22-1-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు”
(లేదా…)
“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:మేదిన్ వీడుచు చిత్రసీమనయయో మెప్పొంద శ్రీదేవియే వాదంబందున పార్వతిన్ విడుచుచున్ వైరాగ్యమొప్పంగనున్చాదస్తమ్మున స్వర్గమందు జనుచున్ జంబంపు శృంగారియౌ శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్...
విష్ణుని పదమొత్తగనేల విష్ణు పత్నిఅన్ని రంగముల మహిళ చిన్న కాదుయనుచు మహిళ సమూహము , ఔర, పలికె శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
3 వ పాదములో సవరణలతో ⬇️విష్ణుని పదమొత్తగనేల విష్ణు పత్నిఅన్ని రంగముల మహిళ చిన్న కాదుయనుచు నాస్తిక స్త్రీ మణి యనెను, ఔర, శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కాదు+అనుచు, సమూహము+ఔర' అన్నపుడు సంధి నిత్యం. 'మహిళా సమూహ' మన్నది సాధు సమాసం. "కాద।టంచు మహిళల సమూహ మౌర పలికె..." అనండి.
సవరణలకు ధన్యవాదములండీ
పటమదేలర? శేషాహి పాన్పు గాను క్షీర సాగర మందున శ్రీహరికట శ్రీ సతీ పదమొత్తెడి, శివుని గొలుతు గదర, తెమ్మిక నొక యంధక రిపు బొమ్మ.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆది శక్తియు నన్నిలోకాల నందు అమ్మలను గన్న యమ్మ యై యవత రించెఅమ్మ కరుణప్రసాదింప యాదిబిక్షు,శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
శ్రీ గురుభ్యోనమఃతల్లిదండ్రుల యొడిలోన తుళ్ళిపడుచుమురిసి యలరుచు ముద్దులమూటగట్టుపాపగనశోకసుందరి, రూపమందుశ్రీసతీ; పదమొత్తెడి శివునిఁ గొలుతు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:శ్రీదేవీయను చిత్రసీమ నటియే చేరంగ స్వర్గమ్మునన్ వాదంబందున పార్వతిన్ విడుచుచున్ వైరాగ్యమొప్పంగనున్చాదస్తమ్మున స్వర్గమందు జనుచున్ జంబంపు శృంగారియౌ శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్...😊
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
హరిహరునకుపత్నియహరితలక్ష్మితిక్కనార్యుడుకల్పించెతీరుగానుభావమద్వైతబ్రహ్మంబుపాదుకోలుపశ్రీపతీపదమోత్తెడిశివునిగోలుతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
హరియుహరునకుఅనిసవరించితిని, తప్పుగావ్రాసితినిక్షమించగలరు
ఊహ చేయుచు పలికె తా నుర్వి యందు శ్రీసతీ పద మొత్తెడి శివుని గొలుతు ననగ నయ్యది నిజమనె నార్యు డొకడు ఉమకు రమ లకు భేదము లుండ వనెను
మోదమ్మందుచు తెచ్చినావు పటమం భోరాశిలోనన్ సదా యా దర్వీకరమే బిచాణముగ పద్మాక్షుండెయౌ విష్ణువున్ శ్రీదేవీ పదపద్మ మొత్తెడి, శివున్ జిత్తంబునన్ గొల్చెదన్ కాదే నాకది తెమ్మికన్ వడిని యా కామారిచిత్రంబునే.
*శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్*శా.భేదంబింతయు లేదు లేదనుచునా వేదమ్ములేదెల్పెగాకేదారేశుడు నన్ను గొల్చు మరినే కృష్ణుండనై గొల్తు నేనా దేవున్ గొలువంగ నేగవలెగా నాలస్య మింకేల నోశ్రీదేవీ పద; పద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు🙏🏻🙏🏻
శ్రీనగర మందున కొలువై చెన్నుమీరపంచ బ్రహ్మలు సేవించు మంచమందుచెఱకువిల్లు సుమశరమ్ము చేతదాల్చుశ్రీసతీ పదమొత్తెడు శివుని గొలుతుకాదంబాటవి మధ్యవాసిని మహాకామేశ్వరీదేవి మైతాదాత్మంబున కప్పురంపు విడెమున్ దక్షాధ్వర ధ్వంసికిన్ మోదంబందుచు మందహాసమున కెమ్మోవి న్నమర్చంగ నాశ్రీదేవీ పదపద్మమొత్తెడు శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
మోదంబీయగ గా చదువ ప్రార్ధన!🙏🙏
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏
శా: మోదంబెంచి వినంగ వెళ్ళితినటన్ ముచ్చట్లు పౌరాణమైవాదంబందున వింత వింత కథలన్ వ్రాకుచ్చ విస్తారమున్ క్రోధంబూనిన మందు డొక్కడు మహా రోశమ్ము గా నిట్లనెన్శ్రీ దేవీ పద పద్మ మొత్తెడి శివున్ చిత్తంబునన్ గొల్చెదన్వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వాక్రుచ్చు' టైపాటు.
ధన్యవాదములు
ఆదిశక్తియె నతివలై అవతరించమువ్వురమ్మలు జగతికి మూలమైరికలియుగమ్మున బలిమితో కలిమి వలయుశ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు (శివుని కొలిస్తే బలిమి వస్తుంది - అర్ధనారీశ్వరుడు కనుక)
చపల తాదిరిగె భువిని చక్కగానుకాలు నొవ్వదా రమణికి కలిమిచెలికిసర్వమంగళ సేవించ సమ్మతముగశ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్"లేదీ రీతిగ బల్కరాదెపుడు చాలింపన్ దగున్ మేలమున్వేదాతీతుని పాదపద్మముల సేవించున్ మహాలక్ష్మియేఆ దివ్యాకృతిఁ నిల్పి మానసము నందర్చింప మేలౌ సదా
చెప్పెద వినవె సూత్రము చేవలతికి శ్రీసతీ! పద మొత్తెడి శివునిఁ గొలుతువాడె నిజమైన పెనిమిటి! భార్య లెల్లమెత్తు రటువంటి వార్లనే మీననేత్రి!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వారినే మీననేత్రి" అనంది.
భేదమ్మేమియు లేదు స్త్రీపురుషులాపేక్షల్ క్రియాశీలముల్!శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్వాదాన్యుండతడే సుమా! మనుజులా పాగెమ్ము సాధింపగానాధారమ్ముగ నిల్తురే ప్రథములై నానాటికిన్ కీర్తితో!జిలేబి
నాదామోదవినోదవాద్యనటనాన్న్యాసమ్ము దీపించ నాహ్లాదోద్భూతమనోహరుండు వరదానానంతకారుణ్యభద్రాదానాప్రతిభున్ గనంగ, ద్రిపురారాతిన్ దురావేశు,, .... రా శ్రీదేవీ! పద పద్మ! మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్.కంజర్ల రామాచార్య.
సమస్య :శ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్ ( బాలమార్కండేయ రక్షణార్థం వచ్చిన అర్ధనారీశ్వరుడు వామపాదాన యముని దండించి ఆపైన ఆ పాదం పార్వతిది కనుక నొచ్చిందేమో అని చేసిన పని )శార్దూలవిక్రీడితము ..........................ఖేదంబందు మృకండుబుత్రు భయమున్ కేలన్ నివారించెనే !యా దేవేశ్వరు డా మహేశ్వరుడు నా యర్ధేందుధారుండునౌ నా దివ్యాత్ముడు పాశి దన్నెను గదా !యా మీద ; నా మంగళా శ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్ .
