7, అక్టోబర్ 2020, బుధవారం

సమస్య - 3510

8-10-2020 (గురువారం)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్"
(లేదా...)
"నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా"
(ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)

89 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    స్వగతం:

    చదువుల్ మానుచు వృద్ధజీవి యొకడే జంబమ్ముగా రాత్రినిన్
    పదులన్ గారెలు మెక్కుచున్ వలపునన్ వైనమ్ముగా చట్నితో
    పదముల్ కూర్చగ శంకరాభరణమున్ పద్యమ్ములన్, తూగుచున్
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      వృద్ధాప్యంలో రాత్రి పూట పదులకొద్ది గారెలు తిని అరిగించుకొంటున్నారా? గ్రేట్!

      తొలగించండి
    2. 🙏😊

      నిన్న మా కోడలు గారెలు చేసి ఇషానితో పంపినది.

      Dialogue from Tagore's "Gora":

      "Was tea sweet enough?"
      "No"
      "Why didn't you decline it?"
      "That woud be more bitter"

      😊

      తొలగించండి
  2. అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ యత్నం..😀

    *కం*

    బెదురుచు పరీక్ష కొరకని
    కదలక మెదలక ఘనముగ కంటిని నిలుపన్
    చదువగ నే నిశిరాతిరి
    *"నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏😊

    రిప్లయితొలగించండి
  3. పదునగు నాయుధముల్గొని
    పదుగురు దొంగలు జొరబడి పడమటి
    గదిలో
    వధియింపగ యజమానిని
    నిదురించెడి వేళ శిరము నేలన్ గూలెన్

    పదునౌ కత్తుల కేలదాల్చి బలుపౌ
    ప్రాయంబు నందుండెడిన్
    వదనంబుల్ మరుగౌనటుల్ వలువలన్ వాటంబుగా జుట్టుచున్
    ముదురౌచోర శిఖామణుల్ జెలగుచున్ బోకార్చగా గేస్తునిన్
    నిదురం దోగెడివేళ శీర్షమహహా నేలంబడెన్ దైవమా

    రిప్లయితొలగించండి
  4. పదుగురు మెచ్చెడి రీతిని
    సుదతి ప్రతిమ జేసి యిరుకు చోటున బెట్టన్
    పదమట త్రాకుట చేతను
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    రిప్లయితొలగించండి
  5. కందం
    మదిలో పర్యావరణపు
    విదితంబని మట్టిబొమ్మ విఘ్నేశునిగన్
    వదులుగ నతికిన ఫలమై
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    మత్తేభవిక్రీడితము
    ముదిరెన్ ద్వేషము లెందుకో మహిని నిర్మూలించగన్ మూర్తులన్
    మదిలో నన్యమతంబుపై సహనముంబారంగ సేమమ్మొకో?
    విదితంబై కడు జాగ్రతన్ గుడిని నే వేంచేసి కాపుండినన్
    మదమాత్సర్యములున్ జెలంగి నతి దుర్మార్గాన బెట్రేగిరో!
    నిదురన్ దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "...జెలంగి యతి..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      మత్తేభవిక్రీడితము
      ముదిరెన్ ద్వేషము లెందుకో మహిని నిర్మూలించగన్ మూర్తులన్
      మదిలో నన్యమతంబుపై సహనముంబారంగ సేమమ్మొకో?
      విదితంబై కడు జాగ్రతన్ గుడిని నే వేంచేసి కాపుండినన్
      మదమాత్సర్యములున్ జెలంగి యతి దుర్మార్గాన బెట్రేగిరో!
      నిదురన్ దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!

      తొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మదినిన్ వీడుచు మెండుగా నులవలన్ మాలీసునున్ జేయుచున్
    ముదమున్ జేర్చగ మాలియే కుడితితో, మూఢుండునౌ జోదుకున్
    కదనమ్మందున, ఘోటమే తడబడన్ గారాబునౌ బొజ్జతో
    నిదురం దోఁగెడి వేళ, శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మదికిన్ మోదము గూర్చెడి
    మదనారి కథలు పఠించు మతిమంతునకున్
    గదిలో కునుకులు మొదలై
    నిదురించెడు వేళ శిరము నేలం గూలెన్.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మదికిన్ మోదము గూర్చు శంకరునివా మాహాత్మ్యపుం గాథలన్
    కుదురున్ గూడి పఠించు కాలమున శైక్షు0డైన యభ్యాసికిన్
    గదిలో మెల్లగ తూగులున్ గలుగుచున్ గాఢంబుగా వాలుచున్
    నిదురం దోగెడి వేళ శీర్షమహహా నేలం బడెన్ దైవమా!

    రిప్లయితొలగించండి
  9. ఉదయమె దేవుని గాంచితి ,
    దదుపరి పరువడిగ పొర్లు దండము జేయన్
    యదటున నేను క లగనుచు
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    పరువడి = కుదురుగా
    అదటు = గర్వము , ఉద్రేకము

    రిప్లయితొలగించండి
  10. ముదితల పొగరుగ కోరుచు
    చెదపురుగు పిరికిగ తలచి చెరుపుగ నడచెన్
    మది తలచని శిక్షగ పెను
    నిదుర పిలచు వేళ శిరము నేలం గూలెన్

    రిప్లయితొలగించండి
  11. సమస్య :
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    ( నెహ్రూజీ తల బొమ్మ చేసి నిద్రిస్తే ...)

    కుదురుగ నెహ్రూ శిరమును
    నదరుగ జేయుచు , ధవళపు నాణ్యపు
    బొమ్మన్
    ముదముగ బల్లను నుంచుచు ,
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్ .

    రిప్లయితొలగించండి


  12. జోగుచూ జోగుచూ :)


    కుదురుగ నిలువక తాకెన్
    నిదురించెడి వేళ శిరము నేలం, గూలెన్
    పదిలముగా జేబున యు
    న్న దళసరి మొబైలు పగిలె నాయద్దమ్మున్


    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. పూసపాటి వారికి మత్తేభములంటే ఇంత మక్కువా ? వరుసగా మత్తేభాల్ వచ్చి మీద పడితే ?



    చదరంగమ్మున పావులన్ కదిపి, వాక్చాతుర్యమున్ జూపి కో
    విదులన్ గెల్చి, నిశాంతమందు కవితావేశమ్ము కద్దంచు బల్,
    సదనమ్మందున వ్రాసి పద్యముల నే సంపూర్తిగా కండ్లపై
    నిదురం దోఁగెడి వేళ, శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!



    గుడ్ నైట్ :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      పూసపాటి వారు కేవలం జాత్యుపజాతి పాదాల సమస్యలే పంపారు. వాటికి వృత్తపాదాలు సిద్ధం చేసింది నేను.

      తొలగించండి
    2. జాత్యుపజాతులనే పెరటితోటల నుండి, ఉత్పలాలు చంపకాలుండే ఉద్యానవనాలకు చేరి, నేడు మత్తేభ శార్దూలలు సంచరించే కవితాటవిలో విహరించ గలుగుతున్నామంటే అది “ శంకరాభరణం” వల్లే, గురమహోదయుల వల్లనే సాధ్యమైనది! వారి ఋణము తీర్చలేనిది! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  14. చదువుము పరీక్ష లనుచును
    ఉదయముననె నన్ను లేప నోపిక తోడన్
    చదువుచును కునుకు పట్టగ
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    రిప్లయితొలగించండి

  15. కం.
    చదువుల తల్లిని నిలుపగ
    మదిగదిలో రొదను నేను మరువగ లేనే
    మెదలక కూర్చుని చదవగ
    నిదురించెడి వేళ శిరము నేలంగూలెన్

    కం.
    ఎదపొదలో నిలవడు గద
    వెదకిన మరువక పలికెడి వెనకయ్య నిలన్
    మది తలచగ రాడెందుకు
    నిదురించెడి వేళ శిరము నేలంబడెనో ! !

