28, అక్టోబర్ 2020, బుధవారం

సమస్య - 3528

 29-10-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రామాయణ కల్పవృక్షమునకు ఘనత గలదె”

(లేదా...)

“రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో”

(ఛందో గోపనము)

66 కామెంట్‌లు:

  1. శా||
    కారుణ్యాలయుడండ్రు రామునిగనన్ కర్తవ్యనిష్ఠుండవన్
    వీరంబున్ యెవడేనివైరిగనినన్ విచ్ఛిన్నమున్ జేసెడిన్
    పారావారము బోలు కావ్యమును సంప్రాప్తిన్ గనన్ గాక వి
    ప్రా! రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'వీరంబున్+ఎవడు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పోరంబోకును దున్నుచున్ మురియుచున్ పోట్లాడి కాట్లాడుచున్
    వీరావేశము హెచ్చగా కుడువగన్ బీరున్ మరిన్ విస్కినిన్
    ప్రారబ్ధమ్మున నిట్లు పల్కితివిరో పాపాల రాయుండ! ఔ
    రా! “రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో”...

    రిప్లయితొలగించండి
  3. ముప్పాళ రంగ నాయకమ్మ వ్రాసిన రామాయణ విష వృక్షం నకు ఘనత కలుగ లేదు అను‌భావన

    ఖ్యాతి కలదు గద జగమున
    రామాయణ
    కల్ప వృక్ష మునకు‌‌, ఘనత‌ కలదె

    తరచి చూడ మనము తరుణి రచించిన
    విష వృక్ష మునకు విశ్వ మందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. "విషపు వృక్షమునకు..." అంటే సరి!

      తొలగించండి
  4. కాల మహిమ యేమొ కవులకు విలువలు
    జారి పోయె నేడు! పారి పోయె!
    సరస కావ్య గతుల సాక్షి రామాయణ
    కల్ప వృక్షమునకు ఘనతఁగలదె!!

    రిప్లయితొలగించండి
  5. ఆధునిక యుగంబు నవతారమేలేక
    అందరును సమాన మనగ యువత
    మానవత్వమందు మనగ రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె!!

    రిప్లయితొలగించండి
  6. విశ్వనాథవారు విశ్వమందునమేటి
    కావ్యములను వ్రాసి ఖ్యాతి నొందె
    వారి కృతులలోన పరము రామాయణ
    కల్పవృక్షముమకు ఘనత గలదె.

    రిప్లయితొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఘోరంబయ్యెడి మాటలన్ పలుకుచున్ కొండాడకే బ్రాహ్మలన్
    తీరున్ తెన్నును లేని రాష్ట్రముననున్ దేదీప్యమానమ్ముగన్...
    ధీరోదాత్తుడ రామసామి ద్రవిడా! తియ్యంగ బోధింతు! రా
    రా! “రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో”...

    రామసామి = పెరియార్ రామసామి నాయకర్

    రిప్లయితొలగించండి
  8. మెప్పు గలిగె గాదె గొప్ప రామాయణ
    కల్ప వృక్షమునకు : ఘనత గలదె
    తలయు తోక లేక వెలసిన కావ్యాని
    కిల న దెప్పు డైన నింపు సొంపు !

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కవుల కిలను తెఱగు గల్పించ కుండుచు
    కైతలే జదువని కాలమందు
    మేటిగా వెలిగిన నాటి రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె?

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాటి పుస్తి లేదు మేటి రామాయణ
    కల్పవృక్షమునకు; ఘనత గలదె
    రాముని కథలంచు లభ్యమౌ నీరస
    పుస్తకములకెల్ల పుడమి లోన?

    రిప్లయితొలగించండి
  11. ఒక ప్రాగల్భ్య కవి మరొక కవితో

    ధీరోదాత్తుడు రామచంద్రుని కథన్ దీరైన రూపమ్ముతో
    నారంభించి కవుల్ లిఖించగ నసంఖ్యాకమ్ముగా కావ్యముల్
    బీరాలాడెడు విశ్వనాథుడను గర్విష్ఠుుండు పొంకించ నా
    ర్యా! రామాయణ కల్పవృక్షమునకున్
    ప్రఖ్యాతి యేమున్నదో?

