8, జనవరి 2021, శుక్రవారం

సమస్య - 3598

 9-1-2021 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్”

(లేదా…)

“కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్”

http://kandishankaraiah.blogspot.com

36 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ధర్మము జేయు వైద్యుడయ! దండుగ మారి కరోనరోగపున్
    మర్మము నేర్వకుండగను మంచిగ మూయక నాదు ముక్కునున్
    దుర్మతి వీడుచున్ కడకు తుమ్ముచు దగ్గుచు రాగ చెంత నా
    కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్...

    రిప్లయితొలగించండి
  2. ధర్మము పాటించి మెలగి
    నిర్మల హృదయమ్ము తోడ నెగడుచు భువిలో
    మర్మము లేనిది యౌ స
    త్కర్మ ము నీరూపు దాల్చి కనబడె నెదుటన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చర్మము తీసివేయుచును చక్కగ గొంతును కోసెడిన్ విధిన్
    మర్మము నేర్వకుండగను మంచిగ పండుగ పూట కోడిదౌ
    కుర్మను వండుటన్ తెలియకుండని భామను పెండ్లియాడ నా
    కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్...

    రిప్లయితొలగించండి
  4. మర్మముకరోనజననము
    చర్మపుచక్షువునకదియుజాడయులేదే
    కార్మికుడుగపోరాడుము
    కర్మునీరూపుదాల్చికనబడెనెదుటన్

    రిప్లయితొలగించండి
  5. మర్మము నెఱుగని మనమున
    నర్మిలితో పూజసేయ నర్పణబుద్ధిన్
    కూర్మావతార నాదు సు
    కర్మము నీరూపుదాల్చి కనబడె నెదుటన్

    ఇటీవల తన పై అధికారిగా వచ్చిన కూతురికి వందన మర్పించిన పోలీసు మనోభావనగా

    అర్మిలి బెంచితీను నిను నాంక్షలు బెట్టక యాడపిల్లయన్
    షర్మిల! వారసత్వమును చక్కగ జేకొని యైపియస్సుగా
    ధర్మము నిల్పగా విధుల దక్షత గూర్చుము, నాదు పూర్వ స
    త్కర్మము నీదురూపమున కన్నులముందర నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  6. ధర్మముసూక్ష్మమయ్యెడినిదాపుననిల్చినఁజూడఁజాలమే
    మర్మముమాధవుండెఱుగుమానవుడాయెడప్రేక్షకుండునౌ
    నిర్మలజీవిగూడనిటనీరజనాభునిద్రుష్టినల్పుడే
    కర్మమునీదురూపమునకన్నులముందరనిల్చెనోప్పుగన్

    రిప్లయితొలగించండి
  7. మర్మము నెరుగని మనుజుడు
    ధర్మము, దానము, గుణములు దర్పము తోడన్
    నిర్మల హృదయుడు కర్ణ సు
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    రిప్లయితొలగించండి
  8. ధర్మము గాచు ధర్మమును దక్షత రక్షణ సేయువారలన్
    కర్మము ఛాయ చందము సకాముల మూఢుల వెంబడించు స
    త్కర్మము పుణ్యలోకమిడు తామస కర్మము నీచ లోకమే
    *“కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్”*?

    రిప్లయితొలగించండి
  9. సమస్య :
    కర్మము నీదు రూపమున
    కన్నుల ముందర నిల్చె నొప్పుగన్

    ( కురుక్షేత్ర రణరంగంలో అస్త్రమంత్రాలు గుర్తు రాక , క్రుంగిన రథచక్రం ఎత్తలేక నిరాశతో పశ్చాత్తప్తచిత్తంతో అర్జునునితో పలుకుతున్న కర్ణుడు )
    మర్మముతోడ ద్రౌపదిని
    మాయపు మాటల నొంచినాడనే !
    వర్మమువంటి మాధవుని
    వాక్కుల నెంతయు సైపనైతినే !
    ధర్మము వీడి బాలకుని
    దారుణరీతిన జంపినాడనే !
    కర్మము నీదు రూపమున
    కన్నుల ముందర నిల్చె నొప్పుగన్ .
    ( ఒంచు - బాధించు ; వర్మము - కవచము ; బాలకుని - అభిమన్యుని )

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల:
    ____________
    శర్మయు శాస్త్రియున్ గలిసి శాస్త్రినిబొందిరి నేటిరోజులన్
    ధర్మముమర్చి పాలకులు,దానముసేయగ దైవసంపదన్
    మర్మమెఱుంగలేకనిక, మాటలునమ్ముచు వోట్లువేయదు
    స్కర్మము నీదురూపమున కన్నులముందరనిల్చెగొప్పగన్.

