25-1-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”
(లేదా…)
“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:చకచక వానలే పడగ చక్కగ నవ్వుచు ముత్తుకూరునన్వికటపు టట్టహాసమున వీనుల విందుగ పాటపాడగన్నికటపు గ్రద్దనున్ గనుచు నీలిగి జంకున కేకలేయుచున్ బెకబెకలాడ మండుకము భీతిలి పాఱెను పాము గ్రక్కునన్...
కంద సమస్యలో యతి అర్థము కాలేదు నాకు
ఇది ఎంతమాత్రం సరదా పూరణ కాదు. సహజమై ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
🙏
సవరించిన సమస్యలు:*25-1-2021 (సోమవారం)**సమస్య – 3614*కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...*“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”*(లేదా…)*“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”*
తప్పులుఁజేసినప్రభుతనుతిప్పలుతోడుతజనతయుతీరుకుదెచ్చెన్ఇప్పటికిదిసరికాదనుకప్పలబెకబెకలువినినకాళమునదరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కాళమ్మదిరెన్" అనండి.
బొప్పడు కర్ణకఠోరపు చప్పుడు చేసె సకినమ్ము జక్కగ జేసెన్ పప్పి పలికింప రబ్బరు కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకలముదేవుడేయనుచుశాంతినియత్నముమానగాతుదిన్వికలమునయ్యెపామునకువింతగమారెనుజీవయాత్రయున్పకపకలాడుచున్జనులుపాఁపనుత్రాడుగఁజేసియాడిరేబెకబెకలాడమండుకముభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్
తేట గీతి:: కొంటెగాడు వాట్సపునందు కొత్త వింత“లండను నగరిలో కప్పల బెకబెకలు వినిన పాము భయపడెన్” , భువిన కనుడనభళియనుచు లైకు చెప్పిరి వారి తీర్చి...భారతీనాథ్ చెన్నంశెట్టి...( వారి= అప్పు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "భువిని" అనండి.
కందంతుప్పలు విడి గదిఁ దూరుచుచప్పున, ధ్వన్యనుకరణపు సాధన లోనన్దిప్పల శ్రుతిఁ దప్పిన వెంకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
వికసిత సుందరాంగియగు వేడుక కత్తియె పిల్చినంత కా ముకుడగు సామవాయికుడు భోగపు వాడలు జేరినంత ర క్షకభటులేగు దెంచిన యగాదు వినంగనె పారిపోయెనే బెకబెకలాడ మండుకము భీతిలి పాఱెను పాము గ్రక్కునన్.
చప్పుడుకు నిలయము చెరువు కప్పల బెకబెక లకు : నహి కడు భీతిల్లె న్ కుప్పలు కావగ వచ్చి న తిప్పన్న కరమున కఱ్ఱ తీవ్రపు స డి కిన్
క్రొవ్విడి వెంకట రాజారావు: గొప్పగ కయ్యను దాటగ చప్పున నీదుచు వెడలెడి సమయము నందున్ చప్పుడు చేయుచు వెన్కొను కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
ఒప్పుగ కయ్యను దాటగచప్పున నీదుచు వెడలెడి సమయము నందున్చప్పుడు చేయుచు వెన్కొనుకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
చప్పున చేరెను కొలనుకుకప్పల బెకబెకలకు నహి, భీతిల్లెన్కుప్పించు గృధ్రమును గనితప్పించు కొనగ సరియగు దారిని వెదకెన్ చకచక పావులన్ గదిపి జాణతనంబున స్ధానికెన్నికల్తికమక బెట్టుచున్ బ్రజల ధీటుగచక్కగ నిర్వహించెడిన్ప్రకటననీయ రమేశుడు భంగపడంగ ప్రధానపక్షమేబెకబెకలాడ మండుకము భీతిలిపారెను పాముగ్రక్కునన్
చంపకమాల మూడవ పాదమునప్రకటన వెల్వరించగని భంగపడంగ ప్రధానపక్షమే గా చదువ ప్రార్ధన!🙏🙏🙏
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'స్థానిక+ఎన్నికల్' అన్నపుడు సంధి లేదు. పైగా దుష్టసమాసం. 'స్థానికపు టెన్నికలు' అనాలి.
