కవిమిత్రులారా,
“కుంటి, మెల్ల, మూగ, గూని”
పై పదాలను ప్రయోగిస్తూ
స్త్రీ సౌందర్యాన్ని వర్ణించండి.
సరదాగా... 😀😀😉మ||పడకుంటిన్ వనితామణింగనుచు సంపన్నాంగనన్ దారియన్సడలన్ మెల్లన నా దృఢత్వము వరించన్ కోమలాకారి ముమ్ముడులన్ కేతనమూగ బంధమునకున్ పుష్పాంగనన్ నే గనన్పడతిన్ బొందదగూని నే గనెద, నా భార్యొప్పినన్ హా విధీ!ఆదిపూడి రోహిత్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'దారియన్'? "దారిలో" అంటే సరిపోతుంది కదా? 'కోమలాకార' అనడం సాధువు అనుకుంటాను. 'పొందదగూని'?
తేటగీతిపొగడ లేకుంటి నగుమోము, సోగ కనులనందమెల్ల సంపెగఁబోల నందె ముక్కుతెరలి ముద్దాడ మూగ ముంగురులు నుదుటకొమ్మ! గుండెలన్ గోల నీ గూని వగలు(గూనుగూను : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టికదే. వి. నడుము మీఁది వంపు.) మేను.... మేనిగూను.... గూని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :దత్తపది : కుంటి - మెల్ల - మూగ - గూని అనే పదాలు అన్యార్థంలో వాడుతూ స్త్రీసౌందర్య వర్ణన .( అనుకున్న అమ్మాయి సంధ్యాసుందరిలా సమీపిస్తే ..)మెల్లని మందహాసమది మేలుగ విచ్చెను ముద్దుమోవిపై ;చల్లని సంజవెల్గులను చక్కగ నామది నేలుకుంటివే !మొల్ల సుగంధముల్ జడను మూగగ ముగ్ధమనోహరీ ! సఖీ !యుల్లము సందడించె మెరు గూనిన మేనిని గాంచినంతనే .
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కామినివయ్యారికాంతగకుంటియేచూపునేసోబగునుచూడ్కికెపుడుక్రీఁగంటఁజూచునుక్రీడగామెల్లగాప్రీతినికలచునుప్రేమతోడముంగిటతలపునుమూయగామూగగాపలుకులచిలుకయైపడతియుండుసిగ్గులమోలకయైసింగారిగూనిగాతలవంచువినయంపుతరుణియనగతేమధురమధురమ్ముమగువకుమనసునెపుడుపరగపార్వతిదేవికిబంటుగాగభరతభూమినిశాంతికిబాటవేయునిత్యశ్రామికురాలుగనెగడుసౌమ్య
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సొబగునుం, మొలకయై' టైపాట్లు.
ధన్యవాదములండి
మగువ! నీ మోమునన్ మూగ మధుపకోటి చెలియ! నీ దేహమెల్లను చెంగలించ సుదతి! నీగూని మనమును జొక్కజేయనిలువలేకుంటి నీమైత్రి నెరపనిమ్ము
గూని = నడుము వంపు
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
కనుల తో జుర్రు కుంటి నీ కనుల సొబగు అంద మెల్లను నాకిచ్చె హాయి మిగుల మూగ నైపోతి పులకించి ముద్దు గుమ్మ కల వరించెను గూనియు కామిత ముగ
అనుకుంటి శశిబింబ మంటియా వదనమ్ము . మెచ్చిన కవికుల మెల్ల పొగడి రామె యందాలనే యద్భుతమంచును . పొందపఱచిరైరి పుష్కలముగ రాయంచ నడకల రమణి నడకలందు . నడుమూగగా వేణి నాట్యమాడు మేలిమి బంగరు మెరుగూనిన శరీర . కాంతిగాంచినచాలు కనులు చెదురు ................... ఆ.వె. గుబ్బలను దాచ లేనట్టి కొంగు తాను మాటి కదియె జారి మరులు గొలుపు చిక్కిపోయినట్టి చిన్ని నడుము పైని ముడత లంద మిచ్చు ముదితలకును.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తగటి జెరగూనినట్టి జీర దాల్చి , మగువమెల్లగ గజ గమనమున మెలయు చుండకంఠమున ముత్తెపు సరమూగ , నది గాంచినెరిని కొనియాడ లేకుంటి నిక్కముగనుతగటి = జరీ , చెరగు = అంచుఊను = కలిగియుండుగమనము = కదలుడు ,ఊగు = కదలునెరి = అందము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
🙏🏽
ఆ.వె.కుంటిసాకులేలనొంటిమెరపుజూడుఅందమెల్లదానిచందమైనమూగవౌదువేల ముచ్చటలాడగచక్కగున్నపిల్లపక్కజేరిఆ.వె.నాట్యరీతినేర్వ నాజూకునడుమూగఅందమెల్లదానియబ్బసొత్తుఓర్వకుంటినయ్య గర్వము దానిదౌగుబ్బచనులభామ గూనుజూసి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఇవ్వాళ కంది వారు సెలవా :) జీపీయెస్ వారి దీదీ దుకాణం బంద్ :) పెనిమిటి మాటగానడుమూగ నాట్యపు నడక!పడిలేచెడు మెల్ల మెల్ల పైటని వడ్డూపొడుగూ నిగుడారంగ చవి డిగనురుక నేలుకుంటి బింబోష్ఠినిదే!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వడ్డూ పొడుగూ' అనడం సాధువు కాదు. 'చవి డిగనురుక'?
