4, జనవరి 2021, సోమవారం

సమస్య - 3595

5-1-2021 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కనుల విందొనర్చు గబ్బిలమ్ము”

(లేదా…)

“కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో”

 

80 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  చనుచును రెక్కలన్ గొనుచు చక్కని రీతిని చెట్లపైననున్
  వినుచును నాదముల్ తనరి వీక్షణ లేకయె గేహమందునన్
  కునుకుచు తల్ల క్రిందుగను కూరిమి మీరగ దూలమందునన్
  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో...

  రిప్లయితొలగించండి
 2. కనులువిచ్చుకున్నకనిపించుకాంతియే
  మాలయన్నమాటమాయమయ్యె
  నేటిమేటిమగలునేర్వగావీరెగా
  కనువిందోనర్చుగబ్బిలమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కనుల విందొనర్చు' టైపాటు.

   తొలగించండి
  2. [05/01, 2:26 p.m.] Nanna: *5-1-2021 (మంగళవారం)*
   *సమస్య – 3595*
   కవిమిత్రులారా,
   ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

   ఆ.వె. లో..
   *“కనుల విందొనర్చు గబ్బిలమ్ము”*

   (లేదా…)

   చంపకమాల లో..
   *“కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో”*

   పూరించిన వారు ఇక్కడ ముందుగా పెట్టిన పిదప కింది బ్లాగు లో వ్యాఖ్యానం బాక్స్ లో గాని..

   http://kandishankaraiah.blogspot.com

   లేదా ఫేస్ బుక్ లో శ్రీ కంది శంకరయ్య గారి ప్రొఫైల్ లో కాని , శంకరాభరణం వేదికపై న కాని పోస్ట్ చేయండి. అక్కడి ఇతర కవుల పూరణలను కూడ చూడండి.
   [05/01, 2:45 p.m.] Nanna: చం !!తనువునునంత శీర్షము నధోముఖమై జనుచుండనేమిటో

   తనువునునూపుచుండెదవ దీశ్వర సేవనుకొందువేేే సుమీ
   జనమునొకింత చీదరనుచూపిన
   వేములవాడమందిర
   మనుచును సాగ వారికిసమూహములుంగ తపస్సు
   చేయుచూ
   కనులకువిందొసంగుగదగబ్బిలమే
   తనసోయగమ్ముతో,,

   వరలక్ష్మిశంకర్శర్మ

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కట్టుకథ కాదు...వాస్తవపురాణమే... కలకత్తాలో నా మిత్రుడు చెప్పగా వినినది:

  ఘనమగు పెండ్లి విందులను కమ్మగ మేయుచు శోభనమ్మునన్
  చనగను రాత్రినిన్ మిగుల చంకలు గొట్టుచు గేహమందునన్
  కనగను దూలమందునొక కన్నియ భీతిని కౌగిలించగన్
  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో...

  రిప్లయితొలగించండి
 4. దళిత జనుల బాధ దయనీయ మనుచును
  కవుల రచన పలికె శివుని చేరి
  జాషువయ్య పదము చక్కగా మెరిసెగా
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి

 5. పచ్చి గబ్బిలపు మాంసము భళారె :)


  చింగు ! చాంగు ! కాంగు! శీఘ్రము గారండు
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము!
  చక్క గాను నరికి చల్లగా తిందామ
  టంచు తినగ వచ్చె రా కరోన!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. ఆటవెలది
  నల్లకోఁతిఁ దెచ్చి నళినాక్షియనదిద్ది
  రంగులద్ది యప్పరసగఁ జూపు
  చిత్రసీమ నొప్పి పాత్రగా నెంచినఁ
  గనుల విందొనర్చు గబ్బిలమ్ము

  చంపకమాల
  అనిశము సంపదల్ బడయ హంగులు గూర్చుచు చిత్రమందునన్
  గనఁగను కారునల్పుగనుఁ గన్పడ రంగులలంకరించి మే
  దిని దిగినట్టి యప్సరగఁ దీర్చరె నేర్పున! వారలొప్పినన్
  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో! !

  రిప్లయితొలగించండి
 7. మత్తు లోన మునుగ మాయయో యనునట్లు
  ఒకటి మరొక టట్టు నుర్వి నుండ
  చూరు పైకి చూడ చోద్య మౌ నట్లుగా
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము

  రిప్లయితొలగించండి


 8. మన వూరి స్పెషాలిటి పొడ
  గను! కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే
  తన సోయగమ్ముతో! విం
  దున కిదె మేలని తి‌నంగ దూకె కరోనా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రశంసనీయమైన పూరణ. అభినందనలు.
   'మన యూరి' అనండి. వూరు అనడం సాధువు కాదు.

   తొలగించండి
 9. వ్రాయ నాటి కవిత భావ జగతిలోన
  జాషువ, నినదించె సంఘ మందు!
  నాడు నేడె కాదు వాడవాడల నెప్డు
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము!


