1, నవంబర్ 2020, ఆదివారం

సమస్య - 3532

 2-11-2020 (సోమవారం)

కవిమిత్రులారా, 

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... 

మట్టిఁ బోసె మరఁది మామ మురిసె”

(లేదా) 

మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

(ఈ సమస్యను పంపిన రామ్ డొక్కా గారికి ధన్యవాదాలు)

61 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కట్టిన త్రాడు తెంపుచును కావర మెచ్చగ హైద్రబాదునన్
  తిట్టుచు తన్నుచున్ తనరి దెప్పుచు పుట్టిన యింటివారినిన్
  గుట్టుగ నుండకుండ వడి కోడలు చేసిన పాయసమ్మునున్
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్...

  రిప్లయితొలగించండి
 2. ఆటవెలది

  అక్కబావలెంచ యపురూపభవనమ్ము
  యప్పునాదులందు నర్చన నిడి
  బాగుకోరువాడు బావమరిది యనన్
  మట్టిఁ బోసె మరిది మామ మురిసె

  ఉత్పలమాల
  పట్టణమందు బావ కడు వాసిగ మేడనుఁ గట్టనెంచుచున్
  బెట్ట ముహూర్తమున్ మరిది వేడుక బాగును కోరువాడనన్
  తట్టలతోడ కానుకల దండిగ దెచ్చి పునాది పూజకున్
  మట్టినిఁ బోసె నా మరిది మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "అక్కబావ లెంచ నపురూప భవనమ్ము నప్పునాదులందు..." అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   ఆటవెలది
   అక్కబావలెంచ నపురూపభవనమ్ము
   నప్పునాదులందు నర్చన నిడి
   బాగుకోరువాడు బావమరిది యనన్
   మట్టిఁ బోసె మరిది మామ మురిసె

   తొలగించండి

 3. కందాటవెలది


  సుదతి విను! మట్టిఁ బోసె మ
  రఁది, మామ మురిసెను, నారు రయ్యన పోసెన్
  కుదురుగ రమణి జిలేబి ! ప
  ది దినముల సమయములోన దిగె పంటయె పో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. మట్టి కట్టగాని మరొకదారియు లేక
  నత్తవారికడకునరుగుదెంచ
  దారివెంట బురద తగని పయనమయ్యె
  మట్టిఁ బోసె మరది మామ మురిసె!

  రిప్లయితొలగించండి
 5. ఆటవెలది
  అత్తగారియింట అల్లెమునుమరగి
  తిష్ఠవేసెఘనుడు తిండికొరకు
  భార్యమాటలువిని పట్టగ హలమును
  మట్టిఁ బోసె మరఁది మామ మురిసె

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గుట్టుగ నుండకే తనరి కోడి పలావును కుమ్మి బీరుతో
  గట్టిగ నేడ్వగన్ కుమిలి గాభర నొందుచు బొజ్జనొప్పితో
  పట్టుకురాగ ప్రీతిగొని వల్లభ వెచ్చని యాముదమ్మునున్
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్...

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  లోతు పూడ్చ నెంచి గోతినందంతయు
  మట్టి పోసె మరిది మామ మురిసె
  చక్క బఱచి నట్టి స్థలమును గాంచుచు
  యిచ్చె పుత్రునికట మెచ్చులెన్నొ.

  రిప్లయితొలగించండి
 8. గులకరముల నాట గునపమొకటి తెచ్చి
  పంట భూమి లోన పడువ తీసి
  యంకురముల బెట్టి యలుపన్నదే లేక
  మట్టిఁ బోసె మరఁది, మామ మురిసె

  రిప్లయితొలగించండి
 9. పట్టణమున గట్ట గట్టి యిల్లొకటి తా
  పట్టుబట్టి చేత పారబట్టి
  పుట్టు గుంటత్రవ్వ పూజించి వాస్తును
  మట్టిబోసె మరది మామ మురిసె

  కట్టిన తాళిమర్చి వెనకాడక దూరపు
  దేశమేగగా
  గట్టిగ నాల్గురూకలను కండ్లనుజూడ,
  కరోన రోగమే
  జుట్టగ దిర్గివచ్చి తన సొంత పురంబు నుపాధిపన్లలో
  మట్టిని బోసె నామరది మామయు నత్తయు గాంచి మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 10. కె.వి.యస్. లక్ష్మి:

  చెట్టు బెట్టి బోదె చేయుచుండగ చెల్లి
  మట్టి బోసె మరిది మామ మురిసె
  అలుపు సొలుపు లేక ఆలుమగలుగూడి
  అంద మైన తోట నమర జేయ.

