27-1-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడ్పు విని మోదమందితి హృదయమందు”
(లేదా…)
“ఏడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్”
(వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో…)
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:త్రాడును జూచి పాముగని దారుణ రీతిని గోలబెట్టుచున్వేడుచు కాళినిన్ మిగుల వెఱ్ఱిగ మొఱ్ఱిగ స్వప్నమందునన్మోడిని జూచి గోలనిడి బొబ్బలు పెట్టెడి దీదిదిన్ భళా యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు."పామనుచు...బొబ్బలు వెట్టుచునుండు దీదిదౌ యేడుపు..." అంటే బాగుంటుందేమో?
🙏
ఖేద మొందితి బిడ్డడి కేరు మనెడుయేడ్పు విని, మోద మందితి హృదయమందునాదు సతి వాని లాలింప నయ్య జోలపాట పాడుచు జోగాడి పరుపునంప!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతిజన్మధన్యము మాతృత్వసాధనమునననుచు తపియించి షణ్ముఖుఁ నర్చనమునఁదాల్చి గర్భము ముచ్చట తనయునిదగుయేడ్పు విని మోదమందితి హృదయమందు
ఉత్పలమాలవేడుకఁ జేయ నింట నొక పిల్లడుఁ బుట్టిన జన్మధన్యమైబీడుగ నుండు జీవితము పేర్మి వసంతముఁ గాంచునంచు నేవేడఁగ షణ్ముఖున్ గడుపు వేగమె పండగ నింట సంతుదౌయేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
మాయభగవానుడీజన్మనాకునిచ్చెఏమికానున్నదోయనినేడ్చెబిడ్డకన్నతల్లిగనేనునుకలలుపండఏడ్పువినిమోదమందితిహ్పుదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...యని యేడ్చె.." అనండి.
తప్పుసరిదిద్దుకుంటాను
ప్రజల హింసించి దోచెడు పాలసులను మట్టు బెట్ట వ్యూహాత్మ క మహి త మైన సాహసంబు న రక్షకుల్ చంపిన దరి యేడ్పు విని మోద మంది తి హృదయ మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఎవరి ఏడుపు'?
చివరి పాదం లో చివర వారి యని సవరణ చేయడమైనది
రాజ్యము తమదే మా కుల భోజ్యమనుచునేతలు వినరైరి జనుల వెతలు జూడఎన్నికల తీర్పు వెలువడు వేళ వారిఏడ్పు విని మోదమందితి హృదయమందు
నిమిషమున నొందెనరె ఖేదము యేడుపు విన్న నా హృదయ మెంతయొ! మోదమునందెఁ దృప్తిగన్ పతిసుముఖుని చేయ కొమరుని ప్రచోదన తోడై!జిలేబి
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
పుట్టి చైనాన భువి నలు తట్టులందుమరణ ఘంటల మ్రోగించి మాయ పురుగు, వచ్చె వ్యాక్సినని కడుపు పగిలి పలుకుఏడ్పు విని మోదమందితి హృదయమందు”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
భార్య పురిటి నొప్పులతోటి బాధ పడగ మగడు పిలువంగ వచ్చిన మంత్రసాని పురుడు పోయంగ పత్నికి, పుట్టె తనయ ఏడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."నొప్పులతోడ" అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు: స్త్రీల శీలము లెడలించు చేష్ట లెంచు దుష్టబుద్ధుల పట్టి ఖైదు నొనరించి ప్రభుత పెచ్చుగా దండించు వడిని వారి యేడ్పు విని మోదమందితి హృదయమందు
వేడుక పెండ్లియైన వెనువెంటనె గర్భము గల్గిపత్నికిన్నాడుచుపాడుచున్ నెలలు నారును మూడునునిండగా వడిన్తోడుగ వైద్యశాలజని తొందర పాటున వేచిబిడ్డదౌఏడుపు విన్న నాహృదయ మెంతయు మోదమునందె తృప్తిగన్
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
పాడినిదప్పుచున్కలనపాండవపుత్రులనేలరాల్చెనేవీడకశాత్రవుండునటవేసెనుబాణమునిండుచూలుపైచూడగరక్షకుండువడికూర్మినిపిండముజన్మమందెగాఏడుపువిన్ననాహ్రుదయమెంతయుమోదమునందెద్రుప్తిగన్
కూడగరక్షకుండుఅనిదిద్దుకున్నాను, కనికరించగలరు
అమ్మయనిపించుకొనలేని యాడజన్మసార్థకతయుండదనుకొను సతికి నేడుచాల కాలాని కుదయించె చంటి పాపఏడ్పు విని మోదమందితి హృదయమందు
కె.వి.యస్. లక్ష్మి: కన్న కలలన్ని నిజమైన కాలమొచ్చి తొమ్మిది నెలల సమయమ్ము తొలగి నంత కల్గినట్టి శిశువొనర్చు కమ్మనైన యేడ్పు విని మోద మందితి హృదయ మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వచ్చి'ని 'ఒచ్చి' అనరాదు. "నిజమైన గడియ వచ్చి" అనండి.