    రిప్లయితొలగించండి

  16. ఆదిభట్ల సత్యనారాయణ

    పదునుగ నా కర్ణుడు తగ
    వదలగ శక్త్యాయుధమును వడిపెంపొందన్
    వధియించెను భీమసుతుని
    నిదురించెడు వేళ , శిరము నేలంగూలెన్

    రిప్లయితొలగించండి
  17. కదనంబందున సత్యభామజయ శంఖారావమున్సల్పుచున్ గదిలించెన్గద పుత్రునిన్దునిమి నాకాశంబు వర్షించగా సుధలన్జిమ్ముచు రాత్రివేళ నటు సుశ్లోకంబు దీపావళిన్ నిదురందోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా కొరుప్రోలురాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  18. అదయుం డోయన ద్రోణసూను డట తా నత్యంత దుష్టాత్ముడై
    ముదముం గూల్చి తనూజులన్ మదముతో మూర్ఖుండు ఖండింప తా
    నెదలో ద్రౌపది కుందె నీగతి కటా యి య్యర్భకశ్రేణికిన్
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా

    రిప్లయితొలగించండి
  19. కుదురుగ పరీక్ష కొఱకై
    చెదరని చిత్తమున చదువ చిత్రంబుగ తా
    వదలక నావా హంబై
    నిదురించెడి వేళ శిరము నేల o గూలెన్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    ౘదువుచు దీపము ముందఱ
    కుదురుగ కూర్చుని పరీక్ష కొఱకై బాలుం
    డదుపును తప్పగ కునుకున
    నిదురించెడు వేళ శిరము నేలంగూలెన్.

    రిప్లయితొలగించండి
  21. నది దరి చల్లని గాలికి
    మది ఝల్లన మఱ్ఱి నీడ మైఁ వాల్చ నటన్
    కుదురగు తలగడ యమరక
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    రిప్లయితొలగించండి
  22. సదయుండై సతతము హరి
    పదములు తన్మయతతోడ పాడుచు నుండన్
    పదిలముగావిను వానికి
    నిదురించెడి వేళ శిరము నేలను గూలెన్

    రిప్లయితొలగించండి
  23. మదమెక్కిన కీచకుడటు
    సుదతా సైరంధ్రినిగని శోభనమునకున్
    పదపదమన వలలునితో
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుదతి+ఆ' అన్నపుడు సంధి లేదు. "సుదతిన్ సైరంధ్రిని గని..." అనండి.

      తొలగించండి
  24. పెదవుల్ కల్పుచు నిచ్చతో పడకపై ప్రేమమ్ముతో కౌగిలిన్
    ముదమున్ బొందుచు ముద్దులన్ మునగ సంభోగమ్ములో రేయిలో
    కుదుపుల్ గల్గగ పాప మేను కదులన్, గూలంగ పైనుండి యా
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా

    రిప్లయితొలగించండి
  25. కె.వి.యస్. లక్ష్మి:

    మదిగోరెడు మరుసీమల
    ముదమొందుచు ప్రియునిదోడ మురిసెడు నటుల్
    సుదతియె తా మైమరచుచు
    నిదురించెడి వేళ శిరము నేలను గూలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మురిసెడు నటులన్" అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  26. అదయనుద్రోణుకుమారుడు
    పదునగుఖడ్గంబుతోడపాండవసుతులన్
    ఛేదించగవెనువెంటనె
    నిదురించెడివేళశిరమునేలంగూలెన్

    రిప్లయితొలగించండి
  27. సదయాత్మా! పసికూన లంచనక యశ్వత్థామ దుర్మార్గుడై,
    యది యే యుద్ధమొ! కృష్ణ! మత్సుతుల నన్యాయమ్ము రాత్రార్ధమం
    దదనుం జూచి హతమ్మొ నర్చ నసిఘాతాత్యుగ్రభిన్నమ్మునై
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  28. పదులున్ వందల మిద్దెలన్నిటుల నిల్పంగన్ మహాసౌధమై
    కుదిరెన్ జక్కని యాకృతంచు జనులా కూర్పున్ గనిన్ మెచ్చినన్
    విధి లీలన్ దెలియంగ లేరు గద యే వేళందు నేమౌననన్
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆకృతి+అంచు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'కనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. సవరించిన పాఠం :-

