31-1-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”
(లేదా…)
“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”
(దేశపతి కృష్ణ గారికి ధన్యవాదాలతో…)
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:కోరిక తీర బీదఱియె కొండొక రోజున ప్రేమమీరగాతీరుగ కోటికోటులకు తిన్నగ వారసురాలు కాగలన్వారిజ నేత్రనున్ వలచి బంజరు హిల్సున పెండ్లియాడగా దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
భారము గాఁగ జీవితము బాగుగ రాబడి పెంచునట్టిదౌదారియె కానరాని కడు దైన్యపు దుస్థితి కష్టపెట్టఁగన్గూరిమిఁ గన్న సంతు దినఁ కూడు లభించక క్రుంగుచుండఁగన్దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్.
ఒకరికినొకరు దూరము దూరముగనుయుండుడను వైద్యులు పలుకు యుక్తి వినకభయము వీడి కరోనా సమయమునకటదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'దూరముగను+ఉండు' డన్నపుడు యడాగమం రాదు. "దూరముగనె యుండుడను.." అనండి.
ధన్యవాదములండీ
మొదటి పాదములో “ దూరముగనె” అని చదువుకొనగలరు
నేరక చేసినట్టి దగు నిక్కము తొందరపాటుదౌ నదిన్మీరిరి ప్రేమపక్షులయి మేలుగ హద్దులు దాటిపోయిరేకారణమేమొతెల్యదయె కాంచగ పెండిలి వేరువారితోదారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్!!
సమస్య : దారుణకార్యమౌను గద దంపతులందుట సౌఖ్య మిద్ధరన్ ( అత్తవారింటికి వచ్చిన బాలచంద్రుని రాకతో ఆనందంతో తలమునకలౌతున్న పుత్రిక మాంచాలతో రేఖాంబ )ఉత్పలమాల ..................వారణ సేయుచుంటి నని వంతను బొందకు ముద్దుకూతురా !కారణ మేమనన్ వినుము ;కార్యమపూడి రణాంగణమ్మునన్ వీరులు పౌరుషార్జునులు వేచుచునుండగ నిట్టి వేళలో దారుణకార్య మౌను గద దంపతులందుట సౌఖ్య మిద్ధరన్ !!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జంటకేరీతికుదరకజాతరయ్యెవింతవిధియేలపందెంబువెట్టెనిటులఉప్పునిప్పునుసరసంపునూయలూగగిదంపతులుసౌఖ్యమందుటదారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. '.. నూయలూగి' టైపాటు.
తండ్రియె మరణించిన విషాద తరుణమున దుఃఖమించుక లేకుండ దుష్టబుద్ధి తోడ నేకాంతమును గోరి గోడ వెనుక దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. నిజానికి ముందుగా ఈ భావంతోనే నేను పూరణ చేయాలనుకున్నాను.
హోరుగ ప్రేమ చిత్రములు హోయను పాటల ప్రేమ గీతముల్బారులు తీరి దుర్బలులు బాలల మానసమందిరమ్ములన్దీరులుదప్పి భ్రాంతి పసి తీరని వారలు పెండ్లియాడినాదారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి..
మైనారిటీ తీరని పిల్లల ప్రేమల నేపథ్యములో
తమదు పిల్లలు యౌవన దశకు జేరి యున్న సమయం బు దెలిసియు కన్న వారి యెదుట సరసము లాడుచు నిష్ట పడియు దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తమదు' అన్న ప్రయోగం సాధువు కాదంటారు.