నెలతుకకు తొమ్మిది నెలలు నిండియుండెపురిటిగది యంతరమునందు పొంచియుంటిజనకునిగ నీసమయమందు , సంతు కలుగనేడ్పు విని మోదమందితి హృదయమందు
క్రొవ్విడి వెంకట రాజారావు: ప్రోడల శీలముల్ నుఱుచు పోకిరిగాండ్రను ఖైదొనర్చియున్ కీడులనెల్ల జేయుటకు కీలకమై విలసిల్లు పట్టులన్ పాడొనరించి తీవ్రమగు బాధల నిల్పెడి వేళ వారిదౌ యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
తొమ్మిది నెలలు మోయగ, తొందరపడెమనసు బిడ్డను చూడగ, మక్కువగనుకానుపు సుఖముగ జరిగె, కన్న బిడ్డఏడ్పు విని మోదమందితి హృదయమందు
మోడులు వార నాశలిక మ్రొక్కుచు నెంతయొ సంతు కోసమైవేడగనా పరంతపుని వేగమె వేకటి దాల్చె పత్నియేనేడిక నిండె మాసములు నిండగు బిడ్డ జనించె నత్తరిన్ఏడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
సమస్య :ఏడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందె దృప్తిగన్ ( కాకతి గణపతిదేవుడు తన రాణి పుత్రికను కనగానే మహామంత్రి శివదేవయ్యతో ఆనందంగా అంటున్నాడు)ఉత్పలమాల ...................వేడుచు బార్వతీసతికి విన్నపమెంతయొ చేసికొంటినే !నేడిటు చూడ మంత్రివర !నిండుగ కన్నుల పండువైన యీ చేడియ చిట్టినోరు కడు చెన్నుగ విప్పుచు సల్పుచున్న యా యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందె దృప్తిగన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చూడగ గంటి నీరురుకు చుండును గష్టసుఖాల కౌగిలిన్పోడిమి జాపుచున్ మనసు మూలల స్పందన నొంద వేగమైతోడుగ నూరడించు మది తోడయి జీవజలంబు మాడ్కి, యాయేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్!
సమస్య :-“ఏడ్పు విని మోదమందితి హృదయమందు"*తే.గీ**రైతులుద్యమాన్ని నకిలీ రైతులనుచుకార్పొరేటు శక్తుల కొమ్ము కాయువారుబూటకపు ఫోస్టులను పెట్టి బోరునేడ్చుయేడ్పు విని మోదమందితి హృదయమందు( అలాంటి పోస్ట్ లను చూసి నవ్వుకున్నాను) ...................✍️చక్రి
బిడ్డ కడుపులోన తిరిగెనడ్డమనుచు వైద్యుడొక్కడు చెప్పగా బాధతోడ వేల్పు లెల్లరిన్ ధ్యానించు వేళ పాప యేడ్పు విని మోదమందితి హృదయమందు
సమస్య :-"ఏడ్పు విని మోదమందితి హృదయమందు"*తే.గీ**పెళ్లి దగ్గర నుండియు పిల్లల సడిఇంటి యందు కోర తుదకు పంట పండె,మల్లె రంగులు పూచిన పిల్లవాడియేడ్పు విని మోదమందితి హృదయమందు ........................✍️చక్రి
(సందర్భము:: కృష్ణుని జన్మ వేళ, వసు దేవుని పలుకులు ) ఏడవ బిడ్డ యేగె, హరి యే దిశనుంటివి, లక్ష్మి కౌగిలిన్యాడుచునుంటివో, యనగనప్పుడు కృష్ణుని మాయ మ్రోగగాఏడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ , దృప్తిగన్”వాడిని చేర్చితిన్ పసిమి వాడని వాని యశోద పంచనన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
రైతుల పోరాటము రసాభాస:ఉ.కూడుచు రైతు బందుగుల కుత్సిత బుద్ధిని తిర్గు బాటులన్కూడదు కూడదంచు దెగ కూరిమి తోడుత హెచ్చరించగాబాడుగ బండ్లనే గొనుచు భారత వీధుల విక్రమించగాగాడిని బడ్డ రైతులును గట్టిగ తప్పు నెరింగి తేల్చగానేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
మోడు వారిన బ్రతుకున ముదము కూర్చ వింటి నింటను శుభవార్త వీను లలరపది వసంతముల పిదప పాప పుట్టనేడ్పు విని మోదమందితి హృదయమందు
వాది తరఫున తీర్పుయు వచ్చి యుండ ఓడిపోయిన ప్రతివాది కోర్టు వద్ద ఏడ్పు విని మోదమందితి హృదయమందువాది గృహమేగి రోదించె వ్యయము జూచి