జీపీయెస్ వారి తరపున :)కనుమూగనీయదే! దీదిని పొగడను మేలుకుంటి! దిమ్మతిరిగె వారిని మెల మెల్లగ దత్తపదిని చేవెలుగూని చేర్చ తీరుగ సభలోన్!జిలేబి
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
🙏😊
కుచముల బెట్టు జారునను కుంటి మిషన్సుతు దవ్వు పెట్టకన్పచనముజేసి మెల్లగను పాలను తాపగ తల్లి మూగగాను చలిత మానసమ్మునొడినుండిన బిడ్డకు గూని తల్లి ప్రేమ చిలకరించు వేళలను మానస పొంగున కంటినందమున్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నేను గతమున వినకుంటి నిన్ను గూర్చితరుణి! జగమెల్ల వెతికిన దొరకున నినుమించు పూబోడి, నడుమూగ నంచితముగనీలి కురులవి సొబగూని నృత్య మాడవీపుపై, కని నామది ప్రీతి నొందె
దత్తపదాల ప్రయోగము అన్యార్ధమని ఇవ్వలేదు కనుక స్వార్ధంలో 🙏🙏🙏కోమలి తలపులను లేదు కుంటితనముముగ్ధ మోమున లేదుగ మూగతనముకొమ్మ కార్యములను లేదు గూనితనముమగువ నీయందమెల్ల నీమంచితనమె
మరువకుంటినిన్ను మదిరాక్షి మదిలోనతాపమెల్లసోక తనువునందునలకలెగసి మూగ నందాల మోముపైన మెరుగూనినట్లు నగవుదోచె
తలపులనూరలేదుగద ,తన్వియిటీవల కుంటియూహలేమలుపులుద్రిప్పెలే మనసు, మూగగ మారిన యప్సరేయనన్సులువుగవిప్పలేముగద,సుక్కలక్రిందన గూనియున్నచోపలువురుకీర్తిసేసితిరి,ప్రాభవమందగ జేయ మెల్లగా+++++++++++++++++++రావెల పురుషోత్తమరావు
మెల్ల మెల్లగా నడిచెడి మెరుపు తీగ!కుంటిసాకులు చెప్పకే కోమలాంగి! మూగ నోమెందుకేనీకు! ముగ్ధ రాల!సోయకనుల నాగూ! నిలుచుండి పలుకు ప్రియురాలి ముద్దుపేరు :నాగు
కోమలియంచయానగనకుంటినిలోచనమెల్లనబ్జమేభామినిమూగకాదుశుకవాణిసుమధ్యయుగూనిలేదులేశ్యామశుభాంగిచంద్రముఖిసారసనేత్రయుమెచ్చులాడియేవామనితంబముల్ బలుకుపాటనవర్ష్మములెన్నశక్యమే
కంటిని వర్ణించఁగ లేకుంటిని బామెల్లఁ దొలఁగె నువిదను గనఁగా నొంటిని మన మూఁగఁ దొడఁగెఁ దుంటరి పరు గూని చెలఁగుఁ దోయలిఁ జేరన్
దత్తపదము మూఁగ కూడ బిందుమధ్యమే.
