20, అక్టోబర్ 2020, మంగళవారం

సమస్య - 3521

 21-10-2020 (బుధవారం)

కవిమిత్రులారా,  

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్”

(లేదా...)

“వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్”

46 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పూసలు గ్రుచ్చి చెప్పుచును పూర్తిగ కల్లలు రాజనీతినిన్
    మోసము జేయుచున్ ప్రజల ముద్దుగ పల్కుచు సంస్కృతమ్మునన్
    కాసిని నేర్చి మాటలను కందము లందున తప్పిదమ్ములన్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్...

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్సులు🙏🙏
    నా పూరణ యత్నం..

    *కం*

    వాసికి నెక్కగ సతతము
    నాసిరకపు పద్యములను నవ్వగ పదుగుర్
    ఆసాంతము తప్పులతో
    *“వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్”*!!

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు🙏

      నా పూరణ యత్నం..

      *ఉ*

      ఆశగ చూచుచున్ నెపుడు నందుకొనంగనె శాలువాలనే
      వాసికి నెక్కగన్ ధనము వందల వేలుగ ఖర్చు బెట్టుచున్
      వీసము నెత్తుకైన తన విద్యకు న్యాయము జేయలేకనే
      *“వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్”*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
      🙏😊

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'పదుగుర్' అనడం సాధువు కాదు. "నవ్వ పదుగురే । యాసాంతము.." అనండి.
      రెండవ పూరణలో "ఆసగ జూచుచుండి సత మందుకొనంగనె..జేయలేకయే..." అనండి.

      తొలగించండి
  3. ఉత్పలమాల:
    --------/-//--

    కాసులుదిన్న నేతవలె,కండ్లను నిండిన కావరమ్ముతో
    కూసినకూతలన్నియును,కూరిమినీయని పాడురాతలై
    వ్రాసినదంత బూతుయని,వాసన బట్టిన సంస్థ వారిచే
    వ్రాసినసత్కవీశ్వరుని,బట్టియొనర్వెద శృంగభంగమున్
    +++++++++++++======+++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బూతు+అని=బూతని' అవుతుంది. యడాగమం రాదు. "బూతనుచు కూరిమి..." అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కోసియు నాల్కనున్ తనరి కూర్చగ సంధుల క్త్వార్థకమ్ములన్
    మూసియు నోటినిన్ వడిగ మూఢుడు తీర్చగ జంటపొల్లులన్
    రోసి యఖండపున్ యతుల రుద్దుచు ముక్కును నేలమీద తా
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ మీ పద్యంలో సాధారణంగా ఔత్సాహిక కవులు చేసే మూడు ప్రధాన దోషాలను ప్రస్తావించారు.
      ౧. "క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు".. 'చూచి+ఎంతయు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. కాని కొందరు సంధి చేస్తున్నారు.
      ౨. ద్రుతం తర్వాత అచ్చు వచ్చినప్పుడు కొందరు ద్విత్వ నకార ప్రయోగం చేస్తున్నారు. (పోతన వంటి కొందరు ప్రసిద్ధ కవులు ప్రయోగించినా) ఇది మంచి పద్ధతి కాదని పండితులంటారు.
      ౩. అఖండయతిని కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. ఎవరైనా ప్రయోగిస్తే నేను అభ్యంతరం చెప్పను.
      మన ఔత్సాహిక కవులలో కొందరు వారి దోషాలను తెలియజేసినపుడు సవరించుకొని ఆ తప్పులను మళ్ళీ చేయడం లేదు. సంతోషం! కాని కొందరు చేసిన తప్పులే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. బహుశా మీరు అటువంటి వారినే దృష్టిలో పెట్టుకొని పూరణ చేసి ఉంటారు.

      తొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాసిని గూడని మాటలు
    పూసలు కూర్చెడి విధమున బోధించుచు తా
    త్రాసము గొలిపెడి కైతలు
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్.