    రిప్లయితొలగించండి
  12. సారాంశమ్మది తెల్పెకాదెవిష వృక్షంబంచునో మూర్ఖురా
    లారామాయణమున్ లిఖించిన కురంగాక్షిన్ జనుల్ దూరిరే
    యారాద్యుండగు విశ్వనాథకవి తానబ్రమ్ము గా వ్రాసెనౌ
    రా రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో

    రిప్లయితొలగించండి
  13. రామకథలమేటి రమ్యమగుఖ్యాతి
    విశ్వనాథు దీప్తి వినుతికెక్క
    వేయిపడగలీల వెలుగురామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "రమ్యమయిన ఖ్యాతి" అనండి.

      తొలగించండి


  14. నప్పు సూవె విశ్వ నాథ రామాయణ
    కల్పవృక్ష మునకు ఘనత, గలదె
    నీదు నాదు పద్యనీరాజములకు, జి
    లేబి, కైపదముల లెక్కకున్ను ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీరాజనము' ఉన్నది. 'నీరాజములు'?

      తొలగించండి


    2. నప్పు సూవె విశ్వ నాథ రామాయణ
      కల్పవృక్ష మునకు ఘనత, గలదె
      నీదు నాదు పద్య నీరాజనములకు
      లేమ, కైపదముల లెక్కకున్ను ?


      జిలేబి

      తొలగించండి
  15. ఘనుడు విశ్వ నాధగారి రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె
    యనెడి శంక నొంద ననువెట్లగు ?నతడు
    రమ్య మైన కావ్య రచన జేసె

    రిప్లయితొలగించండి
  16. సమస్య :
    రామాయణకల్పవృక్షమునకున్
    ప్రఖ్యాతి యేమున్నదో
    ( తిక్కనార్యుని నిర్వచనోత్తరరామాయణం ,
    రఘునాథుని రఘునాథరామాయణం , ఎర్రనార్యుని రామాయణం , కంకంటి పాప రాజు ఉత్తరరామాయణం , మొల్ల రామాయణం , భాస్కరుని భాస్కరరామాయణం
    ఉండగా ఇప్పుడీ విశ్వనాథుని రామాయణ కల్పవృక్షానికి ఇంతటి ప్రసిద్ధి యేమిటని ఒక చూడలేని కవి మరొక కవితో ..)
    శార్దూలవిక్రీడితము
    ...........................

    శ్రీరామాయణకావ్యమాధురులకున్
    జింతింప దిక్కన్నయున్
    గారామౌ రఘునాథు డెర్రనయు నా
    గంకంటి మొల్లమ్మయున్
    ధీరుండౌ మన భాస్కరుండు వెలయన్
    దెల్పంగ నెట్లైన నౌ
    రా ! రామాయణకల్పవృక్షమునకున్
    ప్రఖ్యాతి యేమున్నదో ??

    రిప్లయితొలగించండి


  17. నోరారంగను పద్యముల్ చదువగా నొప్పేయు చూడంగ నౌ
    రా! రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో?
    రారా నా వచ నమ్ములోనధికమై రాణింపజేతున్ జనుల్
    హేరాళమ్ముగ నీకథన్ చదువగా హే రామ! సీతాపతే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. పదలాలిత్యము,శబ్దశాసనము గోప్యంబౌ సమాసంబులున్
    ఎదలోతుల్గను పద్యపంక్తులటు మత్తేభంబులైజెల్లకన్
    రొదబెట్టించగ నమ్మవారు జయ శార్దూలంబు బల్కించకన్
    పదరామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  19. రొదబెట్టించకనమ్మవారు జయ శార్దూలంబు బల్కించకన్

    రిప్లయితొలగించండి
  20. కల్పిత కథల వెన్నియో కావ్యములన
    బడుచు జగతిని కీర్తింప బడుచునుండ
    విశ్వనాథుని రచన రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె

    రిప్లయితొలగించండి
  21. ఆటవెలది
    చిలుక తండ్రి యాజ్ఞ, జీవుని వేదన
    నన్నయాఖ్య తిక్కన కవి వరుల
    నటన లేక 'విశ్వనాథ' రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె?