ధన్యవాదములు గురుదేవా! పౌర యెన్నికల్ అనవచ్చునా?🙏🙏🙏🙏
తెప్పలు వేసుకు వచ్చిరికుప్పలుగ మనుజులు వినుము, కొలను కదలికన్చప్పుడులు వేటకాయనుకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
కె.వి.యస్. లక్ష్మి: చప్పున జేరెను కలుగును కప్పల బెకబెకలకు నహి; కడు భీతిల్లెన్ తప్పదు మృత్యువె తనకని తుప్పలలో బకమును గని త్రోవ పడయకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పడయకున్'?
చెప్పకుమెవ్వడు భయపడుకప్పల బెకబెకలకు; నహి కడు భీతిల్లెన్ముప్పని ముంగిస నట గనిచప్పున బుస గొట్టె జాతి శత్రుత్వమునన్
కం.చప్పున యెన్నికలొచ్చెనుచెప్పకనిచ్చిన గురుతులు చేతనలైనన్కుప్పలుగ వోటు దక్కినకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
(కప్ప బెకబెకలకు పాము గడగడ వణికెన్)(చేతనలు = ప్రాణులు, జంతువులు)
చప్పుడు వినలేదు నగము“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”తప్పుడు కతయిది , నాగువులెప్పుడు కంపనము మాత్రమెరుగును గదరా
నప్ప యొకడు కొంటెగ తనయప్ప నడిగె నమ్మలేని యంశము జెప్పన్చప్పున వాచించె నిటుల“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”నప్ప = బాలుడు
సమస్య :బెకబెకలాడ గప్పలవె భీతిలి పారెను పాము గ్రక్కునన్ ( అహంకరించిన నిజాం నవాబు - అణగగొట్టిన తెలుగు ప్రజలు )చంపకమాల ...................పకపక నవ్వుచున్ " పిరికి పందలు రాజును గెల్వనేర్తురే ?వికటపు నాదు ఠీవికిని వీరలు తొత్తు" లనెన్ నిజాముడే ;తికమకలౌచు నోటువడ ; దెల్గు ప్రజల్ తెగ సంతసించిరే !బెకబెకలాడు గప్పలవె ; భీతిలి పారెను పాము గ్రక్కునన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అప్పా! వచ్చెను గృధ్రముకప్పల బెకబెకలకు, నహి కడు భీతిల్లెన్,చప్పున జరజర ప్రాకుచుగప్పున నొకపుట్ట దూరి కాచుకొనె సుమీజిలేబి
చక్కని పూరణ. అభినందనలు.
వినువీధిని వరుగొకటి కెలను! బెకబెకలాడఁ గప్పలవె, భీతిలి పాఱెను పాము గ్రక్కునన్ పుట్టను దూరెనొక క్షణమందు టక్కున సుమ్మీ !జిలేబి
క్రమముగ వైనతేయుడు ప్రకామరయమ్మున వేల్పుఁ ద్రోవ సంభ్రమమున మాతృదాస్యవినివర్తనఁ జేయగ వచ్చు వేళ సం యమనముఁ గోలు పోయి విటపావళి కూకటి త్రెళ్ళి వెంట రాఁప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై.కంజర్ల రామాచార్య
జనులను రెచ్చగొట్టెడి ప్రసంగములున్, నెరవేర్చరాని పొంతన యిసుమంత లేని వితథమ్మగు హామి నొసంగుటల్, దగన్ధనమును వస్తుమద్యములుదారత నిచ్చుట, నేతలందునన్కనకపు గద్దె నెక్కుటకు గాడిద కేక లవన్ని యర్హతల్.కంజర్ల రామాచార్య.
కప్పుచు గరళపు డాగునుమెప్పుగ పరమేశు మెడన మెదలుచు ప్రీతిన్కొప్పున గంగను దుమికినకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మెడను' అనండి.