    రిప్లయితొలగించండి
  11. *అభిమన్యుని మరణానంతరం సైంధవుని తల్చుకుని పార్థుడు వేదన చెందు సన్నివేశము*
    ***** ***** ****** ****** ***** ******
    ధర్మపరిపాలకుండును
    నిర్మల మనసున్న కృష్ణుని చెలిమి యున్నన్
    కూర్మిసుతుడు తెగటాఱగ
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    రిప్లయితొలగించండి
  12. ( *శల్యునితో కర్ణుని మాటలుగా* )
    ***** ***** ***** ***** ***** ** ******
    అర్మిలి తోడనన్ను హృదయాంతరమందున గారవమ్ముతో
    దుర్మతు లైననేమి పరితోషము గల్గగ జేసి రంచు నే
    ధర్మము కాక పోయినను దందడి జేయగ బూనితిన్ నృపా
    కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  13. ఉత్పలమాల:
    -------------
    ధర్మముదారితప్పెనని దాడులు జేసినతీరుదెల్పగా
    మర్మమెఱింగి పాలకులు,మానవకోణము లోనజూడకన్
    శర్మముబొంది,నాయకులు శాస్తినిజేసితిరంచుదల్చ దు
    ష్కర్మము నీదురూపమునకన్నులముందరనిల్చెగొప్పగా!
    శర్మము=సంతసము

    రిప్లయితొలగించండి
  14. ఉత్పలమాల:
    -------------
    దుర్మతియైనదుష్టుడట ,దూరుచు పేలుచురెచ్చగొట్టగా
    మర్మమెఱుంగలేనిజనమంతయు ,మాయల రెచ్చిపోవగా
    కర్మముగాలిపోయెగద,కన్నులముందర కాపిటాలుదు
    ష్కర్మము నీదురూపమునకన్నులముందరనిల్చెగొప్పగా!

    రిప్లయితొలగించండి
  15. గుడిలో అర్చకుడు దేవునితో మొర పెట్టుకొనే తలంపు గా నా ఈ ప్రయత్నము :

    ఉ:

    నిర్మల మైన చిత్తమున నిత్యము పూజలు సేయుచుండగన్
    ధర్మము మీర పర్వములు దందడి నెంచి సమాచరింపగన్
    మర్మము దెల్వ వంచకుడు మాయము జేసెను విగ్రహమ్ములన్
    కర్మము నీదు రూపమున కన్నుల ముందర నిల్చె నొప్పుగన్

    దందడి=తరచు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. కం.
    చర్మమునొల్చిన నేమౌ
    ధర్మము వీడను మరువను దయగన గోరన్
    మర్మమునెఱుగక నమ్మిన
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    (డాన్ట్రంపుతో అమెరికనులు)

    రిప్లయితొలగించండి
  17. ధర్మము తప్పిరనుకొనుచు
    మర్మముగ నెలమితివిగద మనుజ బతుకులన్
    నర్మము సలిపి , క రోనా !
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    నర్మము = పరిహాసము

    రిప్లయితొలగించండి
  18. వర్మ! శరీరమున్ మనసు పంచితిఁ సర్వము నప్పజెప్పితిన్,
    ధర్మము తప్పి కూడితివి త్రాగితి వీవు, తమిస్ర పాపపున్
    కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్
    శర్మము సౌఖ్య మీల్గె, నభిశంకయె లేదిక, నేను గర్భిణీ౹౹

    రిప్లయితొలగించండి
  19. మర్మమెరుంగని మనమున
    నర్మిలిగానార్తజనులననునిత్యంబున్
    నిర్మలమనమున గావ సు
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    రిప్లయితొలగించండి
  20. ధర్మము తప్పిన ఛైనా
    మర్మముగనుసృష్టిజేయ మాయకరోనా
    ఖర్మంబదె! జేయగ దు
    ష్కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    రిప్లయితొలగించండి

  21. మైలవరపు వారి పూరణ

    భర్త భార్యతో...