వాడల వాడలన్ దిరిగి బాలు డొకండును బుట్టెనంచు దానాడుచు బాడుచున్ బడతి నందము జాటుచు వంధ్య గాదు చిందాడుచు బిల్చెవేడుకగ తాయిని జూడగ క్షీరకంఠుదౌ*“యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్”*
*(స్వాయంభువు మనువు పుత్రుడైన ప్రియవ్రతుని భార్య మాలినీదేవి మృతశిశువుకు జన్మ నివ్వగా నతడు మిగుల రోదింప స్కందుని సతి దేవసేన ఆ పసికందుకు ప్రాణం పోసిన ఘట్టం)* ....... ....... ...... .... ... .. . . . వేడగనెన్నొ దేవతల వ్రేకటి దాల్చిన నేమిరా గనన్ చేడియ జన్మనిచ్చెగద చిత్రము గాను శవానికంచు నే నేడుచు చుండ కందసతియే వరమివ్వ మృతాంగమేడ్చె నా యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
సంధ్యసమయాన పుట్టిన చంటిపిల్లయేడ్పువినిమోదమందితిహృదయమందయింటిమహలక్ష్మి యామెయే యింకమాకుపేరు శ్రీలక్ష్మి యంచును బెట్టుదురమ!
ఉ: కీడును బాయ సాగుబడి కింపగు సంకర పైరు లెంచగన్చీడలు పీడలన్నిటిని చెండుచు నూతన శాస్త్ర విద్యలన్కూడగ హెచ్చు ధాన్యమును గూర్చి కడుంగడు నీర్ష్య బుద్ధితోనేడుపు విన్న నా హృదయమెంతయొ మోదము నొందె దృప్తిగన్వై. చంద్రశేఖర్
దుఃఖ మడరంగఁ బల్కిన దుష్ట భాషణమ్ము లవి యెల్ల నిక్కమ్ము సుమ్మనంగ మించి యెల్లరు నన్ను మన్నించ నాదునేడ్పు విని మోద మందితి హృదయ మందు నేఁడు సెలంగె సంతసము నిండు మనమ్మున మిక్కుటమ్ముగా వేడుక కాదె జన్మ నిడ బిడ్డకు రాతిరి ప్రస్ఫుటమ్ముగానేడయి నంత దార ప్రసవించెను జక్కటి చంటిబిడ్డ నాయేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
వీడగజేయుచున్ భయముపేర్మినిబిడ్డడుపుట్టనంతటన్ నేడుపువిన్ననాహృదయమెంతయొమోదమునందెదృప్తిగన్ జూడగ ముద్దులన్ గురియుచొప్పుననుండెనుబోసినవ్వుతోవేడుకజేయనెంచితినిబీదలకట్లనెయర్ధికోటికిన్
పెక్కు నోములు నోచిన పిదప సతియెజన్నమీయగ నొక బాల చంద్రునకునుతనివి తీరగ నాబాలు తడిమి వాని ఏడ్పు వినిమోదమందితిహృదయమందు!!!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
త్రాడును జూచి పాముగని దారుణ రీతిని గోలబెట్టుచున్
వేడుచు కాళినిన్ మిగుల వెఱ్ఱిగ మొఱ్ఱిగ స్వప్నమందునన్
మోడిని జూచి గోలనిడి బొబ్బలు పెట్టెడి దీదిదిన్ భళా
యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పామనుచు...బొబ్బలు వెట్టుచునుండు దీదిదౌ యేడుపు..." అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఖేద మొందితి బిడ్డడి కేరు మనెడు
యేడ్పు విని, మోద మందితి హృదయమందు
నాదు సతి వాని లాలింప నయ్య జోల
పాట పాడుచు జోగాడి పరుపునంప!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిజన్మధన్యము మాతృత్వసాధనమున
ననుచు తపియించి షణ్ముఖుఁ నర్చనమునఁ
దాల్చి గర్భము ముచ్చట తనయునిదగు
యేడ్పు విని మోదమందితి హృదయమందు
ఉత్పలమాల
తొలగించండివేడుకఁ జేయ నింట నొక పిల్లడుఁ బుట్టిన జన్మధన్యమై
బీడుగ నుండు జీవితము పేర్మి వసంతముఁ గాంచునంచు నే
వేడఁగ షణ్ముఖున్ గడుపు వేగమె పండగ నింట సంతుదౌ
యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిమాయభగవానుడీజన్మనాకునిచ్చె
రిప్లయితొలగించండిఏమికానున్నదోయనినేడ్చెబిడ్డ
కన్నతల్లిగనేనునుకలలుపండ
ఏడ్పువినిమోదమందితిహ్పుదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...యని యేడ్చె.." అనండి.