    రిప్లయితొలగించండి
  6. ఒక పండితుడు తన కొడుకు తప్పులు వ్రాయడం చూసి కోపం వచ్చి ఈ దోషాలకి ఎటువంటి సిక్ష వేయాలో సత్కవీశ్వరుడెవరో వ్రాసారు దాని 'బట్టి' నీకు శృంగభంగం అని ఆతన వ్యాఖ్య

    ఉ||
    జూసిన నీదు పద్యమును సూనృతమున్ గణముల్ విధంబులున్
    పూసిన పూవు రెక్కలను కోసియొనర్చుచు హత్తు ప్రక్రియన్
    త్రోసెద! దోషశైలికి సుతుండవు గావున దండనేమనన్
    వ్రాసిన సత్కవీశ్వరుని బట్టి, యొనర్చెద శృంగభంగమున్

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాసిని కూర్చనట్టివగు వాక్కుల నెంచుచు వాటి నన్నిటిన్
    పూసలు గ్రుచ్చు చందముగ బోధన జేసెడి రీతి నెంచుచున్
    త్రాసముగొల్పు కైతలను రక్తియె నిల్పని తీరు దండిగా
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్.

    రిప్లయితొలగించండి
  8. ౧.
    రోసిరి సత్కవులెల్లరు
    రాసిగబోసిన విధంబు వ్రాయగ కవితల్
    వాసిగలేనికవితలను
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్!!

    ౨.
    వ్రాసిన వ్రాతలన్నియును భాసురమొందగ చూచునట్లుగన్
    వాసిగ నుండుకున్న గడు ప్రాపునుగాంచగ కూర్చిరెన్నియో
    మూసిరి సాహితీ పరుల మోదముగల్గు విధంబునన్ సదా
    వాసిగ లేనిపద్యముల వాసిలజేసిన వారలెల్లరున్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్!!

    రిప్లయితొలగించండి
  9. రాజసభలో పండిత స్పర్ధలో ఒక అహంభావ కవి మాటగా

    నాసరి యొకండు గలడే
    దోసము లేనట్టిరీతి దూగగ నాతో
    వాసికి నెక్కిన కావ్యము
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్

    జాషువా కాలంలోని ఒక అగ్రకుల పండితుని మాటగా 🙏🙏🙏

    ఆసకు హద్దులుండవలె నల్పకులంబు
    నబుట్టి తానుసూ
    వ్రాసితి గొప్పకావ్యముల వాసిని బొందగ నాత్మఘోషనున్
    మోసము జేసె సంఘమని పోరును జేయుచు గబ్బిలమ్మునన్
    వ్రాసిన సత్కవీశ్వరుని బట్టి యొనర్చెద శృంగభంగమున్

    రిప్లయితొలగించండి
  10. దోసములన్ని కూర్చుచు సదుక్తుల చిత్తమునన్ వహించకన్
    వీసమునేని సద్రస కవిత్వ విధానము లెంచి చూడకన్
    'మా' సములెవ్వరంచు పలుమారు లహంకృతి విర్రవీగుచున్
    వ్రాసిన సత్కవీశ్వరుని బట్టి యొనర్చెద శృంగభంగమున్.

    రిప్లయితొలగించండి
  11. వాసిని మెచ్చరు గావున
    రాసియె మేలని దలంచి వ్రాయ కవియుచున్
    మూసతనపు కావ్యములను
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్

    రిప్లయితొలగించండి



  12. బాసను జేయుచుంటినిదె
    బంగరు పువ్వుల బూజజేసెదన్
    వ్రాసిన కైతలన్నియును
    బాఠకు గుండెను దాకునట్లుగా
    వ్రాసిన సత్కవీశ్వరుని
    బట్టి ; యొనర్చెద శృంగభంగమున్
    రాసుల చెత్తపద్దెముల
    రాసభకంఠపు డాబుగానికిన్ .
    ( రాసభకంఠపు - గాడిదగొంతు గల ; డాబుగానికిన్ - దంభపు కవికి )

    రిప్లయితొలగించండి
  13. దోసము జూడకన్ మునుపు దూరి కవీశు ప్రశంస భావనల్
    వాసిగ రాసిగన్ గొని నివారణ పర్యవసాన మెర్గకన్
    దోసిలి యొగ్గి మ్రొక్కుచును దూరములో మఱి తూల నాడుచున్
    *“వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్”*