    ధార్మికమైన పద్ధతిని దగ్గర జేరితి ధర్మపత్ని., స...
    త్కర్మలనాచరించి మనగావలెనిద్దరమొక్కటై., వినా
    మర్మము జీవనమ్మన సమంజసమౌను., విధిప్రయుక్తమౌ
    కర్మము నీదు రూపమున కన్నుల ముందరనిల్చెనొప్పుగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  22. ధర్మపు మార్గమందునను తద్దయు ప్రీతిని సంచరించుచున్
    మర్మమెరింగి నిత్యమును మాధవు భక్తిని గొల్చు చుంటివే
    శర్మ! సతమ్ము నీ కృషిని శౌరి కనుంగొను చుండ స
    త్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  23. ధర్మము వర్థిలు జగతిని
    మర్మంబేమియును లేదు మహిసర్వంబున్
    నిర్మితమౌ నీ రీతిని
    కర్మము నీ రూపు దాల్చి కనబడె నెదుటన్!

    రిప్లయితొలగించండి
  24. ధర్మము దప్పక యెప్పుడు
    గర్మలనేజేయుకతన గామితఫలముల్
    శర్మా!వినుమా సదస
    త్కర్మమునీరూపుదాల్చి కనబడెనెదుటన్

    రిప్లయితొలగించండి
  25. అర్మిలి మ్రొక్క బ్రతికెదవు
    చర్మము ధరియించి నీదు చావిట నాకున్,
    మర్మ మెఱిఁగిన నరులు చెన
    క ర్మము, నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    [చెనకరు + మము = చెనకర్మము]


    ధర్మ విహీన మానవుల ధాత్రినిఁ గాంచమె మిక్కుటమ్ముగన్
    దుర్మతు లుండ నే నకట దుర్గతి పాలగు టిట్లు న్యాయమే
    నర్మము లేల ఖేదనమ! నాకు పురాకృత ఘోర పాప మ
    త్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  26. ధర్మమెరుంగజేసితిరి,
    ధారుణికీర్తిలలామసౌఖ్యముల్
    పేర్మినిపొందజేసితిరి,
    ప్రేమరసామృతజ్ఞానరూప!దు
    ష్కర్మ విదూర!పూజ్య గురు
    రాయర!నా గత జన్మలోని స
    త్కర్మము నీదురూపమున
    కన్నులముందరనిల్చెనొప్పుగన్

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. నర్మపుభాషణంబుల సనాతనధర్మము నొవ్వకుండస
    త్కర్మమునీదురూపమునకన్నులముందఱనిల్చెనొప్పుగన్
    ధర్మమెయెల్లవేళలను ధైర్యమునిచ్చుచు మానవాళికిన్
    ధర్మపథంబునన్ నడువదారినిజూపునుదప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  29. ధర్మమునాచరింపనది తప్పక మేలొనరించు జీవికిన్
    నిర్మలమైన చిత్తమున నిన్ను స్మరించగ నెల్లవేళలన్
    వర్మము గూర్చి సంతసము వావిరియైమది కందళించు స
    త్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి


  30. మా తాతగారు కొన్నాళ్లుగా టపాలు లేవు‌
    వినరా వారికి విన్నపాలు


    అర్మిలి తోడై వినరా
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్
    శర్మాజీ కుశలమ్మే?
    మర్మంబేమియొ టపాలు మాలికలో లేవ్


    ఇవ్వాళ కంది వారు శెలవా ? స్తబ్దుగా వుంది రింఛోళి‌ ?




    జిలేబి




    రిప్లయితొలగించండి
  31. దుస్ససేనునితో ద్రౌపది పలుకులు...

    కందం
    దుర్మార్గమ్మున నీడ్చన్
    ధర్మజుఁడున్ దుస్ససేన నన్నోడినటుల్
    మర్మము విడ జెప్పితె నా
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    ఉత్పలమాల
    దుర్మతి నేకవస్త్రనని దొయ్యలిఁ జెప్పిన దుస్ససేన నీ
    ధర్మజుఁడోడె నిన్ననుచు ధారుణ రీతిగ జట్టుఁ బట్టుచున్
    మర్మము విప్పుచున్ సభకు మానిని నీడ్చితె! నాదు పూర్వ దు
    ష్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  32. ధర్మము దప్పని వాడవు
    నిర్మలమౌ నీదు మనసు నీ నెయ్యంబున్
    శర్మా విను నా ప్రాకృత
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్

    రిప్లయితొలగించండి
  33. కూర్మిని పెంచిన కూతును
    దుర్మతితోబాధలిడుచు దోచుచునగలన్
    ధర్మచ్యుతుడై యల్లుడు
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్”

    రిప్లయితొలగించండి