శాపవశమున పాండురాజుతో కూడుట మరణశాసనమౌనని మాద్రి బాధపడుతున్నటువంటి సన్నివేశము.......... నేరమదేమొ జేసితిని నిశ్చల పూర్ణ మహర్షి వాక్కునన్ఘోరములైన శాపమును కోరివరించితి పూర్వజన్మ సంస్కార ఫలంబు తప్పునె? సుఖంబుగ నుండుట సాధ్యమే యిలన్? దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చేరిరి తండ్రి చచ్చెనని చెప్ప విదేశము నుండి వేగమే దారను వెంటబెట్టుకుని, తందర చెందితి మంచు వారు కం జారములో జనాళి శవ జాగరణమ్మును సేయు వేళలో దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మారగ విల్వలీదినము మన్ననజేయక తల్లిదండ్రులన్తీరుగ నాస్తిలాగుకొని దీనుల యాశ్రమమందు ద్రోయుచున్భారిగ పట్టెమంచముల బండుచు భక్ష్యము లారగించుటేదారుణ కార్యమౌనుగద! దంపతులందుట సౌఖ్యమిద్ధరన్
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
మనువు జరుపగ వైశాఖ మాస మందు ఐదు నక్షత్ర హోటలు నందు,క్రొత్త దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ముగడప దాటి ఆషాడమ కలసి వారు
'నక్షత్ర హోటలు' దుష్టసమాసం.
ఉ: మారెను కాలమంచు తగు మాత్రము పిల్లల వృద్ధి గోరుచున్భారము కోర్చి పంతముగ వారల బంపె విదేశి విద్యకైక్రూరము నేడు క్షేమ మన కుందురు నెవ్వరు తల్లితండ్రులన్దారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'భారమునకోర్చి' అనడం సాధువు. అక్కడ "భారము నోర్చి" అనవచ్చు.
ధన్యవాదములు.
ఇదె సనాతన ధర్మమ్మిదె యని బల్కిపిల్ల వాండ్రను హతమార్చి ప్రీతియిదియెవిభుని కని శివమెత్తుచు వెర్రిబాగుదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ముజిలేబి
వృద్దులగు తల్లిదండ్రులు వద్దు ననుచుదానధర్మముల మరచి దయయు లేకబాగుగ దినితిరుగుటయే భాగ్యమనుచుదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వద్దటంచు" అనండి.
తృటిలో జీవింతురని యకట! దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్, చంపుట పిల్లల మూఢులై విభునిపేరిటనే!జిలేబి
మీ పూరణ ప్రశంసనీయంగా ఉన్నది.
కోరిక గలిగినంతనె గోప్యము విడి ,శిశులయెదుట నేమాత్రము సిగ్గులేకనియమములను కొంచెమయిన నిలుపకుండదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
ఉత్పలమాల:++++++++++++ఆరనిమంటగా రగిలె,నాజ్యముపోయుచు కామవాంఛకున్తీరనికోర్కెదీర్చుమని, తిన్నగవేడగభార్యవద్దనెన్నేరుగసిగ్గులేదనగ,నేరముజేసినవాడినైతిలేదారుణకార్యమౌనుగద,దంపతులందుటసౌఖ్యమిత్ధరన్
ఉత్పలమాల:++++++++++++మారినకాలమందు,పలుమాయలుజేసెడు వారలుండగామీరినమోక్షకాంక్షలవి,మిన్నులనంటగ,క్షుద్రవాంఛలేకోరెనుదైవమంచు తమ కొంపలుముంచగజేయు కృత్యముల్దారుణకార్యమౌనుగద,దంపతులందుటసౌఖ్యమిత్ధరన్
ఉత్పలమాల:++++++++++++నేరముజేయుతీరులను,నెమ్మదినేర్పునుచిత్రరాజముల్వేరుగజెప్పనేమిటికి,వేడిగనయ్యవి,గుండెతాకగాపేరుకుపెద్దలే యిటుల పిల్లల జంపగనెంచు భావనల్దారుణకార్యమౌనుగద,దంపతులందుటసౌఖ్యమిత్ధరన్
కన్నవారనియెడు కనికరము లేకతల్లిదండ్రుల నిరువురి దారుణముగజేర్చి వృద్ధాశ్రమమునందు సిగ్గుమాలిదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
తేటగీతి ప్రియ సుతుండభిమన్యుఁడు వీడె మమ్ముభ్రూణ మాయింటి కోడలుఁ బొగులుచుండవల్లకాదయ్య బావయ్య! బ్రతికి మేముదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ముఉత్పలమాలమారణహోమమందు నభిమన్య కుమారుఁడు కన్నుమూసెనేఘోరమనంగ కోడలిని గుర్విణి నుత్తర బాధ మాన్పి యోదారుచ బావ! మాతరమె తాలక మేమిక జీవితమ్మునన్దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మనిషి మనిషి నడుమ యడమ విడుమనినవినక, పెండ్లియాడెను పో, సవిత్రు సాక్షితొలగకను కరోన తిరుగు తొలి నిశిననుదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మనిషి' అనడం వ్యావహారికం.
