29, జనవరి 2021, శుక్రవారం

సమస్య - 3619

30-1-2021 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కామిని నూపుర మలరెను కాంతుని తలపై”

(లేదా…)

“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”

http://kandishankaraiah.blogspot.com

73 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  ధీమతి జూడగన్ పడక దిండున నెత్తిడు భర్తగారినిన్
  గోముగ రాగ దగ్గరకు కోరిక తీరగ ప్రేమజూపగన్
  చీమను జూచి చిందులిడి చెన్నుగ తన్నగ భర్తనెత్తినిన్
  కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్...

  రిప్లయితొలగించండి
 2. భామినిసత్యగచూడగ
  ఆమనికోకిలగళముననాదరమోప్పన్
  కామితభూదేవతగను
  కామినినూపురమలరెనుకాంతునితలపై

  రిప్లయితొలగించండి
 3. భామిని రుక్మిణి కిచ్చెను
  సామియె పారిజమటంచు సంజ్వరమున యా
  భామయె కృష్ణుని తన్నగ
  కామిని నూపురమలరెను కాంతుని తలపై

  రిప్లయితొలగించండి
 4. రాముని వంశపు పెద్దలు

  సామము గంగను పిలవగ చక చక ధారై

  సోముని సరసన నిలవగ

  కామిని నూపుర మలరెను కాంతుని తలపై”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 5. భామిని యలుకను మాన్పగ
  కామితముగ కృష్ణు డపుడు కాళ్ళను దాకన్
  కామాక్షి తన్నె నయ్యెడ
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై

  రిప్లయితొలగించండి
 6. ఏమనిణజెప్పగావలయునేర్పునబ్రహ్మయునింతిఁజెక్కెగా
  భామినిభావ్యసంపదనుపావనియయ్యెనుబిడ్డనిచ్చుచున్
  వామకురెండుకత్తులునువాసిగవ్రుత్తియువంటవార్పునున్
  కామినినూపురంబలరెగాంతునకున్దలమానికంబునన్

  రిప్లయితొలగించండి
 7. ఏమనువాఁడ? దారకుని నేయఁగ దుర్గయె కాళికాంబయై
  భీమ పరాక్రమం బెసఁగ భీషణ రూపున సంచరించుచున్
  స్వామిని శంకరున్ గనక చప్పునఁ ద్రొక్కిన వేళఁ జూడఁగన్
  కామిని నూపురంబలరె కాంతునకున్ తలమానికంబుగన్.

  రిప్లయితొలగించండి
 8. పారిజాతాపహరణము వృత్తాంత పరంగా ........
  కోపంగా ఉన్న సత్యభామను అనునయించబోతున్న శ్రీకృష్ణునికి సత్యభామయొక్క పాదము తగిలిన సన్నివేశము...........

  ప్రేమమనోహరీ ప్రణయ వీచికలన్ గణియింపవేల నౌ
  రా! మరి నన్ను గాంచవు పరాకుగ నుండెదవేల నేడు నీ
  మోమది వాడెనేల యని ముద్దుగ బల్కెడు కృష్ణుఁ దన్నగా
  కామిని నూపురంబలరె కాంతునకున్ తలమానికంబుగా

  రిప్లయితొలగించండి
 9. రాముని వంశ పెద్ద రఘు రాజుకు తాతకు తాత తాతకున్
  కామము తీర్చగన్భువికి కారుచు ధారగ హోరు హోరుగ
  న్సోముని చెంత చేరి, తలనొప్పుచు గంగమ భక్తి మొక్కగన్
  కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  ( రఘువుకు తాత, తాత, తాత .. భగీరధుడు)

  రిప్లయితొలగించండి
 10. గ్రామము లోన నాటకము రమ్యముగా కొనసాగుచుండగన్
  భామగ వేసినట్టి యొక పాటల గంధి మగండు కృష్ణునిన్
  దామసమంది దుఃఖమున తన్నెడు పాళమునందు జారి యా
  కామిని నూపురం బలరె గాంతునకున్ దలమానికంబుగన్

  రిప్లయితొలగించండి
 11. భామిని కిన్కజూపు ముఖభంగిమ వేడ్కను గూర్చగావడిన్
  ప్రేముడిమీరగా గదిసి " ప్రేయసి నీపద దాసుడన్ గదా
  మోమది కందెనే "యనుచు ముద్దిడబోవగ పాదమున్ భళా
  కామిని నూపురంబలరె కాంతునికిన్ తలమానికంబుగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్షేమము నెంచి నాథునికి శీర్షమునందున హెల్మెటేర్పడన్
   ప్రేమగ పుట్టినింటిదగు పెన్నిధి లోనివి కాలిపట్టెలన్
   సీమ దుకాణమందునను సేలును జేయుచు సొమ్ముగూర్చగన్
   కామిని నూపురంబలరె కాంతునికిన్ తలమానికంబుగన్