    రిప్లయితొలగించండి
  14. మోసము చేయుచు కవినని
    దోసములను కవితలల్లు దుర్జను డొకడున్
    మీసము త్రిప్పుచు కావ్యము
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్

    రిప్లయితొలగించండి
  15. వాసిగ పద్యము వ్రాయక
    రాసియె ఘనమనితలపగరంజననిడునా
    దోసపుతెరఁగున కవితలు
    వ్రాసిన కవివరుని శృంగభంగమొనర్తున్

    రిప్లయితొలగించండి


  16. దూసెద కరవాలమ్మును
    కోసెద శిగపట్టి నరికి; కొరికి కసబిసా
    కూసెద, వచనకవిత్వము
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్!


    వచన కవిత్వము మాదన్న వార్ని వేసెద వేటోయ్
    రండి పోట్లాడదాం‌ శంకరాభరణం వేదికగా :)


    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి

  17. కందోత్పల

    యూ నో వాణి మా దేవి సుమీ:)



    ముదము వచనమనగ మ్రుద
    మ్రుద! వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొన
    ర్చెద శృంగభంగమున్! శా
    రద మా దొరసానియగు; సొరగదువచనమోయ్!


    రిప్లయితొలగించండి
  18. కందం
    వాసిఁ గలుఁగు పెదనార్యులు
    గూసె ననుచు లింగడెంచి కూర్చెను మదిలో
    దోసమన 'నమవసనిశి' ని
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్

    ఉత్పలమాల
    వాసి గలుంగు పెద్దన యవాంఛిత రీతిని పద్యమందునన్
    గూసె ననంగ లింగఁడది గుర్తుగ నెంచెను మానసంబునన్
    "దోసమనన్ 'అమాసఁ' గొని దుష్కరమౌ లఘు రీతి గూర్చుచున్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్"

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    *బాగున్నదాండీ*? . 😂🤣🙏

    పాసితి రేయి నిద్రనొక పద్యమువ్రాయ శ్రమించి., నా సతిన్
    ద్రోసితి ముద్దులిమ్మనగ.,దోసములున్నను మెచ్చగావలెన్
    వ్రాసినదాని చూచి యిది బాగుగ లేదని పిచ్చిపిచ్చిగా
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  20. వాసియె మేలటంచు చనె పాతదినంబుల సాహితీపరుల్
    తోసము నొందు చుండుచునె దోసిలి పెట్టెద నావిధం బునన్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి ; యొనర్చెద శృంగభంగమున్
    రాసియె మెప్పు పొందునని లాఘవరీతిని వ్రాయువానినిన్

    రిప్లయితొలగించండి
  21. చేసేద ప్రయోగ మనుచును
    దోసము లున్నట్టి కవిత తోరము వ్రాయ న్
    చూసిన నొక డ నియె నా
    వ్రాసిన కవి వరు శృంగ భంగ మొనర్తు న్

    రిప్లయితొలగించండి
  22. వ్రాసెద మేలగు రాతలు
    వాసిగ నేనని నుడువగ విబుధులు మెచ్చన్
    బాసలు మరవగ తప్పుల్
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాసలు వేరను మాటల్
      వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్
      భాసము కొరవగు కవితల్
      దోసములెంచగ పలికెడు దురితము నోర్వన్

      తొలగించండి


  23. దోసిలి యొగ్గి వేడుకొని దుక్కి పదామృత సేవనమ్ముతో
    వాసిగ వ్రాయ శోభిలును భారతి సాచివిలోకితమ్ముగా
    పూసిన పల్కుపువ్వు! మసిపూయుచు పద్యము చౌకబారుగా
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. వ్రాసినచో రసధ్వనివిరాజితనవ్యమనోజ్ఞపద్యముల్
    వేసెదఁ బూలదండలను వేడుకతో గళమందు, లేనిచో
    దోసములన్ గణించక యదో యిదొ యెయ్యెదొ కీర్తిఁ గోరుచున్
    వ్రాసిన..., సత్కవీశ్వరునిఁ బట్టి...., యొనర్చెద శృంగభంగమున్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  25. సమస్య :-
    “వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్”

