సం క్రాం తి సం బ రా లు ...........................................
ఎచ్చోట జూచిన నింపుగ హరిదాసు
కీర్తనతో జేయు నర్తనములె
ఎచ్చోట జూచిన నెసగెడు తియ్యని
జానపదుల యొక్క గానసుధలె
ఎచ్చోట జూచిన నచ్చెరు వొసగును
కోలాట రవముల లీల గతులె
ఎచ్చోట జూచిన హెచ్చుగ ధ్వనియించు
చెక్కలభజనల యొక్క శ్రుతులె
రంగురంగుల రంగవల్లరుల కాంతి
రంగరించిరి కాంతలు ప్రాంగణమున |
కర్షకులు తడియగ హర్షవర్ష మందు ,
వచ్చె సంక్రాంతిలక్ష్మి శోభాయముగను |
మకరసంక్రాంతి మన కిడె నికరముగను :--
సకల శుభముల సుఖముల సంతసముల !
........................................................................................... సం క్రాం తి నా డు బ స వ దే వు ని అ లం కా ర ము ...........................................................................................
పసుపున్ గుంకుమ బొట్టువెట్టెదము నీ ఫాలాన | శృంగమ్ములన్
మిసిమిన్ దీర నొనర్తు మయ్య - నడుమన్ మేలైన పూలుంతుము + ఈ
గు రు మూ ర్తి ఆ చా రి వెలుగోడు ( కర్నూల్ )
రిప్లయితొలగించండి-------------------------------------------
సం క్రాం తి సం బ రా లు
...........................................
ఎచ్చోట జూచిన నింపుగ హరిదాసు
కీర్తనతో జేయు నర్తనములె
ఎచ్చోట జూచిన నెసగెడు తియ్యని
జానపదుల యొక్క గానసుధలె
ఎచ్చోట జూచిన నచ్చెరు వొసగును
కోలాట రవముల లీల గతులె
ఎచ్చోట జూచిన హెచ్చుగ ధ్వనియించు
చెక్కలభజనల యొక్క శ్రుతులె
రంగురంగుల రంగవల్లరుల కాంతి
రంగరించిరి కాంతలు ప్రాంగణమున |
కర్షకులు తడియగ హర్షవర్ష మందు ,
వచ్చె సంక్రాంతిలక్ష్మి శోభాయముగను |
మకరసంక్రాంతి మన కిడె నికరముగను :--
సకల శుభముల సుఖముల సంతసముల !
...........................................................................................
సం క్రాం తి నా డు బ స వ దే వు ని అ లం కా ర ము
...........................................................................................
పసుపున్ గుంకుమ బొట్టువెట్టెదము నీ ఫాలాన | శృంగమ్ములన్
మిసిమిన్ దీర నొనర్తు మయ్య - నడుమన్ మేలైన పూలుంతుము + ఈ
కుసుమగ్రైవము వైతు మయ్య మెడలో | కొండంత ప్రేమాస్పదన్
బసవా ! దండముబెట్టి కొల్తుము నినున్ , భర్గుండు హర్షింపగా !
( శృంగము = కొమ్ము : గ్రైవము = దండ : భర్గుడు = శివుడు )
****************************************
మన్మోహన కైతలతో
రిప్లయితొలగించండిజన్మము సార్థకము గాగ జన ప్రియుడగు చున్
తన్మయ మందుచు నుండగ
సన్మానం బేల కవికి సంక్రాంతి కిలన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మన్మోహన' అన్న ప్రయోగం సాధువు కాదు. 'మోహన కైత' దుష్టసమాసం. సవరించండి.
చిన్మయు పై కవితలతో అని మొదటి పాదం సవరించడమైనది
తొలగించండి
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
సన్మార్గంబును వీడుచున్ జరుపుచున్ ఛందస్సులన్ దోషముల్
మన్మోహంబున విఱ్ఱ వీగుచును వే మర్యాదలన్ కోరి తా
నున్మాదమ్మున నోలలాడి కడకున్ హుందాను కోల్పోవగా
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్..