సర్కారు,సచివులు తల్లి దండ్రులు, ఉద్యోగ ఉపాధ్యాయులు పిల్లలని భావించి కరోనా కష్టకాలంలోకోరినదీయలేకమమకారమునింతయుజంపలేకసంస్కారమునేర్పలేకపలుజాబులకైపరదేశమేగలేరీరుజవేళలోప్రజలప్రీతిగనీతిగసాకలేక దర్బారున సంతు బోలు తమ వారిని వేతన జీవులన్ బహిష్కారము జేసినట్లు మనసా వచసా పరిహారమీయకే*“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”*
స్త్రీ రమణీసమాజహృదిచేతముజీతముబాధ్యతాళిచేజేరగనీదునర్భకులచెంతకుఛీయనుపాలనీయదాదారకుడోవినాయకుడుద్యాగముజీవమురాజకీయమే*“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”*
ఈనాడు శంకరాభరణం వారిచ్చిన సమస్యదారుణ కార్యమౌనుగద దంపతులందుట సౌఖ్యమిద్ధరిన్నా పూరణ ఉత్పలమాలవేరొక యింటినుండి మన వీటికి వచ్చిన యాడపిల్లకున్మారణ హోమమున్దలపు మంటల కాహుతిఁ జేయబూనుటల్దారుణ కార్యమౌనుగద! దంపతు లందుట సౌఖ్యమిద్ధరిన్బారిన యేరులన్నియును బర్పముఁజేరుట చూడ ధీమతీ! ఆదిభట్ల సత్యనారాయణ
కొరొన గమనము పెళ్ళింట గుబులునింపెకొత్త దాంపత్యమాధురుల్ గూరలేదుమొదటిరాత్రను నాశలు మోజులిపుడుఇట్టి సమయాన కోరికలింపుగావుదంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'రాత్రి+అను' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
వేరులు చేసి కాపురము వేదన బెట్టి యనాదరంబునన్దూరముగా వసింప నది దుస్సహమౌ గద కన్నవారికిన్వారటు వార్ధకంబు నొక బాసట లేక తపించుచుండగాదారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
కామ క్రోధము లిడువడు కాల మందు తనివి తీరక కోరిక తపన జెంది రామనామ జపంబు వలదను వృద్ధ దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఇడువడు' ?
!దోరవయస్సు నుండి తమతో నివసించు కుమార్తె కోసమై తీరగు యోగ్యుఁడౌ వరునిఁ దెచ్చెడి యోచన లేమి లేకయే కారణ మేదియైన తమకమ్మున సభ్యత మాసి యింటిలోదారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్.