ఎంచుకుంటిని నీయందమెల్ల యిపుడెజుర్రుకొనగను ,నోభామ!చూడుమికనుచీరచెంగూని గుబ్బలుజారెనకటనీదునడుమూగ నటునిటు నిజముసుమ్ము
చం:నడకయె కుంటిగాని మరి నాట్యము చేయు మయూరి రీతినిన్కలవర మింతలేదు చన గన్పడ మెల్లన పోవుచుండగన్పలువురు మూగ మేను పలు వంకలు ద్రిప్పుచుచిందినందమున్తడబడ జేయు నెల్లరల తథ్యము గూనిగ వంగినిల్చొనన్వై. చంద్రశేఖర్
చేపకన్నుల చూపుజాలముఁ జిక్కుకుంటిని, మెల్లగాచూపు ద్రిప్పగ కానవచ్చెను సూచిదేలిన నాసికా,తోపు మోవిని శంఖ కంఠముఁ ద్రోసివచ్చు కుచంబులన్మోపుచూ సొబగూని యా నడుమూగ నిల్చితిఁ స్థాణువై౹౹
నిలువ(కుంటి)వి రాయంచ కులుకు దోడ(మెల్ల) మెల్లంగ నడయాడు మెరుపు దీవె(మూగ)గా వేచె నా మది మోహనాంగిదరికి జేరవె సి(గ్గూని) దాగ నేల
చంపకమాల:++++++++++++++నెలతలపైన నేరములనెన్నుట, వీలయె కుంటికోరికల్పలుకుల విశ్వసింపకను,ప్రాణముదీయును మూగ బాధలేవిలువలు వీధికెక్కుటకు. వింతగజేతురు గూనికృత్యముల్తలపుల కల్మషమ్ములకు, దారిని జూపును,మెల్ల మెల్లగా!
చిత్రమున గనినటు సిగ్గూని చనుచుండ మేలుకుంటి నిపుడె మీననేత్రి మూగమనసులోన ముసిరిన ట్టి మురిపెమెల్ల నెరిగి తినిట నింపు తోడ
సరదాగా... 😀😀😉
రిప్లయితొలగించండిమ||
పడకుంటిన్ వనితామణింగనుచు సంపన్నాంగనన్ దారియన్
సడలన్ మెల్లన నా దృఢత్వము వరించన్ కోమలాకారి ము
మ్ముడులన్ కేతనమూగ బంధమునకున్ పుష్పాంగనన్ నే గనన్
పడతిన్ బొందదగూని నే గనెద, నా భార్యొప్పినన్ హా విధీ!
ఆదిపూడి రోహిత్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దారియన్'? "దారిలో" అంటే సరిపోతుంది కదా? 'కోమలాకార' అనడం సాధువు అనుకుంటాను. 'పొందదగూని'?
తేటగీతి
రిప్లయితొలగించండిపొగడ లేకుంటి నగుమోము, సోగ కనుల
నందమెల్ల సంపెగఁబోల నందె ముక్కు
తెరలి ముద్దాడ మూగ ముంగురులు నుదుట
కొమ్మ! గుండెలన్ గోల నీ గూని వగలు
(గూను
గూను : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
దే. వి.
నడుము మీఁది వంపు.)
మేను.... మేని
గూను.... గూని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిదత్తపది :
కుంటి - మెల్ల - మూగ - గూని అనే పదాలు
అన్యార్థంలో వాడుతూ స్త్రీసౌందర్య వర్ణన .
( అనుకున్న అమ్మాయి సంధ్యాసుందరిలా సమీపిస్తే ..)
మెల్లని మందహాసమది
మేలుగ విచ్చెను ముద్దుమోవిపై ;
చల్లని సంజవెల్గులను
చక్కగ నామది నేలుకుంటివే !
మొల్ల సుగంధముల్ జడను
మూగగ ముగ్ధమనోహరీ ! సఖీ !
యుల్లము సందడించె మెరు
గూనిన మేనిని గాంచినంతనే .
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికామినివయ్యారికాంతగకుంటియే
రిప్లయితొలగించండిచూపునేసోబగునుచూడ్కికెపుడు
క్రీఁగంటఁజూచునుక్రీడగామెల్లగా
ప్రీతినికలచునుప్రేమతోడ
ముంగిటతలపునుమూయగామూగగా
పలుకులచిలుకయైపడతియుండు
సిగ్గులమోలకయైసింగారిగూనిగా
తలవంచువినయంపుతరుణియనగ
తే
మధురమధురమ్ముమగువకుమనసునెపుడు
పరగపార్వతిదేవికిబంటుగాగ
భరతభూమినిశాంతికిబాటవేయు
నిత్యశ్రామికురాలుగనెగడుసౌమ్య
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సొబగునుం, మొలకయై' టైపాట్లు.
