7, జనవరి 2021, గురువారం

సమస్య - 3597

8-1-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్”

(లేదా…)

“పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్”

47 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నల్లని పిల్లి కూననొక నచ్చిన రీతిని తెచ్చి పెంచుచున్
    మెల్లగ మెల్లగా తనరి మీరిన ముద్దున పెద్ద చేయగా
    చల్లగ నాకమున్ జనగ చక్కగ చంపెడు మూషికమ్ములన్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్...

    రిప్లయితొలగించండి
  2. చల్లనిదేవునిగుడిలో
    మెల్లగరేగినయలజడినెల్లనుగనగా
    తల్లికిమ్రోక్కుచువేదన
    పిల్లికిశ్రాద్ధమునుపుడమివేలుపుపెట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. మెల్లగరేగినయలజడిమెఱికనుకనగా
      అనిసవరించడమైనది

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అల్ల కరోన పూర్తిగను హైదరబాదును బందు జేయగా
    చల్లగ ముక్కు మూయుచును జంకుచు బైటకు వెళ్ళజాలకే
    గిల్లుచు గోళ్ళనున్ విసిగి గీరుచు గుండును లేక బేరముల్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్...

    రిప్లయితొలగించండి
  4. అల్లరి వాడై యొకరుడు
    చెల్లని మాటల పలువిధ చెణుకు ల సృష్టి న్
    కల్లలు పలుకుచు నిట్ల నె
    పిల్లికి శ్రాద్ధమును పుడమి వేలుపు పెట్టె న్ ""

    రిప్లయితొలగించండి
  5. తల్లికి తండ్రికి పిండము,

    చల్లని దైవమునకు పిడచను , పెట్టని వా

    డల్లవిగో ఓట్లనగను

    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

    ఓ ఇంటిలో పిల్లిని పెంచుకుంటున్న ఓ
    విప్రుని ఘనకార్యము.

    ఎల్లరు వదలగ దీనిని

    చెల్లెను కాలం బనుచును,చిత్రము గనవో!

    యల్లరి యెలుకల జంపిన

    పిల్లికి శ్రాద్ధము పుడమి వేలుపు వెట్టెన్!!!.

    మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం

    రిప్లయితొలగించండి
  7. ఉత్పలమాల:
    --------------
    తల్లిని దండ్రినిన్ గలిపి,దానముగానిడి యాశ్రమమ్ములో
    చెల్లిని బావగారలను,చేదుగనెంచుచు దూరముంచుచున్
    మెల్లగ యాస్తులన్నిటిని మ్రింగగజూచెడు వారలీభువిన్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమి, వేలుపు బెట్టెను శాస్త్రపద్ధతిన్
    -------------------------------------------------

    రిప్లయితొలగించండి
  8. తల్లిని దండ్రినిన్ గలిపి,దానముగానిడి యాశ్రమమ్ములో
    చెల్లిని బావగారలను,చేదుగనెంచుచు దూరముంచుచున్
    మెల్లగ యాస్తులన్నిటిని మ్రింగగజూచెడు వారలీభువిన్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమి, వేలుపు బెట్టెను శాస్త్రపద్ధతిన్


    రిప్లయితొలగించండి
  9. కందం
    పిల్లినట నొక్కగానొక
    పిల్లయె ప్రాణప్రదముగ పెంచఁగ సమయన్
    తల్లడిలి కోరి నంతటఁ
    బిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    ఉత్పలమాల
    పిల్లలు లేక క్రుంగి విలపించుచు జేయఁగ తీర్థయాత్రలం
    దెల్లరి దీవనన్ నలుసు తీరెను ముద్దులకూతురౌచుఁ దా
    నుల్లము రంజిలన్ గొనియు నూపిరి తానుగ బెంచ చావగన్
    బిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్

    రిప్లయితొలగించండి
  10. చల్లని పాలనుఁబెట్టెను
    పిల్లికి;శ్రాద్ధమునుఁబుడమి వేలుపు వెట్టెన్
    తల్లికి సుమధుర వల్లికి
    చల్లని దీవెనల నివ్వ,సద్గతి పొందన్

