23, జనవరి 2021, శనివారం

సమస్య - 3613

24-1-2021 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము”

(లేదా…)

“ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై”

(‘పద్యప్రభంజనం’ గ్రంథావిష్కరణ సందర్భంగా)

42 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నిమిషము లోన కూర్చుచును నిక్కపు రీతిని నాంధ్ర ఛందమున్
    సమరము జేసి శాస్త్రి యిట జంకును వీడుచు వ్రాయ పద్యముల్
    తములము నోట గూర్చి వడి దారుణ రీతిని రాగ శంకరుల్
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'ఆంధ్ర+ఛందము=ఆంధ్రచ్ఛందము' (తుగాగమ సంధి) అవుతుంది. అక్కడ *"తెల్గు ఛందమున్"* అనండి."

      తొలగించండి
  2. తీరుగ నడుచు విద్యుత్తు దీపములుగ
    కలుగ జేయుమనుజులకు కలిమి నెపుడు
    గాలిని ఉపయో గించిన, ఘనముగ నిల
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తీరుగ నడుచు విద్యుత్తు దీపములుగ
      కలుగ జేయుమనుజులకు కలిమి నెపుడు
      గాలిని ఉపయో గించిన, గాలి మరల
      రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

      తొలగించండి
  3. అమలిన భక్తియుక్తులగు నాస్తికు లార్థికు లార్తి దైవమున్
    మనముననించి యోగమున మాయనుదాటగ సాధనాక్రియన్
    మమతను మోహమాశ పొరిమార్చగ నెంచిన వేల్పుసానియే
    *“ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై”*

    రిప్లయితొలగించండి
  4. తెలుగు రాష్ట్రాల కవులలో దీప్తి నింపి
    దేశ భక్తియు సంస్కృతి తెలియు నట్లు
    పద్య సంకల నంబది వాసి కెక్కి
    రంజిల జేయ గలదు ప్ర భంజ నమ్ము

    రిప్లయితొలగించండి
  5. అభ్యుదయభానుడుదయాద్రినవతరించె
    పంకిలమ్మునుతుడువంగపంతమూనె
    కవిగనింపెనుభావమ్ముఖండితముగ
    రంజిలగఁజేయగలదుప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  6. విపణి చేరిన వ్యాక్సిను విశ్వములను
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము”
    గను జగతిని పీడించిన కరుణ లేని
    విష కరోనన్జయించు సవిత్రు దయన

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. విపణి చేరిన వ్యాక్సిను విశ్వములను
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము”
    గను జగతిని పీడించిన కరుణ లేని
    విష కరోనన్జయించు సవిత్రు దయన

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. విపణి చేరిన వ్యాక్సిను విశ్వములను
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము”
    గను జగతిని పీడించిన కరుణ లేని
    విష కరోనన్జయించు సవిత్రు దయన

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. గణ యతుల ప్రాస వధువుగా కదలి రాగ
    పద్య పాదంబు వరుడుగా పట్టె కరము
    పద్య కావ్యమై నదియును పరిణయమయి
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  10. భావి భారత సంస్కృతి పరిఢవిల్ల
    బ్రతుకు చిత్రము జూపుట భావ్యమనుచు
    పద్యసుమమాల కూర్చిరి భవిత దెలుప
    మెతుకు సీమన మురియగ మెప్పునొంద
    రాష్ట్ర కవులెల్ల వ్రాసిన వ్రాత లెల్ల
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము!!

    రిప్లయితొలగించండి
  11. గణ యతుల ప్రాస వధువుగా కదలి రాగ
    పద్య పాదంబు వరుడుగా పట్టె కరము
    పద్య కావ్యమై నదినేడు పరిణయమయి
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  12. ఆంజ నేయుడు వెడలెను, అంబు దాట
    అంగలను వేయుచు వడిగ, అంబరమున
    వాయునందుని, వేగమె ,వాయు వనిన
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  13. పద్యరచనలు జేకొని యుద్యమముగ
    తెలుగు రాష్ట్రాల సుకవుల దేశభక్తి
    పూరితంబగు పద్యాల పుస్తకమ్ము
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  14. సమస్య :
    ప్రమదము గూర్ప వచ్చెను ప్ర
    భంజన మెల్లెడ వీచి తీవ్రమై


    ( ద్రౌపది కోరిన సౌగంధికపుష్పా లను తీసుకొని వస్తున్న పవన పుత్రునితోపాటు పవనం కూడా పరిమళవంతమై వచ్చింది .)

