సత్సాంగత్యకృద్ధ్యాన చింతన : సాంగత్య కృత్ : ఇక్కడ కృ ధాతురూపము పరమైనది. అభూతము తద్భావార్థమున. అప్పుడు వికృతి వాచకాంతమున నున్న “అ” కారమునకు “ఈ” కారము వచ్చును. ఉదా: లక్ష్య కృతము = లక్ష్యీకృతము; గంగా కృతము: గంగీకృతము యిత్యాదులు. కనుక “సాంగత్యీకృద్ధ్యాన” గా నుండ వలె నని నా యభిప్రాయము. పరిశీలించఁ గోరెదను.
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
మనమున్ దీటుగ కూర్చగన్ ముదమునన్ మౌనమ్మునన్ తీరుగన్
చనుచున్ కాననమందునన్ తపమునన్ జాగ్రత్తగా తీర్చుటన్
కనగన్ మేనక నద్భుతమ్ము గనటన్ కంగారునన్ ప్రీతినిన్
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై...
తొలగించండిKGP Days are hilarious and at the same time thought provoking ,.
Cheers
ఇది 4.1.2021న ఇచ్చిన సమస్య 3594
రిప్లయితొలగించండిపొరపాటుగా తిరిగి ఇచ్చారండీ
తనువున తమకము హెచ్చగ
రిప్లయితొలగించండిఘనుడౌ గాధేయు డంత కదిసెను
ముదితన్
వినుతను మేనక జూచుచు
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కినుకన్ వీడుచు భార్యనున్ ముదిమినిన్ కించిత్తు పోరాటమున్
ఘనమౌ కానన మందునన్ జనుచుభల్ గారాబుగా కోరుచున్
కనగన్ మోక్షపు కాంతనున్ కడకు తా కల్యాణమౌ తీరునన్
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై..
అనయముసాధనచేయుచు
రిప్లయితొలగించండికనగాముక్తినివనితనుఘనమౌకోర్కెన్
మనమునమురియుచుపలుకుచు
తనతోశయనింపమౌనితన్వినిఁగోరెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఘనమౌ కురువంశమునన్
తనరించగ సత్యరతుడు తా నంబికను
న్ననురాగముతో జూచుచు
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్.
ఘన తపమును విడిచి యు దా
రిప్లయితొలగించండికనులను దెరచియును గాంచి కాంతకు వశుడై
మనమున మోహము బుట్టగ
తనతో శయనింప మౌని తన్విని గోరె న్
ఘనమౌనింద్రియశోధనల్తుదినిపోకార్చున్మనోజాడ్యమున్
రిప్లయితొలగించండికనగాకామినిరూపమున్మునికికాంక్షన్నింపెపారంబుపై
వినయాకారవివేకశీలతనుసంవైరాగ్యశోభాక్రుతిన్
తనతోడన్శయనింపఁగోరెనోకకాంతన్మౌనిపుణ్యాత్ముడై
మౌని-శంకరులు
ధనమును తృణముగ దలచుచు
రిప్లయితొలగించండివినయమ్మును వీడకుండ విజ్ఞత తోడన్
జనరక్షకుడౌ హరిచిం
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్
తనపతి దుష్యంతునిపై
రిప్లయితొలగించండిమనసును మరలించలేక మానిని నిదురన్
కనరాక కుమిలినన్ చే
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఘనమౌ కౌరవవంశ మభ్యుదయమున్ కాంక్షించునౌ తల్లికిన్
అనుమోదమ్మిడ వ్యాసమూర్తి నపుడున్ యాలోచనమ్మొందుచున్
అనురాగమ్మున యంబికన్ మొదటగా నాశించి తానచ్చటన్
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై.
వనమాలాధరుఁ మాయనున్ మునిగి యా బ్రాహ్మండు వీక్షించి, యౌ
రిప్లయితొలగించండివన లేచామచిరంటి నా నదిని, యవ్యక్తుండు వేధింపగా
చనువున్ జేరుచు నారదుండనియె కృచ్ఛ్రంబింక బాపంగ తా
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై.