  రిప్లయితొలగించండి
 10. శ్రీ గురుభ్యోనమః

  చీకటుల దిరిగియు చీనవానికెటుల
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము?
  రసనలూరెనేని రాక్షస ప్రవృతుల
  లోకమెల్ల యిటుల శోకమొందు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రవృత్తుల' అనడం సాధువు. అక్కడ "రాక్షస గుణముల" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువుగారు🙏

   సవరణతో

   చీకటుల దిరిగియు చీనవానికెటుల
   కనుల విందొనర్చు గబ్బిలమ్ము?
   రసనలూరెనేని రాక్షస గుణముల
   లోకమెల్ల యిటుల శోకమొందు!

   తొలగించండి
 11. జాషువ కృతి యైన చక్కని కావ్యమున్
  నృత్య నాటకముగ నేడు వేయ
  మెచ్చి పలికిరంట మేధావు లెందరో
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము

  రిప్లయితొలగించండి
 12. జనులకు నచ్చినట్టి కృతి జాషువ వ్రాసిన కావ్యమొక్కటిన్
  ఘనుడగు దర్శకుండొకడు కన్నులవిందగు నాటకమ్ముగా
  వనితలె పాత్రధారులుగ పట్టణమందున వేయ పల్కిరే
  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో

  రిప్లయితొలగించండి
 13. మంచి పద్యమొకటి మానక వ్రాసిన
  చదువువారలెల్లసంతసింత్రు
  విడచిపెట్టి నింట విడిదిజేయగ నేల?
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము!

  రిప్లయితొలగించండి
 14. చం:

  మననము చేయుచుండు కడు మక్కువ మీరగ బావ ప్రేమమున్
  కనబడ దిర్గుచుండుమమకారము తోడు నలంకరింపుగా
  ననిరట యమ్మలక్కలెల నవ్వుచు గేలిని వెక్కిరింపుగన్
  కనులకు విందొసంగు గద గబ్బిలమే తన సోయగమ్ముతో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. చీనివాడుమెచ్చి తినినంత కినుకతో
  కొత్తరోగములకు కొలువునిచ్చె
  చూపులేదుగాని చెవులేగ నయనమ్ము
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చూపులేదుగాని మాపటివేళలో
   నేర్పుజూపుజనులకోర్పుతోడ
   తల్లకిందులైన తలపులు హెచ్చునొ
   కనుల విందొనర్చు గబ్బిలమ్ము

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 16. మరొక పూరణము:

  కనులు చెమర్చు తాను పరి
  కల్పన జేసిన ఖండకావ్యమున్
  గనులకు గట్టినట్లు వ్యధ
  గాన్పడజేసె క్షుధార్త బాధలన్
  గనులను నిల్పెజాషువ వి
  కాస సరిత్ప్రభ సంఘమంతటన్
  కనులకు విందొసంగుఁ గద
  గబ్బిలమే తన సోయగమ్ముతో!

  రిప్లయితొలగించండి
 17. సమస్య :
  కనులకు విందొసంగు గద
  గబ్బిలమే తన సోయగంబుతో

  ( జాషువా గారి " గబ్బిల " నామక కావ్యపుత్రిక సోయగం మనోహరం )

  వినుటకు నింపుగొల్పు గద !
  విచ్చిన శాబ్దికసౌష్ఠవంబులున్ ;
  మనమున గొల్వుదీరు గద !
  మంజులభావతరంగపంక్తులున్ ;
  జననుతకీర్తిశాలియగు
  జాషువ కావ్యలతాంగులందునన్
  గనులకు విందొసంగు గద !
  గబ్బిలమే తన సోయగమ్ముతో .

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విశ్వనాథునకున్' అనడం సాధువు.

   తొలగించండి
  2. చంపకమాల:
   ______-------
   మనమును కృంగదీసెగద,మానవజాతి విరుద్ధ సంస్కృతుల్
   తనమనయన్నభావనల తన్నుకుజచ్చెడుకాలమందునన్
   వినయము గానువ్రాసెనిక,విన్నపమాయన ఖండకావ్యమున్
   కనులకు విందొసంగుగద,గబ్బిలమేతనసోయగమ్ముతో
   [సవరణ పాఠము ధన్యవాదాలతో]

   తొలగించండి
 19. తలను కిందకుంచి తావుకొన మనకు
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము ,
  గాని పాలనమ్ము గావించ నారీతి
  రాష్ట్ర మంత సాగు రచ్చ రచ్చ

  తావుకొను = నిలుచు

  రిప్లయితొలగించండి
 20. విను కవి కాళి దాసు విను వీధిన పంపెను మేఘ వర్ధినన్

  వినతిని పంపె జాషువ కవీంద్రుడు కాశికి విశ్వ నాధుకు

  న్నణుగుచునున్న వారి కధ నా పరమేశుకు పద్య రూపమున్

  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 21. జాషువ కవి వ్రాయ చాల కావ్యములను
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము
  మనము జేయు పనులు మరియు మ
  రియు నుండ
  వాటి యందు కొన్ని వాసి కెక్