తొలగించండి* మున్మాదమ్మున
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మన్మోహంబు' సాధు ప్రయోగం కాదు.
🙏
తొలగించండిఉన్మాదపు పలుకులతో
రిప్లయితొలగించండిసన్మార్గపు బాటనొదలి శబ్బరి దారి
న్నున్మాద రచన సేయగ
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వదలి'ని 'ఒదలి' అనరాదు. "బాట వదలి/బాటను విడి" అనవచ్చు. 'శబ్బరి దారి'?
2 వ పాదములో “బాటనొదలి” స్థానములో “బాటను విడి” గా చదువుకొనలసిందిగా మనవి
తొలగించండిధన్యవాదములండీ శంకరయ్య గారూ
తొలగించండిశబ్బరి... చెడ్డ
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సన్మార్గమ్మున నాంగ్లమున్ నడుపుచున్ చాంతాడులౌ బ్లాగులన్
మున్ముందెప్పుడు వ్రాయకే తెలుగునన్ పొందైన మాటొక్కటిన్
జన్మంబొందుచు శంకరాభరణమున్ సర్దాగ వ్రాయంగ వే
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్..
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసన్మానంబది కాద గౌరి పతి మెచ్చంగాను పద్యమ్ములన్
రిప్లయితొలగించండిసన్మానంబది కాద శ్రీ పతియె మెచ్చంగాను పద్యమ్ములన్
సన్మానంబది కాద వాణి పతి మెచ్చంగాను పద్యమ్ములన్
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిమృన్మయ దేహమ్మైనన్
దన్మూలము భుక్తి తోడఁ దనరఁగ భువినిన్
సన్మతి నొనర్చని బ్రభుత
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్?
శార్దూలవిక్రీడితము
ఉన్మేషంబున దైవదత్తపు కవిత్వోల్లాసమున్ బంచగన్
జన్మన్ బొందిన దాదిగా యుదర పోషాహారముల్ ముఖ్యమౌ
తన్మూలమ్మును గూర్చకే ప్రభుత సంధానించెడున్ జ్ఞాపికా
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి"...బొందిన దాదిగా నుదర..."
గురుదేవులకు ధన్యవాదములు.మీతో గలిపి కవిమిత్రులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
తొలగించండిసవరించిన పూరణ:
శార్దూలవిక్రీడితము
ఉన్మేషంబున దైవదత్తపు కవిత్వోల్లాసమున్ బంచగన్
జన్మన్ బొందిన దాదిగా నుదర పోషాహారముల్ ముఖ్యమౌ
తన్మూలమ్మును గూర్చకే ప్రభుత సంధానించెడున్ జ్ఞాపికా
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
మృన్మయమందున గాంచగ
రిప్లయితొలగించండిసన్మిత్రుడు పద్యములను చదువిన తోడన్
తన్మయు లైనను చాలదె
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మృన్మయమందున గాంచగ'?
"చదివినతోడన్" టైపాటు.
సన్మార్గంబునుఁజూపుచు
రిప్లయితొలగించండితన్మార్గంబునకవితలుతలకోనివ్రాయన్
చిన్మయజగతియుచూడదు
సన్మానంబేలకవికిసంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తలకొని'టైపాటు.
ఉన్మేషంబగు కావ్యముల్ జనులలో నుత్సాహమున్ నింపెడిన్
రిప్లయితొలగించండిమన్మోహంబుగ వ్రాసినట్టి కృతులన్ మన్నింతురే పాఠకుల్
సన్మిత్రుల్ గనిమెచ్చుటన్నదె పురస్కారమ్మెయౌ వేరుగన్
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమన్మోహనమగు కవిత న
రిప్లయితొలగించండివోన్మేష పథమున జాతి నుసికొల్పంగా
జన్మంబు ధన్య మన్యుల
సన్మానంబేల కవికి సంక్రాంతి కిలన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! సవరించెదను!🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ
తొలగించండిచిన్మయమౌ కవితలను న
వోన్మేష పథమున జాతి నుసికొల్పంగా
జన్మంబు ధన్య మన్యుల
సన్మానంబేల కవికి సంక్రాంతి కిలన్?
