15, జనవరి 2021, శుక్రవారం

సమస్య - 3605

16-1-2021 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రత్నములను విడిచి రాలఁ గొనెను”

(లేదా…)

రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్”

78 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    రత్నపు పుత్రులన్ మరియు రాణుల వోలెడి ముద్దు పుత్రికల్,
    పత్నుల వీడుచున్ గొనుచు బ్రాహ్మణ వర్యులు నాకమేలగన్
    యత్నము జేసి కోరికలు హాయిని దీర్చెడి సాలెగ్రామలన్...
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్...

    రిప్లయితొలగించండి
  2. ధరల పెంపు జూడ ధరలోనగనలేము
    నింగినంటినంత నిగుడలేము
    బంగరు నగ కింక వన్నెలు లేవని
    రత్నములను విడిచి రాలఁ గొనెను!

    రిప్లయితొలగించండి
  3. చేరి రత్న రాశి చేకూర్చ చెల్లమ్మ

    వేయి వెలుగులొందె రేయి రాజు

    సాధనమునజేరి చంద్రుని, మనుజుడు

    రత్నములను విడిచి రాలఁ గొనెను

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రత్నపు రాసులన్ గొనుచు రంభల వోలెడు దార్లకీయగన్
    పత్నులు మూర్ఖులై కడకు పండుగ నీయగ చెప్పుదెబ్బలే
    యత్నము జేసి కూర్చుచును హ్లాదము నొందుచు జూబ్లిహిల్సునన్
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్...

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లింగమూర్తిదైన లెస్సయౌ రూపమ్ము
    ప్రస్తరములయందు పట్టిజూచి
    సతము శివుని గొల్చు సద్భక్తులెల్లరు
    రత్నములను విడిచి రాలుగొనెను

    రిప్లయితొలగించండి
  6. పూతమెఱుపుఁజూచిభువిలోనజనులెల్ల
    నాసపడగనాపనాధుడేడి
    విధికినెదురునీదవేరుగాదెవ్వరు
    రత్నములనువిడిచిరాలఁగోనెను

    రిప్లయితొలగించండి
  7. పత్నికి నింపు గూర్చుటకు పట్టము గట్టెడు రామచంద్రునిన్
    కృత్ను యయోధ్యకున్ పతి వికీర్ణ మనస్కుడు పంప కానకున్
    యత్నము లేకయే జనెను హ్లాదమునొందుచు పత్నిగూడుచున్
    రత్నపు రాసులన్ విడచి రాలగొనెన్ సుజనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారి మహిమ గుర్తించి సేవించి
      మోక్షమార్గ మెంచి మోకరిల్లి
      సత్యమైన ధనము సత్పదార్ధమటంచు
      రత్నములను విడచి రాల గొనెను


      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  8. నీతి విలువ బెంచు నిక్కమౌ గ్రంధాలు
    కవుల రచన లుండ కల్ల బొల్లి
    వచన రచన గోరు వక్ర బుధ్ధు డొకండు
    రత్నములను విడిచి రాల గొనెను

    రిప్లయితొలగించండి
  9. నీతి కలిగి నట్టి నేతను కాదంచు
    కల్లు సీసనిచ్చు ఖలుని మెచ్చి
    యోటు వేసినట్టి యూరురా యదియేను
    రత్నములను విడిచి రాలఁ గొనెను

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    రత్నములను విడిచి రాల గొనెను

    ( కురుక్షేత్ర యుద్ధంలో సహాయాన్ని కోరిన దుర్యోధనునితో శ్రీకృష్ణుడు తనను గాని పదివేలమంది నారాయణు లనబడే వీరులను గాని కోరుకోమంటే అతడు కృష్ణుని వదిలి వారిని కోరాడు )

    " నన్ను గొనుము లేక నారాయణాఖ్యుల
    నైన గొను " మనియెను నల్లనయ్య ;
    రెండవదియె కోరె రెటమత రారాజు ;
    రత్నములను విడిచి రాల గొనెను .

    రిప్లయితొలగించండి
  11. రత్నము నెత్తి నున్న ఫణి రాజును కంఠము దాల్చినట్టి, తా

    పత్నికినర్ధ భాగమును పంచిన బిచ్చమునెత్తు వానికై

    యత్నముజేసి భక్తిగను యాజి, మహేశుడు రాశి పోయగన్

    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  12. పత్నినిపుత్రునిన్వదలిభసురమయ్యెడిసత్యచంద్రుడే
    యత్నములన్నిటన్కలియెయోడెనుహాయనివీడెనయ్యెడన్
    రత్నముసత్యసంధతనురాగలకష్టములెంచకేయెదన్
    రత్నపురాశులన్విడిచిరాలఁగోనెన్సుజనుల్నుతింపగన్

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    రత్నరాశినడుమ రంజిల్లు దానవు
    ముండ్ల, రాళ్ల నడక ముదిత కనవు
    వలదన పతి, సీత వనవాసమెంచుచు
    రత్నములను విడిచి రాలఁ గొనెను

    ఉత్పలమాల
    రత్న వినిర్మితమ్ము సుఖ లాలస పంచెడు రాణివాసమున్
    బత్నిగ పొంద నీకు వనవాసము దుర్భరమౌ శిలాదులన్
    చ్యౌత్నమటన్న రాముఁ గని జానకి కాదని వెంటనంటుచున్
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నూత్నముగా లభించిన వినూత్నమునౌ శిలలందు చక్కగన్
    యత్నము లేకనే గనిన యంబరకేశుని లింగరూపమున్
    రత్నములన్ వలెన్ దలచి త్య్రక్షునమేయముగా స్మరించుచున్
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్...