◆ శంకరాభరణం ◆ తేది 25-౦1-2021 ....సోమవారం సమస్య -***** **** బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”నా పూరణ. చం.మా.**** *** **తికమక పాలనన్ సలిపి తిప్పలుఁ బెట్టగ భారతీయులన్..,ప్రకటిత యుద్యమాలు కడు ప్రాకటమొప్పగ జేయగన్..భరించక యిక ఆంగ్ల పాలకులు జంకుచు పాఱిరి ప్రాణ భీతి.., సూబెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్” ★★ ఆకుల శాంతి భూషణ్ ★★ ★ వనపర్తి ★
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ప్రకటిత+ఉద్యమాలు=ప్రకటితోద్యమాలు' అవుతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సప్పము సవ్వడి కనుగొనిముప్పును తప్పించుకొనగ పూనిక తోడన్గొప్పగ గొంతులు బెంచినకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్!!!
నిప్పౌ సీతను బట్టినతప్పుకు నారావణుగని దండెత్తి కపుల్గుప్పించిన తీరు నరయకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్.
🙏🏻🙏🏻
ముప్పనసాంబునిమడుగునగప్పలభక్ష్షించుకొఱకుకర్కటిరాగన్ చప్పునముప్పునుగనునాకప్పలబెకబెకలకునహికడుభీతిల్లెన్
తప్పదు ముప్పని జేసినకప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్చప్పుడువిని యాకసమునచప్పుననొక గ్రద్దయటకు చయ్యన జేరన్
ఎప్పటి వలె వర్షమ్మునఁ దెప్పలుగఁ జెలంగి కూయ దిక్కు లదరఁగా నప్పుడు సరోజములతోఁ గప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్ [అహి =జలము] ఒకటికి నొక్కటిం బెనఁగ నొప్పును గుంభికి గడ్డిపోఁచలే ప్రకటితమే లయమ్ము కదరా చలిచీమల చేత భోగికిం జకచక నైకమత్యమునఁ జాగఁగఁ గాన మసాధ్య మెద్దియున్ బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను బాము గ్రక్కునన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
చకచక బ్రాఁకుచున్ ఫణము జాచుచు జెచ్చెర నేగుదెంచు నాచకితముగూర్చు పన్నగము చయ్యననాగెను గాంచి గృధ్రమున్వికచము మానసంబులను పెంపొనరింపగ సంతసంబునన్బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్
తప్పు లెరుగకుండ తరుచుమెప్పుబడయనెంచి గొప్ప మేల్ తలపెట్టన్చప్పున డబ్బును జూడగకప్పల బెకబెకలు వినిన పాము భయపడెన్!
చెకుముకిఱాయివోలెను నచేతనరీతినినుంటివేమిరా?ప్రకటముజేయుమీప్పుడిటపామదిచూడుమయేమిచేయునో?నకనకలాడుసర్పమువనాంతరసీమకునేగనయ్యెడన్బెకబెకలాడకప్పలవెభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్
వికసిత వృక్షరాజముల వెల్గు నిశీధిని మేఘమాలికల్ప్రకటిత శైలముల్ నదులు బావులు క్షేత్రము లెన్ని యెన్నియోసకలము గాంచుచుంటి నొక స్ధావర మందు విచిత్ర దృశ్యమున్*“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”*
చంపకమాలసకలముఁ దెల్సి యా భటులు సర్పముఁ బోలెడు వాడు వచ్చుటల్బ్రకటముఁ గాగ ముంగిసల వంతున వ్యక్తులు రాజుఁ జుట్టిరన్రకమున మాటలాడ విని రయ్యున బాణెను వచ్చువాడహో!బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్!!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
చకచక వానలే పడగ చక్కగ నవ్వుచు ముత్తుకూరునన్
వికటపు టట్టహాసమున వీనుల విందుగ పాటపాడగన్
నికటపు గ్రద్దనున్ గనుచు నీలిగి జంకున కేకలేయుచున్
బెకబెకలాడ మండుకము భీతిలి పాఱెను పాము గ్రక్కునన్...