ఉన్మాదంబకు కవికిని
రిప్లయితొలగించండిసన్మానము జేయ బిలిచె సాహితి వేత్తల్
సన్మార్గంబును జూపని
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఉన్మాదుండగు కవికిని' అనండి.
'సాహితీవేత్తల్' అనడం సాధువు.
జన్మము సఫలమ్మనగా
రిప్లయితొలగించండిసన్మిత్రులగు కవివరుల సావాసముతో
సన్మార్గమ్మున సాగన్
సన్మానంబేల కవికి సంక్రాంతి కిలన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా:
రిప్లయితొలగించండితన్మాత్రం బొన గూర్చ భావ్య మనరే ! తాదాత్మ్యమున్ జెందుచున్
మన్మోహంబగు గ్రంథ కావ్యములనున్ మన్నింపుతో వ్రాయగా
నున్మా దంబున మాటలాడ దగునే నున్మత్తు లీరీతినిన్
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వంబునన్
తన్మాత్రమ్=సన్మాన మనే "ఆ మాత్రము" అనే అర్థంలో రాశాను.
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిసన్మానంబు లవేల సత్కవులకున్
సంక్రాంతి పర్వమ్మునన్
( అభినందనని మించిన సన్మానం
ఏముంటుంది ? )
ఉన్మాదంబులు లేక కావ్యరసపా
నోన్మేషులై నిత్యమున్
తన్మాత్రంబగు హ్లాదమున్ తగినచి
త్తంబందునన్ బొందుచున్
సన్మార్గంబున నేగు సౌహృదము వీ
సంబంతయున్ గల్గినన్
సన్మానంబు లవేల సత్కవులకున్
సంక్రాంతి పర్వమ్మునన్ ?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిన్మయ రూపును తలచుచు
రిప్లయితొలగించండితన్మయులైకొలువగసతతమ్మతి భక్తిన్
సన్మనమునమెచ్చహరియు
సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందము:
రిప్లయితొలగించండి+++++++
కన్మరుగున కాంతలనిడి
చిన్మయమగు భక్తియనుచు చిందులువేసెన్
సన్మతివీడిన చోటుల
సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిDhanyavaadaalu guruvaryaa
తొలగించండిచిన్మయ చిత్తుడగుటచే
రిప్లయితొలగించండితన్మయమున వేరు మతపు తప్పులనెంచన్
నున్మాద రచన జేయగ
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందము:
రిప్లయితొలగించండి+++++++
తన్మయమందగతగునా?
ఉన్మాదముగాకనేమియుచ్చిలియగునా?
సన్మనమును వీడురోజుల
సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్
----------------------------
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "సన్మనము వీడు రోజుల/సన్మనమును విడు రోజుల' అనండి.
తొలగించండితన్నయనందగ తగునా
ఉన్మాదముగాకనేమియుచ్చిలియగునా?
సన్మనమువీడురోజుల
సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్
(సవరణ పాఠము ధన్యవాదాలతో)
రిప్లయితొలగించండిసకలము మీకెరు కయ్య! వె
స కసురు కొననేలనయ్య సన్మానంబే
ల కవికి సంక్రాంతికిలన్?
చకితుల మైనామయా నిజమెరుగ లేకన్!
