తలు దూరదర్శినిన్
    గర్భిణి జేరి గోరిరట కాపగ సీటును పాఠశాల సం
    దర్భ మిదే యటంచు తగు దారిని జూపెదమన్న తక్షణమ్
    గర్భము నందు నున్న పసికందు గటుక్కున దుమ్మె బిట్టుగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. నిర్భయమొందజేసెనికనేర్చుచు మ్రింగుటయన్నసారమున్
    గర్భమునందునున్నపసికందు,గబుక్కునదుమ్మెబిట్టుగన్
    దుర్భరమైనశీతలముదోబుచులాడుచునుండగానొగిన్
    నర్భకుడైనసోమపుడునారడివెట్టుచునోపలేకనే

    రిప్లయితొలగించండి
  23. దుర్భరమైన జీవితము తొయ్యలి దయ్యెను పానశౌరుడా
    యర్భకుడైన యింటి మగడామెను కొట్టిన నేమి క్షేమమే
    గర్భమునందు నున్న పసికందు, గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్
    నిర్భయు డొక్కడా నెలలు నిండిన యింతి ప్రసూతి కేగగన్.

    రిప్లయితొలగించండి
  24. దుర్భరగతిఁ గుంతికి యా
    విర్భవ మందిన సుతుణ్ణి విసమున నొదలన్
    అర్భకుడేడ్వగను "నదీ
    గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్" 
    ------ శ్రీరామ్ 10వ తరగతి

    రిప్లయితొలగించండి
  25. అర్భకుడామతల్లియుదరాంతరసంస్థితుడైనసోదరా
    విర్భవమెప్పుడెప్పుడుభువిన్దనతోవిహరించనంగసం
    దర్భమువిప్పిజెప్పుదరిదానెగబుక్కునతుమ్మియిట్లనెన్
    *గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్"*
    నిర్భరుడర్భకానుజుడునిప్పుడెజెప్పెజనింతువైళమే

    రిప్లయితొలగించండి
  26. నిర్భరగర్భమండపిమునీంద్రులుదర్భపవిత్రులైనసం
    దర్భమునిర్భయార్భకుడుదర్చిరగిల్చినధూమపుండునా
    విర్భవుడయ్యెగర్భవతివేడుకగాంచినబల్కిరివ్విధిన్
    *గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్"*

    రిప్లయితొలగించండి