10, అక్టోబర్ 2020, శనివారం

సమస్య - 3512

 11-10-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"కాకికిన్ హంసయే సతిగా లభించె"

(లేదా...)

"కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్"

104 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    రోకటి పెట్టులోర్వకయె రోయుచు బోవగ వంగభూమికిన్
    వాకిట చెట్టునున్నదియె పండుగ జేయుచు నాంధ్రనుండి భల్
    చీకటి లోన రంగులను చెన్నుగ జూడగనన్ని నల్లవై
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాకియు కీరమున్ నెమలి గ్రద్దయు కోకిల కోడిపుంజుయున్
    వేకువ జామునన్ తరల పెండ్లికి పోటిని వెండికొండనున్
    పోకిరి జేసి గెల్వగను ప్రొద్దున రాత్రియు చాకచక్యమున్
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వధువు చక్కదనముతోడ వఱలు నంత
    వరుడు నందవిహీనుడై వ్రాలె నచట
    వధువు తెల్లన నలుపున వరుడు గలడు
    కాకికిన్ హంసయె సతిగా లభించె.

    రిప్లయితొలగించండి
  4. శిశుపాలుని విలాపం...

    తేటగీతి
    ప్రణయసీమను విహరించు రాజహంస
    రుక్మిణిన్ నే మరులుఁ గొన రుచిరమనుచుఁ
    గోరి నల్లనయ్యకు తానె దారయయ్యె!
    కాకికిన్ హంసయే సతిగా లభించె!

    ఉత్పలమాల
    సోకుల రుక్మిణీ లలన సొంపుగ వచ్చును రాజహంసయై
    నాకిక భార్యయై బ్రతుకు నందనమౌననిగంటి స్వప్నమున్
    రాకయె నల్లనయ్యఁగొని రంజిల బోయెన రుక్మి! యక్కటా!
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్?

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తేకువతోడ లోకమును దిట్టతనమ్ముగ నేలుచుండుచున్
    దూకొను పద్మినీశయుడు ద్యోతమునొందగ నీలివర్ణమున్
    శ్రీకరియైన పద్మగృహ శ్వేతపు ఛాయను వెల్గుచుండగన్
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గృహ శ్వేతపు' అన్నపుడు 'హ' గురువై గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. పద్మగృహ అంటే లక్ష్మీదేవి అన్న భావంలో వాడాను. గృహశ్వేతపు కాదుగదా! అప్పుడుగూడ హ గురువవుతుందా? గురువుగారు నాకు దయతో తెలియజేయ గలరు.

      తొలగించండి
  6. *శిశుపాలుని మనో వేదన*......... ...... ............................... ........ ... ........... . . నిరుపమాన సుందరి యైన నీరజాక్షి
    నపహరించుకు పోయెనా యాదవుండు
    కనగ నల్లని వాడికా కలికి తాను
    కాకికిన్ హంస యే సతిగా లభించె.

    రిప్లయితొలగించండి
  7. డబ్బు మంచిగున్నదనుచు డాబుజూసి
    చదువు,సంస్కారమేలేని శాల్తియతడు
    మేని మెరుపులు లేకున్న మెచ్చినివ్వ
    కాకికిన్ హంసయే సతిగా లభించె!!

    రిప్లయితొలగించండి
  8. *శిశుపాలుని మనో వేదన*........ ......................................................... .
    పోకిరి యాదవాన్వయుడు మూర్ఖుడు వెన్నదొంగయే
    నాకిల భార్యగా దగిన నారిని కృష్ణుడు దొంగచాటుగా
    చేకొని పోయె వేగిరమె శీలవతిన్ కడు సుందరాంగి యా
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  9. దేవదాసు, పార్వతి

    ప్రాకటమైన ప్రేమకథ రాజకుమారుడు
    పేదరాలిదౌ
    తేకువలేక వీడగను దేవత పారును
    దేవదాసు దా
    వీకను బెండ్లియాడె వరబేధము
    నెంచక వృద్ధభూపతిన్
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్?

    రిప్లయితొలగించండి
  10. రూకలు బాగుగున్నవని రూపము యంద విహీనమవ్వగా
    కోకలు గూర్చ,చాలు తన కోర్కెలు తీరును గాదె యంచు నా
    కోకిల మెచ్చి,నా వరుని కూర్మిని పెండిలియాడగా నా
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్!!