తేటగీతిశ్రీ మహాకాళి మారణహోమమందునసురమూకను మర్దించి యుసురనంగవలదు వలదంచు వారించు పత్నిఁ జేరిశ్రీ సతీ పదమొత్తెడి శివునిఁ గొలుతు
శార్దూలవిక్రీడితముమోదంబున్ గొన మోహినీ లలనలో, మోహించి తద్రూపుడౌశ్రీదేవున్, పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్నాదౌ పద్యముఁ బాడి శిష్య చివరన్ నర్తించ 'వున్' చోట 'వీ'శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
వేదాకారిణి హంసవాహిని సదావీణన్ కరంబందునన్మోదంబొప్పగదాల్చు శ్వేత కమలంబున్ శ్వేత పద్మాసనిన్నాదాతీత శుభంకరిన్ ద్రిపుర సౌన్దర్యాంగి ప్రత్యంగిరా*“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”*
వేదంబెవ్వని సన్నుతించు సురలున్ విశ్వంభ రాదిత్యులున్మోదం బందుచు నాడి పాడెదరు ధర్మోద్ధార కున్శ్రీశునిన్పాదం బందున గంగ వక్షమున భవ్యానంద మున్జిందు నా*“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”*
శ్రీసతీపదమొత్తెడి శివునిగొలుతుశ్రీసతీపదమెత్తిన శ్రీకరుండునందనందనుడార్య!వినంగరాదె?యయినశివకేశవులొకరెయాఖ్యవేరు
చంద్రశేఖరుఁ గైలాస శైల వాసుఁ బార్వతీ సక్త వామాంగు ఫాలనయను నాగ భూషణు నాట్యమ్ము నాఁ బరంగు శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు [శ్రీ సతి = కీర్తి కాంత] కేదారేశ్వరుఁ గాలకంఠుని హరున్ గీర్వాణ సంస్తుత్యునిం గాదక్షఘ్ను సుధాంశు శేఖరుని నేఁ గైలాస సంవాసు గంగా దారాగ్రణికిన్ సహోదరియు నా కాత్యాయణీ మాతయే శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునం గొల్చెదన్
మోదంబొందుచునెల్లవేళలను నామోదంబుతోదప్పకన్ శ్రీదేవీపదపద్మమెత్తెడిశివున్ జిత్తంబునన్ గొల్చెదన్ వేదాతీతుడు శంకరుండునుదగున్ విష్ణుండునొక్కండుగానాదామోదరు,శంభునిన్ గొలువుడీహర్షాతిరేకంబునన్
దక్ష యజముకు పోవల దనెను శివుడువినక దాక్షాయని కదెల, విధివి దానమునగ, శ్రీ సతీ వలదుగ,ముంపు మనకుయనుచు, శ్రీసతీ, శ్రీసతీ, యనుగ విభుడుఆవి ధముగ శ్రీసతిని కాయగ దలచుచుశ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
వాదాలెందుకుశంభుడేకనగపవిత్రుండువిష్ణుండెగావేదాలన్నియునుగ్గడించెనిదియేవేరెందుకీభావనల్పాదాలంటిరివీరలేదగతికిన్పాలిచ్చుమూలాంబికన్శ్రీదేవీపదపద్మమోత్తెడిశివున్చిత్తంబునన్ఁగోల్చెదన్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
మేదిన్ వీడుచు చిత్రసీమనయయో మెప్పొంద శ్రీదేవియే
వాదంబందున పార్వతిన్ విడుచుచున్ వైరాగ్యమొప్పంగనున్
చాదస్తమ్మున స్వర్గమందు జనుచున్ జంబంపు శృంగారియౌ
శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్...
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
మేదిన్ వీడుచు చిత్రసీమనయయో మెప్పొంద శ్రీదేవియే
వాదంబందున పార్వతిన్ విడుచుచున్ వైరాగ్యమొప్పంగనున్
చాదస్తమ్మున స్వర్గమందు జనుచున్ జంబంపు శృంగారియౌ
శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్...