తప్పుసరిదిద్దుకుంటాను
తొలగించండిప్రజల హింసించి దోచెడు పాలసులను
రిప్లయితొలగించండిమట్టు బెట్ట వ్యూహాత్మ క మహి త మైన
సాహసంబు న రక్షకుల్ చంపిన దరి
యేడ్పు విని మోద మంది తి హృదయ మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎవరి ఏడుపు'?
చివరి పాదం లో చివర వారి యని సవరణ చేయడమైనది
తొలగించండిరాజ్యము తమదే మా కుల భోజ్యమనుచు
రిప్లయితొలగించండినేతలు వినరైరి జనుల వెతలు జూడ
ఎన్నికల తీర్పు వెలువడు వేళ వారి
ఏడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినిమిషమున నొందెనరె ఖే
దము యేడుపు విన్న నా హృదయ మెంతయొ! మో
దమునందెఁ దృప్తిగన్ పతి
సుముఖుని చేయ కొమరుని ప్రచోదన తోడై!
జిలేబి
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిపుట్టి చైనాన భువి నలు తట్టులందు
రిప్లయితొలగించండిమరణ ఘంటల మ్రోగించి మాయ పురుగు,
వచ్చె వ్యాక్సినని కడుపు పగిలి పలుకు
ఏడ్పు విని మోదమందితి హృదయమందు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభార్య పురిటి నొప్పులతోటి బాధ పడగ
రిప్లయితొలగించండిమగడు పిలువంగ వచ్చిన మంత్రసాని
పురుడు పోయంగ పత్నికి, పుట్టె తనయ
ఏడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నొప్పులతోడ" అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్త్రీల శీలము లెడలించు చేష్ట లెంచు
దుష్టబుద్ధుల పట్టి ఖైదు నొనరించి
ప్రభుత పెచ్చుగా దండించు వడిని వారి
యేడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేడుక పెండ్లియైన వెనువెంటనె గర్భము గల్గి
రిప్లయితొలగించండిపత్నికిన్
నాడుచుపాడుచున్ నెలలు నారును మూడును
నిండగా వడిన్
తోడుగ వైద్యశాలజని తొందర పాటున వేచిబిడ్డదౌ
ఏడుపు విన్న నాహృదయ మెంతయు మోదమునందె తృప్తిగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిపాడినిదప్పుచున్కలనపాండవపుత్రులనేలరాల్చెనే
రిప్లయితొలగించండివీడకశాత్రవుండునటవేసెనుబాణమునిండుచూలుపై
చూడగరక్షకుండువడికూర్మినిపిండముజన్మమందెగా
ఏడుపువిన్ననాహ్రుదయమెంతయుమోదమునందెద్రుప్తిగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడగరక్షకుండుఅనిదిద్దుకున్నాను, కనికరించగలరు
రిప్లయితొలగించండిఅమ్మయనిపించుకొనలేని యాడజన్మ
రిప్లయితొలగించండిసార్థకతయుండదనుకొను సతికి నేడు
చాల కాలాని కుదయించె చంటి పాప
ఏడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండికన్న కలలన్ని నిజమైన కాలమొచ్చి
తొమ్మిది నెలల సమయమ్ము తొలగి నంత
కల్గినట్టి శిశువొనర్చు కమ్మనైన
యేడ్పు విని మోద మందితి హృదయ మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వచ్చి'ని 'ఒచ్చి' అనరాదు. "నిజమైన గడియ వచ్చి" అనండి.