    మత్తేభవిక్రీడితము
    పితదౌ యానతి, జీవి వేదనలవే ప్రేరేపణై, పూనగన్
    జతగా నన్నయ తిక్కనాది కవులే, సంకల్పమేపారగన్
    కృతియై వెల్వడె నాటకీయతలతో హృద్యమ్ముగన్ లేని శ్రా
    వ్యత రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'ప్రేరేపణ+ఐ' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      మత్తేభవిక్రీడితము
      పితదౌ యానతి, జీవి వేదనల సత్ప్రేరేపణన్ బూనగన్
      జతగా నన్నయ తిక్కనాది కవులే, సంకల్పమేపారగన్
      కృతియై వెల్వడె నాటకీయతలతో హృద్యమ్ముగన్ లేని శ్రా
      వ్యత రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో?

      తొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీరున్ గూడిన పోడిమిన్ గలిగి పృథ్విన్ ధర్మమే జెప్పుచున్
    కారుణ్యాయుత దృష్టితో చెలగి ప్రఖ్యాతమ్మునౌ రీతినిన్
    రారాజై ప్రజనేలినట్టి ఘనుడా రాముండె బోధించులే
    రా! రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో!

    రిప్లయితొలగించండి
  23. సారాచారవిచారసారమదివిస్తారాత్మవైరాగ్యమం
    దారంబందునమానవాత్మగరిమన్స్థైర్యంబుసద్ధర్మ్యమున్
    శ్రీరామానుజరామరామలమహచ్ఛ్రేష్టోన్నతైశ్వర్యమౌ
    రా *రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో*

    రిప్లయితొలగించండి
  24. కె.వి.యస్. లక్ష్మి:

    ఇడకు విశ్వనాధు డిడిన రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె
    నంచు జదివి మెచ్చి నారు పారగతులు
    రామగాథ మిగుల రమ్య మనుచు.
    (ఇడ=భూమి)

    రిప్లయితొలగించండి
  25. సమస్య: రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో
    ధీరుండై ఘన విశ్వనాథుడు కడున్ దీపించె చూపించి వై
    శారద్యమ్మును, జ్ఞానపీఠ ఘనతన్ సాధించె నాంద్రమ్మునన్
    లేరే యాయన సాటివారు, తెలియున్ ప్రీతిన్ పఠించంగ, నౌ
    రా! రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో

    రిప్లయితొలగించండి
  26. వర రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో
    నరయంగా దగు పండితోత్తములు విద్యావంతులున్ గాని గా
    వరమున్ జూపెడి మూర్ఖుడెట్లు దెలియున్ భావార్థ సౌందర్యమున్
    స్థిరమై కూపముఁ దాగు భేకమెటు గుర్తించున్ ఝరీ పూరమున్

    రిప్లయితొలగించండి
  27. విశ్వనాథ వారి కవిత్వం పాషాణ పాకం అన్న కవి (జరుక్ శాస్త్రి గారు కాదు సుమా.. )తో వేరొక సంప్రదాయ కవి ఇలా...

