28, జనవరి 2021, గురువారం

సమస్య - 3618

 29-1-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్”

(లేదా…)

““వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్”

78 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  తలకిక నూనెబెట్టుచును తన్మయమొందుచు పాదమందునన్
  నలుపుచు మెండు తైలమును నందము నొందుచు వెండికొండనున్
  కలిసి వరూధినిన్ మిగుల కామము హెచ్చగ కోరి నీవు కా
  వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్...

  రిప్లయితొలగించండి
 2. తలవక విష్ణుని చరితము

  కొలవక యదుకుల రమణుని గోపీ కృష్ణున్

  చెలగుచు నిరతము, వైరము
  వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. ఖలులగు జనుల చెలిమియును,
  వెలవెలఁదుల తోడి పొందు, వేషమ్ములకే
  విలువ యిడుట సతతము కా
  వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా కందపద్యానికి వృత్తరూపం...

   ఖలులగు వారితోఁ జెలిమి గల్గుట, రొక్కము గోరు వేశ్యలౌ
   వెలఁదులతోడి పొందు మఱి వేషము లేసెడి రాజకీయ నే
   తల సహవాసమున్, సభల తా బిరుదుల్ గొని మోదమందఁగా
   వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్

   తొలగించండి
 4. తెలివిగ నటించు వారై
  పలుకులతో మోసగించి పాలసు లగుచున్
  మెలగుచు బెదరించంగా
  వలయునను ఖలుడు : సుజనుడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి
 5. విలువలవలువలనూడ్చగ
  కలియుగరంగస్ధలమునకాంచగవేషం
  బిలలోతనతోనటనకు
  వలయుననుఖలుడు, సుజనుడువలదనునెపుడున్

  రిప్లయితొలగించండి
 6. పలువురు నేతలే ప్రజలపాలిట దయ్యములై నిజాయితీ
  వలువ లవేలయంచు నలు వంకల నీతికి నీళ్ళు వీడుచున్
  పలువలె మేలుమేలనుచు పద్ధతి పాతర వేయు వారలే
  *“వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్”*

  రిప్లయితొలగించండి
 7. మిలమిలలాడు మాయలను మిక్కిలి నేర్పుగ హోరు జోరుగ

  న్బలికెడు దుష్ట నాయకుల బాసల జోలికి పోక ఓటుకై

  తళ తళ నోటు, శోకమును తార్చెడి పాటును , పాప మూటలన్,

  వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 8. చలిపులి పెరిగిన తరుణము
  వెలవెలదియె తన సరసకు పిలిచిన ముదమున్
  లలనను కవగొన వెడలగ
  వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి


 9. అలవిని మీరిన సంపద
  వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్
  కలతల యిబ్బడి చేర్చెడు
  కలిమిని సుదతీ జిలేబి కర్మవశముగా


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. యిలన సుజనుండు గోరును
  కలిమిని, బలిమిగ నితరుల కల్యాణములన్
  యిల జనులకు కీడులు గా
  వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. 'కల్యాణములన్+ఇల' అన్నపుడు యడాగమం రాదు. "ఇలను సుజనుండు... కల్యాణముల । న్నిల జనులకు.." అనండి.

   తొలగించండి
 11. వెలదులె వేల్పులంచు నడి వీధిని వారికి గుళ్ళు గట్టి ని
  శ్చలమతి నంజలించి యభి సారికలే యువతన్ రసజ్ఞ వి
  జ్ఞులుగ సమాజ శిల్పులుగ జూతు రటన్న వివాద తార్కికుల్
  *“వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్”*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రసజ్ఞ' అన్న తర్వాత 'విజ్ఞులు' అనడం పునరుక్తియే. "రసైక విజ్ఞులుగ.." అనండి.

   తొలగించండి


 12. జగడము లన్నియు తనకం
  డగ వలయు ననంగ దుష్టుఁడగు, వద్దనువాఁ
  డగు సజ్జనుండిలన్! జా
  డ గుర్తు పట్టుట సులభము డంబము పలుకున్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. సలసలకాగెమానసముశాంతినిఁగోరెనుకోంగచేపనే
  అలుసుగనాయెజీవనమునాదరమింతయులేదుపేదకున్
  కులములమాటుబంధములగుంభనలేకనుసామరస్యమున్
  వలయుననంగదుష్టుడగు, వద్దనువాడగుసజ్జనుండిలన్

  రిప్లయితొలగించండి
 14. పలువడొకండు తా గెలిచి పాలన జేయగ నెంచి యోట్లకై
  పలువురు పారికాపులగు పాపులతో కకుభంపు సీసలన్
  నెలగను పంచనెంచగను నీతిని వీడుచు తోషమందునన్
  వలయు ననంగ దుష్టుఁడగు, వద్దనువాఁడగు సజ్జనుం డిలన్

  రిప్లయితొలగించండి
 15. వెలవెలబోయిన బ్రతుకున
  కులసతి కన్నులను నిండు కోపాశ్రువులన్
  వెలయాలి తోడి పొందే
  వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పలువిధముల వేషమ్ములు
   కలలో నైనా తలవని కలతల తోడై
   నెలతలు గను సీరియలే
   వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "కలలోనైనను.." అనండి.