దాన సౌశీల్య గుణములు దనర వలయు నతిథి పూజలు సంతత మడర వలయు ధన ఫలాది భోగముల స్వార్థ మడరంగ దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము వారని ప్రేమ తోడుత శుభమ్ముగ నూని గృహస్థ ధర్మమున్ దార సమేత మిద్ధర సతమ్ము చరింపఁగ భర్త ధన్యుఁడే కారణ మేమి చెప్పిన నగర్హితమే యిది నిత్య సత్యపుం దారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్ [సత్యపు +తారుణ =సత్యపుం దారుణ; తారుణము = తరుణ భావము - అన్ ప్రత్యయము; తారుణ్యము యన్ ప్రత్యయము.ఉదా: శ్రమణ అన్ /యన్ = శ్రామణము / శ్రామణ్యము]
'తారుణ కార్య' మంటూ వైవిధ్యంగా అద్భుతమైన పూరణ చెప్పారు. మొదటి పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పుణ్యతీర్ధములకువెళ్ళిమునిగినీటదంపతులు సౌఖ్యమందుటదారుణమ్ముపరులుచూతురనుభయము పడకయట్లుతనువులొక్కటగుటమరీ దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వెళ్ళి, మరీ' అన్నవి వ్యావహారికాలు. "తీర్థములకు నేగి/పోయి... ఒక్కటగుట కడు దారుణమ్ము..." అనండి.
దారుణకార్యమౌనుగదదంపతులందుటసౌఖ్యమిద్ధరన్ దారుణమెట్లగున్రమణ!దంపతులేగదవారలిద్దరున్ నోరునునుంచు మేలుగనునొవ్వగజేయుటబాడియేగనన్ మీరుటమాటలన్భువినిమీకునుమాకునుమంచిగాదుగా
భారత దేశమందునను బాధల మున్గగ తల్లిదండ్రులేవారల బాధ్యతన్ గొనక, భాగ్యమె ముఖ్యమటంచు నెంచుచున్చేరగ వారు స్వర్గమును చేయగ కర్మల రాకయున్నచో దారుణ కార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
కన్న వారు కష్టములతో కలత నంద వారి బాధలు గాంచియు పట్టనట్లుబయట హాయిగ తిరుగుచు పగలు రేయి*దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము* మారెనుకాలమిప్పుడిటు మానవతన్ విడి కన్నబిడ్డ లేవేరుగ కాపురమ్మిడుచు వేడుక తోడను నెల్లవేళలన్భారముగాతలంచుచునువారలదూరమునుంచనెంచుటన్*దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”*
సంపదలు కూడబెట్టిననింపు కాదుసంతు మనసు ప్రేమను చూప జరుగునయ్యదంపతులు సౌఖ్యమందుట ; దారుణమ్ముకదర ముసలి వారి తరుమ కంపుయనుచు...భారతీనాథ్ చెన్నంశెట్టి...
గు రు మూ ర్తి ఆ చా రి ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, గురుభ్యో నమః ; నిన్నటి పూరణ స్వీకరించ మనవి....................................................................................దారను సంగమింప కుపతప్త విపీడితయౌ తఱి | దైవ సద్వ్రతాచార మొనర్చు భార్యc గని - సంశమ మొందకు మెప్పుడున్ | రతీధోరణి మాను - మారసి ఋతుస్రవకాంత | నకాలమందునన్ =దారుణకార్యమౌనుగద , దంపతు లందుట , సౌఖ్య మిధ్ధరన్ ! ! { ఉపతప్త = అనారోగ్యము ఉపతప్తవిపీడితయౌ తఱి = అనారోగ్యపీడితురాలగు నపుడు ; సంశమమొందకు = సుఖపడకు ; ఋతుస్రవకాంత = ఋతుస్రావ మందున్న కాంత ;.................................... చివరి వాక్య క్రమము =---------------------- అకాలమందునన్ - దంపతులుసౌఖ్యమందుట - ఇధ్ధరన్ - దారుణకార్యమౌనుగద }******************************************
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
కోరిక తీర బీదఱియె కొండొక రోజున ప్రేమమీరగా
తీరుగ కోటికోటులకు తిన్నగ వారసురాలు కాగలన్
వారిజ నేత్రనున్ వలచి బంజరు హిల్సున పెండ్లియాడగా
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిభారము గాఁగ జీవితము బాగుగ రాబడి పెంచునట్టిదౌ
రిప్లయితొలగించండిదారియె కానరాని కడు దైన్యపు దుస్థితి కష్టపెట్టఁగన్
గూరిమిఁ గన్న సంతు దినఁ కూడు లభించక క్రుంగుచుండఁగన్
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్.
