29, అక్టోబర్ 2020, గురువారం

సమస్య - 3529

 30-10-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా, 

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్”

(లేదా...)

“గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్”

79 కామెంట్‌లు:



  1. స్వల్ప అడ్జస్ట్ మాడి :)


    హద్దరి బన్నా మా హరి
    కిద్దఱు సతులయ! రఘుపతికి మహేశునకున్
    కొద్దిగ తొడుసతడి విలును
    సద్దుమణగు చేసి భూమిజను మనువాడెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  2. అంతలోపలే సమస్య మారిపోయిందే :)



    అమృతాంజనం :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్నించాలి. పోస్ట్ చేసిన తర్వాత గణదోషాన్ని గుర్తించి సమస్యను మార్చాను.

      తొలగించండి

  3. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    గుండ్రమ్మాయెను గుండునాది యనుచున్ క్రుద్ధుండునై యెన్నికన్
    మండ్రాటమ్మును నోర్వలేక కసిగా మర్యాదనున్ వీడుచున్
    తండ్రిన్ మించిన స్ఫూర్తినిన్ గొనుచహో ధారాళమౌ తీరునన్
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్...

    రిప్లయితొలగించండి
  4. తండ్రికిఁదగ్గతనయునిగ
    గాండ్రించుచునుత్తరుండుగాండీవిఁగనెన్
    పుండ్రకమువలెనుమెఱయుచు
    గాండ్రించెనుకుక్కపిల్లగాడిదవోలెన్
    పుండ్రకము-గురువింద

    రిప్లయితొలగించండి
  5. ఓండ్ర నిడు గాడిద మహిని,

    గాండ్రించును వ్యాఘ్ర మెపుడు,కాశ్యపి పైనన్

    గండ్ర పలుకులేల, నెచట

    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    గాండ్రించుట పులికేతగు
    నోండ్రించుటగాడిదకగు నొకరొకలాగున్
    వేండ్రపడ బోయినంతట
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  7. ఓండ్రించునట్టిదేలన
    గాండ్రించునటేలనోయి గాడిదయిటులా!
    ఎండ్రినుదాగినదేమో
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్!!

    రిప్లయితొలగించండి
  8. తండ్రియె తెప్పించె తనదు
    పండ్రెండేఁడుల సుతునకు పరితోషముతో
    నాండ్రైడు ఫోను, నందున
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్.

    రిప్లయితొలగించండి

  9. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పుండ్రమ్మున్ సరిదిద్దుచున్ ముఖమునన్ పోట్లాటకై పోవుచున్
    పండ్రెండున్ సరి చేరగా గడియెలే పంజాబు పట్నమ్మునన్
    తీండ్రించంగను భానుడే గగనమున్ దిక్కున్ వడిన్ తోచకే
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్...

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గుండ్రమ్మున్ గల బుడ్డిలోని మధువున్ గ్రోలేటి మూర్ఖుండటన్
    తీండ్రమ్మైన ప్రభావమున్ గలిగి నుత్తేజమ్ముతో నూగుచున్
    తండ్రిన్ జూచి భయమ్ముతో వణకుచున్ తబ్బిబ్బుతో తాననెన్
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్.

    రిప్లయితొలగించండి
  11. కె.వి.యస్. లక్ష్మి:

    గోండ్రుమనెను గాడిదలే
    ఓండ్రం బెట్టెను ఘనముగ నొంటెలె నపుడున్
    గండ్రాయిని సర్కసులో
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిదవోలెన్.
    (గండ్రాయి= కృష్ణాజిల్లాలో ఒక గ్రామం)

    రిప్లయితొలగించండి


  12. తండ్రీ! వనమున వ్యాఘ్రము
    గాండ్రించెను! కుక్కపిల్ల గాడిద వోలెన్
    గుండ్రము గా తిరిగె తలని
    వేండ్రము తగులంగ చాల వేగము గానన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అపుడా తండ్రి వేగిరముగా నొచ్చి అచ్చోట వ్యాఘ్రము లేదని గ్రహించి బడితే పూజ చేసి ఉపక్రమించే. మరల నిజముగా వచ్చేనని హాహాకారము గావింప.. మిథ్యయే ఇదని భావించి తండ్రి పెడచెవిన బెట్టి సివరాఖరున ఘొల్లు మనుచు కన్నీట మునిగేన్ రక్తపు టేరు గమనించి.. అంతే కదా బిజిలే అమ్మణ్.. వణక్కం.. సిహి కనసుగళు బిజిలే అవారె.. తుంబ

      తొలగించండి
  13. కం:

    ఓండ్రించుట గార్దభమై
    గాండ్రించుట పులి సహజము గతిపడు నెపుడున్
    తండ్రీ !! సంకర మగుటన
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. గుండ్రంబైనది సాగి దీర్ఘమగునే?గోళంబుగా నిల్వదే!
    గుండ్రాతిన్ జడమంచు పల్కరె బుధుల్ కూడంగ యోగార్థులై
    పుండ్రంబుల్ నుదుటన్ ధరింపగనె తా పుణ్యాత్ముడెట్లౌనొకో!
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వంబుతో బిట్టుగన్?