   తొలగించండి
 16. వెలగల వెలదులగోరగ
  వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్
  కలతలు రేపగ జూచుచు
  విలువలు పోగొట్ట నెంతురు వీధిన బడుచున్!!

  రిప్లయితొలగించండి
 17. తలపుల ద్వేషము నిండగ
  బలిగోరుచు మతముపేర భారతమందున్
  విలయము సృష్టించు పనులు
  వలయునను ఖలుడు; సుజనుడు వలదను నెపుడున్

  తలపుల ద్వేషభావనలు దాకగ సోదరభావ హీనుడై
  కలిమియె శాశ్వతంబనుచు కక్షలబూనుచు హింసజేయుచున్
  విలువల విస్మరించుచును పెద్దలమాటల త్రోసివేయగా
  వలయుననంగ దుష్టుడగు వద్దనువాడగు సజ్జనుండిలన్

  రిప్లయితొలగించండి
 18. ఇలపై నిరంకుశత్వము
  వలయు నను ఖలుఁడు ; సుజనుఁడు వలదను నెపుడున్
  బలవంతపు పరిపాలన
  కలవరపడక వలసినది గైకొన గదగున్

  రిప్లయితొలగించండి
 19. [27/01, 10:34 PM] +91 95504 67431: 👌👍👏👏👏👏👏

  ఇలలో కుత్సిత మతితో
  చెలిమిని స్వార్థమ్ముకొరకు చేయుచు నుండున్
  కలిమిని దోచగ నెంచుచు
  వలయు నను ఖలుడు,సుజనుడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి
 20. మలయజగంధుల స్నేహం
  బిలఁ నితరుల ధనము బొందనిచ్చ, బుధులపై
  చులకన భావము గలుగుట
  వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్

  దుర్యోధనునికి హితబోధ చేయుచున్న కృష్ణపరమాత్మ పల్కులుగా..........

  ఖల సహవాసమున్ నెఱపి గర్వము మించఁగ నాజిఁ పాండుపు
  త్రుల దునుమాడ గోరెదవు రోషపు బల్కులు చాలు నిన్ను దు
  ర్బలునిగ జేసి చూపెదరు పంతము వీడుము వారి వైరమున్
  వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్

  రిప్లయితొలగించండి
 21. కందం

  "చెలఁగగఁ బాండవులనినిన్
  విలయమె" ననఁగ హరి కౌరవేయులు వినిరే?
  పలుకఁగ హితమ్ము యుద్ధమె
  వలయు నను ఖలుఁడు! సుజనుఁడు వలదను నెపుడున్!!


  చంపకమాల

  "విలువలకంకితంబయిన వీర వరేణ్యులుఁ బాండునందనుల్
  జెలఁగిన నాడు నాశనము జిద్దునఁ దప్పద" టన్నఁ గృష్ణుడున్
  బలుకులఁ గౌరవుల్ వినిరె? బంధువు శ్రేయము నెంచ యుద్ధమున్
  వలయు ననంగ దుష్టుఁడగు! వద్దనువాఁడగు సజ్జనుం డిలన్!!


  రిప్లయితొలగించండి
 22. వలెనది యిల్లు నేల సదుపాయము లెన్నవి కొన్నఁ, లెక్కలూ
  కొలతలు లేకయే యొఱగు కోట్లకు విల్వగు నాస్తిపాస్తులున్
  నిలువదు శీల మస్స లవినీతికి హేతువు లంచ మిద్ధరన్
  వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొన్ని అసాధు ప్రయోగాలున్నవి.

   తొలగించండి
 23. సమస్య :
  వలయు ననంగ దుష్టుడగు
  వద్దనువాడగు సజ్జనుం డిలన్

  ( సంధి కోసం కౌరవసభకు పాండవరాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనునితో )

  చంపకమాల
  ...................

  అలయక నింతదాక మరి
  యాదగ మంచిని జెప్పినా ; నికన్
  మెలకువ లేని మీవి మిడి
  మేలపు బల్కులు మించుచుండెనే ?
  కలయిక కల్లయే యగును ;
  కర్ణుని నమ్మిన నీకు సంధి కా
  వలయు ననంగ దుష్టుడగు ;
  వద్దనువాడగు సజ్జనుం డిలన్ .

