21, అక్టోబర్ 2020, బుధవారం

సమస్య - 3522

 22-10-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు”

(లేదా...)

“పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా”

http://kandishankaraiah.blogspot.com

70 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కలుగన్ భీతియె మానసమ్మునయయో గంభీరమౌ రీతినిన్
    తలలన్ దాచగ తావు లేక వడిగా తైతక్కలాడించుచున్
    చెలగన్ మోడి ప్రచారమందు తనరన్, చేదోడు వాదోడుగా
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా!...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తలపుల్ రేగగ మన్మధుండు చెలగన్ దయ్యమ్మునున్ బోలుచున్
    నిలువన్ జాలక గంతులేయుచునయో నెయ్యమ్ము కయ్యంబులన్
    వలపుల్ మీరగ చీని నాయకుడహో బంధించబో కౌగిలిన్
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా!...

    రిప్లయితొలగించండి
  3. పులి వేటాడి, మేక తప్పించుకుని, అలసి, దూరంగా వేర్వేరుగా ఒకే రేవున నీళ్ళు త్రాగవచ్చును కదా

    అలయించన్, పులులామృగంబులను వేటాడన్ జలంబుల్ గనెన్
    విలయంబైన పులుల్ విడంగనురకన్ వెళ్ళెన్ మృగంబుల్ జలం
    బులసేవించగనా జలాశయముకున్ వ్యూఢంబు వేర్వేరుగన్
    పులులున్ మేకలునొక్కరేవునజలమ్మున్ ద్రాగు వీక్షింపుమా

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉరకన్, వెళ్ళెన్' అన్నవి వ్యావహారికాలు. 'విడంగ జనియెన్ వేగన్ మృగంబుల్...' అందామా?

      తొలగించండి
  4. ఆశ్రమ ము నందు వసియించు నన్ని కలసి
    మెలసి మెలగుచు నుండుట మెచ్ఛు కొనగ
    పులులు మేకలు నొకరేవు జలము ద్రాగు
    న నుట సహజమై తన రునీ యవని యందు

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఎన్నికలవేళ వైరి పార్టీలవారు
    రాయబారము జేసి పాలకుల దోడ
    సంధితో మెలగాడెడి రంధి జూడ
    పులులు మేకలు నొకరేవు జలము ద్రాగు.

    రిప్లయితొలగించండి
  6. వారి కధికార మున్నట్టి పాళమందు
    విరివిగ బ్రజాధనమ్ముమ్రింగిరని వీరు
    వీరు దొంగలటంచును వారలనరె
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు

    రిప్లయితొలగించండి
  7. కలహమ్మెంచెడి నన్ని పక్షములలో ఖానుల్ సమావేశమై
    చెలిమిన్ గూడుచు నెన్నికల్ కొఱకు సంసిద్ధంబునౌ కాలమున్
    అలవిన్ పాలకవర్గమున్ గలిసి చేయందన్ గనన్ తోచునౌ
    పులులున్ మేకలునొక్కరేవునజలమ్మున్ ద్రాగు వీక్షింపుమా!

    రిప్లయితొలగించండి
  8. సమస్య :
    పులులున్ మేకలు నొక్కరేవున జల
    మ్ముం ద్రాగు వీక్షింపుమా

    ( కణ్వమహాముని ఆశ్రమసమీపాన అక్కడి ప్రశాంతపరిస్థితిని సారథికి చూపించి ఆశ్చర్యపడుతున్న దుష్యంతమహారాజు )
    మత్తేభవిక్రీడితము
    .........................
    కలయుం గాదిది సారథీ ! మరియు నా
    గాంభీర్యదృశ్యంబు నీ
    వల గన్గొంటి ! మహర్షి కణ్వుని తపో
    భాగ్యంపు శక్త్యున్నతిన్
    దిలకింపం దగు బాము - ముంగిసల మై
    త్రిన్ ; సింహమత్తేభముల్
    బులులున్ మేకలు నొక్కరేవున జల
    మ్ముం ద్రాగు ; వీక్షింపుమా !!

