మీ ఆజ్ఞ ప్రకారం విన్నకోట వారికి పంపితిని. వారి స్పందన:
Good morning, Sir. So kind of you to send me a copy of your book of reminiscences. I like books of memoirs. Just now I have read a couple of articles in your book and found them hilarious. You have a Wodehousian style of narrating 🙂.
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
సద్యశమంద గోరుచును శంకరు కొల్వును చేరి తీరుగన్
హృద్యపు మాటలన్ నుడివి హేలగ నేర్చుచు తెల్గు ఛందమున్
గద్యము వ్రాయజాలకయె గట్టిగ డప్పులు కొట్టి దోషపున్
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్...
కృష్ణ శాస్త్రి = నల్లని (ప్రభాకర) శాస్త్రి
జీపీయెస్ వారికి
తొలగించండిKGP edition is quite excellent. Humorous at the same time thought provoking.
Thank you for sending such wonderful compilation.
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పుస్తకం జిలేబి గారి మెప్పు పొందినందుకు సంతోషం!
🙏
తొలగించండిశంకరకృప జిలేబి గారు!
మీ ఆజ్ఞ ప్రకారం విన్నకోట వారికి పంపితిని. వారి స్పందన:
Good morning, Sir.
So kind of you to send me a copy of your book of reminiscences. I like books of memoirs. Just now I have read a couple of articles in your book and found them hilarious. You have a Wodehousian style of narrating 🙂.
Thank you very much for the book.
- Vinnakota Narasimha Rao
18-01-2021
హృద్యము గానట్టి వగుచు
రిప్లయితొలగించండివిద్యావంతులకు నవియు వెగటు గ నుండన్
సద్యశమును గూర్చని వౌ
పద్యములు వ్రాసితి నని పలుకగ నేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పద్యమ్మును..." టైపాటు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిహృద్యమ్మగు భావములను
గద్యకవితలందు చాటి ఘనమగు కీర్తి
న్నుద్యోతించిన శాస్త్రీ
పద్యమ్మును వ్రాసితినని పలుకగనేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచోద్యంబిదే జిలేబీ
యాద్యంతమ్ములిటుకల భయానక పేర్పుల్
గిద్యమ్ముల మరి వ్రాయుచు
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భయానక పేర్పుల్' దుష్టసమాసం.
విద్యల నిచ్చిన తల్లివి
రిప్లయితొలగించండిహృద్యము నీవాక్కు నెపుడు హృదయము నందున్
గద్యము నెరుగని వాడినె
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నీ వాక్కు నిలుచు హృదయమునందున్' అంటే బాగుంటుందేమో?
ఇంకా బాగుంటుంది ఆర్యా!🙏
తొలగించండిఆద్యుల ముద్దుల తనయుడు
రిప్లయితొలగించండిబాధ్యత భారతము వ్రాసె, పలుకది మునిదే,
విద్యకునొజ్జగు దేవా
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆద్యుల ముద్దుల తనయుడు
రిప్లయితొలగించండిబాధ్యత భారతము వ్రాసె, పలుకది మునిదే,
విద్యకునొజ్జగు దేవా
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఉద్యోగము కొరకై జని
రిప్లయితొలగించండివిద్యార్హత జెప్పుమనగ విజ్ఞత విడి యా
యుద్యోగితోడ నిట్టుల
పద్యమ్మును వ్రాసితినని పలుకగ నేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కొరకై చని' అనండి.
రిప్లయితొలగించండిఅనుమానమేల నేనౌ
నను! పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొ
ప్పునె కృష్ణ శాస్త్రికిన్? చ
ప్పున వేస్తానొక్క వేటు పోదు బడాయీ !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచోద్యము నందినాడ నిట చూడగ చిత్రమ దేమిటో యికన్
రిప్లయితొలగించండివిద్యల వేల్పునెప్పుడును వేడక యుండెను చిత్తమందునన్
హృద్యమునొందునట్టి దొక హెచ్చగు మెప్పగు పల్కనేరడే
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిహృద్యమ్ముగ పదసంధా
రిప్లయితొలగించండినోద్యోగము లేని పద్యముచితం బౌనే?
సద్యస్ఫురణము కఱువౌ
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా?
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఆద్యంతము వ్యాకరణము
నధ్యయనముఁ జేసినట్టి యధిపుల పలుకుల్
వద్యగ నొప్పినఁ జాలదె?
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా?