  రిప్లయితొలగించండి
 24. నిలువునగూల్చివేసెగద,నిన్నటి బంధమునొక్కవేటుతో
  పలుకులవిశ్వసించుటయె, పాపముగానయె ధాత్రినందునన్
  తలపులకొచ్చి బాధపడు,తల్లులుదండ్రులు కంటనీటితో
  వలయుననంగదుష్టుడగు,వద్దనువాడగుసజ్జనుండిలన్
  +++++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 25. వలవలనేడ్వనేమగును,వంచనజేసినతల్లిదండ్రికిన్
  పిలుపులవిశ్వసించుటయె,పిల్లలుజేసినపాపమాయెలే
  నిలువునబాతివేయవలె,నిండుగముంచినదొంగస్వాములన్
  వలయుననంగదుష్టుడగు,వద్దనువాడగు సజ్జనుండిలన్
  ++++++++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. చం:

   పొలమున పండు ధాన్యమును పొందిక మేర యథేచ్చ రీతినై
   తలచిన సంత యందు తగు దారణ కమ్ము కొనంగ వచ్చనన్
   ఫలితము లెంచు చట్టములె భారత మందు రచింప పాటి గా
   వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్

   దారణ=ధర

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
  2. మరొక ప్రయత్నము:

   చం:

   కలగన రాదటంచు నొక కన్యక వేడు కొనంగ దుఃఖమున్
   బలువిడి మొండిపట్టు గొని బాధ్యతలెంచని మోసగాడు నా
   కలికిని వెంబడించ నట కానగ పోలిసుపార ద్రోల గా
   వలయు ననంగ దుష్టుడగు వద్దను వాడగు సజ్జనుండిలన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 27. కలువల కన్నుల చిన్నది
  కులుకులనొలికెడు తనసతి కూడదటంచున్
  వెలయాలిపొందు తను కా
  వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి
 28. కలిమియులేములన్ననవి, కావడికుండలతుల్యమేయనిన్
  తలపునగుర్తుబెట్టనిక,ధన్యతజెందును మానవాళియే
  సులువుగమోక్ష మార్గమని,చుక్కలజేర్చెడు మార్గమే వినన్
  వలయుననంగ దుష్టుడగు,వద్దనువాడగుసజ్జనుండిలన్
  +++++==+++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 29. వలువలు జారగ దూలుచు
  వలకాకను రేప బూని వల పన్నుచునా
  వెలయాలిడ మధుపాత్రను
  వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి
 30. చం
  తలపక నీశ్వరున్ దుదకు తామె మహోన్నతుగా నెరింగి య
  న్యుల ధన, మాన, ప్రాణముల నూరికె తీయు మహాను భావులౌ
  నలఘుల రీతి వర్తన సమస్త మహీతలమందు జేయగా
  *వలయు ననంగ దుష్టుఁడగు, వద్దనువాఁడగు సజ్జనుం డిలన్*

  రిప్లయితొలగించండి
 31. లలనలపొందు గోరుట విలాసపు జీవనమందు వాంఛయున్
  పలలమునందు మక్కువయు పందెము లందున నిచ్చ జూపుటల్
  కలహము కోరి దెచ్చుటయు కాలము వ్యర్థమొనర్చు పోకడల్
  వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్

  రిప్లయితొలగించండి
 32. వలపుల కవధినిఁ గనరు జ
  నులు పెరుగు నవి యలవడినను ధర యొసఁగినన్
  వలసినవి దనియ కధికము
  వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్


  కలవర మందు చుందుదురు కాపురుషుల్ మది దానమిం డనన్
  సలలిత మిత్తు రుత్తములు చక్కగ విత్తము లార్త కోటికిన్
  బిలబిల సాగుచుం బరుల వీటికిఁ గూటికి నర్థికోటి పో
  వలయు ననంగ దుష్టుఁ డగు వద్దను వాఁడగు సజ్జనుం డిలన్

  రిప్లయితొలగించండి
 33. వలపులుమీరగరతికా
  వలయుననుఖలుడు,సుజనుడువలదనునెపుడున్
  కలిబొలిమాటలువినడము
  పలుకులుసత్యంబులుగనెబలుకగగోరున్

  రిప్లయితొలగించండి
 34. కలిబొలిమాటలాడుచునుగాంతలబొందునుగోరువాడెకా
  వలయుననంగదుష్టుడగువద్దనువాడగుసజ్జనుండిలన్
  కలియుగధర్మమేమొయిదికానిచొనిట్లుగసాహసింతురే?
  వలపులజోలికిన్జనకబంధుగణంబులపేర్మినొందుమా

  రిప్లయితొలగించండి
 35. కలహము వద్దనంగ విన కారణమేమియు లేకనుండెనే
  విలయము సృష్టి జేసి మును ప్రేమను త్రుంచగ బూనినాడహో
  మలుపులు తిర్గినట్టి దది మారణహోమము జేయ టన్న కా
  వలయు ననంగ దుష్టుడగు,వద్దను వాడగు సజ్జనుండిలన్!!

  రిప్లయితొలగించండి
 36. కలలను తేలుచున్ సతము కాంక్షలు మానసమందు మించగా
  విలువలు వీడి వర్తిలుచు పృథ్విని నిత్యము ముల్లెకోసమై
  సలుపుచు నీచకార్యము లసత్యములాడుచు ద్రవ్యమెప్డు కా
  వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుండిలన్

  రిప్లయితొలగించండి
 37. ఇలలో కుత్సిత మతితో
  చెలిమిని స్వార్థమ్ముకొరకు చేయుచు నుండున్
  కలిమిని దోచగ నెంచుచు
  వలయు నను ఖలుడు,సుజనుడు వలదను నెపుడున్

  రిప్లయితొలగించండి