      పదులున్ వందల మిద్దెలన్నిటుల నిల్పంగన్ మహాసౌధమై
      కుదిరెన్ జక్కని కట్టడంబనుచునా కూర్పున్ జనుల్ మెచ్చినన్
      విధి లీలన్ దెలియంగ లేరు గద యే వేళందు నేమౌననన్
      నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా

      తొలగించండి
  29. అదయన్ ద్రోణుకుమారుడున్ మిగులదానావేశజాడ్యంబుతో
    పదునుంబొందినగత్తితోనరుకయావాలంబుమూలంబునన్
    నిదురంద్రోగెడివేళశీర్షమహహానేలంబడెన్ దైవమా!
    కదలంజాలకపాండునందనులయాఖ్యాతోపపాండ్యుల్ నిశిన్

    రిప్లయితొలగించండి
  30. పదునైనట్టి యులిన్ ధరించి పసతో పాషాణమున్ జెక్కితిన్
    మదినే దోచెడు రీతి శిల్పమదియే మార్జాలమున్, జిన్నదౌ
    గదిలో దాచగ నట్టి శిల్పమును నా కాల్దాకగన్ శార్వరిన్
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా

    రిప్లయితొలగించండి
  31. ఈ నాటి శంకరాభరణం
    వారి సమస్య.

    నిదురం దోగెడి వేళ శీర్ష మహహా నేలన్ బడెన్ దైవమా


    ఇచ్చిన పాదము మత్తేభము

    నా పూరణ సీసములో


    హయగ్రీవ చరిత్ర సందర్భంలో


    శ్రీ హరి విరామము లేక రక్కసులతో యుద్ద ము చేసి అలసి పోతాడు అలసి అతని ధనువు పైనే నిదుర కొన్ని యుగాల పాటు పోతాడు అప్పుడు దేవతలు శ్రీ హరిని ఎలా నిదుర లేపాల అని తర్జన భర్జన పడుచుండగా శివుడు అలా నిదుర పోతున్న వారిని లేపరాదు అది మహా పాపము‌ అని చెప్పి ఒక చెద పురుగును సృష్టించిన అది వింటి నారి కొరుకు తుంది అప్పుడు విల్లు వంగి శ్రీ హరి నిదుర లేస్తాడు అని సలహా చెపుతాడు అప్పుడు చెద పురుగును బ్రహ్మ పంపగా అది వింటి నారిని కొరకుతుంది ఒక్క సారిగా వింటి నారి తెగి భీకర శబ్దం తో పైకి యెగసి శ్రీహరి తలను నరుకుతుంది

    ఊహించని పరిణామము గాంచి దేవతలు దిగ్భ్రాంతి చెంది దేవిని ప్రార్థన చేస్తారు ఆమె హయగ్రీవుడను రాక్షసుని మరణము కోరి శ్రీవారి తల తెగి పడి నది ఒక గుర్రము తలను అతికించమని ఆనతి ఇస్తుంది అప్పుడు అశ్వము తలను తెచ్చి అతికించగా చక్రి హయ గ్రీవ నామము బడసి హయగ్రీవుడు అను రాక్షసుని సంహరిస్తాడు



    రక్కసులను బట్టి రణము వి
    రామము
    నెరుగక తాచేసి నిదుర రాగ

    ధనువుపై ముదముగ తలనుంచి నిదురించె
    శౌరి కడుయుగముల్,నారి నొక్క

    చెదపురుగు కొరుకన్ శీఘ్రగతిని నిద్ర
    మేల్కొను నని పల్కె మిత్తి గొంగ,

    వమ్రిక‌ నొక్కటి పంకజ జన్ముడు
    కోర నా ధనువును కొరికెనుగ, క

    పి నిదురం దోగెడి వేళ శీర్ష మహహా నేలన్ బడెన్ దైవమా లిఖిత మి


    ది గద తరచి చూడగ నని దివిజు లెల్ల

    వేదన బడసి దేవిని వేడె,నామె

    యానతి బడసి నతికించ యయువు తలను,

    విధు డపుడు హయ గ్రీవుడై వెలుగు నొందె

    యయువు = గుర్రము
    వమ్రిక. = చెద పురుగు
    మిత్తిగొంగ. = శివుడు

    కపి= హరి

    రిప్లయితొలగించండి
  32. వదలక బద్దక మింతయుఁ
    గదలెడు మారుత మొసఁగ సుఖము తూఁగే బె
    ట్టిదముగఁ జెలంగఁ గూర్చొని
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్