ధన్యవాదములండి
తొలగించండి
రిప్లయితొలగించండిమగువ! నీ మోమునన్ మూగ మధుపకోటి
చెలియ! నీ దేహమెల్లను చెంగలించ
సుదతి! నీగూని మనమును జొక్కజేయ
నిలువలేకుంటి నీమైత్రి నెరపనిమ్ము
గూని = నడుము వంపు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండికనుల తో జుర్రు కుంటి నీ కనుల సొబగు
రిప్లయితొలగించండిఅంద మెల్లను నాకిచ్చె హాయి మిగుల
మూగ నైపోతి పులకించి ముద్దు గుమ్మ
కల వరించెను గూనియు కామిత ముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనుకుంటి శశిబింబ మంటియా వదనమ్ము
రిప్లయితొలగించండి. మెచ్చిన కవికుల మెల్ల పొగడి
రామె యందాలనే యద్భుతమంచును
. పొందపఱచిరైరి పుష్కలముగ
రాయంచ నడకల రమణి నడకలందు
. నడుమూగగా వేణి నాట్యమాడు
మేలిమి బంగరు మెరుగూనిన శరీర
. కాంతిగాంచినచాలు కనులు చెదురు
...................
ఆ.వె. గుబ్బలను దాచ లేనట్టి కొంగు తాను
మాటి కదియె జారి మరులు గొలుపు
చిక్కిపోయినట్టి చిన్ని నడుము పైని
ముడత లంద మిచ్చు ముదితలకును.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితగటి జెరగూనినట్టి జీర దాల్చి , మగువ
రిప్లయితొలగించండిమెల్లగ గజ గమనమున మెలయు చుండ
కంఠమున ముత్తెపు సరమూగ , నది గాంచి
నెరిని కొనియాడ లేకుంటి నిక్కముగను
తగటి = జరీ , చెరగు = అంచు
ఊను = కలిగియుండు
గమనము = కదలుడు ,
ఊగు = కదలు
నెరి = అందము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
🙏🏽
తొలగించండిఆ.వె.
రిప్లయితొలగించండికుంటిసాకులేలనొంటిమెరపుజూడు
అందమెల్లదానిచందమైన
మూగవౌదువేల ముచ్చటలాడగ
చక్కగున్నపిల్లపక్కజేరి
ఆ.వె.
నాట్యరీతినేర్వ నాజూకునడుమూగ
అందమెల్లదానియబ్బసొత్తు
ఓర్వకుంటినయ్య గర్వము దానిదౌ
గుబ్బచనులభామ గూనుజూసి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఇవ్వాళ కంది వారు సెలవా :) జీపీయెస్ వారి దీదీ దుకాణం బంద్ :)
పెనిమిటి మాటగా
నడుమూగ నాట్యపు నడక!
పడిలేచెడు మెల్ల మెల్ల పైటని వడ్డూ
పొడుగూ నిగుడారంగ చ
వి డిగనురుక నేలుకుంటి బింబోష్ఠినిదే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వడ్డూ పొడుగూ' అనడం సాధువు కాదు. 'చవి డిగనురుక'?
రిప్లయితొలగించండిజీపీయెస్ వారి తరపున :)
కనుమూగనీయదే! దీ
దిని పొగడను మేలుకుంటి! దిమ్మతిరిగె వా
రిని మెల మెల్లగ దత్తప
దిని చేవెలుగూని చేర్చ తీరుగ సభలోన్!