    రిప్లయితొలగించండి
  15. గాండ్రించును పులి మాదిరి
    నోండ్రించును గాడిదవలె నో కళతోడన్
    గుండ్రంబుగ శబ్దమిడుచు
    గాండ్రించెను,కుక్కపిల్ల,గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  16. శార్దూలవిక్రీడితము
    గాండ్రించన్ దగు వ్యాఘ్రమన్నదెపుడున్ కల్లోలుడున్ పారగా
    నోండ్రించన్ దగు గార్ధభమ్ముఁ గొడితే యొళ్ళంతహూనమ్మునై
    తీండ్రమ్మున్ వినిపింపఁ బోయి పులిలా తిక్కెక్కువై దొంగపై
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్
    గుండ్రాయిన్ యజమానియే విసరగన్ గోల్పోయెఁ దాఁ బ్రాణమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొడితే, ఒళ్ళంత, పులిలా' అన్నవి వ్యావహారికాలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

      శార్దూలవిక్రీడితము
      గాండ్రించన్ దగు వ్యాఘ్రమన్నదెపుడున్ కల్లోలుడున్ పారగా
      నోండ్రించన్ దగు గార్ధభమ్ము జవురన్ హూనమ్మునై యొంటిపై
      తీండ్రమ్మున్ వినిపింప బెబ్బులివలెన్ దిక్కెక్కువై దొంగపై
      గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్
      గుండ్రాయిన్ యజమానియే విసరగన్ గోల్పోయెఁ దాఁ బ్రాణమున్


      తొలగించండి
  17. పాపం కుక్క పిల్ల కదండి.. దానికి భౌభౌ మని అరవాలని ఎవరు చెప్పి ఉండక పోవచ్చు.. ఢ్యాంకుక్ ఢ్యాంక్ శబ్దం విని అదే ఉచ్చరించ దలచిందేమో మరి.

    శునకంబది తెలియరాలే దానికి గార్దభమో లేకను గ్రామసింహము నని.. తెలిసి వచ్చినాకనే భౌభౌ మనుచు దిరిగేన్ పిక్క బట్టి కొరికేన్.. అంత దాకనే గార్దభం వలె ఇలు హైండ్ కాళ్ళతో దన్నుచు నుండేన్.. గర్వంబు లేదేమీ.. ఈ డ్రిల్లు బిట్టు యాడనుండి వచ్చే.. హతవిధీ.. వీధి నిండ కుక్కల బెడదా.. ఒక్క గాడిద కూడా వాటిని తరిమికొట్టరే.. పిక్కలు బట్టితే యాంటి రబీస్ వ్యాక్సీన్ వేయించుకోవాలి.. గాడిద తన్నితేనో.. పక్కటెముకలన్ని పెక్కుటిల్లి ఓటిలో సర్జన్ కై వేచి చూడాలి.. !

    రిప్లయితొలగించండి
  18. తీండ్రించిన క్షుత్తున పులి,
    పుండ్రములను మూడుగల్గి భూషించెనుగా,
    మండ్రాడకు మోయబరువు,
    గాండ్రించెను, కుక్కపిల్ల, గాడిదవోలెన్

    మండ్రాడు = దుఃఖించు

    తండ్రిన్వోలె ప్రియంబు పెంచగనటన్
    ధన్యాత్ముడా మౌనియే
    తీండ్రంబైన విరోధమున్ మరచుచున్
    తిర్యక్కులే స్నేహమున్
    మండ్రాటమ్మును బొందకే మసలగా మన్నించుచున్ మందనున్
    గాండ్రించెన్ శునకంబు గాడిదవలెన్
    గర్వమ్ముతో బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  19. ఓండ్రించె కేశి వేపిగ
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్
    ఎండ్రి కరివలె చనెననుచు
    దండ్రికి జెప్పగ సుతునికి దండన దొరికెన్

    రిప్లయితొలగించండి
  20. తండ్రీ ! నేనిదె గాంచితిన్ మిగుల వింతౌ శ్వానమున్ నవ్యతన్
    ఓండ్రక్ష్మాంచితమున్ సతంత్రియుతమున్ ఉద్యత్కళాఖండమున్
    వేడ్రంబున్ హితులందరున్ బొగడ సంప్రీతుండనై చూడగన్
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్

    వేండ్రము = ఉత్సుకత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యుతమున్+ఉద్యత్=యుతము నుద్యత్' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా?