విష్ణుని పదమొత్తగనేల విష్ణు పత్ని
రిప్లయితొలగించండిఅన్ని రంగముల మహిళ చిన్న కాదు
యనుచు మహిళ సమూహము , ఔర, పలికె
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
3 వ పాదములో సవరణలతో ⬇️
తొలగించండివిష్ణుని పదమొత్తగనేల విష్ణు పత్ని
అన్ని రంగముల మహిళ చిన్న కాదు
యనుచు నాస్తిక స్త్రీ మణి యనెను, ఔర,
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కాదు+అనుచు, సమూహము+ఔర' అన్నపుడు సంధి నిత్యం. 'మహిళా సమూహ' మన్నది సాధు సమాసం. "కాద।టంచు మహిళల సమూహ మౌర పలికె..." అనండి.
సవరణలకు ధన్యవాదములండీ
తొలగించండిపటమదేలర? శేషాహి పాన్పు గాను
రిప్లయితొలగించండిక్షీర సాగర మందున శ్రీహరికట
శ్రీ సతీ పదమొత్తెడి, శివుని గొలుతు
గదర, తెమ్మిక నొక యంధక రిపు బొమ్మ.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆది శక్తియు నన్నిలోకాల నందు
రిప్లయితొలగించండిఅమ్మలను గన్న యమ్మ యై యవత రించె
అమ్మ కరుణప్రసాదింప యాదిబిక్షు,
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
శ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండితల్లిదండ్రుల యొడిలోన తుళ్ళిపడుచు
మురిసి యలరుచు ముద్దులమూటగట్టు
పాపగనశోకసుందరి, రూపమందు
శ్రీసతీ; పదమొత్తెడి శివునిఁ గొలుతు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
శ్రీదేవీయను చిత్రసీమ నటియే చేరంగ స్వర్గమ్మునన్
వాదంబందున పార్వతిన్ విడుచుచున్ వైరాగ్యమొప్పంగనున్
చాదస్తమ్మున స్వర్గమందు జనుచున్ జంబంపు శృంగారియౌ
శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్...
😊
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిహరిహరునకుపత్నియహరితలక్ష్మి
రిప్లయితొలగించండితిక్కనార్యుడుకల్పించెతీరుగాను
భావమద్వైతబ్రహ్మంబుపాదుకోలుప
శ్రీపతీపదమోత్తెడిశివునిగోలుతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
హరియుహరునకుఅనిసవరించితిని, తప్పుగావ్రాసితినిక్షమించగలరు
తొలగించండిఊహ చేయుచు పలికె తా నుర్వి యందు
రిప్లయితొలగించండిశ్రీసతీ పద మొత్తెడి శివుని గొలుతు
ననగ నయ్యది నిజమనె నార్యు డొకడు
ఉమకు రమ లకు భేదము లుండ వనెను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోదమ్మందుచు తెచ్చినావు పటమం భోరాశిలోనన్ సదా
రిప్లయితొలగించండియా దర్వీకరమే బిచాణముగ పద్మాక్షుండెయౌ విష్ణువున్
శ్రీదేవీ పదపద్మ మొత్తెడి, శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
కాదే నాకది తెమ్మికన్ వడిని యా కామారిచిత్రంబునే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్*
రిప్లయితొలగించండిశా.