    రిప్లయితొలగించండి
  11. సమస్య :
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమి
    వేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్

    ( పెంపుడుపిల్లి మరణిస్తే పెంచిన
    విప్రుడు చేసిన పని )

    మెల్లగ మెల్లగన్ గనుచు
    మిక్కిలి ప్రేమగ జుట్టుముట్టుచున్ ;
    నల్లని రూపుతోడ గడు
    నాజుకు గొంతున బల్కరించుచున్ ;
    గల్లను గంట మ్రోగగను
    గంతిడు నీలపుకండ్ల కూనకై ;
    పిల్లికి ; శ్రాద్ధమున్ బుడమి
    వేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్ .

    రిప్లయితొలగించండి
  12. ఇల్లును గుల్లను జేసెడి
    బల్లిదులౌ మూషికముల బట్టెడు బిల్లే
    చల్లగ కనుమూయగ నా
    పిల్లికి శ్రాద్ధమును బుడమి వేలుపు బెట్టెన్


    పిల్లలు లేనియింట నతిప్రేమను బెంచెడునొక్కపిల్లినిన్
    బల్లిదుడైన భైరవము బట్టుచు ప్రాణము దీయగా నయో
    పెల్లుబుకంగ దుఃఖమది పెద్దల చెంతను జేర్చగాను నా
    పిల్లికి శ్రాద్ధమున్ పుడమి వేలుపుబెట్టెను శాస్త్రపద్ధతిన్

    రిప్లయితొలగించండి


  13. చల్లగ నెలుకల బెడదను
    మెల్లగ దీర్చెను గృహమున! మేవడి తోడై
    యొళ్లును వీడగ మరువక
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. తనువును వీడంగా న
    డ్డన పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వె
    ట్టెను శాస్త్రపద్ధతిన్ గా
    చె నింటి ననుచు మరువక వచించి జిలేబీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. ఎల్లలులేనిప్రేమతనకెవ్వరులేరనిపిల్లిపిల్లనే
    మెల్లగజేరదీసిపరమేశుడొసంగినసంతుటంచునా
    పిల్లికిరాచభోగములువిందువినోదములెన్నియెన్నియో
    నల్లనికారుచీకటినినాకముకంపెనుతెల్లకుక్కయే
    *“పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్”*

    రిప్లయితొలగించండి
  16. మల్లన పుత్రు సాక్షిగను మారుతి సాక్షిగ జానకీశు చే

    విల్లుయె సాక్షిగా పగిలె విగ్రహ మూర్తులు , వారు వీరులు

    న్నెల్లరు మేమె హిందువని నేర్పున చూపగ పన్ను యుక్తులన్

    పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  17. అల్లన కాళ్ళచెంత తిరుగాడును వాలముఁ త్రిప్పు మ్యావటం
    చెల్లెడ నింటిలోనఁ గనిపించు యముండన మూషికాళికిన్,
    పిల్లల పేర్మి బంధువయి వీడగ నూపిరి యార్తి తోడ నా
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్

    నిన్నటిపూరణ

    ధనముఁ దిరస్కరింతురె? యుదంచితనిర్ధనతాబ్ధిజన్యబిం
    ధనమది కాదె! జీవనవిధాననిదానము గాని తుచ్ఛదం
    ధనమగుఁ గాక, తద్విధి ను దంచితధైర్యవిధాయిమానసేం
    ధనమును వీడి పోగలదె తన్వి? ముదంబున భర్త యింటికిన్.