రిప్లయితొలగించండికంద సమస్యలో యతి అర్థము కాలేదు నాకు
ఇది ఎంతమాత్రం సరదా పూరణ కాదు. సహజమై ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిసవరించిన సమస్యలు:
*25-1-2021 (సోమవారం)*
*సమస్య – 3614*
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
*“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”*
(లేదా…)
*“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”*
తప్పులుఁజేసినప్రభుతను
రిప్లయితొలగించండితిప్పలుతోడుతజనతయుతీరుకుదెచ్చెన్
ఇప్పటికిదిసరికాదను
కప్పలబెకబెకలువినినకాళమునదరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కాళమ్మదిరెన్" అనండి.
బొప్పడు కర్ణకఠోరపు
రిప్లయితొలగించండిచప్పుడు చేసె సకినమ్ము జక్కగ జేసెన్
పప్పి పలికింప రబ్బరు
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకలముదేవుడేయనుచుశాంతినియత్నముమానగాతుదిన్
రిప్లయితొలగించండివికలమునయ్యెపామునకువింతగమారెనుజీవయాత్రయున్
పకపకలాడుచున్జనులుపాఁపనుత్రాడుగఁజేసియాడిరే
బెకబెకలాడమండుకముభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేట గీతి::
రిప్లయితొలగించండికొంటెగాడు వాట్సపునందు కొత్త వింత
“లండను నగరిలో కప్పల బెకబెకలు
వినిన పాము భయపడెన్” , భువిన కనుడన
భళియనుచు లైకు చెప్పిరి వారి తీర్చి
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( వారి= అప్పు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భువిని" అనండి.
కందం
రిప్లయితొలగించండితుప్పలు విడి గదిఁ దూరుచు
చప్పున, ధ్వన్యనుకరణపు సాధన లోనన్
దిప్పల శ్రుతిఁ దప్పిన వెం
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికసిత సుందరాంగియగు వేడుక కత్తియె పిల్చినంత కా
రిప్లయితొలగించండిముకుడగు సామవాయికుడు భోగపు వాడలు జేరినంత ర
క్షకభటులేగు దెంచిన యగాదు వినంగనె పారిపోయెనే
బెకబెకలాడ మండుకము భీతిలి పాఱెను పాము గ్రక్కునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచప్పుడుకు నిలయము చెరువు
రిప్లయితొలగించండికప్పల బెకబెక లకు : నహి కడు భీతిల్లె న్
కుప్పలు కావగ వచ్చి న
తిప్పన్న కరమున కఱ్ఱ తీవ్రపు స డి కిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగొప్పగ కయ్యను దాటగ
చప్పున నీదుచు వెడలెడి సమయము నందున్
చప్పుడు చేయుచు వెన్కొను
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
ఒప్పుగ కయ్యను దాటగ
తొలగించండిచప్పున నీదుచు వెడలెడి సమయము నందున్
చప్పుడు చేయుచు వెన్కొను
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచప్పున చేరెను కొలనుకు
రిప్లయితొలగించండికప్పల బెకబెకలకు నహి, భీతిల్లెన్
కుప్పించు గృధ్రమును గని
తప్పించు కొనగ సరియగు దారిని వెదకెన్
చకచక పావులన్ గదిపి జాణతనంబున స్ధానికెన్నికల్
తికమక బెట్టుచున్ బ్రజల ధీటుగచక్కగ నిర్వహించెడిన్
ప్రకటననీయ రమేశుడు భంగపడంగ ప్రధానపక్షమే
బెకబెకలాడ మండుకము భీతిలిపారెను పాముగ్రక్కునన్
చంపకమాల మూడవ పాదమున
తొలగించండిప్రకటన వెల్వరించగని భంగపడంగ ప్రధానపక్షమే గా చదువ ప్రార్ధన!🙏🙏🙏
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'స్థానిక+ఎన్నికల్' అన్నపుడు సంధి లేదు. పైగా దుష్టసమాసం. 'స్థానికపు టెన్నికలు' అనాలి.