   తొలగించండి
  2. లేమను గూడుచు శారద
   యామిని బృందావనమున హాసముతోడన్
   స్వామియె ముద్దిడ పాదము
   కామిని నూపుర మలరెను కాంతుని తలపై

   తొలగించండి
  3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. కాముని పున్నమి రాతిరి
  భామిని పతితో సరసము బరపుచునుండన్
  కామప్రేరేపణమున
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై

  రిప్లయితొలగించండి
 13. కందం
  భామిని యలకలఁ జెలఁగగ
  యామినిలో కృష్ణమూర్తి యనునయమునకున్
  గోముగ కదలాడంగన్
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై!

  ఉత్పలమాల
  ఆ ముని నారదుండు హరి యాయమ రుక్మిణి సత్యభామలున్
  శేముషిఁ దిమ్మనార్యుల విశేష కథాగమనంపు పాత్రలై
  ధీమతి కృష్ణరాయల విధేయతఁ దీర్చిన కావ్యసీమలో
  కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్

  రిప్లయితొలగించండి
 14. నాట్యమాడుటకు తప్పని సరిగా కాలికి మువ్వలు ధరిస్తారు. పెండ్లికి ముందు తాను నాట్యకళాకారిణి గా కొనసాగుటకు పట్టుబట్టి ఒప్పుకొన జేసి, భర్తకు ఆమె మువ్వలే శ్రేష్ఠము అని చెప్పే ఈ ప్రయత్నము:

  ఉ:

  భామిని నాట్య శాస్త్రమును భక్తి ప్రపత్తుల కోర్చి నేర్చుచున్
  నీమము మేర నృత్యములు నిష్ఠగ జేయుచు వృద్ధి నొందగన్
  మామను పెండ్లియాడె తన మాటకు సమ్మతి వెల్లడించగన్
  కామిని నూపురంబలరె కాంతునకున్ తల మానికంబుగన్

  తలమానికము= శ్రేష్ఠము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. సమస్య :
  కామిని నూపురం బలరె
  గాంతునకున్ దలమానికంబుగన్

  ( గగనగంగ అవతరణాన్ని గౌరీదేవికి వివరిస్తున్న నారదుడు )

  ఉత్పలమాల
  ....................

  ఏమని విన్నవింతు పర
  మేశ్వరు రాణివి నీకు నిప్పుడున్ ?
  గోమలి ! దేవగంగ ప్రభు
  గోరిక దీర్పగ చండవేగియై
  భూమికి దూకుచున్నయది ;
  ముచ్చట గొల్పుచు తళ్కులీను నా
  కామిని నూపురం బలరె
  గాంతునకున్ దలమానికంబుగన్ .
  ( ప్రభు గోరిక - భగీరథుని కోరిక )

  రిప్లయితొలగించండి
 16. స్వాములవారి నమ్ముకుని సంతతికోసమె సంప్రదించగా
  పాముపడంగవిప్పినటు,పాపమునామెను చేరరమ్మనెన్
  కోమలి కోపతాపమున,కొంగుబిగించుచు జుట్టుబట్ట నా
  కామునినూపురంబలరె,కాంతునికిన్ తలమాణికంబుగన్
  +++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి


 17. భామా విలాప మదిగో
  కామిని నూపుర మలరెను; కాంతుని తలపై
  నీమము తప్పక భారము
  శ్యామల రాయా పడెను! ప్రశాంతత పోయెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 18. చేతి చమురు వదిలె :)


  అలకల పాన్పదియె! గలగ
  లల కామిని నూపురం బలరెఁ; గాంతునకున్
  దలమానికంబుగన్ రొం
  పి, లావు గా క్రెడిటు కార్డు బిల్లు జిలేబీ :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. శ్రీమాహేశ్వరి సేవగ
  ఆ మాతకు ముడుపు మోసె యానందముగన్
  నామము లనుచు కదల, శివ
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై

  రిప్లయితొలగించండి
 20. భామినితోడ కూడి కడు పచ్చగ నిల్చిన జొన్నచేనులో
  కాముని కేళిలో మునిగి కాంచుచు నుండగ మోదమత్తరిన్
  గోముగ కన్నుగీటుచును కొమ్మయు పొర్లుచు రెచ్చగొట్టగా
  కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్
  అసనారె