    నిర్ధనతాబ్ధిజని + అబింధనము :------ నిర్ధనత్వమనే సముద్రంలో పుట్టిన బడబాగ్ని వంటిది (అప్ + ఇంధనము)

    నిదానము = ఆదికారణము
    దంధనము = అశాశ్వతమైనది

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  18. నల్లఫలకము పయి కలదు
    తల్లికి శ్రాద్ధమునుఁ బుడమి తాలుపు పెట్టెన్
    అల్లరి బాలుడు మార్చెను
    పిల్లికి శ్రాద్ధమును బుడమి వేలుపు వెట్టెన్

    రిప్లయితొలగించండి
  19. తననిటు కన్నవారలు సదాశమొప్పగ నెట్టకేలకున్,
    వినయ విధేయతన్ కడు వివేక విచక్షత గల్గువానితో
    ననునయ వాక్యముల్ బలికి యాదరమొప్పగ తన్నుబంప బం
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్


    మెల్లగ తనపని నెఱపుట
    కెల్లరతో తీపి ముచ్చటెపుడును బలికే
    కల్లల నా కుడ్యముపై
    పిల్లికి శ్రాద్ధమును బుడమివేలుపు వెట్టెన్.

    రిప్లయితొలగించండి
  20. చెల్లికి తెల్గు నేర్పెడి వజీరుడు వ్రాసెను నల్లబల్ల పై
    తల్లికి శ్రాద్ధమున్ బుడమి తాలుపు పెట్టెను శాస్త్రపద్ధతిన్
    కల్లును త్రావినట్టి యొక గర్హ్యుడు మార్చెను దాని నిట్టులన్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  21. పల్లెల దొరపిల్లులుగా
    నల్లిరిఁగంచెలనువారునల్లనిధనమై,
    జెల్లగ భూచట్టము,దొర
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  22. ఉ:

    చెల్లని మాటలివ్వి చిరు చింతన సేయగ తేట తెల్లమౌ
    తల్లియు తండ్రియున్ గడచ తద్దినమెట్టక నుద్ధరింపగన్
    కల్లయె గాదె నిట్టి ఘనకార్యము చేయుదురన్న నివ్విధిన్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమి వేలుపు బెట్టెను శాస్త్ర పధ్ధతిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. పిల్లిని చంకబెట్టుకొని పెల్లికి నేగె నొకండునాడు నా
    పిల్లికి పొయ్యిలో నెలవు, పిల్లిశిరానికి ముండనంబు నీ
    *“పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్”*
    బిల్లలు బెద్దలున్ *కొరొన* వేటుకు తోచక తల్లడిల్లగా

    రిప్లయితొలగించండి
  24. కల్లుద్రాగెనుబాపడు
    ఉల్లము మరణమును దలచ నూపిరి యాగెన్
    మెల్లగ జారెను కలలో
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    రిప్లయితొలగించండి
  25. ఈరోజు నేను, మా ఆవిడ ఉత్తరాంధ్రకు బయలుదేరుతున్నాము. మా కార్యక్రమ వివరాలు ఇవి...
    9-1-2021 (శనివారం) అన్నవరం, తలుపులమ్మ లోవ దర్శనం
    10-1-2021 (ఆదివారం) అన్నవరం సమీపంలోని హంసవరంలో కన్నేపల్లి వరలక్ష్మి, భమిడిపాటి కాళిదాసు గారల పుస్తకావిష్కరణలు.. భమిడిపాటి వారి 'ఆంధ్రబాల శతకం' కృతి స్వీకరణ... తదనంతరం విశాఖపట్టణానికి ప్రయాణం.
    11-1-2021 (సోమవారం) సింహాచలం, విశాఖపట్టణ సందర్శన.
    12-1-2021 (మంగళవారం) కారులో విశాఖ నుండి బయలుదేరి శ్రీకాకుళం, అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగ దర్శనానంతరం విశాఖకు తిరిగివచ్చి రాత్రికి రైలెక్కడం..
    అవకాశం ఉన్న కవిమిత్రులు ఎవరైనా ఎక్కడైనా కలిస్తే సంతోషం!