  రిప్లయితొలగించండి
 11. పట్టణ మందునుండి తన పల్లెకు జేరిన బాలుడాతడే
  గట్టున మొక్కనాటగ నఖానము తో దొన త్రవ్వి యందునన్
  మొట్టికి బెట్టి గర్తమును మూయగ నెంచుచు శీఘ్రమే యటన్
  మట్టినిఁ బోసె నా మరఁది, మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 12. అత్త యింటి కొచ్చె నల్లుడు , బండుగ
  సమయమంత నడప సంబరముగ ,
  నిరవుముందు నున్న వృక్షములకెరువు
  మట్టిఁ బోసె , మరఁది మామ మురిసె

  రిప్లయితొలగించండి
 13. దట్టపు మబ్బు పట్టెనిక ధారగ వర్షము జాలువారగా
  గుట్టల నుండి వెల్లువగ గ్రుమ్మరుచున్ పరవళ్ళు ద్రొక్కుచున్
  గట్టును దాటి పర్వులిడు కాలువ నీటికి నడ్డు గట్టగా
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 14. సమస్య :
  మట్టిని బోసె నా మరది
  మామయు నత్తయు గాంచి మెచ్చగన్

  ( కీర్తి - మూర్తి ప్రకృతివైద్యులు. మట్టిపట్టీల
  వాడకంలో మరది చేసే సాయాన్ని మెచ్చు
  కొంటున్న కీర్తి. సంతసిస్తున్నఅత్తమామలు)

  పుట్టిన పల్లెలో జనుల
  పూర్ణపు వ్యాధివిముక్తి కోసమై
  దిట్టపు వైద్యశాల కరు
  దెంచిన రోగుల సేవజేయగా
  బట్టుగ నోషధుల్ గలిపి
  పట్టుల వేయగ నుత్సహించుచున్
  మట్టిని బోసె నా మరది ;
  మామయు నత్తయు గాంచి మెచ్చగన్ .

  రిప్లయితొలగించండి
 15. పెరటి తోట యందు వివిధ మొక్కల దెఛ్చి
  పెంచ నెంచె బావ ప్రీతి తోడ
  సాయ పడగ బూని సహకార మందించ
  మట్టి బోసె మరది మామ మురిసె

  రిప్లయితొలగించండి


 16. కందోత్పల


  మయి తనివారంగనరె దొ
  రయు మట్టినిఁ బోసె నా మరఁది మామయు న
  త్తయుఁ గాంచి మెచ్చఁగన్ భా
  ర్యయె నారును నాటె పంట రయ్యన వచ్చెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. పెట్టిరి పెళ్లి మూరుతము పిన్నలు పెద్దలు నెంద రెందరో
  చుట్టము చుట్టు ప్రక్కలను చూచెడు గూర్చొను వార లేపనిన్
  బట్టరు పుట్ట మన్ను గొని వత్త మటన్నను లేవ రంతలో
  తట్టలు తెచ్చి పెట్టిన ముదంబున నూత్న వరుండు పాఱతో
  *మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్*

  రిప్లయితొలగించండి
 18. పట్టిన కారుమబ్బులవి వర్షము నియ్యగ కుండపోతగా
  గట్టులు త్రెంపి నీరములు గ్రామము నంతయు ముంచబోవగా
  కట్టడిచేయగా చెరువు కట్టల, పల్లియ కట్టుబాటుతో
  మట్టిని బోసె నామరది మామయు నత్తయు గాంచి మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 19. చెట్లు భావి మనికి మెట్లంచు దలపోసె
  మెట్టినింట నడుగు వెట్టినపుడు
  తట్ట పార పలుగు తన మగడందించ
  మట్టిఁ బోసె మరఁది మామ మురిసె

  రిప్లయితొలగించండి
 20. మైలవరపు వారి పూరణ

  చండీహోమము🙏

  పట్టుగ చండికాంబికకు భక్తిని హోమము జేయనెంచగా
  గట్టిరి మండపమ్ము., నొక గంపెడు పుల్లలు దెచ్చెనన్నయున్
  బుట్టెడు పూల తమ్ముడును., పుట్టల దగ్గర దెచ్చి తట్టెడౌ
  మట్టినిఁ బోసె నా మరిది., మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 21. పుట్టిన బిడ్డలందు చిన పుత్రునియందలి పేర్మిఁ జూపుచున్
  గుట్టుగ నాస్తి పాస్తులనుఁ గుట్రలఁ బన్నుచుఁ చిన్నవానికై
  దిట్టగ నప్పగించన, దేల? యనం గడు కోపయుక్తుడై
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి


 22. చట్టున లేచి బ్రాహ్మమున జాప్యము చేయక లోకరీతిగా
  తట్టను చేతబట్టుకొని తమ్ముని తోడుగ భూమిపూజయున్
  జట్టుగ చక్కబెట్టుకొని సంతసమొందుచు నిల్లుకట్టగా
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. ఉ.
  శెట్టియు వానిమామయు విశిష్టములైన సుస్వర్ణకారులై
  పెట్టెను కొట్టు జట్టుగను పెంపొనరింపగ లోకులందరిన్
  కట్టక రాచపన్నులను కల్కముగా సిరి యుంచినట్టి యా
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 24. ఆటపాటలవలెనన్నిపనులుజేయు
  తలనునాలుకవలె తనరుచుండు
  చేనులోనభర్త చెట్లునాటుచునుండ
  మట్టిఁ బోసె మరఁది మామ మురిసె

  రిప్లయితొలగించండి
 25. మైదుకూరు ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన నేపథ్యంలో...

  ఉత్పలమాల
  పట్టణమందు మూయ బడి వైళమె దుష్ట కరోన ధాటితో
  నెట్టి యుపాధి నేరక జ్వలించెడు నాకలి భిక్షనెంచకే
  దిట్టయు నైన పండితుడు దీరి పునాదుల బేలుదారుగన్
  మట్టినిఁ బోసె నా మరిది మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్

  (Youtube videos లో కూడా చూపించారు)  రిప్లయితొలగించండి
 26. మొదటి సారిగా మెట్ట భూమిని మాగాణి గా మార్చాలంటే పొలం మధ్యలో కట్టలు పోయు సందర్బంగా నా పూరణ:

  ఉ:

  కట్టలు బోయనెంచి నది కాలువ బారగ మెట్ట భూమినున్
  తట్టలు పారలున్ వలయు తంత్రము నెల్లయు చక్కబెట్టగన్
  నట్టును జేరి ముందరగ నాకర మూనుట భాగ్యమంచు తా
  మట్టిని బోసె నా మరది మామయు నత్తయు గాంచి మెచ్చగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 27. వానపడుటవలనబాడిబాడిగమారి
  రొచ్చురొచ్చునగుచుగచ్చయయ్యి
  యింటిముందుగుంతకంటికగుబడగ
  మట్టిబోసెమరదిమామమురిసె

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. పుట్టిన దివసమ్ము తొట్టి కట్టె కొఱకు
   గట్టి దెబ్బలు దిని ముట్ట దివము
   మట్టిలోనఁ బుట్టి మట్టిలోఁ గలయంగ
   మట్టిఁ బోసె మఱఁది మామ మురిసె


   బెట్టిద మైన పట్టుఁ దగఁ బెట్టుచు గట్టునఁ బట్టి యెట్టులో
   గుట్టుగఁ బోయి రట్టు సెడఁ గొట్టున కింపుగఁ దెచ్చి తట్టనున్
   దట్టము గాఁగ నాఱు నొక తట్టను జెప్పఁగఁ జెప్ప దొడ్డిలో
   మట్టినిఁ బోసె నా మఱఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

   తొలగించండి
 29. మట్టినినమ్మిజీవన మమైక్యముమృత్తికతోడ సల్పియే
  రట్టొనరింపనట్టియనురాగపుకోవెలమాగృహంబు మా
  చిట్టిమఱందిపెండ్లికని చెచ్చెర పందిరివేయ బూన తా
  మట్టినిఁ బోసె నా మరఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 30. చెట్టును బెంచగా నదియె చేతన మంది జనాళి కీ ధరన్
  బట్టుచు ప్రాణవాయువు నపార విభూతులొ సంగు నంచు నే
  పెట్టితి మొక్కలన్, పతియు బ్రీతిగ నీరిడె; పేడ కూడినన్
  మట్టిని బోసె నా మరది, మామయు నత్తయుఁ గాంచి మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 31. పుట్టనుద్రవ్వగానగముబుస్సలుగొట్టుచుబారిపోవగా
  మట్టినిబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్
  గట్టడిజేయగావలెనుగాంతలుబిల్లలుబెద్దవారలన్
  బుట్టలయొద్దకున్ నెపుడుబోవకజేయుడునెట్టివేళలన్

  రిప్లయితొలగించండి
 32. బిడ్డవద్దునాకుపిల్లలుబరువంచు
  నవతఁజూపమురిసెనారియోకతె
  ఖర్మకాలితుదకుఖననమ్ముఁజేయంగ
  మట్టిబోసెమరదిమామమురిసె

  రిప్లయితొలగించండి
 33. చెట్టునుపాదుకోల్పుటకుచేర్చినకుండిలయందునిండుగా
  మట్టినిసేకరించికోనిమామనుపిల్చుచుసాయమందగా
  ఇట్టులకూడదంచుతననింపుగపిల్వగవచ్చిచేరుచున్
  మట్టినిఁబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్

  రిప్లయితొలగించండి