    సదయుం డాతఁడు వాసుదేవుఁ డరయన్ సంజీవియై వెల్గఁడే
    హృద యావేశ విలగ్న ఘాతకుఁడు విప్రేంద్రుండు హింసించఁగాఁ
    బదిలం బెక్కడ ద్రౌపదేయుఁ డకటా పార్థుండు తద్ద్రౌణిచే
    నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'తూఁగే' అన్నది వ్యావహారికం కదా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక వందనములు.
      తూఁగు+ఏ =తూఁగే, నిద్రయే యన్న యర్థములో. తూఁగెడు నన్న యర్థము కాదండి.

      తొలగించండి
  33. పదునౌయమ్ముల వేయుచున్
    దనుజులన్ భగ్నంబు గావించుచున్
    అదుపున్ దప్పుచు నాజిలో మునుగుచు న్నాయాసమున్ బొందుచున్
    వదనంబించుక వాల్చగా ధనువునన్ వంచించగా పుర్వదే
    నిదురందోగెడు వేళ శీర్షమహహా నేలంబడెన్ దైవమా!

    రిప్లయితొలగించండి
  34. చదువులబడిలో ఛాత్రుఁడు
    బొదవగ నిద్దురకొరిగెను పొత్తమువెనుకన్
    అదటునదుఃస్వప్నమునన్
    నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్

    రిప్లయితొలగించండి
  35. మైలవరపు వారి పూరణ

    ముదమున్ గూర్చుచు చాలకుండు వినుచున్ ముద్దారగా పాటలన్
    పదిగంటల్ గతియింప దీపములనార్పన్., కండ్లు మూయంగనే
    యెదుటన్ వేరొక వాహనమ్ము గని తప్పింపంగ యత్నింపగా
    నిదురన్ దోగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  36. హరికథ గా నా ప్రయత్నము:

    మ:

    పదరా పోదము దేవళంబరికథా పాఠమ్ము సంకీర్తనల్
    సదమై యొప్పగ నాలకింపదగు ప్రోత్సాహమ్ము నా దాసుకున్
    కదముల్ ద్రొక్కెను కృష్ణలీలలుగ నా కంసున్వధింపన్నహో
    నిదురం దోగెడి వేళ శీర్ష మహహో నేలం బడెన్ దైవమా

    దాసు=హరిదాసు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. *పదముల మాలల నిటు కై-*
    *పదములనే శంకరుండు కనిపెట్టి యిడన్*
    *పదములకై యేను వెదక*
    *నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్.*

    😊 వందే గురుపదద్వంద్వ మవాన్మానస గోచరం.

    -యజ్ఞభగవాన్ గంగాపురం.

    రిప్లయితొలగించండి
  38. మదిరాపానులుయుద్ధకౌశలముసంపాదింపనేలేదుసం
    పదలన్గోరరుఖడ్గమెత్తియెదురైపౌంస్యంబునన్లేరుబె
    *న్నిదురందోఁగెడివేళశీర్షమహహానేలంబడెన్దైవమా!*
    మధుదైత్యాంతక!ద్రౌపదీతనయులన్మక్కించెనీద్రౌణియే

    కదనంబందుననిద్రబోయెహరియాక్రవ్యాశినిన్జంపిప్రా
    ణదునిన్లేపగహేషికంధరునిదున్మాడంగబ్రహ్మాదులే
    చెదపుర్వున్పురిగొల్పనారిగొరికెన్ఛేదంబయెన్శీర్షమే
    *నిదురందోఁగెడివేళశీర్షమహహానేలంబడెన్దైవమా*

    రిప్లయితొలగించండి