ధన్యవాదములు గురుదేవా! పౌర యెన్నికల్ అనవచ్చునా?
తొలగించండి🙏🙏🙏🙏
తెప్పలు వేసుకు వచ్చిరి
రిప్లయితొలగించండికుప్పలుగ మనుజులు వినుము, కొలను కదలికన్
చప్పుడులు వేటకాయను
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిచప్పున జేరెను కలుగును
కప్పల బెకబెకలకు నహి; కడు భీతిల్లెన్
తప్పదు మృత్యువె తనకని
తుప్పలలో బకమును గని త్రోవ పడయకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పడయకున్'?
చెప్పకుమెవ్వడు భయపడు
రిప్లయితొలగించండికప్పల బెకబెకలకు; నహి కడు భీతిల్లెన్
ముప్పని ముంగిస నట గని
చప్పున బుస గొట్టె జాతి శత్రుత్వమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిచప్పున యెన్నికలొచ్చెను
చెప్పకనిచ్చిన గురుతులు చేతనలైనన్
కుప్పలుగ వోటు దక్కిన
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
తొలగించండి(కప్ప బెకబెకలకు పాము గడగడ వణికెన్)
(చేతనలు = ప్రాణులు, జంతువులు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచప్పుడు వినలేదు నగము
రిప్లయితొలగించండి“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”
తప్పుడు కతయిది , నాగువు
లెప్పుడు కంపనము మాత్రమెరుగును గదరా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినప్ప యొకడు కొంటెగ తన
రిప్లయితొలగించండియప్ప నడిగె నమ్మలేని యంశము జెప్పన్
చప్పున వాచించె నిటుల
“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”
నప్ప = బాలుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిబెకబెకలాడ గప్పలవె
భీతిలి పారెను పాము గ్రక్కునన్
( అహంకరించిన నిజాం నవాబు - అణగగొట్టిన తెలుగు ప్రజలు )
చంపకమాల
...................
పకపక నవ్వుచున్ " పిరికి
పందలు రాజును గెల్వనేర్తురే ?
వికటపు నాదు ఠీవికిని
వీరలు తొత్తు" లనెన్ నిజాముడే ;
తికమకలౌచు నోటువడ ;
దెల్గు ప్రజల్ తెగ సంతసించిరే !
బెకబెకలాడు గప్పలవె ;
భీతిలి పారెను పాము గ్రక్కునన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅప్పా! వచ్చెను గృధ్రము
కప్పల బెకబెకలకు, నహి కడు భీతిల్లెన్,
చప్పున జరజర ప్రాకుచు
గప్పున నొకపుట్ట దూరి కాచుకొనె సుమీ
జిలేబి
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివినువీధిని వరుగొకటి కె
లను! బెకబెకలాడఁ గప్పలవె, భీతిలి పా
ఱెను పాము గ్రక్కునన్ పు
ట్టను దూరెనొక క్షణమందు టక్కున సుమ్మీ !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రమముగ వైనతేయుడు ప్రకామరయమ్మున వేల్పుఁ ద్రోవ సం
రిప్లయితొలగించండిభ్రమమున మాతృదాస్యవినివర్తనఁ జేయగ వచ్చు వేళ సం
యమనముఁ గోలు పోయి విటపావళి కూకటి త్రెళ్ళి వెంట రాఁ
ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై.
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజనులను రెచ్చగొట్టెడి ప్రసంగములున్, నెరవేర్చరాని పొం
రిప్లయితొలగించండితన యిసుమంత లేని వితథమ్మగు హామి నొసంగుటల్, దగన్
ధనమును వస్తుమద్యములుదారత నిచ్చుట, నేతలందునన్
కనకపు గద్దె నెక్కుటకు గాడిద కేక లవన్ని యర్హతల్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికప్పుచు గరళపు డాగును
రిప్లయితొలగించండిమెప్పుగ పరమేశు మెడన మెదలుచు ప్రీతిన్
కొప్పున గంగను దుమికిన
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మెడను' అనండి.