      తొలగించండి
  21. ఈండ్రము సేయగ చెడు కల
    తండ్రికి వివరించె సుతుడు తత్తఱపడుచున్
    ఓండ్రించెను పెద్ద పులియు
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  22. సమస్య :
    గాండ్రించెన్ శునకంబు గాడిదవలెన్
    గర్వమ్ముతో బిట్టుగన్

    (వీరబ్రహ్మయోగీంద్రుని కాలజ్ఞానగ్రంథం)

    గుండ్రంబైన గుహాంతరంబున మహా
    గూఢంబు దివ్యంబునై
    దీండ్రింపంగల జ్ఞానసంచయము స
    ద్దీక్షన్ గనెన్ బ్రహ్మమే
    " గండ్రాయిం గల కప్పపల్కులవె ! యా
    గంటిన్ వృషాధ్వానమే !
    గాండ్రించెన్ శునకంబు గాడిదవలెన్
    గర్వమ్ముతో బిట్టుగన్ . "
    ( గండ్రంబు- వర్తులాకారపు;తీండ్రించు- ప్రకాశించు; బ్రహ్మము- వీరబ్రహ్మయోగి ;
    గండ్రాయి- బండరాయి; యాగంటిన్- శివక్షేత్రమైన యాగంటిలో ; వృషాధ్వానము -నంది అరపు )

    రిప్లయితొలగించండి
  23. తండ్రీ! మము దయ గనుమా
    ఉండ్రాలను నారగించి నుత్తరమిమ్మా
    గండ్రవు! చెపుమానెందుకు
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్ ?

    రిప్లయితొలగించండి
  24. తండ్రీ వింతగ వింటిని
    గాండ్రించేను కుక్క పిల్ల గాడిద వోలెన్
    తీ o డ్ర ముగా నియ్య ది యే
    వేండ్రము పుట్టించె మందికి వేయి విధాల న్

    రిప్లయితొలగించండి


  25. బండ్రాళ్లావిడ గుండె మీద నిడి హాంఫట్టంచు కొట్టంగనా
    తండ్రా మాంత్రికు డప్పు డా పడతియే తట్టంచు లేవంగనే
    నోండ్రన్ బెట్టెను చీలిగాడు భళిరా యొప్పారు క్రోధమ్ముతో
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. ✍️ Malli Siripuram
    కం//
    మండ్రాటముతో వ్యాఘ్రము
    గాండ్రించెను, కుక్కపిల్ల గాడిద వోలెన్ !
    ఓండ్రను బెట్టక, మొరగగ
    గుండ్రాయిని విసరివేసి కుంకను దరిమెన్ !!

    రిప్లయితొలగించండి
  27. ✍️ Malli Siripuram
    కం//
    మండ్రాటముతో వ్యాఘ్రము
    గాండ్రించెను, కుక్కపిల్ల గాడిద వోలెన్ !
    ఓండ్రను బెట్టక, మొరగగ
    గుండ్రాయిని విసరివేసి కుంకను దరిమెన్ !!

    రిప్లయితొలగించండి
  28. ఓండ్రించుట గాడిదకగు
    గాండ్రించుట పులికగు మరి కాలమహిమయా?
    తండ్రీ! యేమిది చిత్రము
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  29. తండ్రీ చూడుము వింతలు
    తీండ్రించుచువెలుగుచుండె తిమిరంబదిగో
    నోండ్రించుచుండెకర్వము
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  30. మైలవరపు వారి పూరణ

    ఒక అవధానిని ఇబ్బంది పెట్టేలా సమస్యనిస్తే తాను సభలో గుర్తింపు పొందవచ్చుననే దురూహ గల ప్రాశ్నికుడు.. 👇

    సమస్యాకర్త్రే నమః

    ఉండ్రమ్మో యన మార్దవమ్మె యగుచో నూదున్ గదా పూరణన్.,
    గుండ్రాతిన్ వలె గట్టిదై., కొరుక సంకోచమ్ము గల్గించుచో
    తీండ్రింతున్ సభ నేనటంచు తెలివిన్ దెల్లార్చి యొక్కండనెన్
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  31. గుండ్రాయి వలెనొక ఖరము
    నోండ్రను పెట్టక మగతగ నూర్పులు విడువన్
    కాండ్రించ నొక్కడచ్చట
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్

    రిప్లయితొలగించండి
  32. తండ్రీ! చేయు మిమిక్రి కుక్క వినుమా! ధైర్యమ్ముతో వ్యాఘ్రమై
    *గాండ్రించెన్ శునకంబు, గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగ*
    న్నోండ్రల్ వెట్టెను, పాటపాడె పికమై యొప్పారె నో చిల్కయై
    కాండ్రించెన్ గద మానవాకృతిని తా కవ్వించి నవ్వించుచున్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి

  33. పిన్నక నాగేశ్వరరావు.