  రిప్లయితొలగించండి
 22. చంపకమాల:
  ++++++++++++
  పనితనమున్న హస్తమున,పాటుగ వ్రాసెను ఖండ కావ్యమున్
  వినయము,విజ్ఞతన్ గలిసి,వేదికనెక్కెను గొప్ప భావమై
  కనుగొన బాధతో హృదయ, గాధనుదెల్పగనేగె కాశికిన్
  కనులకువిందొసంగుగద,గబ్బిలమే తన సోయగమ్ముతో

  రిప్లయితొలగించండి
 23. మనమున ప్రేమభావనయె మత్తునముంచగ ప్రాయమందునన్
  వినబడదేమి చెప్పినను వెర్రిని జూడరు మంచిచెడ్డలన్
  వెనుకను ముందునున్ గనని భీకరవృత్తి ఙెలంగువారికిన్
  కనులకు విందొసంగు గద గబ్బిలమే దన సోయగమ్ముతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ప్రేమలోన మునుగ పీకలోతులలోన
   మంచిచెడ్డ లేవి కొంచమైన
   మనసుకెక్కవు గద మారుని మహిమను
   కనులవిందొనర్చు గబ్బిలమ్ము

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
 24. మేలు మేల్బలియన జాలికన్నులనిండ
  కావ్యమయ్యె నవ్యదివ్యభావ
  మద్దిజాషువాకుమారిరసికులకు
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము

  రిప్లయితొలగించండి
 25. మనమున బుట్టుభావనలు మాన్యులలేఖినికావ్యఖండమై
  మనమలరించెనించెమహిమాన్వితలక్షణప్రాజ్ఞరాజికిన్
  మునుగవిచక్రవర్తియనుమోదమొసంగవచించెనిష్ణుకున్
  *కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో*

  రిప్లయితొలగించండి
 26. కొమ్మ క్రింద వ్రేలి గమ్మత్తుగానుండి
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము
  గబ్బిలమ్ముగురిచి కావ్యమే వ్రాసెను
  జాషువకవి భువిని భేషుగాను

  రిప్లయితొలగించండి
 27. మూర నుగ్ర కోపము సుతునిఁ బిల్తురు
  గబ్బిలం బనుచును గాఁక తోడ
  మూర సంతసమ్ము పుత్ర రత్నము వారి
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము


  కనిన నమంగళం బనుచుఁ గాంతురు దుఃఖము లండ్రు వింత సూ
  కను నట కూన నింపుగ మృగమ్ము నిభమ్ము తనూరుహద్వయ
  మ్మున విహగమ్ము భంగి దివి మూరుచుఁ జాగు నధః శిరమ్ముగాఁ
  గనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో

  రిప్లయితొలగించండి
 28. పల్లెటూరునుండి పట్నవాసమువచ్చి
  వేషభాషలన్ని విస్మయముగ
  గుర్తుపట్టకుండ గుండమ్మ మార్చగా
  కనుల విందొనర్చు గబ్బిలమ్ము

  రిప్లయితొలగించండి
 29. కనపడుచుండు నెప్పుడును గబ్బిలమట్టుల పల్లెటూరిలో
  కనపడదెట్టి ఫ్యాషను ముఖంబున తైలము జారుచుండు నా
  వనితకు మేకపున్ పులిమి బైతును ప్రౌఢగ తీర్చిదిద్దగా
  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో

  రిప్లయితొలగించండి
 30. మనుగడజీవకోటికితమస్సునుగాగనుశోధనేయనన్
  వినగనువింతగానటనువిజ్ఞతఁజూపిరిశాస్త్రమందునన్
  కనికరమెందులేకతనుమానవుడేవెదుకంగఁజూడగా
  కనులకువిందోసంగుఁగదగబ్బిలమేతనసోయగమ్ముతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాను'ను 'తను' అని ప్రయోగించరాదు.

   తొలగించండి
  2. కనికరమెందులేకటను, అనిచూచినచోసరిపోవునుగదాగురువుగారు

   తొలగించండి
 31. కనుముర మర్రివృక్షమునుగంటివె?చక్కనిరంగుగల్గుచున్
  కనులకువిందొసంగుగద గబ్బిలమేతనసోయగంబుతో
  బనిగొనిజాషువాకవియె వ్రాసెనుగబ్బిలమౌపేరునన్
  మనములుసంతసించగను మాన్యులు,సజ్జనలోకమందరున్

  రిప్లయితొలగించండి
 32. విను మిల భోగులౌ కవుల వీనుల విందగు కైతలందునన్
  వనితల వాలుచూపులును వాటపు సొంపులె సోయగమ్ములౌ
  మనసున కల్మషంబులణుమాత్రము లేని విశుద్ధ జీవికిన్
  కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో

  రిప్లయితొలగించండి