  రిప్లయితొలగించండి
 21. భామయె దుర్గయై మగడు భవ్య మనస్కుడు శంకరుండునై
  క్షేమముగోరగానెపుడుజిందులువేసెడుదారదారకున్
  జీమగనెంచిసారగొనిచెంతకుజేరియుగాళియైనయా
  *“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”*

  రిప్లయితొలగించండి
 22. సోముడు రోహిణీవిభుడు జూడడటంచును దక్షుజేరెనా
  స్వామిని నన్నుజేర్చుమని ప్రార్థన జేయగ పుత్రికోసమే
  సోము శపించె క్షీణువయి స్రుక్కగ శంభు శిరంబు నెక్కెమా
  *“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”*

  రిప్లయితొలగించండి
 23. కాముకుడైన వల్లభుడు గాంతను జెంతకు చేరదీసి యో
  భామిని త్రాగుబోతునని పల్కకు దూరకు మంచు ప్రేమతో
  దామరకంటిగంటి ముగుదా! ముదమందగ భూషతొడ్గగా
  *“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”*

  రిప్లయితొలగించండి
 24. కోమలమైన పాదమని కోరికతో సఖి పాదపద్మమున్
  ప్రేమను ముద్దుపెట్టుకొన ప్రేయసి యుల్లముపొంగి వాంఛలన్
  గోముగ పాదమున్ కదుప గుల్ఫము నాథు తలందు త్రాకనా
  *“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్

  రిప్లయితొలగించండి

 25. స్వామిశిరోవిభూషణశశాంకకళాకమనీయభాగమో
  యేమొ! యనన్?, మనోజ్ఞపరమేశకపర్ధవిరాజమానమై,
  వ్యోమధునీపదాంబుజవిభూషితఘల్ఘలరావరమ్యమై
  కామిని నూపురం బలరెఁ, గాంతునకున్ దలమానికంబుగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 26. భామ పదములూనె నఖము
  కాముని కేళితమకమున కామిత రీతిన్
  లేమ ముడువ కాలు నపుడు
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై

  రిప్లయితొలగించండి
 27. ఏమనిజెప్పుదునారద!
  కామినినూపురమలరెను కాంతునితలపై
  కామినియనగనునెఱుగుమ
  యామెయెయాసత్యభామ యాపనిజేసెన్

  రిప్లయితొలగించండి
 28. ఏ మగువ సైప నోపును
  గాముకుఁడౌ స్వీయ భర్తఁ గన నివ్విధి నా
  భామకుఁ గలిగెను రోతయె
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై

  [కామిని: ఇక్కడ వేశ్య]


  ప్రేమ గలట్టి చోటునను వింతయె నిందలు గూడ నొప్పులౌ
  క్షేమము గూర్తు రింపుగను జింత వహింపక వారి కెప్పుడున్
  భామిని సత్యభామ పతి వామ పదమ్మునఁ దన్నఁ గిన్కమై
  కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్

  రిప్లయితొలగించండి
 29. ఏమా లాస్య విలాసము
  ప్రేమామృత రాగ ధార వీక్షిత హేలా
  రామపు నాట్యం బందున
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై!

  రిప్లయితొలగించండి
 30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 31. భామినిసత్యభామకసిబాదమునెత్తుచుదన్నగాదలన్
  గామినినూపురంబలరె గాంతునకున్దలమానికంబుగన్
  గోమునబల్కెనప్పుడటకోపముపోయెనె?చెప్పుమావడిన్
  బ్రేమముమీరదెత్తుసుమవృక్షముచూడుమ యీక్షణంబునన్

  రిప్లయితొలగించండి
 32. ప్రేమము మీర దంపతులు వెన్నెల రేయి సమాగమంబునన్
  కాముని ప్రేరణంబు నభిగాముకులై చరలాడు వేళలో
  హేమ విభూషణం బపసరిల్లి పయిన్ బడ జూడ నత్తరిన్
  కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్

  రిప్లయితొలగించండి
 33. ప్రేమలకుడిచిన భామిని
  క్షేమం బరసిన ప్రియుడట కేలునుమోడ్చెన్
  కోమల విలసిత చేష్టల
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై!!

  రిప్లయితొలగించండి
 34. శ్రీమాతంగియె గిరిపై
  ప్రేమముతో నాట్యమాడ పెనిమిటి తోడన్
  కోమల భంగిమ లందున
  కామిని నూపురమలరెను కాంతుని తలపై!!!

  రిప్లయితొలగించండి
 35. ఆముని పారిజమొసగగ
  తాముడువగరుక్మిణియును తపనయు హెచ్చన్
  భామయు కినుకను బూనగ
  కామిని నూపుర మలరెను కాంతుని తలపై

  రిప్లయితొలగించండి