    శా ||
    శ్రీరామాయణ కల్పవృక్ష కవితాశిల్పంపు మాహాత్మ్యమున్
    ఔరా!చెప్ప బృహస్పతి ప్రముఖులే తబ్బిబ్బియౌ !రామభూ
    పా!రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో
    యారమ్యమ్మగు కీర్తిచంద్రికలు సాధ్యమ్మౌనె నీకైతకున్

    రిప్లయితొలగించండి
  28. శ్రీరామప్రభుదివ్యపావనధరిత్రీపుత్రిచారిత్ర్యమున్
    సారాసారవిమర్శఁ జేయుదువొ? యీషణ్మాత్రవిజ్ఞానివై,
    శ్రీరంజిల్లిన కల్పవృక్షము విషక్ష్మాజమ్మ! చూపింతు రా
    రా,రామాయణకల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  29. నిన్ను నీవు హృదిని సన్నన సేసికొ
    న్నటుల నగును గాదె యట్టి దింక
    వలదు సంశయమ్ము వలదు రామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె


    భద్ర క్షేమద చిత్త రంజన కథాప్రాశస్త్య సద్గ్రంథమున్
    సద్రాజావళి మార్గదర్శి జన హృచ్చైతన్య విస్తారియున్
    క్షుద్రాలోచన దుస్తరంగ వృత రక్షోవ్రాత విధ్వంసి శ్రీ
    మద్రామాయణ కల్పవృక్షమునకుం బ్రఖ్యాతి యేమున్నదో!!!

    రిప్లయితొలగించండి
  30. సత్కవివరులిటుల సాక్షిరామాయణ
    కల్పవృక్షమునకుఘనతగలదె?
    యనుటపాడియగునెనాలోచనముజేయు
    డొక్కమారుదెలియునిక్కమెదియొ

    రిప్లయితొలగించండి
  31. పౌరానీకముమెచ్చగానచటన్పౌనహవచోలాభమే
    హారామాయనుపల్కుగాదపరమున్హాయంచుఁజేర్చున్తుదిన్
    మీరాప్రశ్ననువేయగాతగునునామీసాలరాయుళ్లనే
    ఆరామాయణకల్పవ్రుక్షమునకున్ప్రఖ్యాతియేమున్నదో

    రిప్లయితొలగించండి
  32. మైలవరపు వారి పూరణ

    నారద మహర్షి... దేవేంద్రునితో యిలా అంటున్నారు...

    సురనాథా! మన కల్పభూజమిటనే శోభిల్లుచుండెన్ గదా!
    ధరలో గంటి మరొక్కటిన్., సకలవిద్వద్వంద్యమౌ పొత్తమున్.,
    నరులున్ దాని బఠించి తృప్తులగుచుండన్ గాంచితిన్ వింతయే!
    వరరామాయణ కల్పవృక్ష మునకున్ ప్రఖ్యాతి యేమున్నదో!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  33. శా:

    ఏ రామాయణ మూల మైన నొకటే యే రీతి పొందించినన్
    సారాంశమ్మును మార్చకుండగ కథా సాగించుటే నిత్యమౌ
    తీరా కారణ మేమిటో నెరుగమే తీరెంచి వాక్రుచ్చ, నౌ
    రా,రామాయణ కల్ప వృక్షమునకున్ ప్రఖ్యాత మేమున్నదో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. పోరంబోకునివోలెమాటలుదగన్ బోనాడగాబాడియే
    రా!రామాయణకల్పవృక్షమునకున్ ప్రఖ్యాతియేమున్నదో
    వీరా!బీరునుద్రాగియుంటివిగదేవేళాయెనేద్రాగగన్
    నౌరాయేమిదిలోకమెక్కడకుబోయూనుంగదోదైవమా!

    రిప్లయితొలగించండి
  35. విశ్వనాధవారి విన్నాణమంతయు
    రంగరించి నారు రచనలందు
    గొప్పతనముజూపకున్నరామాయణ
    కల్పవృక్షమునకు ఘనత గలదె

    రిప్లయితొలగించండి
  36. వీనులలరగాను వినియు రామాయణ
    కల్పవృక్షమునకు ,ఘనత గలదె”*
    యని మొరకు తనమున యడుగుట యవివేక
    మండ్రు విబుధ వర్యు లనవరతము.

    రిప్లయితొలగించండి