జిలేబి
'న్మ' ప్రాసక్లేశాన్ని తప్పించుకున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికన్మూసిన కన్ దెరచిన
రిప్లయితొలగించండిపెన్మాయల ద్రుంచు వాడు వెన్నుండుండన్
మన్మోహను దరి జేరగ
సన్మానంబేల కవికి సంక్రాంతి కిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిమున్ముందెన్నడు లేదు రేపు నిపు డున్ముత్యంబిదే గాంచగా
రిప్లయితొలగించండిమన్మోహాంగము లివ్వి యివ్వి యని తన్మాధుర్యమున్జెప్పగా
సన్మిత్రాళియ తన్మయాత్ములయి సౌజన్యంబు హర్షించగా
*“సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసన్మార్గంబువచించిభావికులశశ్వచ్ఛ్రేయమున్బూన్చియున్
రిప్లయితొలగించండిజన్మార్థాశయముత్తమోత్తమగతిన్సంతోషమున్గూర్చియున్
సన్మిత్రాళిహృదాంజలుల్గొనినవిశ్వశ్రేయమున్నించుచో
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసవరించిన పద్యం
రిప్లయితొలగించండిచిన్మయ రూపుని లీలల
తన్మయత న్ వ్రాసి తాను ధన్యత జెందెన్
జన్మ తరించియు నుండగ
సన్మానం బేల కవికి సంక్రాంతి కిలన్?
...అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండి★ ......శంకరాభరణం....★
◆ .....14-1-2021 ......గురువారం.....◆
సమస్య - 3603
***** **** *** ***
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
నా పూరణ. శార్దూలము
**** *** **
ఉన్మాదమ్మును బ్రోత్సహించు కృతులే యుత్పత్తి తాఁ జేయకే
సన్మార్గమ్మును బోధఁ జేయు రచనల్ చక్కంగఁ దాఁ సల్పుచున్
జన్మన్ ధన్య మొనర్చుకున్న నదియే చాలున్ గదా!వేరుగన్
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
★★ ఆకుల శాంతి భూషణ్ ★★
★ వనపర్తి ★
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉన్మాదపు పనులేటికి
రిప్లయితొలగించండితన్మయముగకవితజెప్పదారిద్ర్యమునన్
సన్మానము క్షుధనార్పదు
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిన్మా మిత్రమ కన నీ
రిప్లయితొలగించండికన్మును జాఁ గగు భృశముగఁ గావున నేఁడే
తన్మన మలరఁగఁ జేయుఁడు
సన్మానం, బేల కవికి సంక్రాంతి కిలన్
జన్మాధిక్యుఁడు కాశ్యపేయుఁడు సహస్రస్యోన ధీరుండు కిం
చిన్మోహమ్ము వహించె నేమొ యన నిస్సీ బంధితుం డైన యీ
షన్మాత్రమ్ము బలమ్ము సూప కసిదంష్ట్ర ద్వేష్య వక్త్రమ్ములో
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్
[అసిదంష్ట్రము = మకరము]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికన్మూసిన దెరచిన గన
రిప్లయితొలగించండిమన్మందిరమున మనోఙ్ఞమౌ పలుకుజెలిన్
జన్మంబే ధన్యంబౌ
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మన్మందిరము' సాధుప్రయోగం కాదు.
సన్మార్గంబందు జనుల
రిప్లయితొలగించండినున్ముఖులను జేయు కవిత లుత్తేజమిడన్
సన్మతులైనను జాలిక
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసన్మిత్రులు మెచ్చు కొనగ
రిప్లయితొలగించండిసన్మానం బన కవులకు, సంతోషమ్మే
ఉన్మాదపు కవితలకా
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్!!
ఉన్మాదుల్ రచియించుచుందురిలలో నూరించు కాన్కల్ గొనన్
రిప్లయితొలగించండిమన్మందారమునందు వాణినిలువన్ మాధుర్యమౌకైతలన్
సన్మార్గమ్మున పోవుచున్ రచనలన్ సాగించుచున్ మించగా
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిన్మయ రూపును తలచుచు
రిప్లయితొలగించండితన్మయులైకొలువగసతతమ్మతి భక్తిన్
సన్మనమునమెచ్చహరియు
*సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్"