భేదంబింతయు లేదు లేదనుచునా వేదమ్ములేదెల్పెగా
కేదారేశుడు నన్ను గొల్చు మరినే కృష్ణుండనై గొల్తు నే
నా దేవున్ గొలువంగ నేగవలెగా నాలస్య మింకేల నో
శ్రీదేవీ పద; పద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు🙏🏻🙏🏻
తొలగించండి
రిప్లయితొలగించండిశ్రీనగర మందున కొలువై చెన్నుమీర
పంచ బ్రహ్మలు సేవించు మంచమందు
చెఱకువిల్లు సుమశరమ్ము చేతదాల్చు
శ్రీసతీ పదమొత్తెడు శివుని గొలుతు
కాదంబాటవి మధ్యవాసిని మహాకామేశ్వరీదేవి మై
తాదాత్మంబున కప్పురంపు విడెమున్ దక్షాధ్వర ధ్వంసికిన్
మోదంబందుచు మందహాసమున కెమ్మోవి న్నమర్చంగ నా
శ్రీదేవీ పదపద్మమొత్తెడు శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
మోదంబీయగ గా చదువ ప్రార్ధన!🙏🙏
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏
తొలగించండిశా:
రిప్లయితొలగించండిమోదంబెంచి వినంగ వెళ్ళితినటన్ ముచ్చట్లు పౌరాణమై
వాదంబందున వింత వింత కథలన్ వ్రాకుచ్చ విస్తారమున్
క్రోధంబూనిన మందు డొక్కడు మహా రోశమ్ము గా నిట్లనెన్
శ్రీ దేవీ పద పద్మ మొత్తెడి శివున్ చిత్తంబునన్ గొల్చెదన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వాక్రుచ్చు' టైపాటు.
ధన్యవాదములు
తొలగించండిఆదిశక్తియె నతివలై అవతరించ
రిప్లయితొలగించండిమువ్వురమ్మలు జగతికి మూలమైరి
కలియుగమ్మున బలిమితో కలిమి వలయు
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
(శివుని కొలిస్తే బలిమి వస్తుంది -
అర్ధనారీశ్వరుడు కనుక)
చపల తాదిరిగె భువిని చక్కగాను
తొలగించండికాలు నొవ్వదా రమణికి కలిమిచెలికి
సర్వమంగళ సేవించ సమ్మతముగ
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్"
రిప్లయితొలగించండిలేదీ రీతిగ బల్కరాదెపుడు చాలింపన్ దగున్ మేలమున్
వేదాతీతుని పాదపద్మముల సేవించున్ మహాలక్ష్మియే
ఆ దివ్యాకృతిఁ నిల్పి మానసము నందర్చింప మేలౌ సదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచెప్పెద వినవె సూత్రము చేవలతికి
శ్రీసతీ! పద మొత్తెడి శివునిఁ గొలుతు
వాడె నిజమైన పెనిమిటి! భార్య లెల్ల
మెత్తు రటువంటి వార్లనే మీననేత్రి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వారినే మీననేత్రి" అనంది.
రిప్లయితొలగించండిభేదమ్మేమియు లేదు స్త్రీపురుషులాపేక్షల్ క్రియాశీలముల్!
శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
వాదాన్యుండతడే సుమా! మనుజులా పాగెమ్ము సాధింపగా
నాధారమ్ముగ నిల్తురే ప్రథములై నానాటికిన్ కీర్తితో!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాదామోదవినోదవాద్యనటనాన్న్యాసమ్ము దీపించ నా
రిప్లయితొలగించండిహ్లాదోద్భూతమనోహరుండు వరదానానంతకారుణ్యభ
ద్రాదానాప్రతిభున్ గనంగ, ద్రిపురారాతిన్ దురావేశు,, .... రా
శ్రీదేవీ! పద పద్మ! మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్.
కంజర్ల రామాచార్య.
సమస్య :
రిప్లయితొలగించండిశ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్
జిత్తంబునన్ గొల్చెదన్
( బాలమార్కండేయ రక్షణార్థం వచ్చిన అర్ధనారీశ్వరుడు వామపాదాన యముని దండించి ఆపైన ఆ పాదం పార్వతిది కనుక నొచ్చిందేమో అని చేసిన పని )
శార్దూలవిక్రీడితము
..........................
ఖేదంబందు మృకండుబుత్రు భయమున్
కేలన్ నివారించెనే !
యా దేవేశ్వరు డా మహేశ్వరుడు నా
యర్ధేందుధారుండునౌ
నా దివ్యాత్ముడు పాశి దన్నెను గదా !
