3, జనవరి 2021, ఆదివారం

సమస్య - 3594

4-1-2021 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్”

(లేదా…)

“తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై”

75 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    వినకే మిత్రుల మాటలన్ మొరటుగా వేగమ్మునన్ జేరుచున్
    ఘనమౌ యోగుల నాశ్రమంబు నహహా గర్వంబు కోల్పోవగా
    పనికిన్ మాలిన రీతినిన్ తిరుగుచున్ బంజార హిల్సందునన్
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై..

    రిప్లయితొలగించండి
  2. వనిలోకుదరదుసాధన
    మనసునదాగినతలపులనాపుకోనంగా
    తనువేనాయుధమౌగా
    తనతోశయనింపమౌనితన్వినిఁగోరెన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చనుచున్ వంగపు దేశమందు వడిగా జంఘాలశాస్త్రీయుడే
    మునుపున్ గానని రీతినిన్ తనరుచున్ మోహంపు కార్యమ్ములన్
    ఘనమౌ వీరుల పద్ధతిన్ జరుపుచున్ కాపాలికమ్మందునన్
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై...

    రిప్లయితొలగించండి
  4. ఘన తపముసేయు కౌశికు

    ముని చెంతకు మేనకమ్మ మురిపము రాగ

    న్గని కన్ను చెదరి తమకము

    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కౌశిక ముని... కను చెదరి తమకమున...' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ
      సరిచేస్తానండీ

      తొలగించండి
  5. వ్యాస జననము 🙏🙏

    అనఘండగు పుత్రునిగన
    ఘనమౌ ఘడియలని దలచి గంగను
    నావన్
    దినమున్ రాత్రిని జేయుచు
    తనతో శయనింప మౌని తన్వినిగోరెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనఘుండౌ సుతుడుద్భవించి భువినం దామ్నాయముల్ గూర్చగా
      ఘనమౌ మూర్తముగా దలంచి మనమున్ గంగానదీమధ్యమున్
      దినమున్ రాత్రిగమార్చుచున్ పడవలో
      తేజస్వి తాదైవ చిం
      తన తోడన్ శయనింపగన్ బిలిచె
      కాంతన్ యోగి మోక్షార్ధియై

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. కందం
    ఘన భరతావని నామముఁ
    దన పేరున నిల్పఁగలుఁగు దౌహిత్రు గనన్
    మునుముందుగ నిర్ణయమో?
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్

    మత్తేభవిక్రీడితము
    తనియన్ ముక్తినిఁ గశ్యపాదితులొగిన్ ధ్యానింప దామోదరున్
    దనయుండై జనియింప నొప్పి వరమున్ నందింప నందించగఁన్
    మనపై భారము వైచె దైవమనుచున్ మన్నించ నాదేశమున్
    దనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై

    రిప్లయితొలగించండి
  7. వినగాభామినితర్కమున్మనమునన్వేమారులూహించుచున్
    అనిలోపోరదితత్వమెంచననుచున్నానందరాసిక్యమున్
    తనువేనూగగశంకరుండుతమితోతాపంబునార్పంగయా
    తనతోడన్శయనింపఁగన్బిలిచెఁగాంతన్యోగిమోక్షార్ధియై

    రిప్లయితొలగించండి
  8. ముని తపము చెరచ బలసూ
    దనుడే మేనకను పంప తపమును చాలిం
    చి నారి పొంకములను గని
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బేసి పాదాలలో బేసిగణంగా జగణం వాడరాదు. "...చి నెలత పొంకములను గని" అనండి.

      తొలగించండి
  9. మనమున దేవుని దలచుచు
    ననయము జపియింప వలయు నాహరి పదముల్
    మునుకొని స్వచ్ఛంబగు చే
    తనతో శయనింప మౌని తన్విని గోరెన్

    రిప్లయితొలగించండి
  10. కనుగొన లేకుంటిమిలే
    మనసే చెప్పంగ లేక మాన్యతగనమే
    వినయము విడిచిన మానిసి
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్!!

    రిప్లయితొలగించండి
  11. తనకున్ సంతతి లేకనూర్ధ్వగతులన్ దా పొందలేనంచు నా
    మునిహింసీరముతోడ శీఘ్రగతిఁ సత్పుత్రుండ్రనే పొందగా
    మనువాడెన్ గద మందపాలుడు గరుత్మంతమ్మునే, పేర్మితో
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "లేక యూర్ధ్వగతులన్.." అనండి.