ఒకరికినొకరు దూరము దూరముగను
రిప్లయితొలగించండియుండుడను వైద్యులు పలుకు యుక్తి వినక
భయము వీడి కరోనా సమయమునకట
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దూరముగను+ఉండు' డన్నపుడు యడాగమం రాదు. "దూరముగనె యుండుడను.." అనండి.
ధన్యవాదములండీ
తొలగించండిమొదటి పాదములో “ దూరముగనె” అని చదువుకొనగలరు
తొలగించండినేరక చేసినట్టి దగు నిక్కము తొందరపాటుదౌ నదిన్
రిప్లయితొలగించండిమీరిరి ప్రేమపక్షులయి మేలుగ హద్దులు దాటిపోయిరే
కారణమేమొతెల్యదయె కాంచగ పెండిలి వేరువారితో
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిదారుణకార్యమౌను గద
దంపతులందుట సౌఖ్య మిద్ధరన్
( అత్తవారింటికి వచ్చిన బాలచంద్రుని రాకతో ఆనందంతో తలమునకలౌతున్న పుత్రిక మాంచాలతో రేఖాంబ )
ఉత్పలమాల
..................
వారణ సేయుచుంటి నని
వంతను బొందకు ముద్దుకూతురా !
కారణ మేమనన్ వినుము ;
కార్యమపూడి రణాంగణమ్మునన్
వీరులు పౌరుషార్జునులు
వేచుచునుండగ నిట్టి వేళలో
దారుణకార్య మౌను గద
దంపతులందుట సౌఖ్య మిద్ధరన్ !!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజంటకేరీతికుదరకజాతరయ్యె
రిప్లయితొలగించండివింతవిధియేలపందెంబువెట్టెనిటుల
ఉప్పునిప్పునుసరసంపునూయలూగగి
దంపతులుసౌఖ్యమందుటదారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'.. నూయలూగి' టైపాటు.
తండ్రియె మరణించిన విషాద తరుణమున
రిప్లయితొలగించండిదుఃఖమించుక లేకుండ దుష్టబుద్ధి
తోడ నేకాంతమును గోరి గోడ వెనుక
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిజానికి ముందుగా ఈ భావంతోనే నేను పూరణ చేయాలనుకున్నాను.
హోరుగ ప్రేమ చిత్రములు హోయను పాటల ప్రేమ గీతము
రిప్లయితొలగించండిల్బారులు తీరి దుర్బలులు బాలల మానసమందిరమ్ముల
న్దీరులుదప్పి భ్రాంతి పసి తీరని వారలు పెండ్లియాడినా
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి..
మైనారిటీ తీరని పిల్లల ప్రేమల నేపథ్యములో
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండితమదు పిల్లలు యౌవన దశకు జేరి
రిప్లయితొలగించండియున్న సమయం బు దెలిసియు కన్న వారి
యెదుట సరసము లాడుచు నిష్ట పడియు
దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తమదు' అన్న ప్రయోగం సాధువు కాదంటారు.
శాపవశమున పాండురాజుతో కూడుట మరణశాసనమౌనని మాద్రి బాధపడుతున్నటువంటి సన్నివేశము..........
రిప్లయితొలగించండినేరమదేమొ జేసితిని నిశ్చల పూర్ణ మహర్షి వాక్కునన్
ఘోరములైన శాపమును కోరివరించితి పూర్వజన్మ సం
స్కార ఫలంబు తప్పునె? సుఖంబుగ నుండుట సాధ్యమే యిలన్?