ఉత్పలమాల
హృద్యకవిత్వ మాధురుల నింపుగ భావకవీంద్రుఁడౌచు నై
వేద్యముఁ జేసి వాణి కృప విర్విగఁ పద్యములందు పాటలన్
సద్యశమున్గొనన్, గుమతి చందవిహీనగతిన్ లిఖించుచున్
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె? కృష్ణ శాస్త్రికిన్!
(శ్రీకృష్ణశాస్త్రి గారితో, కుమతి పద్యము వ్రాసి నాఁడనని పల్కవచ్చునా? అను భావంతో)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఆద్యుడు పోతనార్యుడు మహాకవి వ్రాసిన కావ్యమందునన్
రిప్లయితొలగించండివేద్యులు మెచ్చినట్టి పలు వీనుల విందగు పద్యరాజముల్
హృద్యముగా రచించితిని యిందున నెవ్వని చేజనించనే
పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణశాస్త్రికిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రచించితిని+ఇందున' అన్నపుడు యడాగమం రాదు.
ఉద్యోగము కొరకై జని
రిప్లయితొలగించండివిద్యార్హత జెప్పుమనగ విజ్ఞత విడి యా
యుద్యోగితోడ గొప్పగ
పద్యమ్మును వ్రాసితినని పలుకగ నేలా?
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిహృద్యమునైన భావముల నింపుగ వెల్లడిజేయు రీతినిన్
గద్యము నాశ్రయించి గమకమ్మగు పాటల గూర్చి కీర్తినిన్
సద్యశమొంది భావకవి సత్కృతి తోడ తరించినట్టి తా
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హృద్యములైన...' అనండి.
మిథ్యావాదీ! నీవిట
రిప్లయితొలగించండిమద్యమ్మును గ్రోలి తూలి మానినిపైనన్
సద్యో జనితమ్మగు నొక
పద్యమ్మును వ్రాసితినని పలుకగ నేలా?
హృద్యపు కావ్యసంపుటిని హేలరచింపగ తెల్గువారలా
మద్యపు మత్తులో మునిగి మంజుల భావపరంపర
దేలియాడిరే
చోద్యము గాదె నీవిటుల జుల్కన జేయుచు మాటలాడగా
పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణశాస్త్రికిన్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణ రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ
తొలగించండిహృద్యపు కావ్యసంపుటిని హేల రచింపగ తెల్గువారలా
మద్యపు మత్తులో మునిగి మంజుల భావము
దేలియాడగా
చోద్యము గాదె నీవిటుల జుల్కన జేయుచు మాటలాడగా
పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణశాస్త్రికిన్?
ఉద్యోగార్థము తప్పదు
రిప్లయితొలగించండిగద్యపు రీతుల చదువులు ఘనమను తలపుల్
హృద్యంబౌ భాష మరువ
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా
సవరించి 🙏
తొలగించండిఉద్యోగార్థంబున దగు
గద్యపు రీతుల చదువులు ఘనమను తలపుల్
హృద్యంబౌ భాష మరువ
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండివిద్య నిగూఢ గుప్తమని వేరొకరెవ్వరు సాటిరారనన్
మద్యము గ్రోలు చందమున మట్టుకు దెచ్చిన తీరు బల్కగన్
చోద్యము మీర ఛందముగ శుద్ధియె లేక ప్రచండ రీతినిన్
పద్యము రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణ ! శాస్త్రికిన్!
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిహృద్యమ్మగు భావమ్ముల
సద్యశమొందగ తెలుపుచు సతతము నీవున్
గద్యమె మేలని వ్రాసియు
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహృద్యము గద కృష్ణుని కథ
రిప్లయితొలగించండితధ్యంబుగ దరికి జేర్చు, తారణ మనకున్
గద్యమె పద్యముగ నలరు
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి◆ శంకరాభరణం ◆
తేది 20-1-2021 ......బుధవారం
సమస్య -
***** ****
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”
నా పూరణ. ఉ.మా.
**** *** **
విద్యల నేర్చి ప్రాస,యతిఁ బేర్చి గణమ్ముల గూర్చి గాఢ వై
విధ్య పదాలమర్చి మరి వేలుగ వ్రాసిన నీదు పద్యముల్
చోద్యమె గాంచ నందునను సుంతయు లేక సుభావజాలముల్;
హృద్యము గాని పద్యముల నిట్టుల నల్లుచు నీవు.., మేటిదై
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”
★★ ఆకుల శాంతి భూషణ్ ★★
★ వనపర్తి ★
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. ఉ.మా.