    *కందం**

    మోసము జేసిన వాడిని
    వాసి గలిగినట్టి గొప్ప వాడనుచు స్తుతిన్
    మీసము గల వీరుడనుచు
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్
    .................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  26. మోసముచేయుచున్ ప్రజల ముల్లెను పొందుచు దొడ్డిదారిలో
    దోసపు జీవితమ్ములను దుష్టపు కార్యములన్ని చేయుచున్
    వేసము వేసి నేతలయి, ప్రేలెడి వారల మెప్పుకోసమై
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ, బట్టి యొనర్చెద శృంగభంగమున్

    రిప్లయితొలగించండి
  27. దోసములెంచుచున్నెపుడు దూషణ జేయుచు వేరు కైతలన్
    కాసుల కాశ జెంది దన కావ్యములన్నిట స్త్రోత్ర పాఠముల్
    రాసులు జేసి గోరుచును రాచ కుటుంబపు ప్రాపకమ్మికన్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్

    రిప్లయితొలగించండి
  28. వశమౌదునుసత్కవితకు
    విశదముగా తేటపరచు విద్వత్కవికిన్
    విషయములేనికవిత్వము
    వ్రాసిన కవివరుని శృంగభంగమొనర్తున్

    రిప్లయితొలగించండి
  29. వాసిగనుండకబేలగ
    మాసినవస్త్రమ్మువోలెమసిబారంగన్
    నీసునుగూడుచురచనను
    వ్రాసినకవివరునిశృంగభంగమొనర్తున్

    రిప్లయితొలగించండి
  30. ఆస చెలఁగ డెందమ్మునఁ
    గాసుల కోసమ్ము దోష కాయ గుణములన్
    దోసము లెంచక పొగడుచు
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్


    ఈసున నన్ను సంతతము హేళన సేయు మదాంధ సూరికిన్,
    భాస సమాన విశ్రుత విభాసిత పండిత భవ్య కావ్య వి
    న్యాస విలాస గీత రచనా సువిశారద రంజనమ్ములన్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి, యొనర్చెద శృంగభంగమున్

    రిప్లయితొలగించండి
  31. కాసులతోడసత్క్రియనుగారవమిత్తునుగాశవ్యసంపుటిన్
    వ్రాసినసత్కవీశ్వరుని,బట్టియొనర్చెదశృంగభంగమున్
    నీసునవ్రాయునట్టికవినెప్పటికప్పుడుదూషణంబులన్
    జూసినవెంటనేరచనచోద్యమునింపునునీయగావలెన్

    రిప్లయితొలగించండి
  32. రాసిని గన వేలాదిగ
    వ్రాసితి పద్యములటంచు వాగెడు కుకవుల్
    కాసుల కొరకు కుకవితల . వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్

    రిప్లయితొలగించండి
  33. కాసులఁ బొందగా దలచి కాకవు లెందరొ వ్యక్తి పూజలన్
    వాసిగ జేయుచున్ సతము వాసియె లేని వృధా కవిత్వమున్
    రాసులుగా నిరర్థకపు గ్రంథము లెన్నియొ దూరదర్శనుల్
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్

    రిప్లయితొలగించండి
  34. ఉ:

    గీసెడు చిత్రముల్ గనగ కేసరి యెవ్వడొ తేటతెల్లమౌ
    కూసెడి కూతలన్ వినగ గుప్పున కానగు భావ చింతనల్
    బాసట నిల్తు నెల్లపుడు వాస్తవమై యటు గాక యున్నచో
    వ్రాసిన సత్కవీశ్వరుని బట్టి యొనర్చెద శృంగభంగమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. అందరికీ నమస్సులు🙏
    ఉ.మా

    త్రాసుకు తూగు వ్యాకరణ దక్షత చూపెడి సాహితీ స్పృహన్
    కాసుల వేటలో మునిగి కన్నులు మూసుకు బోవ పండితా
    ధీశులు భాధ్యతన్ మరచి దేభ్యపు వ్రాతల పైత్య మెక్కగన్
    *వ్రాసిన సత్కవీశ్వరుని బట్టి యొనర్చెద శృంగ భంగమున్*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి