20, జనవరి 2021, బుధవారం

సమస్య - 3610

21-1-2021 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్"

(లేదా...)

"బంధములెల్లఁ ద్రెంచుకొన బంధువనంబడు లోకమందునన్"

(ఈ సమస్యను పంపిన R.V.G. కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు)

58 కామెంట్‌లు:

  1. బంధవిమోచన మందగ
    రంధివలదు వచ్చె మందు రాదను టీకా
    ముందే నిలువగ మోహా
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్!!

    రిప్లయితొలగించండి


  2. అంధుడు తప్పక మనుజుడు
    బంధములం ద్రెంచుకొనిన, బంధు వనఁబడున్
    బంధములా యీశుని సం
    బంధముగా నెరపి బతుకు బండి నడుపగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  3. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    స్వీయ కథ:

    అంధుడు నాంధ్రమందునను హ్లాదము నొందుచు హైద్రబాదునన్
    బంధువు లెల్లరిన్ పిలిచి పండుగ జేయుచు పద్యమల్లగన్
    సంధులు ప్రాసలున్ యతుల శంకరవర్యుని కొల్వునందునన్
    బంధములెల్లఁ ద్రెంచుకొన బంధువనంబడు లోకమందునన్...

    (ఏదో ఒకటి వ్రాయాల కదా క్లిష్ట సమస్యకు పూరణ)

    రిప్లయితొలగించండి
  4. అంధుని వలె జీవించును
    బంధములన్ ద్రెo చు కొనిన : బంధు వన బడున్
    బంధము తో స్నేహ మనెడి
    గంధము లను బంచు వాడు కమ్రపు ఫణతి న్

    రిప్లయితొలగించండి
  5. గంధము వలె మైపూతల
    బంధములం ద్రెంచుకొనిన బంధువనబడున్
    రంధిని పెంచగఁజూచెడు
    అంధుడు సర్వత్ర హేయమందును గాదే!

    రిప్లయితొలగించండి
  6. కందువ తెలియని భువి భవ

    బంధములం ద్రెంచుకొనిన ; బంధు వనఁబడున్"

    స్కంధుని తండ్రికి, పదమును

    పొందును మందత్వమొదలి పొందిక శివునిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...
    ( కందువ= జాడ
    మందత్వ= బుద్ధి లేని తనము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు ద-ధ ప్రాసను 2:2 నిష్పత్తిలో ప్రయోగించారు. అది 3:1 లేదా 1:3 నిష్పత్తిలో ఉండాలంటారు పెద్దలు.
      'వదలి'ని 'ఒదిలి' అనరాదు. "మందత్వము విడి" అనవచ్చు.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ
      మీ అమూల్య సవరణలను తప్పక పాటిస్తానండీ

      తొలగించండి
  7. అంధుడవై పలికితివో
    గంధవతిని గ్రోలిన మయికమదేమొ యిటుల్
    వందింపగ నెవ్విధిరా
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్ ?

    రిప్లయితొలగించండి
  8. పంధాతనదిగతనపరి
    పంధులదౌష్ట్యమణచిభువిపాలనసేయన్
    సంధింపగసౌమ్యాస్త్రము
    బంధములన్ఁద్రెంచుకోనినబంధువనఁబడున్

    రిప్లయితొలగించండి
  9. అంధుడవై లిఖించితివొ హాలహలన్ జవి గొంటివో గనన్
    బంధములెల్ల పెంచుకొన బంధువనంబడు నంచు చెప్ప ని
    ర్గ్రంధుని వోలె వ్రాసితివి కాదె యభిజ్ఞులు నవ్వు రీతిగన్
    బంధములెల్లఁ ద్రెంచుకొన బంధువనంబడు లోకమందునన్ .

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బాంధవములు రూపడగును
    బంధములం ద్రెంచుకొనిన; బంధువనబడున్
    దంధనమొందని తలపుల
    సంధానముతో జనులను సాకుచు పఱగన్.

    రిప్లయితొలగించండి
  11. బంధువు సర్వజనాళికి
    సింధువు దయకున్ మహేశు జిత్తము నందున్
    బంధించుచు నిహలోకపు
    బంధములన్ ద్రెంచుకొనిన బంధువనబడున్

    బంధువు దీనులందరకు పాలనజేయును శ్రీలనిచ్చుచున్
    సింధువు సానుభూతికిని స్నేహము బంచు విపత్తులందు స
    ద్భంధువు భక్తులందరకు ధార్మిక బుద్ధినిగల్గి హీన సం
    బంధములెల్ల ద్రెంచుకొన బంధువనంబడు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  12. అంధమగును బతుకంతయు
    బంధములం ద్రెంచుకొనిన ; బంధు వనఁబడున్
    బంధుత్వము మరువక సం
    బంధుల బండుగకు పిలిచి పబ్బము నొసగన్

    రిప్లయితొలగించండి
  13. అంధము తోడ నిండు బతుకంతయు నిక్కముగా ధరిత్రిపై
    బంధములెల్లఁ ద్రెంచుకొన ; బంధువనంబడు లోకమందునన్
    యింధన ఖర్చు లన్నిటిని యిచ్చుచు రమ్మని యామతించి సం
    బంధులనందరిం గలిపి పండుగనాడున విందునీయగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అందునన్+ఇంధన, అన్నిటిని+ఇచ్చుచు' అన్నపుడు యడాగమం రాదు. 'ఇంధన కర్చు' అన్నది దుష్టసమాసం.

      తొలగించండి
  14. అంధుడవైతి మైథిలిని యా రఘువీరుని యాలి దెచ్చి సం
    *బంధములెల్లఁ ద్రెంచుకొన; బంధువనంబడు లోకమందునన్"*
    సింధుర ఘోటకాల్ భటులు శ్రేష్ట రథంబులు బంధువుల్ దెగన్
    సంధికి శత్రువొప్పునె దశానన దైత్యుల గాచి నప్పుడే

    రిప్లయితొలగించండి
  15. వందనముజేతు రాముని
    మందిరమును సృజన జేయు మాన్యుని కెపుడున్
    అందరి వాడౌ ఋషిగా
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్

    రిప్లయితొలగించండి
  16. బంధుల నేకు లుందురిల పాశవిమోహవిలగ్నచిత్తులై
    బంధురకార్యకారకనిబంధన స్వార్థపరత్వయోజనన్,
    సంధిలు నొక్కడా హరియె స్వాత్మనిరర్థకసాంద్రదేహసం
    బంధములెల్లఁ ద్రెంచుకొన బంధువనంబడు లోకమందునన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  17. అందముగ మోమున నగవు
    చిందదు, ప్రేమగ పలకడు, చేయడు నెపుడున్
    బంధువుకు సాయము, యతడు
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు ద-ధ ప్రాసను 2:2 నిష్పత్తిలో ప్రయోగించారు. అది 3:1 లేదా 1:3 నిష్పత్తిలో ఉండాలంటారు పెద్దలు.
      "చేయం డెపుడున్ । బందుగుకు సాయ మాతడు..." అనండి.

      తొలగించండి
  18. అంధ క్షీరముల విధము
    బంధుత్వము కలిసి యుండి, బహుజన యుతమౌ
    సంధిని కూర్చగ నా ప్రతి
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్

    అంధము-నీరు
    ప్రతిబంధము-అడ్డగింత.

    రిప్లయితొలగించండి
  19. మంధరమాయమాటలనుమంచిగనమ్మెనుకైకతానుగా
    అంధతకోరెగావరమునంతటభూపతిబాధనందెగా
    కుందకజానకీపతియుకౌశలమోప్పగతండ్రియానతిన్
    బంధములెల్లఁద్రెంచుకోనబంధువనంబడులోకమందునన్

    రిప్లయితొలగించండి
  20. బంధుత్వంబులువోవును
    బంధములందెంచుకొనిన,బంధువనబడున్
    బంధములబెంచువానిని
    బంధంబులుమేలుసేయుబ్రజలకునెపుడున్

    రిప్లయితొలగించండి
  21. స్కంధము లానుచు సౌహృద
    గంధము ప్రసరించ నింపుగ మనమ్మున గ
    ర్వాంధుఁడు కా కెన్నఁడు వా
    గ్బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్


    గ్రంథము లందు నివ్విధము కన్పడు నేరికి నైన వారు జ్ఞా
    నాంధులు కాక యున్నఁ బరమాత్ముఁడు నిత్యుఁడు విశ్వ జీవ నై
    కేంధన దాత జీవులకు నిద్ధర వెన్నుఁడు వాని కింపుగా,
    బంధము లెల్లఁ ద్రెంచుకొన, బంధు వనంబడు లోక మందునన్

    రిప్లయితొలగించండి
  22. కందం
    సంధికి కాదనఁ గర్ణులు
    నెందరయిన చాలరంటె? యిట పృథ సుతు నే
    రంధిని కృష్ణ! సుయోధను
    బంధములం ద్రెంచుకొనిన, బంధు వనఁబడున్!

    ఉత్పలమాల
    బంధువులైన వారిఁగని పట్టని రీతిని తాము నుండుచున్
    సంధిత కష్టకాలమున సర్వులు మాత్రము వారిసేవకై
    బంధురమై సహాయపడ వచ్చుచు మానసికంపు భావనా
    బంధములెల్లఁ ద్రెంచుకొన బంధువనంబడు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  23. ఆది శంకరాచార్యుల ప్రస్తావనగా నా ప్రయత్నము

    ఉ:

    బంధము త్రెంచి శంకరులు భారత సంస్కృతి నాల్గు దిక్కులన్
    చిందగ సన్యసించి నతి శీఘ్రమె దీక్ష వహించి ధాటిగా
    హిందు మతంబు నుద్ధరణ హెచ్చు నొనర్చ ప్రసిద్ధమయ్యె తా
    బంధము లెల్ల ద్రెంచు కొన బంధువనంబడు లోకమందునన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణ గా..

      ఆది శంకరాచార్యుల ప్రస్తావనగా నా ప్రయత్నము

      ఉ:

      బంధము త్రెంచి శంకరులు భారత సంస్కృతి నాల్గు దిక్కులన్
      చిందగ సన్యసించి నతి శీఘ్రమె దీక్ష వహించి ధాటిగా
      సింధు జగంబు నుద్ధరణ చిక్కు విదిల్చి ప్రసిద్ధమయ్యె తా
      బంధము లెల్ల ద్రెంచు కొన బంధువనంబడు లోకమందునన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. సవరణ గా..

      ఆది శంకరాచార్యుల ప్రస్తావనగా నా ప్రయత్నము

      ఉ:

      బంధము త్రెంచి శంకరులు భారత సంస్కృతి నాల్గు దిక్కులన్
      చిందగ సన్యసించి నతి శీఘ్రమె దీక్ష వహించి ధాటిగా
      సింధు జగంబు నుద్ధరణ చిక్కు విదిల్చి ప్రసిద్ధమయ్యె తా
      బంధము లెల్ల ద్రెంచు కొన బంధువనంబడు లోకమందునన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  24. వ్యాఖ్యను తొలగించే సౌకర్యము లేనందున రెండు సార్లు ఎక్కువగా / మొత్తం 3 సార్లు ప్రచురితమైనది , మన్నించండి

    రిప్లయితొలగించండి
  25. అంధులవోలెజీవితమునందగనౌనికనెల్లవారికిన్
    బంధములెల్లద్రెంచుకొన,బంధువనంబడులోకమందునన్
    బంధముగూర్చువాడెకద బంధుగణంబునగాకనెల్లవారిచేన్
    బంధువులందఱున్ భువినిబంధములన్నిటిబెంచగాదగున్

    రిప్లయితొలగించండి
  26. బంధువనంగ దగదు కా
    మాంధుల సంగాతమందు మందుని దలపన్
    అంధత్వము వీడి యసం
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్

    రిప్లయితొలగించండి
  27. సుందరమోహన రూపుడు
    నందరిబంధువు హరియగు, నవనిని యతడే
    బంధములను కలుపును యా
    బంధములను ద్రెంచుకొనిన బంధువనబడున్!!!

    రిప్లయితొలగించండి
  28. బంధము జీవికి వీడని
    గంధములేయౌను ముక్తి కాంతను బడయన్
    వందితముగనీభువి భవ
    బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్

    రిప్లయితొలగించండి
  29. రంధిన్ వీడుదు రెల్లరు
    బంధములం ద్రెంచుకొనిన; బంధు వనఁబడున్
    సింధువుగను ప్రేమ సుధా
    గంధం బలరుచు బ్రతుకగ కాలం బందున్!

    అందము లీను విశ్వమున
    యాత్రికునిన్వలె వోవుచుంటిటన్
    వందలు వేలుగా హృదయ
    పేటి వసించు ప్రభావ రాగముల్
    పొందుగ నిల్చి చిత్తమున
    బోడిమి గల్గి గమింప నెవ్విధిన్
    బంధములెల్లఁ ద్రెంచుకొన?
    బంధువనంబడు లోకమందునన్?!

    రిప్లయితొలగించండి