    కమలము వంటి మోముగల
    కామిని ద్రౌపది కోర్కె దీర్పగా
    విమలయశస్వి యైన మన
    భీముడు మెచ్చి కుబేరుడీయగా
    సుమముల నెన్నొ తీసికొని
    శూరుడు వచ్చుచునుండ ; దోడుగా
    బ్రమదము గూర్ప వచ్చెను ప్ర
    భంజన ; మెల్లెడ వీచి తీవ్రమై .

    రిప్లయితొలగించండి
  15. పేర్మి జేబట్టె బైడెను పెద్ద పదవి
    చేరువగనున్న కమలమ్మ చెలిమిమీర
    జనులు మోదమ్ము శాంతమ్ము కనులజూడ
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  16. నూతన వసంత మొచ్చె వి నూతనముగ
    మందు వచ్చె కరోనాకు,ముందు మనకు
    పంచె, భారత శాస్త్రజ్ఞ భళిర యనగ
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  17. తీండ్రపు సమయమున పిల్ల తెమ్మెరయును
    కవుల గోష్టి యందు కవితాకరువలి యును
    తనువుకైన మనసుకైన ననువుగ మన
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  18. సుమధురవాచకార్థపరిశోభితసత్కవితావనమ్ము నం
    దమలినపద్యసౌరభసమంచితసౌఖ్యవిధాయ
    కమ్ము సం
    క్రమితరసప్రవాహనుతకావ్యపరీమళపూర్వవైభవ
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి


  19. ఆరు వందల పై చేరి నారు కవులు
    దేశ భక్తి వర్రోడి ప్రోదియగు పద్య
    సంకలనము వెలువడి యెంచక్కగాను
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము!

    పద్య ప్రభంజనం‌ ఆవిష్కరణోత్సవానికి
    కల్వకుంట్ల కవిత జాగృతి తోడ్పడగా
    తంగేటిజున్ను వెలువడేటి శుభసందర్భానికి

    శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి


  20. వడి దేశభక్తిని కవుల
    నొడి ప్రమదము గూర్ప వచ్చెను ప్రభంజన మె
    ల్లెడ వీచి తీవ్రమై జడి
    సుడిగాలివలె తెలగాణ చొప్పు కవితలై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. పలుకవులలోన యుప్పొంగు భావ వాహి
    నీతరంగ మాలికలవి నేడు వెలుగు
    చూచెడి తరుణమంచును శుక్ల సుతులు
    సంబరమ్ములె మినుముట్టు సభను జూడ
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  22. ఆడ బిడ్డలు వెలసిన ఆలయాన
    నవ్వు పువ్వులు జాబిల్లి నవ్యకాంతి
    చక్కదనముల వెలుగులు పెక్కువౌను
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    ( నేడు జాతీయ బాలికా దినోత్సవము)


    రిప్లయితొలగించండి
  23. అమరుల వైరి, రక్కసుల రాజు మహా బలు రావణుండు, నా

    యము విడి సీత , భూసుతను యాతనవెట్టుచునుండ, లంక ధా

    మమునకు చేరి గెంతునను మారుతి లంకను కాల్చె , మాతకున్

    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  24. విమల యశోపయోనిధిని వేదసమంచిత భారతాంబనున్
    సముచిత భక్తితత్పరత సత్కవులెల్లరు ప్రస్తుతించుచున్
    సమయగ దీనభావములు జాతికిజాగృతినీయ
    బూనగా
    ప్రమదము గూర్చవచ్చెను ప్రభంజన మెల్లెడవీచి తీవ్రమై

    రిప్లయితొలగించండి
  25. కవివరేణ్యుల శ్రేష్ఠమౌకవనమగుచు
    లలితపదజాలములతోడ రమ్యమలరి
    పండితులనుగాక యరయపామరులను
    రంజిలగజేయగలదు ప్రభంజనమ్ము