      తొలగించండి
  12. యోగి ని పోలీసులు నిర్బంధించ వచ్చినపుడు ఆశ్రమము లో గల పరిస్థితి ఆధారంగా నా ప్రయత్నము:

    మ:

    నినదించన్ వినిపించె నాశ్రమము తానేరస్థుడే కాదనిన్
    యెన లేనంతగ గోలసేయుచును "దేహీ" యంచు వేడంగనై
    వినకన్ పోలిసు లిట్లు దెల్పి రెటులౌ వీడంగ నివ్వానినిన్
    తనతోడన్ శయ నింపగన్ బిలిచె గాంతన్ యోగి మోక్షార్థి యై

    దేహీ = రక్షించ మని ప్రార్థన

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన
    సమస్య
    *“తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్”*
    (లేదా…)
    *“తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై”*

    పూరణ

    1 ) కందము

    వనమందున గాధి సుతుడు
    ఘనతపమును జేయుచుండిఁ గనియెన్ లేమన్
    మేనకఁ సునిశిత దేహన్
    తనతో శయనింప మౌని బిలిచెన్ గాంతన్

    2) మత్తేభము

    మునివర్యుండు పరాశరుండుగనె నామోదంబు లేపారగా
    వనితారత్నము మత్స్యగంధిఁ గడు దివ్యంబైన కన్యామణిన్
    ఘనమౌ రీతిగ నావలో కలియ నాకాంక్షిచి తాదాత్మ్యతన్
    తనతోడన్ శయనింపగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి


  14. చనువుగ మేలైన ప్రవ
    ర్తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్
    అనుమానమువలదు సుమా!
    తన భార్యను కోరె ధవుని ధర్మముగ సుమీ



    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. ముని వాటిక నలవాటుగ
    తనతో శయనింప ; మౌని తన్వినిఁ గోరెన్
    శునకమునకు పాలనొసగి
    యనువుగ నిదురింప జేయు మనుచు పిరిమిగన్

    రిప్లయితొలగించండి
  16. వనమున విశ్వామిత్రుడు
    తన తపమును ఘోర రీతి తనరుచు నుండన్
    గునుపుగ మేనక కనబడ
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్

    రిప్లయితొలగించండి
  17. సమస్య :
    తన తోడన్ శయనింపగన్ బిలిచె గాం
    తన్ యోగి మోక్షార్థియై

    ( కైవల్యం కోరిన రక్తభిషయోగిని ముందు గృహస్థుడవై సంతానవంతుడవైనాక ముక్తిని పొందుతావన్న లలితాదేవి ఆజ్ఞాపాలనకై రాజ్యలక్ష్మి అనే కాంతను పెండ్లాడిన యోగి )

    మత్తేభవిక్రీడితము
    ..........................

    అనయంబున్ లలితామహాంబికను మో
    క్షాకాంక్ష సేవింపగా
    ఘనమౌ దర్శనమిచ్చి దేవి " సుతునిన్
    గన్గొన్న నాపిమ్మటన్
    ముని ! కైవల్యము నందుదీ " వన ; మహా
    మోదంబునన్ బోయి చే
    తన తోడన్ శయనింపగన్ బిలిచె గాం
    తన్ యోగి మోక్షార్థియై .

    (వేదాంతం వారి దర్శకత్వంలో వచ్చిన లలితాశివజ్యోతి చిత్రరాజం " రహస్యం " కథ ఆధారంగా )( చేతన - తెలివి )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'లవ కుశ' ద్వారా సంపాదించినదంతా ఆ నిర్మాత 'రహస్యం'తో పోగొట్టుకున్నాడు. రహస్యం చిత్ర వైఫల్యానికి కారణాలనేకం. మొదట జానపద చిత్రాల నాయకుడుగా ఉన్న నాగేశ్వరరావు తరువాత సాంఘికాలకు పరిమితమయ్యాడు. సాంఘిక చిత్రాల నాయకుడిగా చూడడానికి అలవాటు పడిన జనాలు అతన్ని జానపద నాయకుడిగా చూడలేకపోయారు. ఏదో సస్పెన్స్ సినిమాతో జనాలను సంభ్రమాశ్చర్యాలతో ముంచేద్దామన్న ఆలోచన చిత్రాన్నే ముంచింది. రక్తభిష యోగి యువకుడు (కాంతారావు)గా మారుతున్న విషయాన్ని ప్రేక్షకులకు ముందే తెలియజేస్తే బాగుండేది. అసలు రహస్యాన్ని బయట పెట్టే సన్నివేశం పద్యాల సంభాషణతో ఉండడం సామాన్యజనులకు నచ్చలేదు.
      ఆ సినిమాలో కొన్ని పాటలు బాగుంటాయి. ముఖ్యంగా 'గిరిజా కళ్యాణం' యక్షగానం అత్యద్భుతం!

      తొలగించండి


  18. అనుమానమ్ము జనాళి కింక వలదీ యభ్యంతరంబైన చే
    ష్టనునిర్ముక్తుడు చేసె నంచు సభలో! సాధింప శాలీనుడై
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై
    తనయిల్లాపెను జాగురూకుడగుచున్ తంత్రార్థసారమ్ముతో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. ఇనుడున్ చంద్రుడు సర్వ లోకములు సృష్టిన్ స్వర్గ పాతాళముల్

    తనుకన్దిక్కులు పిక్కటిల్లగను భూతమ్ముల్కరుల్సింహముల్

    వణికెన్ కౌశికు ఘోర దీక్షగని; దేవ్యావేశ్య పొంగుల్గనిన్

    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( రెండవ పాదము
    తనుక .. భయము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'దేవ్యావేశ్య' ? 'కనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. ఘనదీక్షాదృఢబద్ధుడై గురుకృపాకాంక్షావ్రతాలంబియై
      తనరన్ భూతలశాయియై మనసునం దయ్యప్పభక్త్త్యున్నతిన్
      తనువుం దాల్చిన నీలవస్త్రుడయి నిత్యార్చావిధిన్, గూతు చే
      తన తోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. తనువులశాశ్వతములనుచు
    ధనకనకాదులుపరువపు దర్పములెల్లన్
    తనతోరావని హరి చిం
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్