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచేరిరి తండ్రి చచ్చెనని చెప్ప విదేశము నుండి వేగమే
రిప్లయితొలగించండిదారను వెంటబెట్టుకుని, తందర చెందితి మంచు వారు కం
జారములో జనాళి శవ జాగరణమ్మును సేయు వేళలో
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమారగ విల్వలీదినము మన్ననజేయక తల్లిదండ్రులన్
తీరుగ నాస్తిలాగుకొని దీనుల యాశ్రమమందు ద్రోయుచున్
భారిగ పట్టెమంచముల బండుచు భక్ష్యము లారగించుటే
దారుణ కార్యమౌనుగద! దంపతులందుట
సౌఖ్యమిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిమనువు జరుపగ వైశాఖ మాస మందు
రిప్లయితొలగించండిఐదు నక్షత్ర హోటలు నందు,క్రొత్త
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
గడప దాటి ఆషాడమ కలసి వారు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నక్షత్ర హోటలు' దుష్టసమాసం.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిమారెను కాలమంచు తగు మాత్రము పిల్లల వృద్ధి గోరుచున్
భారము కోర్చి పంతముగ వారల బంపె విదేశి విద్యకై
క్రూరము నేడు క్షేమ మన కుందురు నెవ్వరు తల్లితండ్రులన్
దారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భారమునకోర్చి' అనడం సాధువు. అక్కడ "భారము నోర్చి" అనవచ్చు.
ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఇదె సనాతన ధర్మమ్మిదె యని బల్కి
పిల్ల వాండ్రను హతమార్చి ప్రీతియిదియె
విభుని కని శివమెత్తుచు వెర్రిబాగు
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివృద్దులగు తల్లిదండ్రులు వద్దు ననుచు
రిప్లయితొలగించండిదానధర్మముల మరచి దయయు లేక
బాగుగ దినితిరుగుటయే భాగ్యమనుచు
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వద్దటంచు" అనండి.
రిప్లయితొలగించండితృటిలో జీవింతురని య
కట! దారుణకార్యమౌను గద దంపతు లం
దుట సౌఖ్య మిద్ధరన్, చం
పుట పిల్లల మూఢులై విభునిపేరిటనే!
జిలేబి
మీ పూరణ ప్రశంసనీయంగా ఉన్నది.
తొలగించండికోరిక గలిగినంతనె గోప్యము విడి ,
రిప్లయితొలగించండిశిశులయెదుట నేమాత్రము సిగ్గులేక
నియమములను కొంచెమయిన నిలుపకుండ
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి++++++++++++
ఆరనిమంటగా రగిలె,నాజ్యముపోయుచు కామవాంఛకున్
తీరనికోర్కెదీర్చుమని, తిన్నగవేడగభార్యవద్దనెన్
నేరుగసిగ్గులేదనగ,నేరముజేసినవాడినైతిలే
దారుణకార్యమౌనుగద,దంపతులందుటసౌఖ్యమిత్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి++++++++++++
మారినకాలమందు,పలుమాయలుజేసెడు వారలుండగా
మీరినమోక్షకాంక్షలవి,మిన్నులనంటగ,క్షుద్రవాంఛలే
కోరెనుదైవమంచు తమ కొంపలుముంచగజేయు కృత్యముల్
దారుణకార్యమౌనుగద,దంపతులందుటసౌఖ్యమిత్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి++++++++++++
నేరముజేయుతీరులను,నెమ్మదినేర్పునుచిత్రరాజముల్
వేరుగజెప్పనేమిటికి,వేడిగనయ్యవి,గుండెతాకగా
పేరుకుపెద్దలే యిటుల పిల్లల జంపగనెంచు భావనల్
దారుణకార్యమౌనుగద,దంపతులందుటసౌఖ్యమిత్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికన్నవారనియెడు కనికరము లేక
రిప్లయితొలగించండితల్లిదండ్రుల నిరువురి దారుణముగ
జేర్చి వృద్ధాశ్రమమునందు సిగ్గుమాలి
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిప్రియ సుతుండభిమన్యుఁడు వీడె మమ్ము
భ్రూణ మాయింటి కోడలుఁ బొగులుచుండ
వల్లకాదయ్య బావయ్య! బ్రతికి మేము
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
ఉత్పలమాల
మారణహోమమందు నభిమన్య కుమారుఁడు కన్నుమూసెనే
ఘోరమనంగ కోడలిని గుర్విణి నుత్తర బాధ మాన్పి యో
దారుచ బావ! మాతరమె తాలక మేమిక జీవితమ్మునన్
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమనిషి మనిషి నడుమ యడమ విడుమనిన
రిప్లయితొలగించండివినక, పెండ్లియాడెను పో, సవిత్రు సాక్షి
తొలగకను కరోన తిరుగు తొలి నిశినను
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనిషి' అనడం వ్యావహారికం.