**** *** **
విద్యల నేర్చి ప్రాస,యతిఁ బేర్చి గణమ్ముల గూర్చి గాఢ వై
విధ్య పదాలమర్చి మరి వేలుగ వ్రాసిన నీదు పద్యముల్
చోద్యమె గాంచ నందునను సుంతయు లేక సుభావజాలముల్;
హృద్యము గాని పద్యముల నిట్టుల నల్లుచు నీవు.., మేటిదౌ
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”
★★ ఆకుల శాంతి భూషణ్ ★★
★ వనపర్తి ★
మద్యము సేవించితివో
రిప్లయితొలగించండిచోద్యముగ గణనియమంబు జోడించకనే
గద్యము కదియించి యిటుల
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసద్యస్స్ఫూర్తిగ పద్యము
రిప్లయితొలగించండిహృద్యముగావ్రాయలేక హృదయమునందున్
సద్యశమునుకాంక్షించుచు
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండివాద్యము చేత పూని సతి వాణియె, శ్రీ సుతు బ్రహ్మ రాణియె
రిప్లయితొలగించండిన్విద్యల దేవతా మణియె, నిక్కము వాక్కుల దేవ దేవియే,
సద్యము మాట కూర్చగను , శారద గొప్పను చాటి చెప్పకన్
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె ,కృష్ణ , శాస్త్రికిన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాణియెన్.. సద్యము..'?
[1/20, 06:01] shankargdabbikar: పద్యము హృద్యమై ప్రజల భవ్య గళంబున నాట్య మాడుచున్
రిప్లయితొలగించండిగద్యమొ పద్యమో మృదుల గాన తరంగిణి నోలలాడు నై
వేద్యమొ వీనువిందువొ నివేదనమో రసబంధురంబునో
సాధ్యమొకో రచింపగ ప్రశస్త పదంబు ముదంబు గూర్చెనో
మద్యమొకో మనంబునకు మత్తును చిత్తము నందు హ్లాదమౌ
*“పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”*
[1/20, 06:13] shankargdabbikar: గద్యము వేద్యమయ్యెను జగంబున పద్యము కష్టసాధ్యమై
హృద్య మనింద్యమై కవుల హృత్గృహమందున సద్యశంబునై
వేద్యమనంత ఛందముల విద్య విహంగము వాహినీగతిన్
పద్య మృదంగ నిక్వణము పండిత పామర రంజకంబనన్
*“పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'వీనువిందువొ'?
'హృద్గృహ' మనండి. 'అనంత+ఛందము=అనంతచ్ఛందము' అవుతుంది.
పద్యము హృద్యమై దనర బాయక నిల్చునదెల్ల కాలమున్
రిప్లయితొలగించండిసద్యశమంద జేయునది; సత్యవిదూరపు వర్ణనంబుతో
పద్యము వ్రాసి తానిటుల బండిత శ్రేష్ఠుడనంచు బల్కుచున్
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి'సద్యము' ? దాని తర్వాత అరసున్న ఎందుకు?
గద్యమువ్రాసినకవివర!
రిప్లయితొలగించండిపద్యమ్మును వ్రాసితినని పలుకగనేలా
పద్యమ్ములకును నెఱుగుము
హృద్యంబగు గ్రంధపఠన మెక్కువవలయున్
సద్యో విద్యా పారీ
రిప్లయితొలగించండిణాద్య కవీంద్రర్షభ పరమామ్నాయ నభో
హృద్యాంశు సన్నిభుండవు
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా
విద్యలు రావు వంశ గత విద్వ దమేయ పరంపరన్ భువిం
జోద్యముగా శ్రమించిననె చొప్పడు సద్గురు శిక్ష లుండఁగా
గద్యము నొక్క తప్పయినఁ గానక యుండఁగ వ్రాయ నేరఁడే
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిహృద్యంబగు ఛందస్సును
రిప్లయితొలగించండిఅధ్యయనము జేయకుండ అతిశయ మతితో
సద్యశమును పొందుటకై
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా !!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగద్యమువ్రాసిజూపియును గందరగోళపుమధ్యలోదనే
రిప్లయితొలగించండిపద్యమువ్రాసినాడనని పల్కగనొప్పునె కృష్ణశాస్త్రికిన్
హృద్యముగారచించగనునింపుగఛందములాదిగానొగిన్
విద్యలనెన్నియోచదివివిఙ్ఞతనొందుచువ్రాయగావలెన్
విద్య యొకింత లేని యవివేకియు బల్కు గదా ప్రగల్భముల్
రిప్లయితొలగించండిపద్యము వ్రాసినాఁడనని; పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్
పద్యము వ్రాయలేననుట; వ్రాసెనతండు రసాత్మకంబులున్
హృద్యములైన కావ్యములు హృత్కమలంబున నిల్పి భారతిన్