    రిప్లయితొలగించండి
  26. జలద తోయ కణావృత విలసి తాభ్ర
    సంజనిత ఘన సంచార సన్నుతమ్ము
    సూర్య తప్త కాయ జనిత శోక జనుల
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము


    దమన విలగ్న చిత్త యుత దైవగ ణేశ్వర చోదితుండునై
    విమల మనో బృహద్బల వివేక మురారి నణంచ నెంచుచున్
    సమదము గోకులార్తిదము సత్వ తరమ్ముగ విశ్వ మాన వా
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై

    [మానవ +అప్రమదము =మానవాప్రమదము]

    రిప్లయితొలగించండి
  27. ఉ:

    సుమధుర పద్య రాజములు సొంపగు రీతిని జాలువారగన్
    క్రమమగు భావరాగములు కచ్ఛపి బల్కిన తీరు నొప్పగన్
    కుముదము విచ్చు చందమున గూర్చిన కావ్యమటంచుమెచ్చనై
    ప్రమదము గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచె చిత్రమై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. తమిళులు "చిన్ని యాశ" యని తాళము నృత్యము చేయబూన నా
    తమకము నిచ్చె, నాదము నతండు విభిన్న స్వరంబు లార్ద్రతన్
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై
    సముచితమే ప్రశస్తి య "గిశై పుయలే" రెహమాన్కు సార్థమై౹౹

    రిప్లయితొలగించండి
  29. విమలమనస్కునైజనగవేంకటనాధునిదేవళంబుకున్
    బ్రమదముగూర్చవచ్చెనుప్రభంజనమెల్లెడవీచితీవ్రమై
    సుమధురభావముండునెడసోమముసైతమునెయ్యమిచ్చుగా
    నమలినమాన్యవంతులకునందగజేతురుసాయమెప్పుడున్

    రిప్లయితొలగించండి
  30. తేటగీతి
    వాగ్విభవమొప్ప సత్కవివర్యులెల్ల
    పద్యరవళుల సృజియించ హృద్యమనఁగ
    వేడుకగనేడు గ్రంథమావిష్కరింప
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము

    చంపకమాల
    కుముద దళాక్షి సీతఁగనఁ గోరిన యంత నమోఘశక్తిమై
    సమయఁగ వేదనల్ జనని జాడను బట్టి సమగ్ర సంగతిన్
    సుమతినిఁ దెల్సి రామునకు జొప్పడ మారుతి నింగిఁ దేలుచున్
    బ్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై

    రిప్లయితొలగించండి
  31. విమల వివేక పూర్ణులగు విజ్ఞులు ప్రాజ్ఞులు సత్యశీలురౌ
    సుమతులు సత్కవీశ్వరులు శుక్లకటాక్షము బొంది కబ్బమున్
    దమదగు రీతిలోన భరతాంబను కొల్చిన గ్రంథమొక్కటిన్
    బ్రమదము గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై

    రిప్లయితొలగించండి
  32. సుమధురసౌమ్యగాత్రిగవసుంధరలక్ష్మిగవీరమాతయై
    అమలినభారతావనికినాయమసేవలనందఁజేయుచున్
    తమకముతోడదేశమునతానికగోంతునువిప్పెగావడిన్
    ప్రమదముగూర్పవచ్చెనుప్రభంజనమెల్లెడవీఁచెతీవ్రమై

    రిప్లయితొలగించండి
  33. విమల మనస్కులౌ కవులు పేరిమి భారతి మ్రోల భక్తితో
    సుమములుగా నమర్చి రతి సుందరమౌ గతి భావయుక్తమౌ
    సుమధుర పద్యముల్ పుడమి శోభిల భారత ప్రాభవంబికన్
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై

    రిప్లయితొలగించండి
  34. విమల మనస్కులౌ కవులు పేరిమి భారతి మ్రోల భక్తితో
    సుమములుగా నమర్చి రతి సుందరమౌ గతి భావయుక్తమౌ
    సుమధుర పద్యముల్ పుడమి శోభిల భారత ప్రాభవంబికన్
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై

    రిప్లయితొలగించండి