ధన్యవాదములండీ
తొలగించండిసర్కారు,సచివులు తల్లి దండ్రులు, ఉద్యోగ ఉపాధ్యాయులు పిల్లలని భావించి కరోనా కష్టకాలంలో
రిప్లయితొలగించండికోరినదీయలేకమమకారమునింతయుజంపలేకసం
స్కారమునేర్పలేకపలుజాబులకైపరదేశమేగలే
రీరుజవేళలోప్రజలప్రీతిగనీతిగసాకలేక ద
ర్బారున సంతు బోలు తమ వారిని వేతన జీవులన్ బహి
ష్కారము జేసినట్లు మనసా వచసా పరిహారమీయకే
*“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్త్రీ రమణీసమాజహృదిచేతముజీతముబాధ్యతాళిచే
రిప్లయితొలగించండిజేరగనీదునర్భకులచెంతకుఛీయనుపాలనీయదా
దారకుడోవినాయకుడుద్యాగముజీవమురాజకీయమే
*“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈనాడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండిదారుణ కార్యమౌనుగద దంపతులందుట సౌఖ్యమిద్ధరిన్
నా పూరణ
ఉత్పలమాల
వేరొక యింటినుండి మన వీటికి వచ్చిన యాడపిల్లకున్
మారణ హోమమున్దలపు మంటల కాహుతిఁ జేయబూనుటల్
దారుణ కార్యమౌనుగద! దంపతు లందుట సౌఖ్యమిద్ధరిన్
బారిన యేరులన్నియును బర్పముఁజేరుట చూడ ధీమతీ!
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొరొన గమనము పెళ్ళింట గుబులునింపె
రిప్లయితొలగించండికొత్త దాంపత్యమాధురుల్ గూరలేదు
మొదటిరాత్రను నాశలు మోజులిపుడు
ఇట్టి సమయాన కోరికలింపుగావు
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాత్రి+అను' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
వేరులు చేసి కాపురము వేదన బెట్టి యనాదరంబునన్
రిప్లయితొలగించండిదూరముగా వసింప నది దుస్సహమౌ గద కన్నవారికిన్
వారటు వార్ధకంబు నొక బాసట లేక తపించుచుండగా
దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికామ క్రోధము లిడువడు కాల మందు
రిప్లయితొలగించండితనివి తీరక కోరిక తపన జెంది
రామనామ జపంబు వలదను వృద్ధ
దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఇడువడు' ?
!దోరవయస్సు నుండి తమతో నివసించు కుమార్తె కోసమై
రిప్లయితొలగించండితీరగు యోగ్యుఁడౌ వరునిఁ దెచ్చెడి యోచన లేమి లేకయే
కారణ మేదియైన తమకమ్మున సభ్యత మాసి యింటిలో
దారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదాన సౌశీల్య గుణములు దనర వలయు
రిప్లయితొలగించండినతిథి పూజలు సంతత మడర వలయు
ధన ఫలాది భోగముల స్వార్థ మడరంగ
దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము
వారని ప్రేమ తోడుత శుభమ్ముగ నూని గృహస్థ ధర్మమున్
దార సమేత మిద్ధర సతమ్ము చరింపఁగ భర్త ధన్యుఁడే
కారణ మేమి చెప్పిన నగర్హితమే యిది నిత్య సత్యపుం
దారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
[సత్యపు +తారుణ =సత్యపుం దారుణ; తారుణము = తరుణ భావము - అన్ ప్రత్యయము; తారుణ్యము యన్ ప్రత్యయము.