    రిప్లయితొలగించండి
  15. గంధపు చెట్లు, టేకు చెట్ల పెంపకము లో బలవంతముగా పెట్టుబడి పెట్టించిన తీరుపై ఈ నా ప్రయత్నము

    ఉ:

    నూత్నపు రీతులన్ ప్రజల నొత్తిడి జేయుచు స్వల్ప కాలమున్
    యత్నము లేక యిబ్బడగు నాయము బొందుట తథ్యమంచనిన్
    కృత్నుల పర్యవేక్షణగ కిమ్మనకుండగ నమ్మ బల్కగన్
    రత్నపు రాసులన్ విడచి రాలగొనెన్ సుజనుల్ నుతింపగన్

    కృత్ను= నైపుణ్యముగా పనిచేయువాడు ( ఆంధ్ర భారతి )

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు: తథ్యమంచనన్ గా మారుస్తాను.

      తొలగించండి
  16. ( *శిశుపాలుని యంతరంగము* )
    ....... ...... ...... ....... ........ ....... ...... .....
    యత్నము జేసెగాదె యొక యన్నగ చెల్లెలు బాగుకోరి నా
    పత్నిగ జేయనెంచినను భామిని నల్లని గొల్లవానికిన్
    బత్నిగ మారె నయ్యయొ సువాసిని రుక్మిణి యెంత వెఱ్ఱిదో
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  17. ఆ.వె.
    మంచివారితోడు మదిని ముదముగూర్చు
    చెడుతలపులనెపుడు చేర్చరాదు
    ఖలునకెటులదెలియు కమనీయరీతులు
    రత్నములను విడిచి రాలఁ గొనెను

    రిప్లయితొలగించండి
  18. యత్నముతోడ దివ్యపదమర్చనఁజేసియు విగ్రహంబులన్
    రత్నములంచెఱింగెను ధరాధిపుడొక్కడు-సార హీనమౌ
    పత్నియు,పుత్ర,మిత్రులను బాసియు రోసెను సత్యమెంచుచున్-
    రత్నపు రాశులన్ విడిచి రాలఁగొనెన్ సుజనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
  19. ఒక మామ్మ గారికి పండక్కి చీరలు కొందామనిపించింది

    పుత్రరత్నములకు పొసగదిందుల యని
    మనవరాళ్ళనడుగ మంచిదనగ
    కొంటె మనుమడొకడు కొక్కరించె నిటుల
    “రత్నములను విడిచి రాలఁ గొనెను”

    రిప్లయితొలగించండి
  20. ఇంటరంభవంటియిల్లాలునువిడచి
    కోతివంటి నాతిగోరి మగఁడు
    వెర్రివానివోలె వెంపరలాడుచు
    రత్నములను విడిచి రాలఁ గొనెను

    రిప్లయితొలగించండి
  21. నూత్నవిధంపు పోకడలనొప్పెడి సుందరి వాని పొందుకై
    యత్నముజేయ నాతడొక యంగవిహీనను గాంచి యామెనే
    పత్నిగ నొందెనామెకొక పచ్చని జీవనమిచ్చునిచ్చతో
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  22. రత్నపు రాసులన్ వదలి రాలను గోరునె? మూర్ఖుడట్లు దు
    ర్యత్నము జేయునో? సుజను లంధులొ?దాన మెచ్చగన్
    రత్నములన్ శిలాశకలరాశులనున్ గని భేద మెంచి యే
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్, సుజనుల్ నుతింపఁగన్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  23. రిప్లయిలు
    1. పత్ని రమాస్వరూపవతిభాసురభవ్యతనూవిలాసినిన్
      నూత్నకళాసమన్వితవినోదనిరంతరసౌఖ్యదాయినిన్
      యత్నము తోడ వీడి వెలయాలిని గూడె నొకండు మూఢుడై
      రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్‌.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. గణసవరణతో

    రత్నపు రాసులన్ వదలి రాలను గోరునె? మూర్ఖుడట్లు దు
    ర్యత్నము జేయునో? సుజను లంధులొ?యెట్దాలుగ న మెచ్చగన్
    రత్నములన్ శిలాశకలరాశులనున్ గని భేద మెంచి యే
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్, సుజనుల్ నుతింపఁగన్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. రత్నము రత్నమే తళుకు రంగుల రాళ్ళవి తట్టెడేలకో
    రత్నముయత్నసాధ్యమదిరాజులకిష్టముజాతిరత్నమే
    రత్నమిహంబుధర్మమదిరాయిపరంబగుమోహమన్
    *రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్”*