    రిప్లయితొలగించండి
  22. తనకున్ సంతతి లేక యూర్ధ్వగతులన్ దా పొందలేనంచు నా
    మునిహింసీరముతోడ శీఘ్రగతిఁ సత్పుత్రుండ్రనే పొందగా
    మనువాడెన్ గద మందపాలుడు గరుత్మంతమ్మునే, పేర్మితో
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై

    రిప్లయితొలగించండి
  23. వనవాసమ్మునకేగువేళఁదనసద్భా
    వంబుసద్భక్తి,రా
    మునితోడన్ జని లక్ష్మణుండుభళి సంపూ
    ర్ణంబుగాగోరెప
    త్నిని,నాపైనటు పర్ణశాలనను నేతీ
    రున్యుటంకించి చిం
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీరున్ + ఉటంకించి' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  24. ఘనుడాపుణ్యుడుమందపాలుడనువిఖ్యాతుండుశీఘ్రంబుగా
    ఘనసంతానముబొందగోరిజరితాఖ్యన్బక్షి బద్మాక్షినిన్
    *“దనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై”*
    గనియెన్ నల్వురు పుత్రు లాగమములోజ్ఞానాగ్నిరూపంబనన్



    వనమున్జేరెదపంబుసల్పెమునువిశ్వామిత్రుడేకాంగుడై
    మననధ్యానమహోగ్రదీక్షగొనెబ్రహ్మర్షిత్వమందన్ఘనా
    ఘనుడంపెన్భువివేల్పుచేడియనువిఘ్నార్థంబుగామోద్ధృతిన్
    *“దనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై”*

    రిప్లయితొలగించండి
  25. మనవిని వినుమని మునివరు
    వనితామణి నిద్ర లేమి బాపగ వేడన్
    మనమున పరమాత్ముని చిం
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్

    రిప్లయితొలగించండి
  26. ఘన యోగ ప్రకట ప్రభావ ధృతి వి
    ఖ్యాతిల్లు మౌనీశ్వరున్
    దన చిత్తంబున దూగు వేదన ని
    వృత్తం బొందగా గోరగన్,
    "వినుమా! మానస మందు నిర్మలత సం
    ప్రీతిన్సదా పొంది చే
    తన తోడన్ శయనింప"ఁగన్ - బిలిచెఁ గాం
    తన్ యోగి మోక్షార్థియై!

    రిప్లయితొలగించండి
  27. అనయముశుభమగుహరిచిం
    తనతోశయనింప,మౌనితన్వినికోరెన్
    వనితా!విడువకు పతిసే
    వనునెల్లపుడునుగలుగునుబరమపదంబున్

    రిప్లయితొలగించండి
  28. ఘనుఁ డింద్రియ నిగ్రహఁడు సు
    మనస్కుఁడు తపో నిరతిని మను వాఁ డంతం
    దన భార్యను వీక్షించుచుఁ
    దనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్

    [తన్వి = తనివి, తృప్తి]


    ఘన సుశ్రోణినిఁ జంచరీకచికురం గంజాక్షి వీక్షించ నిం
    తినిఁ గామార్తులు కాని వా రరుదు గాధేయుం డహో మేనకం
    గని నిష్ఠం దప మాచరించుచుఁ దగన్ క్షత్రర్షి భావమ్మునం,
    దనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి, మోక్షార్థియై

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. కనగాదెల్సెనుదానుగారమనువేకళ్యాణమాడంగనౌ
    దనతోడన్శయనింపగన్బిలిచెగాంతన్యోగిమోక్షార్ధియై
    జనతావాసమువీడికాననపువాసంబున్గోరుకొంచుదా
    మననంబయ్యదిచేయగాశివునినామంబున్ నేగె గాయటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం అర్థం కాలేదు. మూడవ, నాల్గవ పాదాలలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  31. ఆటవెలది
    నల్లకోఁతిఁ దెచ్చి నళినాక్షియనదిద్ది
    రంగులద్ది యప్పరసగఁ జూపు
    చిత్రసీమ నొప్పి పాత్రగా నెంచినఁ
    గనుల విందొనర్చు గబ్బిలమ్ము

    చంపకమాల
    అనిశము సంపదల్ బడయ హంగులు గూర్చుచు చిత్రమందునన్
    గనఁగను కారునల్పుగనుఁ గన్పడ రంగులలంకరించి మే
    దిని దిగినట్టి యప్సరగఁ దీర్చరె నేర్పున! వారలొప్పినన్
    కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో! !

    రిప్లయితొలగించండి
  32. ఘనముగ గాదిసుతుండట
    మనమున బ్రహ్మర్షి గాగ మానుగ తపమున్
    వనిలో మేనకనుగనుచు
    తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్”*

    రిప్లయితొలగించండి