నెలతుకకు తొమ్మిది నెలలు నిండియుండె
రిప్లయితొలగించండిపురిటిగది యంతరమునందు పొంచియుంటి
జనకునిగ నీసమయమందు , సంతు
కలుగ
నేడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిప్రోడల శీలముల్ నుఱుచు పోకిరిగాండ్రను ఖైదొనర్చియున్
కీడులనెల్ల జేయుటకు కీలకమై విలసిల్లు పట్టులన్
పాడొనరించి తీవ్రమగు బాధల నిల్పెడి వేళ వారిదౌ
యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితొమ్మిది నెలలు మోయగ, తొందరపడె
రిప్లయితొలగించండిమనసు బిడ్డను చూడగ, మక్కువగను
కానుపు సుఖముగ జరిగె, కన్న బిడ్డ
ఏడ్పు విని మోదమందితి హృదయమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోడులు వార నాశలిక మ్రొక్కుచు నెంతయొ సంతు కోసమై
రిప్లయితొలగించండివేడగనా పరంతపుని వేగమె వేకటి దాల్చె పత్నియే
నేడిక నిండె మాసములు నిండగు బిడ్డ జనించె నత్తరిన్
ఏడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఏడుపు విన్న నా హృదయ
మెంతయొ మోదమునందె దృప్తిగన్
( కాకతి గణపతిదేవుడు తన రాణి పుత్రికను కనగానే మహామంత్రి శివదేవయ్యతో ఆనందంగా అంటున్నాడు)
ఉత్పలమాల
...................
వేడుచు బార్వతీసతికి
విన్నపమెంతయొ చేసికొంటినే !
నేడిటు చూడ మంత్రివర !
నిండుగ కన్నుల పండువైన యీ
చేడియ చిట్టినోరు కడు
చెన్నుగ విప్పుచు సల్పుచున్న యా
యేడుపు విన్న నా హృదయ
మెంతయొ మోదమునందె దృప్తిగన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచూడగ గంటి నీరురుకు
చుండును గష్టసుఖాల కౌగిలిన్
పోడిమి జాపుచున్ మనసు
మూలల స్పందన నొంద వేగమై
తోడుగ నూరడించు మది
తోడయి జీవజలంబు మాడ్కి, యా
యేడుపు విన్న నా హృదయ
మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి“ఏడ్పు విని మోదమందితి హృదయమందు"
*తే.గీ**
రైతులుద్యమాన్ని నకిలీ రైతులనుచు
కార్పొరేటు శక్తుల కొమ్ము కాయువారు
బూటకపు ఫోస్టులను పెట్టి బోరునేడ్చు
యేడ్పు విని మోదమందితి హృదయమందు
( అలాంటి పోస్ట్ లను చూసి నవ్వుకున్నాను)
...................✍️చక్రి
బిడ్డ కడుపులోన తిరిగెనడ్డమనుచు
రిప్లయితొలగించండివైద్యుడొక్కడు చెప్పగా బాధతోడ
వేల్పు లెల్లరిన్ ధ్యానించు వేళ పాప
యేడ్పు విని మోదమందితి హృదయమందు
సమస్య :-
రిప్లయితొలగించండి"ఏడ్పు విని మోదమందితి హృదయమందు"
*తే.గీ**
పెళ్లి దగ్గర నుండియు పిల్లల సడి
ఇంటి యందు కోర తుదకు పంట పండె,
మల్లె రంగులు పూచిన పిల్లవాడి
యేడ్పు విని మోదమందితి హృదయమందు
........................✍️చక్రి
(సందర్భము:: కృష్ణుని జన్మ వేళ, వసు దేవుని పలుకులు )
రిప్లయితొలగించండిఏడవ బిడ్డ యేగె, హరి యే దిశనుంటివి, లక్ష్మి కౌగిలి
న్యాడుచునుంటివో, యనగనప్పుడు కృష్ణుని మాయ మ్రోగగా
ఏడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ , దృప్తిగన్”
వాడిని చేర్చితిన్ పసిమి వాడని వాని యశోద పంచనన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
రైతుల పోరాటము రసాభాస:
రిప్లయితొలగించండిఉ.