ఉదా: శ్రమణ అన్ /యన్ = శ్రామణము / శ్రామణ్యము]
'తారుణ కార్య' మంటూ వైవిధ్యంగా అద్భుతమైన పూరణ చెప్పారు. మొదటి పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుణ్యతీర్ధములకువెళ్ళిమునిగినీట
రిప్లయితొలగించండిదంపతులు సౌఖ్యమందుటదారుణమ్ము
పరులుచూతురనుభయము పడకయట్లు
తనువులొక్కటగుటమరీ దారుణమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెళ్ళి, మరీ' అన్నవి వ్యావహారికాలు. "తీర్థములకు నేగి/పోయి... ఒక్కటగుట కడు దారుణమ్ము..." అనండి.
దారుణకార్యమౌనుగదదంపతులందుటసౌఖ్యమిద్ధరన్
రిప్లయితొలగించండిదారుణమెట్లగున్రమణ!దంపతులేగదవారలిద్దరున్
నోరునునుంచు మేలుగనునొవ్వగజేయుటబాడియేగనన్
మీరుటమాటలన్భువినిమీకునుమాకునుమంచిగాదుగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారత దేశమందునను బాధల మున్గగ తల్లిదండ్రులే
రిప్లయితొలగించండివారల బాధ్యతన్ గొనక, భాగ్యమె ముఖ్యమటంచు నెంచుచున్
చేరగ వారు స్వర్గమును చేయగ కర్మల రాకయున్నచో
దారుణ కార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికన్న వారు కష్టములతో కలత నంద
వారి బాధలు గాంచియు పట్టనట్లు
బయట హాయిగ తిరుగుచు పగలు రేయి
*దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము*
మారెనుకాలమిప్పుడిటు మానవతన్ విడి కన్నబిడ్డ లే
వేరుగ కాపురమ్మిడుచు వేడుక తోడను నెల్లవేళలన్
భారముగాతలంచుచునువారలదూరమునుంచనెంచుటన్
*దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”*
సంపదలు కూడబెట్టిననింపు కాదు
రిప్లయితొలగించండిసంతు మనసు ప్రేమను చూప జరుగునయ్య
దంపతులు సౌఖ్యమందుట ; దారుణమ్ము
కదర ముసలి వారి తరుమ కంపుయనుచు
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గురుభ్యో నమః ; నిన్నటి పూరణ స్వీకరించ మనవి
....................................................................................
దారను సంగమింప కుపతప్త విపీడితయౌ తఱి | దైవ సద్వ్రతా
చార మొనర్చు భార్యc గని - సంశమ మొందకు మెప్పుడున్ | రతీ
ధోరణి మాను - మారసి ఋతుస్రవకాంత | నకాలమందునన్ =
దారుణకార్యమౌనుగద , దంపతు లందుట , సౌఖ్య మిధ్ధరన్ ! !
{ ఉపతప్త = అనారోగ్యము
ఉపతప్తవిపీడితయౌ తఱి = అనారోగ్యపీడితురాలగు నపుడు ; సంశమమొందకు = సుఖపడకు ; ఋతుస్రవకాంత = ఋతుస్రావ మందున్న కాంత ;
....................................
చివరి వాక్య క్రమము =
----------------------
అకాలమందునన్ - దంపతులుసౌఖ్యమందుట - ఇధ్ధరన్ - దారుణకార్యమౌనుగద }
******************************************