    కాండ్రించును పెద్ద పులులు
    నోండ్రించును ఖరములన్ని యుత్పాత
    ములన్
    తండ్రీ! మరి యే విధముగ
    గాండ్రించును కుక్కపిల్ల గాడిద వోలెన్?

    రిప్లయితొలగించండి
  34. పౌండ్రకుడను నేనేగా
    గాండ్రింతును వాసుదేవు ఘనమగు రీతిన్
    వేండ్రము తీర్చెద ననుచును
    గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్.
    వేండ్రము = తాపము

    రిప్లయితొలగించండి
  35. తీండ్రించెన్ గగనాంతరాళముననా తిగ్మాంశు డుత్సాహియై
    యోండ్రల్వెట్టెను గార్ధబంబపుడుతానోర్వంగ లేకుష్ణమున్
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్
    తండ్రీభాస్కరయాతపంబునికనేతాళంగజాలన్ ప్రభో!

    రిప్లయితొలగించండి
  36. విండ్రు కడు వింతగ జనులు
    తీండ్రపుఁ గూతనె యెఱుగు నిదియె సత్యము కా
    దండ్రు నలుగు రీ మాటను
    గాండ్రించెను గుక్కపిల్ల గాడిద వోలెన్


    వాండ్రున్వీండ్రును జూచుచుండఁ దమి నా శ్వానంపు టచ్చేష్టలం
    బండ్రెండేండ్లది యాలకించి కినుకం బంతమ్ము సంధిల్లగా
    నోండ్రించంగఁ జెలంగి, గర్దభ సమూహోద్ఘోష మచ్చోటునన్
    గాండ్రించెన్, శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్

    [గాండ్రించు = ఉబ్బు]

    రిప్లయితొలగించండి
  37. కొండ్రాజపురమువోవుచు
    నోండ్రింపునువింటినేనునుపవనమందున్
    దండ్రీయేమీవింతలు
    గాండ్రించెనుకుక్కపిల్లగాడిదవోలెన్

    రిప్లయితొలగించండి
  38. తండ్రిన్ జేరుచు బిడ్డడొక్కడు మహోత్సాహంబుతో గోరెనం
    చాండ్రైడ్ ఫోనును ప్రీతిగా నొసగగా నాబాలుడే దానిలో
    యెండ్రిన్ మీటగ గాలిలో నెగిరెనే యేనుంగు గర్జించెనే
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  39. గాండ్రించెన్ శునకంబుగాడిదవలెన్ గర్వమ్ముతోబిట్టుగన్
    తండ్రీయేమిది?వింతలిట్టులునొగిన్ దాగల్గెజిత్రంబుగా
    గాండ్రింపుల్ దగునొక్కగాడిదకునేగాదాభువింజూడగన్
    మండ్రాటంబులుగల్గుచున్నవిగదేమర్మంబులాలించగన్

    రిప్లయితొలగించండి
  40. గండ్రించెద నీ పలుకులు!
    "గాండ్రించెను కుక్క పిల్ల గాడిద వోలెన్
    దండ్రీ" యన తప్పు కదా!
    'ఓండ్రించు ఖరములు, మొఱుగు నుర్విని కుక్కల్!'
    (గండ్రించు = ఖండించు)

    రిప్లయితొలగించండి
  41. మాయాబజార్ చిత్రనేపథ్యం....

    శార్దూలవిక్రీడితము
    గుండ్రమ్మౌ శశిపూర్ణబింబమనఁగన్ గొంగ్రొత్త వర్ణంబులన్
    పుండ్రమ్మున్ శశిరేఖమోముపయినన్ ముద్దార వీక్షింపగన్
    మండ్రాడంగనులక్ష్మణుం, డసురుఁడామాయా విశేషంబునన్
    గాండ్రించెన్ శునకంబు, గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  42. తీండ్రంబైనకరోనకాలమునవాంతిన్జేయనావీటినిన్
    గుండ్రాయంతటిగుండెమండియతనిన్గ్రోధంబునన్దూరనో
    తండ్రీతింటినిహోటలందుపమనింతన్గాలిగాడందువే
    యోండ్రన్బెట్టకుగ్రామసింహమువలెన్యున్మాదివీవన్ననే
    *“గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్”*

    రిప్లయితొలగించండి