    రిప్లయితొలగించండి
  9. విలువౌ విద్యను నేర్వగా(జూపగా) కవులు సంప్రీతిన్ సమాయత్తులై
    సులువౌరీతిని పద్యమున్ గరపు
    సుశ్లోకంపు సంస్థానమం
    దలుపున్ లేకయె పూరణల్ సలుప
    గానన్యోన్య స్నేహంబునన్
    పులులున్ మేకలు నొక్కరేవున జలమ్మున్ ద్రాగు వీక్షింపుమా

    అవధానులు, పండితులు పులులు!
    ఔత్సాహిక కవులు మేకలు!
    పులులకు జూపగా, మేకలకు నేర్వగా
    అన్వయము! 🙏🙏🙏

    మునులు తపమును జేసెడు భూమిలోన
    సకల భూతములు చరించు సఖ్యమునను
    కుక్క మార్జాలము గుడుచు నొక్కచోట
    పులులు మేకలు నొకరేవు జలము ద్రాగు

    రిప్లయితొలగించండి
  10. వాది,ప్రతివాదులొకటయ్యి వాదుజేయ
    ఫలిత మేరీతి నుండునో తెలియ లేమ
    న్యాయమేరీతి దొరుకును నరులకింక
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు!!

    రిప్లయితొలగించండి
  11. కలనుగంటిని కలలోన గాంచితేను
    మనుజులందరు మునులుగామారినారు
    నాయకులయందునవినీతినాశమొందె
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు

    రిప్లయితొలగించండి
  12. అందరికీ నమస్సులు🙏

    నా పూరణ యత్నం..

    *తే గీ*

    రాజకీయము నందున లక్ష్య మొకటె
    ఏలు వారును ప్రత్యర్థి యెంచి యొకటి
    దోచు కొందురు ప్రజలను దొరికినంత
    *“పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  13. లలనా నానుడు లాలకింపుమ జనారణ్యమ్ములో గాంచగన్
    పలు నేరమ్ముల సేసినట్టి ఖలులే పాలింతురే సత్యమే
    స్థలమున్ మారిన వేళ ప్రతి పక్షంబందు కూర్చుండు నే
    తలు నీతుల్ వచియింపనేమి గనగన్ దస్యుల్ గదా వారలున్
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "మారిన వేళలోన ప్రతిపక్షంబందు..." అనండి.

      తొలగించండి
  14. పులుల కంటఁబడిన మేక పోకడిట్లు
    జనుల కంటఁబడినపాము చచ్చునట్లు
    చూడ నీరుగుడుచునొక్క చోట వేరె
    పులులు , మేకలు నొకరేవు జలము ద్రాగు

    రిప్లయితొలగించండి
  15. పులులు మేకలు నొకరేవు జలము ద్రావ
    జాతి వైరముల గణన జాడ్యమేల
    ఎల్లజీవుల దాహము జలముదీర్చ
    కర్మ జీవుల బ్రతుకుల మర్మమేమొ
    భరతభూమిలో మహిమల కొరతలేదు

    రిప్లయితొలగించండి


  16. ఔర! చంద్రశేఖరుని మహానగరమి
    దియె సుమీ! వర్షములు ప్రతి దినము కురిసి
    వాగులున్ చెరువులు నిండి వర్ధిలెనిట
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు!


    అంతా మమేకై పోయింది !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. బలిమిన్ జూపుచు ముందుగా వెడలి
    యార్భాటమ్ముగా జూచినన్
    తలనున్ వంచుచు క్యూలలో చివరిగా
    దర్శించినన్ దైన్యమున్
    నిలుచున్ దేవుని ముంగిటన్ మొఱల
    విన్పించంగ కైమోడ్చుచున్
    పులులున్ మేకలు నొక్కరేవున జలమ్ముల్ ద్రాగు వీక్షించుమా

    రిప్లయితొలగించండి
  18. వ్యాఘ్రములనగ నేమొకొ, వనము లోన

    చింబులని వేని నందురు, చెప్పు‌శుక్రు

    నకు కనుల సంఖ్య యెంత,రజ కులు వస్త్ర

    ములుతుకు స్ధలమేమిటొ, తెలుపు జీవు

    లేమి చేయు దప్పి కలుగ భూమి పైన,

    పులులు,మేకలు,నొక,రేవు, జలము ద్రాగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. బాగుందండి. ప్రశ్నలు బాగున్నవి, వాటి యుత్తరములు బాగున్నవి కాని యా రెంటిని ననుసంధించు వారధియే లేదు.
      సంఖ్య యెంత – ఒక కుదరదు. ఒకటి యనవలెను. వృత్తిలోనే దానికిఁ బ్రత్యయ లోపము. ఒక యిల్లు, ఒక మనిషి యిత్యాదుల.
      నాల్గవ పాదములో గణభంగము.