యా మీద ; నా మంగళా
శ్రీదేవీపదపద్మ మొత్తెడి శివున్
జిత్తంబునన్ గొల్చెదన్ .
తేటగీతి
రిప్లయితొలగించండిశ్రీ మహాకాళి మారణహోమమందు
నసురమూకను మర్దించి యుసురనంగ
వలదు వలదంచు వారించు పత్నిఁ జేరి
శ్రీ సతీ పదమొత్తెడి శివునిఁ గొలుతు
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిమోదంబున్ గొన మోహినీ లలనలో, మోహించి తద్రూపుడౌ
శ్రీదేవున్, పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
నాదౌ పద్యముఁ బాడి శిష్య చివరన్ నర్తించ 'వున్' చోట 'వీ'
శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
వేదాకారిణి హంసవాహిని సదావీణన్ కరంబందునన్
రిప్లయితొలగించండిమోదంబొప్పగదాల్చు శ్వేత కమలంబున్ శ్వేత పద్మాసనిన్
నాదాతీత శుభంకరిన్ ద్రిపుర సౌన్దర్యాంగి ప్రత్యంగిరా
*“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”*
వేదంబెవ్వని సన్నుతించు సురలున్ విశ్వంభ రాదిత్యులున్
రిప్లయితొలగించండిమోదం బందుచు నాడి పాడెదరు ధర్మోద్ధార కున్శ్రీశునిన్
పాదం బందున గంగ వక్షమున భవ్యానంద మున్జిందు నా
*“శ్రీదేవీ పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్”*
శ్రీసతీపదమొత్తెడి శివునిగొలుతు
రిప్లయితొలగించండిశ్రీసతీపదమెత్తిన శ్రీకరుండు
నందనందనుడార్య!వినంగరాదె?
యయినశివకేశవులొకరెయాఖ్యవేరు
చంద్రశేఖరుఁ గైలాస శైల వాసుఁ
రిప్లయితొలగించండిబార్వతీ సక్త వామాంగు ఫాలనయను
నాగ భూషణు నాట్యమ్ము నాఁ బరంగు
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
[శ్రీ సతి = కీర్తి కాంత]
కేదారేశ్వరుఁ గాలకంఠుని హరున్ గీర్వాణ సంస్తుత్యునిం
గాదక్షఘ్ను సుధాంశు శేఖరుని నేఁ గైలాస సంవాసు గం
గా దారాగ్రణికిన్ సహోదరియు నా కాత్యాయణీ మాతయే
శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునం గొల్చెదన్
మోదంబొందుచునెల్లవేళలను నామోదంబుతోదప్పకన్
రిప్లయితొలగించండిశ్రీదేవీపదపద్మమెత్తెడిశివున్ జిత్తంబునన్ గొల్చెదన్
వేదాతీతుడు శంకరుండునుదగున్ విష్ణుండునొక్కండుగా
నాదామోదరు,శంభునిన్ గొలువుడీహర్షాతిరేకంబునన్
దక్ష యజముకు పోవల దనెను శివుడు
రిప్లయితొలగించండివినక దాక్షాయని కదెల, విధివి దాన
మునగ, శ్రీ సతీ వలదుగ,ముంపు మనకు
యనుచు, శ్రీసతీ, శ్రీసతీ, యనుగ విభుడు
ఆవి ధముగ శ్రీసతిని కాయగ దలచుచు
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు
వాదాలెందుకుశంభుడేకనగపవిత్రుండువిష్ణుండెగా
రిప్లయితొలగించండివేదాలన్నియునుగ్గడించెనిదియేవేరెందుకీభావనల్
పాదాలంటిరివీరలేదగతికిన్పాలిచ్చుమూలాంబికన్
శ్రీదేవీపదపద్మమోత్తెడిశివున్చిత్తంబునన్ఁగోల్చెదన్