    రిప్లయితొలగించండి
  26. మైలవరపు వారి పూరణ

    విధి యాడిన వింత ఆటలో... పాపం..! పావులు...
    వీరి గోడెవరికీ పట్టదు... 😥🙏

    ఇల్లిలు దిర్గి., శ్రాద్ధముల.. నింపు వివాహములన్ బొనర్చుచున్
    బిల్లల భార్య సాకుకొను బీదపురోహితుడీ కరోనచే
    చెల్లని రూకయయ్యె.,నిక జేయునదేమియులేక కుందుచున్
    బిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు పెట్టెను శాస్త్రపద్ధతిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  27. తల్లికినిష్టము పెంపుడు
    పిల్లి గతించగవగచుచు పిలిచి పురోధన్
    పిల్లికి సద్గతులిమ్మన
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    రిప్లయితొలగించండి
  28. తల్లియు దండ్రియు గతింప
    పిల్లలు శ్రాద్ధంబు భక్తిఁ బెట్టుట సరియౌ
    నల్లరి మాటలె గానెట
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    రిప్లయితొలగించండి
  29. తల్లిగ రాజుయు పెంచిన
    పిల్లికి,రుగ్మతనచనియ పిలిచెను జనులన్
    చల్లగ యాత్మకు శాంతికి
    పిల్లికి శ్రాద్ధమును బుడమి వేలుపు వెట్టెన్

    రిప్లయితొలగించండి
  30. పిల్లలు లేని పంతులొక పిల్లిని బెంచెను గారవంబుగా
    పిల్లిగతింపతల్లడిలి పెంచిన మక్కువయగ్గలించగా
    పిల్లికి సద్గతుల్ గలుగ బిట్టుగయోచనజేసి యంతటన్
    పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వెట్టెను శాస్త్రపద్ధతిన్

    రిప్లయితొలగించండి
  31. పిల్లితలగొఱిగె మంగలి
    పిల్లికిశ్రాద్ధమును బుడమివేలుపువెట్టెన్
    పిల్లికి భోగముగలుగుట
    యల్లదిభాగ్యమ్ము గాదె ?యాలోచించన్

    రిప్లయితొలగించండి
  32. పెల్లుగ నిండంగఁ గడుపు
    చల్లఁ గలిపి యన్నము దిన శర్వరి గడవన్
    వెల్లివిరియకను మును చూ
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్

    [మునుచూపు +ఇల్లికి; ఇల్లి = ఉపవాసము]


    కల్లలు పల్క నేల నపకారపుఁ జేష్టలు స్వార్థ బుద్ధియుం
    బెల్లుగ నున్న యీతనికిఁ బ్రేమ దయాగుణముల్ సెలంగునే
    తల్లికిఁ బిండముం దనిసి ధాత్రిని పెట్టని బిడ్డఁ డక్కటా
    పిల్లికి శ్రాద్ధముం బుడమి వేలుపు వెట్టెను! శాస్త్రపద్ధతిన్

    [శాస్త్రపద్దతిన్: ఇక్కడ తల్లికి నన్వయముగా గ్రహించఁ దగును]

    రిప్లయితొలగించండి
  33. పిల్లికిశ్రాద్ధమున్ బుడమివేలుపువెట్టెనుశాస్త్రపద్ధతిన్
    నల్లదెయేమిపల్కితిరియచ్చెరువయ్యెనువిన్నవెంటనే
    పిల్లికిగొర్గెనేదలను బేర్మినిమంగలిఖాళియుంటతోన్
    పిల్లియదృష్టమేయిదియ వేలనునొందుట మానవాళిచేన్

    రిప్లయితొలగించండి
  34. కందం
    దుర్మార్గమ్మున నీడ్చన్
    ధర్మజుఁడున్ దుస్ససేన నన్నోడినటుల్
    మర్మము విడ జెప్పితె నా
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    ఉత్పలమాల
    దుర్మతి నేకవస్త్రనని దొయ్యలిఁ జెప్పిన దుస్ససేన నీ
    ధర్మజుఁడోడె నిన్ననుచు ధారుణ రీతిగ జట్టుఁ బట్టుచున్
    మర్మము విప్పుచున్ సభకు మానిని నీడ్చితె! నాదు పూర్వ దు
    ష్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  35. మెల్లగ పాలను తాగగ
    చల్లగనింటచొరబడగసంబరమొదవన్
    పిల్లలు కొట్టగ జచ్చిన
    పిల్లికి శ్రాద్ధము ను పుడమి వేలుపు పెట్టెన్

    రిప్లయితొలగించండి