రిప్లయితొలగించండి◆ శంకరాభరణం ◆
తేది 25-౦1-2021 ....సోమవారం
సమస్య -
***** ****
బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”
నా పూరణ. చం.మా.
**** *** **
తికమక పాలనన్ సలిపి తిప్పలుఁ బెట్టగ భారతీయులన్..,
ప్రకటిత యుద్యమాలు కడు ప్రాకటమొప్పగ జేయగన్..భరిం
చక యిక ఆంగ్ల పాలకులు జంకుచు పాఱిరి ప్రాణ భీతి.., సూ
బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”
★★ ఆకుల శాంతి భూషణ్ ★★
★ వనపర్తి ★
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రకటిత+ఉద్యమాలు=ప్రకటితోద్యమాలు' అవుతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసప్పము సవ్వడి కనుగొని
రిప్లయితొలగించండిముప్పును తప్పించుకొనగ పూనిక తోడన్
గొప్పగ గొంతులు బెంచిన
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిప్పౌ సీతను బట్టిన
రిప్లయితొలగించండితప్పుకు నారావణుగని దండెత్తి కపుల్
గుప్పించిన తీరు నరయ
కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏🏻🙏🏻
తొలగించండిముప్పనసాంబునిమడుగున
రిప్లయితొలగించండిగప్పలభక్ష్షించుకొఱకుకర్కటిరాగన్
చప్పునముప్పునుగనునా
కప్పలబెకబెకలకునహికడుభీతిల్లెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితప్పదు ముప్పని జేసిన
రిప్లయితొలగించండికప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
చప్పుడువిని యాకసమున
చప్పుననొక గ్రద్దయటకు చయ్యన జేరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎప్పటి వలె వర్షమ్మునఁ
రిప్లయితొలగించండిదెప్పలుగఁ జెలంగి కూయ దిక్కు లదరఁగా
నప్పుడు సరోజములతోఁ
గప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
[అహి =జలము]
ఒకటికి నొక్కటిం బెనఁగ నొప్పును గుంభికి గడ్డిపోఁచలే
ప్రకటితమే లయమ్ము కదరా చలిచీమల చేత భోగికిం
జకచక నైకమత్యమునఁ జాగఁగఁ గాన మసాధ్య మెద్దియున్
బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను బాము గ్రక్కునన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిచకచక బ్రాఁకుచున్ ఫణము జాచుచు జెచ్చెర నేగుదెంచు నా
రిప్లయితొలగించండిచకితముగూర్చు పన్నగము చయ్యననాగెను గాంచి గృధ్రమున్
వికచము మానసంబులను పెంపొనరింపగ సంతసంబునన్
బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితప్పు లెరుగకుండ తరుచు
రిప్లయితొలగించండిమెప్పుబడయనెంచి గొప్ప మేల్ తలపెట్టన్
చప్పున డబ్బును జూడగ
కప్పల బెకబెకలు వినిన పాము భయపడెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెకుముకిఱాయివోలెను నచేతనరీతినినుంటివేమిరా?
రిప్లయితొలగించండిప్రకటముజేయుమీప్పుడిటపామదిచూడుమయేమిచేయునో?
నకనకలాడుసర్పమువనాంతరసీమకునేగనయ్యెడన్
బెకబెకలాడకప్పలవెభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికసిత వృక్షరాజముల వెల్గు నిశీధిని మేఘమాలికల్
రిప్లయితొలగించండిప్రకటిత శైలముల్ నదులు బావులు క్షేత్రము లెన్ని యెన్నియో
సకలము గాంచుచుంటి నొక స్ధావర మందు విచిత్ర దృశ్యమున్
*“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిసకలముఁ దెల్సి యా భటులు సర్పముఁ బోలెడు వాడు వచ్చుటల్
బ్రకటముఁ గాగ ముంగిసల వంతున వ్యక్తులు రాజుఁ జుట్టిరన్
రకమున మాటలాడ విని రయ్యున బాణెను వచ్చువాడహో!
బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్!!