కూడుచు రైతు బందుగుల కుత్సిత బుద్ధిని తిర్గు బాటులన్
కూడదు కూడదంచు దెగ కూరిమి తోడుత హెచ్చరించగా
బాడుగ బండ్లనే గొనుచు భారత వీధుల విక్రమించగా
గాడిని బడ్డ రైతులును గట్టిగ తప్పు నెరింగి తేల్చగా
నేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
మోడు వారిన బ్రతుకున ముదము కూర్చ
రిప్లయితొలగించండివింటి నింటను శుభవార్త వీను లలర
పది వసంతముల పిదప పాప పుట్ట
నేడ్పు విని మోదమందితి హృదయమందు
వాది తరఫున తీర్పుయు వచ్చి యుండ
రిప్లయితొలగించండిఓడిపోయిన ప్రతివాది కోర్టు వద్ద
ఏడ్పు విని మోదమందితి హృదయమందు
వాది గృహమేగి రోదించె వ్యయము జూచి
వాడల వాడలన్ దిరిగి బాలు డొకండును బుట్టెనంచు దా
రిప్లయితొలగించండినాడుచు బాడుచున్ బడతి నందము జాటుచు వంధ్య గాదు చిం
దాడుచు బిల్చెవేడుకగ తాయిని జూడగ క్షీరకంఠుదౌ
*“యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్”*
*(స్వాయంభువు మనువు పుత్రుడైన ప్రియవ్రతుని భార్య మాలినీదేవి మృతశిశువుకు జన్మ నివ్వగా నతడు మిగుల రోదింప స్కందుని సతి దేవసేన ఆ పసికందుకు ప్రాణం పోసిన ఘట్టం)* ....... ....... ...... .... ... .. . . .
రిప్లయితొలగించండివేడగనెన్నొ దేవతల వ్రేకటి దాల్చిన నేమిరా గనన్
చేడియ జన్మనిచ్చెగద చిత్రము గాను శవానికంచు నే
నేడుచు చుండ కందసతియే వరమివ్వ మృతాంగమేడ్చె నా
యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
సంధ్యసమయాన పుట్టిన చంటిపిల్ల
రిప్లయితొలగించండియేడ్పువినిమోదమందితిహృదయమంద
యింటిమహలక్ష్మి యామెయే యింకమాకు
పేరు శ్రీలక్ష్మి యంచును బెట్టుదురమ!
ఉ:
రిప్లయితొలగించండికీడును బాయ సాగుబడి కింపగు సంకర పైరు లెంచగన్
చీడలు పీడలన్నిటిని చెండుచు నూతన శాస్త్ర విద్యలన్
కూడగ హెచ్చు ధాన్యమును గూర్చి కడుంగడు నీర్ష్య బుద్ధితో
నేడుపు విన్న నా హృదయమెంతయొ మోదము నొందె దృప్తిగన్
వై. చంద్రశేఖర్
దుఃఖ మడరంగఁ బల్కిన దుష్ట భాష
రిప్లయితొలగించండిణమ్ము లవి యెల్ల నిక్కమ్ము సుమ్మనంగ
మించి యెల్లరు నన్ను మన్నించ నాదు
నేడ్పు విని మోద మందితి హృదయ మందు
నేఁడు సెలంగె సంతసము నిండు మనమ్మున మిక్కుటమ్ముగా
వేడుక కాదె జన్మ నిడ బిడ్డకు రాతిరి ప్రస్ఫుటమ్ముగా
నేడయి నంత దార ప్రసవించెను జక్కటి చంటిబిడ్డ నా
యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్
వీడగజేయుచున్ భయముపేర్మినిబిడ్డడుపుట్టనంతటన్
రిప్లయితొలగించండినేడుపువిన్ననాహృదయమెంతయొమోదమునందెదృప్తిగన్
జూడగ ముద్దులన్ గురియుచొప్పుననుండెనుబోసినవ్వుతో
వేడుకజేయనెంచితినిబీదలకట్లనెయర్ధికోటికిన్
పెక్కు నోములు నోచిన పిదప సతియె
రిప్లయితొలగించండిజన్నమీయగ నొక బాల చంద్రునకును
తనివి తీరగ నాబాలు తడిమి వాని
ఏడ్పు వినిమోదమందితిహృదయమందు!!!