    ***కోకిల=అందమైన స్త్రీ పేరు.

    రిప్లయితొలగించండి
  11. లోకము నందు లేరె గన లోకుల నేకులు చూడము చ్చటై
    శోకము నందనేల గడు చూపుకు నల్లగ కానుపిం చియున్
    పోకడ చూడుమమ్మ పతి పొత్తుగ నుల్లము నిచ్చువాడెగా
    కాకికి రాజహంససతిగాలభియించెనుచిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
  12. చీకటి రాత్రులేమిగిలె చిత్రముగానిట రాష్ట్రమంతయున్
    రాకలు పోకలే బెరిగె,రాష్ట్రపునేతకు రాజధానిలో
    పోకయెగాని,రాబడియె,పొల్లుకునైనను గానరాని,యే
    కాకికి రాజహంససతిగా,లభియించెను చిత్రమెట్లగున్
    ++++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  13. అందరికీ నమస్సులు..🙏🙏

    నా పూరణ యత్నం..

    *తే గీ*

    విద్య లేని వాడొక్కండు విద్యమంత్రి
    బుర్ర లేని వాడొక్కండు భువిని యేల
    వినగ నివ్విధమ్ముగ నిది వింత వోలె
    *"కాకికిన్ హంసయే సతిగా లభించె"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్శ్మి:

    నలుపు తెలుపుల నాణ్యత తెలియ జూడ
    నలుపులేని తెలుపు తీరు తలచ లేము
    సిరికి తోడాయె నల్లనౌ శ్రీధరుండు
    కాకికిన్ హంసయే సతిగా లబించె.

    రిప్లయితొలగించండి
  15. ఆకటి వేళ యన్నమిడె డాప్తులు లేని బికారి యైన యా
    శ్రీకరు డందగాడనుచు చిన్నది శ్రీగల భాగ్యశాలి తా
    సాకిన సుందరాంగి కడు సద్గుణ శీలియె మెచ్చ నట్టి యే
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఆకటివేళ నన్నమిడు నాప్తులు..." అనండి.

      తొలగించండి
  16. కె.వి.యస్. లక్ష్మి:

    గురువుగారికి నమస్కారములు. దయతో నిన్నటి పూరణను పరిశీలించ వలసినదిగా కోరుచున్నాను.

    ప్రజల నాదరించి రాజ్యమ్ము నేలుచు
    ప్రాభవమ్ము నొంద ప్రభువు నెపుడు
    సత్యవంతు చేసి సరిరీతి దీర్చి దు
    ర్మతము మార్చు వాడె మంత్రియగును.

    రిప్లయితొలగించండి
  17. కాకికిన్ హంసయే సతిగా లభించె
    సతిపతుల పక్షులననేల సాధువగునె
    తెలుపునలుపులగోలలు తేలవెపుడు
    రంగులేవయిననవియు రమ్యమగును
    బతికి వున్ననుసుఖములు బడయ వచ్చు

    రిప్లయితొలగించండి
  18. తాత్వికముగా చూస్తే
    కాకి జీవనము ప్రకృతివంటిది , ఆజన్మాంతము అది ఆహారము వెదకుచూ , పితృకార్యములందు వారి ఆత్మల మనకు జేరూతూ ఉంటుంది. హంస పురుషతత్వము గావున , ఏకం సత్ అనే మాటలో ఇంక ఏది ఏ లింగమనెడు భేదమేమి?


    ఉ||
    చీకటి వర్ణమున్ వితతజీవనశైలిని గల్గు కాకికిన్
    పోకడ జన్మయన్ ప్రకృతి, పూరుషశైలి గలుంగ హంసయం
    దేకము సత్తనన్ మనకు దీనిని గానునె లింగభేదమా
    కాకికి రాజహంస సతిగాలభియించెను చిత్రమెట్లగున్

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  19. చక్కనగు జంటన మగడు శాపమొంది
    గూనివానిగ మారగ కొంతమంది
    దానినెరుగక వగచుచు దలచిరిటుల
    గాకికిన్ హంసయే సతిగా లభించె

    రిప్లయితొలగించండి
  20. ముసలి వాడా గౌతముండు
    నహల్యను
    పరిణయ మాడెగా బ్రహ్మ కోర,

    మిసిమి వర్ణము గల మేనక‌ మనువాడి
    గాధి సుతుని కూడె బాధ తోడ

    నల్లని‌రంగుతో నెల్లరి మనసును
    రంజిల్ల‌చేసెడు రామ చంద్రు

    నకుసీత తో పరిణయము జరిగెనుగా,
    నారాయణుని రంగు నలుపు గాదె


    నా కలిమిచెలి యరుణవర్ణము ను‌ కలిగె,

    తరచి చూడగా నిదియె చిత్రంబు గాదు

    కాకి కిన్ హంసయే సతిగా లభించె

    ననుట నిజమని నొకనితో వనిత పలికె

    రిప్లయితొలగించండి


  21. బ్రహ్మచారి వెంకోబు మావయ్య, యగడు
    కాకికిన్ హంసయే సతిగా లభించె
    నీకు దక్కదా మనవడ నీరజాక్షి ?
    యత్నమును చేయు వామనయన లభించు !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  22. ప్రశ్న జవాబు కందోత్పల !