    రిప్లయితొలగించండి
  26. యత్నముతోడమాధవునియాలిగమారగనెంచిబీబియే
    రత్నముబోలువల్లభులురాగవిరాగితిరస్కరించెలే
    పత్నియనంగయీమెశహబాసనిభక్తికిగట్టపట్టమున్
    *రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్”*

    రిప్లయితొలగించండి
  27. భార్య మెప్పు (బొంద భర్త నొకండుయు
    పట్ణమంత( దిరిగి పనికి రాని
    మెరిసి బోవుచున్న మేలిమి నివియని
    రత్నములను విడచి రాల గొనెను

    రిప్లయితొలగించండి
  28. కర్షకుం డొకండు కామధేను నిభము
    లావుల నిటఁ జూప మని యడుగఁగ
    విక్రయించు చోటు వీక్షించి వరధేను
    రత్నములను విడిచి రాలఁ గొనెను

    [విడిచిరి +ఆలఁ = విడిచి రాలఁ; ఆలు =ఆవులు]


    రత్నము పుట్టు నింపుగను రాతినిఁ జక్కఁగ సానపట్టఁగా
    యత్నము తోడ నాఁ దలఁచి యంచిత వర్తక పుంగవుండు దాఁ
    బత్నిని వెంటఁ బెట్టుకొని పన్నుగ నేఱి మహానుభావుఁడే
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  29. కామితములు తీర్చు కామధేనువదియు
    గృహమునందు నుండ కేలు సాచి
    పరుల యింటి కేగి పాలుకోరినయట్లు
    రత్నములను విడిచి రాలు గొనెను

    రిప్లయితొలగించండి
  30. భక్తి మెయి సమాజ ప్రగతికై కృతిమణుల్
    రచన జేసె త్యాగరాజు, యెఱిగి
    స్వర రసజ్ఞుడు తన సంగీతమున పంచ
    రత్నములను విడిచి రాలఁ గొనెను౹౹

    రిప్లయితొలగించండి
  31. నూత్న గృహంబుకై యచట నుండిన పాత భవంతి గూల్చ నా
    యత్నమునన్ బయల్పడెనహా నిధి యందున గండకీ శిలల్
    రత్నములున్ కనుంగొని పరంతపుడా హరి సేవ కోసమై
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  32. కృత్నుడు నౌ సుయోధనుడు కృష్ణ సహాయము గోరవచ్చి ని
    ర్యత్నుడటంచు దన్ను విడి యాదవ వీరుల నేరుటన్ గనన్
    యత్నము పారెనంచనుచు నర్జుని దోడుత యచ్యుతుండనెన్
    రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్.

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల:
    -------------
    పత్నిని వెంటబెట్టుకొని,పావనతీర్ధములన్ని జుట్టుచున్
    యత్నపులోపముంచకను ,యాత్రలనన్నిట జేయుచుండగా
    పత్నికి కంటనే బడెను,పళ్ళికిలించెడు సాములోరికన్
    రత్నపు రాసులన్ విడిచి,రాలగొనెన్ సుజనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
  34. ఉత్పలమాల;
    --------------
    రత్నమురాసియై నిలిచి,రాణిగ బొందిన జానకమ్మతో
    నూత్నపురాజహంసగను,నూహల దేలుచునుండ నంతలో
    యత్నముజేసిరావణుడు,యాతనబెట్టగవానరాఖ్యులన్
    రత్నపురాసులన్ విడిచి, రాలగొనెన్ సుజనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
  35. క్రొత్త కవిని జదువు కోర్కెల నూరంగ
    భర్తృ హరిని జదివి బాగుపడడు
    చెత్తనెత్తికెక్క చేతనగోల్పోవ
    రత్నములను విడిచి రాలగొనెను

    రిప్లయితొలగించండి
  36. భర్తృ హరిని విడిచి బాధలు బెట్టెడు
    శుష్క కావ్యమనగ సుత్తిగొట్టె
    చేతబట్టనతడు చేతనగోల్పోయె
    రత్నములను విడిచిరాలగొనెను

    రిప్లయితొలగించండి
  37. ఆటవెలది:
    +++++++++++++
    భార్యభర్తలనెడు బంధము మారెను
    కలసి జీవనంపు కాలమొచ్చె
    పెండ్లిగానికన్నె పెకలించ సంస్కృతి
    రత్నములనువిడిచి రాలగొనెను.

    రిప్లయితొలగించండి
  38. శ్రీ. కె.ఈశ్వరప్ప.ఆలూరు
    దొంగతనముజేయు సంగతిదెలియక
    పిల్లియెగురునపుడు దొరలరవమువిని
    రత్నములనువిడిచిరాలుగొనెను

    రిప్లయితొలగించండి