జిలేబి
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండి🙏😊
తొలగించండికుచముల బెట్టు జారునను కుంటి మిషన్సుతు దవ్వు పెట్టకన్
రిప్లయితొలగించండిపచనముజేసి మెల్లగను పాలను తాపగ తల్లి మూగగా
ను చలిత మానసమ్మునొడినుండిన బిడ్డకు గూని తల్లి ప్రే
మ చిలకరించు వేళలను మానస పొంగున కంటినందమున్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేను గతమున వినకుంటి నిన్ను గూర్చి
రిప్లయితొలగించండితరుణి! జగమెల్ల వెతికిన దొరకున నిను
మించు పూబోడి, నడుమూగ నంచితముగ
నీలి కురులవి సొబగూని నృత్య మాడ
వీపుపై, కని నామది ప్రీతి నొందె
దత్తపదాల ప్రయోగము అన్యార్ధమని ఇవ్వలేదు కనుక స్వార్ధంలో 🙏🙏🙏
రిప్లయితొలగించండికోమలి తలపులను లేదు కుంటితనము
ముగ్ధ మోమున లేదుగ మూగతనము
కొమ్మ కార్యములను లేదు గూనితనము
మగువ నీయందమెల్ల నీమంచితనమె
మరువకుంటినిన్ను మదిరాక్షి మదిలోన
రిప్లయితొలగించండితాపమెల్లసోక తనువునందు
నలకలెగసి మూగ నందాల మోముపై
న మెరుగూనినట్లు నగవుదోచె
తలపులనూరలేదుగద ,తన్వియిటీవల కుంటియూహలే
రిప్లయితొలగించండిమలుపులుద్రిప్పెలే మనసు, మూగగ మారిన యప్సరేయనన్
సులువుగవిప్పలేముగద,సుక్కలక్రిందన గూనియున్నచో
పలువురుకీర్తిసేసితిరి,ప్రాభవమందగ జేయ మెల్లగా
+++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మెల్ల మెల్లగా నడిచెడి మెరుపు తీగ!
రిప్లయితొలగించండికుంటిసాకులు చెప్పకే కోమలాంగి!
మూగ నోమెందుకేనీకు! ముగ్ధ రాల!
సోయకనుల నాగూ! నిలుచుండి పలుకు
ప్రియురాలి ముద్దుపేరు :నాగు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోమలియంచయానగనకుంటినిలోచనమెల్లనబ్జమే
రిప్లయితొలగించండిభామినిమూగకాదుశుకవాణిసుమధ్యయుగూనిలేదులే
శ్యామశుభాంగిచంద్రముఖిసారసనేత్రయుమెచ్చులాడియే
వామనితంబముల్ బలుకుపాటనవర్ష్మములెన్నశక్యమే
కంటిని వర్ణించఁగ లే
రిప్లయితొలగించండికుంటిని బామెల్లఁ దొలఁగె నువిదను గనఁగా
నొంటిని మన మూఁగఁ దొడఁగెఁ
దుంటరి పరు గూని చెలఁగుఁ దోయలిఁ జేరన్
దత్తపదము మూఁగ కూడ బిందుమధ్యమే.
తొలగించండిఎంచుకుంటిని నీయందమెల్ల యిపుడె
రిప్లయితొలగించండిజుర్రుకొనగను ,నోభామ!చూడుమికను
చీరచెంగూని గుబ్బలుజారెనకట
నీదునడుమూగ నటునిటు నిజముసుమ్ము
చం:
రిప్లయితొలగించండినడకయె కుంటిగాని మరి నాట్యము చేయు మయూరి రీతినిన్
కలవర మింతలేదు చన గన్పడ మెల్లన పోవుచుండగన్
పలువురు మూగ మేను పలు వంకలు ద్రిప్పుచుచిందినందమున్
తడబడ జేయు నెల్లరల తథ్యము గూనిగ వంగినిల్చొనన్
వై. చంద్రశేఖర్
చేపకన్నుల చూపుజాలముఁ జిక్కుకుంటిని, మెల్లగా
రిప్లయితొలగించండిచూపు ద్రిప్పగ కానవచ్చెను సూచిదేలిన నాసికా,
తోపు మోవిని శంఖ కంఠముఁ ద్రోసివచ్చు కుచంబులన్
మోపుచూ సొబగూని యా నడుమూగ నిల్చితిఁ స్థాణువై౹౹
నిలువ(కుంటి)వి రాయంచ కులుకు దోడ
రిప్లయితొలగించండి(మెల్ల) మెల్లంగ నడయాడు మెరుపు దీవె
(మూగ)గా వేచె నా మది మోహనాంగి
దరికి జేరవె సి(గ్గూని) దాగ నేల
చంపకమాల:
రిప్లయితొలగించండి++++++++++++++
నెలతలపైన నేరములనెన్నుట, వీలయె కుంటికోరికల్
పలుకుల విశ్వసింపకను,ప్రాణముదీయును మూగ బాధలే
విలువలు వీధికెక్కుటకు. వింతగజేతురు గూనికృత్యముల్
తలపుల కల్మషమ్ములకు, దారిని జూపును,మెల్ల మెల్లగా!
చిత్రమున గనినటు సిగ్గూని చనుచుండ
రిప్లయితొలగించండిమేలుకుంటి నిపుడె మీననేత్రి
మూగమనసులోన ముసిరిన ట్టి మురిపె
మెల్ల నెరిగి తినిట నింపు తోడ