      వారధి యీ క్రింది విధముగా నుండ వచ్చును. ప్రయత్నించండి.

      లేమి చేయు దప్పి కలుగ, నెఱుఁగు మిట్లు
      క్రమముగ నుడువఁ గ్రింద నిక్కమ్ముగఁ దగఁ
      బులులు,మేకలు,నొక,రేవు, జలము ద్రాగు.

      తొలగించండి
    3. నమస్కారము ఆచార్య. చాలా కాలము‌ తర్వాత నా పై కరుణించారు సరి చేసుకుంటాను

      తొలగించండి
    4. నమస్సులండి.
      శ్రీమదాంధ్రరామాయణ శ్రీ బాల రామాయణ కావ్య ద్వంద్వ రచనలో నిమగ్నుఁడ నైతిని.

      తొలగించండి
  19. జలమే ధారలుగానుబారెగద,యేజాప్యమ్మదేలేకతా
    బలమున్ జూపుచునంతసైన్యమును,నేభారమ్ముగానెంచకన్
    కులముల్ జాతియు వర్ణభేదముల, తా కూలంగదోసేయుచున్
    పులులున్ మేకలునొక్క రేవున, జలమ్ముల్ ద్రాగు వీక్షించుమా!

    రిప్లయితొలగించండి
  20. మునులు తపమును చేసెడు వనములందు
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు
    ననుచు తెల్పిరి గ్రంథము లందు కవుల
    దెటులు జరుగునో యన్న నే నేమి చెబుదు?

    రిప్లయితొలగించండి


  21. హమ్మయ్య!


    కలికాలమ్మున సామరస్యమునుకున్ కారుణ్యమున్ చూపెడీ
    బలమైనట్టి పెనంగనట్టి వెఱగై భాసిల్లు క్షేత్రంబిదే!
    కలయో వైష్ణవ మాయయో తెలియదౌ! కల్యాణ తీర్థమ్ములో
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    బలవద్భేదములేక., సర్వసమతాభావమ్ము దీపింపగా.,
    విలసత్కందఫలాదిసేవనమె నైవేద్యప్రసాదమ్ముగాన్
    వెలయున్ సాత్త్వికశాంతిభావనలు., రావే! నీకు జూపించెదన్
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా.!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
      'రావే కణ్వభూమిన్ గనన్' అని మూడవ పాదంలో వారి సవరణే.

      తొలగించండి
  23. మ:

    గెలుపున్ గోరగ రౌద్రమై తనరి లంఘింపన్ బృహన్నౌకనున్
    కలయన్ దిర్గుచు పాచికల్ కదన రంగంబున్ తలంపొప్పగన్
    ఫలితంబెంచిన మీదటన్ సకల సంభావ్యమ్ము నీ రీతిగన్
    పులులున్ మేకలు నొక్కరేవున జలమ్ముంద్రాగు వీక్షింపుమా

    బృహన్నౌక=Chess
    పాచికలు=పావులు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పులులే మేకల తోలుఁగప్పుకొని భూమిన్ వాటితోఁ గూడి నె
      చ్చెలులై యందిన మేర దోచుకొను, నిశ్చేష్టన్ విలోకించన్
      పులులై యొప్పిరి మోసగాండ్రు,సుజనుల్ బొల్పొందు మేషమ్ములై,
      పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి

  24. తే. గీ

    నేతలు ప్రజల బ్రార్థించ నెమ్మి జూపు
    నోట్లు దండగ నోర్మితో నొడలు మరచి
    బీద సహపంక్తిని భుజించ భేదము విడి
    *పులులు మేకలు నొకరేవు జలము త్రాగు*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  25. అలుగుల్ బాఱెను చింతజేయగను సంద్రంబయ్యెరాదారులున్
    కలుగుల్ నిండెను వ్యర్ధముల్ నిలిచి భంగంబయ్యె భూమార్గముల్
    నెలవుల్ దప్పగ భాగ్యవంతులును మిన్నేసాక్షిగా పేదలై
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  26. తేటగీతి
    ఆయుధములై యహింస సత్యములమరఁగ
    స్వేచ్ఛఁ గొన్న ఫలమ్మొ? విశేషమనఁగ
    దుష్టులున్ శిష్టులున్ జేరి తుష్టినేల
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు

    మత్తేభవిక్రీడితము
    ఇల సత్యమ్ము నహింసనాయుధములై యీడేర్చఁ బోరాటమున్
    బలమై స్వేచ్ఛనుఁ బొందినట్టి ఫలమో! స్వార్థంపు శార్దూలముల్
    మిలితంబౌచును సాత్వికోత్తములునౌ మేషాలతో నేలఁగన్
    బులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా!


    రిప్లయితొలగించండి
  27. కలలోనాటవియందుగాంచితినిచొక్కంబైనమున్యాశ్రమం
    బిలలోనాకమునందనంబులతలున్బిందెల్ఫలాల్పుష్పముల్
    గొలనుల్స్వచ్ఛజలాశయంబులటచక్షుశ్శోత్రతార్క్ష్యాదికో
    *“ల్పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా”*

    రిప్లయితొలగించండి
  28. పలుదుష్కార్యములందునన్ ధనము సంపాదించి గర్వాంధులై
    విలువౌ భూములు దోచి గ్రామముల, నైవేద్యమ్ములన్ పెట్టి కో
    వెలలందున్ స్తుతియించుచున్ ముదముతో విశ్వాత్మునిన్, గంగలో
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

    రిప్లయితొలగించండి
  29. పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు
    పాలకుండయినను లేక బానిసయిన
    జన్మనెత్తు దనుక నెట్టి జాతినయిన
    తారతమ్యము లెరుగరు తనువుకొరకు

    రిప్లయితొలగించండి
  30. కణ్వునాశ్రమమందునకలసిమెలసి
    పులులుమేకలునొకరేవుజలముద్రాగు
    జంతుజాలమంతయునటసఖ్యతోడ
    బ్రదుకుచుండునిర్భయముగవంతలేమి

    రిప్లయితొలగించండి
  31. ముచ్చటగ మూడు రేవులు పచ్చదనపు
    గట్టు లతిశయిల్లఁగ నటఁ గలవు వెలసి
    పోరు లేకుండ రెండు రేవుల జలమ్ముఁ
    బులులు, మేకలు నొకరేవు జలముఁ ద్రాగు


    అలవోకం దిరుగాడి కాననమునన్ వ్యాఘ్రమ్ము లత్యుగ్రముల్
    పలుమాఱున్ దిశ లెల్ల గాంచుచును దత్ప్రాంతంపు ఛాగాల్పముల్
    కులుకుల్ తోడుత నుండగా నులుకులుం గ్రొవ్వంగఁ గుందంగ నా
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

    రిప్లయితొలగించండి
  32. కలయాయంటివె?గాదుగానదియయక్కాంతారమందున్ భళా
    పులులున్ మేకలునొక్కరేవునజలమ్ముంద్రాగువీక్షింపుమా
    యలయాకణ్వునియాశ్రమంపుదరిబాహాటంబుగామేకలున్
    బులులున్ దిర్గుచుబ్రీతిభావమునుబెంపొందింకొందున్ వనిన్

    రిప్లయితొలగించండి
  33. కలిలో వింతలు వేనవేలు కననౌకాకమ్ము శ్వేతమ్ముగన్
    పలలంబున్విడనాడి కేసరి తృణంబన్నంబుగా జేకొనున్
    కలశంబందున సంభవించుశిశువుల్ గర్భంబు లేకుండగన్
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

    రిప్లయితొలగించండి
  34. వెలయించున్ దన చిత్ర రాజముల ప్రావీణ్యంబు నొప్పారగా
    కలనైనన్ గనరాని యందములతో గన్విందుగా నాతడే
    చెలువౌ చిత్రము జూడుమిందు వనమున్ చిత్రించె హృద్యమ్ముగా
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా

    రిప్లయితొలగించండి
  35. ఆకు లలములు దినుచును నడవు లందు
    మునుల యాశ్రమ ములయందు ముచ్చటగను
    వైర ప్రాణులు సైతము పరవశాన
    పులులు మేకలు నొకరేవు జలము త్రాగు.

    రిప్లయితొలగించండి