    "గనుమా ! కావుమనెడు హా
    సను కాకికి రాజహంస సతిగా లభియిం
    చెను!"; "చిత్రమెట్లగున్ సఖి
    సినిమా కథలోన కోపు చిక్కదు వెదుకన్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. మారీచుని మనోగతము రావణుని గూర్చి



    సకల సుగుణరాశి ,శుభాంగి‌ సాథ్వి, ధర్మ

    చరిత ,మండోదరి పతి దశ వదనునుడు,

    కాదుగా చిత్రము తలచగ నొక నవద

    కాకికిన్ హంసయే సతిగా లభించె

    అవద కాకి = దుష్టడు

    రిప్లయితొలగించండి
  24. తాను పరిణయ మాడంగ తలచు సతిని
    తేరుపై వచ్చి దొంగయై తెచ్చుకొనెను
    కాకికిన్ హంసయే సతిగా లభించె
    కృష్ణు దూషించె శిశుపాలు డీర్ష్యతోడ

    రిప్లయితొలగించండి


  25. వాకబు చేసి నాను గుడి వాడను వాడొక బిచ్చ గాడటా
    తాకగ వాడి నా సుడి సుతారముగా మహరాజుగాన నే
    కాకికి రాజహంస సతిగా లభియించెను; చిత్రమెట్లగున్
    కోకను చాపి భాగ్యవతి కూర్మిని చూపదె భాగ్యలక్ష్మి రాన్



    జిలేబి

    రిప్లయితొలగించండి

  26. ప్రజల చింత లేక పదవులు కోసమై
    పట్టు విడువకుండ పట్లు పడుచు
    మనసు చింత లేక మానమ్ము నెంచక
    మతము మార్చువాఁడె మంత్రి యగును

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. కాకికి రాజహంస సతిగా లభియించెన! సాజమే గదా
      యే కులమై నేమి మతమేదియు నైనఁ బరస్పరమ్ము వా
      రేకమనస్కులై చెలగి రిర్వురుఁ జక్కని ప్రేమపక్షులై;
      కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్?

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "...యే కులమైన నేమి" టైపాటు.

      తొలగించండి
  28. వాడునలుపువానిమనసుకూడనలుపు
    మల్లెవలెతానురూపసిమచ్చకంటి
    ధాత నొసటను వ్రాసిన రాతవలన
    కాకికిన్ హంసయే సతిగా లభించె

    రిప్లయితొలగించండి
  29. మైలవరపు వారి పూరణ

    *సమసమాజము*

    ఏ కులమైననేమి? మతమెద్దియ యేని? పరస్పరమ్ముగా
    నేకమనస్కతన్ మెలగనేమగు., వర్ణవివక్ష యుక్తమే ?
    లోకమునందు మానవులు లోనికి జూడరిదేమి చోద్యమో!
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్??

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  30. తాకెసుకన్యహస్తగతదర్భయెచక్షులరక్తమూరినన్
    తేకువదానితండ్రితనదేహజనిత్తుశపింపబోకనెన్
    బ్రాకటచారచక్షువుతపస్వికిగూతునుగట్టబెట్టె *నే*
    *"కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్"*

    రిప్లయితొలగించండి
  31. లోకువయైరిబాలికలు లోకములోజగదేకవీరుకున్
    పోకిరితిండిపోతులకుమూర్ఖులకున్ గుణహీనుకంధుకున్
    రూకలుగల్గువానికినిరుక్మిణి బోలుసతుల్ కుబుద్ధియౌ
    *"కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్"*

    రిప్లయితొలగించండి
  32. పెండ్లి వేడుక నందున వివిధ జనులు
    వధువు వరునిని గాంచుచు పలికి రిట్లు
    కాకికిన్ హంస సతిగా లభించె
    ననుచు గుసగుస లాడి తా మనిరి గదర

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీళ్ళనిన్..' 'అని' అన్న ప్రయోగం సాధువు కాదు. "తీరు జూడ నవలోకనమందగ..." అనండి.

      తొలగించండి
    3. సవరించిన పద్యము:
      ఉ:

      లోకువ గాదు, నావిధికి లోబడి యుండదె జీవితమ్మిలన్
      నేకముచేయు నాయజుడు నెక్కడి కక్కడ తోడు నీడగన్
      చీకటి వెల్గులున్ పిదప చేదును తీపుల ,పాలు నీళ్ళుగన్
      లోకము తీరు జూడ నవలోకనమందగ వచ్చు నీగతిన్
      కాకికి రాజహంససతిగా లభియించెను చిత్రమెట్లగున్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  34. గోకుల రక్షకుండు మరిఁగూరిమిఁగన్నడు నల్లనయ్యఁదా
    చేకొని లేఖనంబులను చిత్తము నిల్పుచు తత్వమెంచుచున్
    శ్రీకరి కన్యకామణిని శ్రీలుడు దోడ్కొని వేగమైజనన్
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  35. ఏకులమైన నేమి కడునింపుగు పల్కుల చెంగలించుచున్
    సాకగ పేదవారి, నభిసర్జన చేయుచు నార్జనమ్ముతో
    పైకము నడ్గనెప్పుడు వివాహము కోసమటంచు చెప్పు నే
    కాకికి రాజహంససతిగా లభియించెను చిత్రమెట్లగున్
    అసనారె

    రిప్లయితొలగించండి
  36. లోకము మెచ్చునట్లుగుణ రూపవిశేషత నొప్పువాడుయున్
    శ్రీకర సంపదల్గలిగి శీతల సుందర మోహనాంగుడున్
    పోకడ సర్వలోకహిత బోధిత తత్వవిచారుడైన నే
    కాకికి రాజహంససతి గాలభియించెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాడుయున్' అనడం సాదువు కాదు. "వాడునున్" అనండి.

      తొలగించండి
  37. పెండ్లికేగాతినొకపరిప్రేమతోడ
    గానిపించెనునచ్చట గానరాని
    వింతయొక్కటిసుకుమారకాంతకకట
    వరుడుగలభియించెనలుపువర్ణయుతుడు
    కాకికిన్ హంసయేసతిగాలభించె

    రిప్లయితొలగించండి
  38. లౌకిక వాంఛలందు నవలంబితమై మది కాకి తీరుగన్
    నాకిది నాకె గావలెను నాదని నిత్యము కావు కావనున్
    లౌకిక బంధమంటక విరాగిలు నాత్మయె హంసయై మెయిన్
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
  39. కాకికి కాకిగాక కలకంఠము జంటగుటెట్టులొప్పు? నే
    కాకినిజేసియంచనిటుకాకికి గూర్చుట లగ్గుకాదు చీ
    కాకులుపెచ్చుమీరుసరికాదదియంచకునెగ్గుసేయగా
    కాకికి రాజహంస సతిగా లభియించెను చిత్రమెట్లగున్
    (చిత్రమెట్లగున్= చిత్రము! ఎట్లగున్?)

    రిప్లయితొలగించండి
  40. ఈకలికాలమందరయ యెక్కడచూచిన గానిపించుగా
    చీకటిరంగుతోనొకరు జెల్వగురూపుననుందురొక్కరున్
    మాకనపాలెమందుగన మాధవిరంగలునట్లెయుండుటన్
    గాకికిరాజహంస సతిగాలభియించెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
  41. కర మరుదు జంట యింపగుఁ గన్నులకును
    గాంచుఁ డక్కడ కమనీయ మంచు నుడువ
    నరునకును నారి కపరంపున కపరంపుఁ
    గాకికిన్ హంసయే సతిగా లభించె


    కాక కపోత కోకిల బకవ్రజ కుక్కుట కాలకంఠ హృ
    త్కేకి చకోర సద్ధరిణ కీర్ణ జగమ్మున నంచితమ్ముగన్
    నాక నివాస దేవవర నాభిజ వాహన రాజ హంస కే
    కాకికి రాజహంస సతిగా లభియించెను జిత్ర మెట్లగున్

    [హంసకు + ఏకాకికి = హంస కేకాకికి]

    రిప్లయితొలగించండి
  42. హంసలు లభింప దుర్లభ మయ్యె వర్త
    మాన మందున కనగనిమ్మహిన నార్య!
    ధనము తానెర జూపగ ధనికునకును
    కాకికిన్ హంసయే సతిగా లభించె.

    రిప్లయితొలగించండి
  43. కాకగుణంబు నొంది తన కాయము బూడిద తోడ నింపుచున్
    నైకటి కుండు , కుత్తుకన నాగము దాల్చెడి భూతనాధుకున్
    నాకువు కూతురై సొబగు నాతి యపర్ణకు పెండ్లి సాగగన్
    కాకికి రాజహంస సతిగా లభియించెను , చిత్రమెట్లగున్

    నైకటికుడు = బిచ్చగాడు

    రిప్లయితొలగించండి
  44. చీకటి వేళ త్రాగితివి సీసెడు మద్యము నీరుగల్పకన్
    నీకది నెత్తికెక్కినది నిక్కమటంచును చెప్పుచుంటి నీ
    పోకిరి మాటలన్ వినుచు, మూర్ఖుడ! యెక్కడ గాంచినావిలన్
    కాకికి రాజహంస సతిగా లభియించెను, చిత్రమెట్లగున్.

    రిప్లయితొలగించండి