బ్రాహ్మడు- నారదుడు
చామచిరంటి- యువతి
కృచ్ఛ్రము- బాధ
సమస్య :
రిప్లయితొలగించండితనతోడన్ శయనింపగోరె నొకకాం తన్ మౌని పుణ్యాత్ముడై
( తన తండ్రిని తప్ప తదన్యుల నెరుగని ముగ్ధముని కుమారుడు ఋష్యశృంగుడు కొందరు రమణీమణు లను తిలకించి విన్నవించుకొన్న చిన్నకోరిక )
మత్తేభవిక్రీడితము
----------------
ఘనమౌ కన్నుల యందమున్ సరసమౌ
గాత్రంపు సంభాషణల్
మనమం దెంతయొ సందడింప ; మగువన్
మాధుర్యధుర్యాంచితన్
జనిలో గాంచని ఋష్యశృంగముని హ్రీ
చంద్రుండు నుత్సాహియై
తనతోడన్ శయనింపగోరె నొకకాం
తన్ మౌని పుణ్యాత్ముడై .
( జనిలో - పుట్టిన పిమ్మట ; హ్రీ చంద్రుడు - సిగ్గుపడే చంద్రుని వంటి వాడు ; గాత్రం - కంఠం )
మనోహరమైనది, సహజసుందరముగానున్నది, గురువుగారికిప్రణామములు
తొలగించండి
రిప్లయితొలగించండిశంకరుల వారి మాటగా :)
అనుచరు లార! సమస్య య
దె! నూతన విధమున తలచి దెస మార్చుచు పూ
రణ వేఱుగ చేయండీ!
"తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్"
జిలేబి
కినుకన్ చూపుచు నడ్గె సద్గురువు జగ్గీవాసుదేవున్ సుయౌ
రిప్లయితొలగించండివనమందున్ గల తన్వి యిట్లు "ప్రియునిన్ బ్రాతిన్ రతిన్ కూడ వ
చ్చునె?" "వద్దెవ్వని తోడ, నన్యులను శుశ్రూషించు టెట్లంచు చిం
తనతోడన్ శయనింపఁ" గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై౹౹
మనసున విరాగ భావన
రిప్లయితొలగించండితనువది నాశమగు జూడ, తలపుల నందున్
తను వేరను భగవత్చిం
తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్
కందం
రిప్లయితొలగించండిమనువైన, మాటయైనన్
నినవంశుని బాణమైన నిలనొకటే పా
వని! నియమశీలి యను చిం
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్
మత్తేభవిక్రీడితము
మనువైనన్, శరమైన, మాటయయినన్ మాన్యుండుగా నొక్కటౌ
యినవంశాంబుధి రామచంద్రునకు! శంకింపంగ నేలమ్మ? పా
వని! మిన్నే భువిఁ గూలినన్ వ్రతముఁదా వారింపడన్ మేటి చిం
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై
వాల్మీకి మునివర్యులు సీతమ్మతల్లితో...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినా పూరణ:: అన్యాపదేశముగా
రిప్లయితొలగించండికనకను వావి వరసలను,
తన వెంట పడు సుర పతిని తప్పించుకు చే
రెను ముని వాకిట బహు యా
తనతో ; శయనింప మౌని తన్వినిఁ గోరెన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( లీలా వతి వెంట పడిన ఇంద్రుడినుండి తప్పించుకుని నారదుని ఆశ్రమములో ఆశ్రయము పొందిన చరిత్ర)
అనాథాశ్రమానికి వచ్చిన ఒక అనాథయైన వనితతో ఆ ఆశ్రమనిర్వాహకడైన ముని మాటలు
రిప్లయితొలగించండికనుమీ యాశ్రమమెంత భద్రమగునో కాంతామణీ సోదరీ!
మునివృత్తిన్ దలఁ దాల్చి యుందురిట సమ్మోహమ్ముఁ బోనాడి స
జ్జను లిచ్చోట విరక్తు లంచు
ధృతిసత్సాంగత్యకృద్ధ్యానచిం
తనతోడన్ శయనింపఁ గోరె నొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై.
కంజర్ల రామాచార్య.
చిన్న సందేహ మండి.
తొలగించండిసత్సాంగత్యకృద్ధ్యాన చింతన : సాంగత్య కృత్ : ఇక్కడ కృ ధాతురూపము పరమైనది. అభూతము తద్భావార్థమున. అప్పుడు
వికృతి వాచకాంతమున నున్న “అ” కారమునకు “ఈ” కారము వచ్చును.
ఉదా:
లక్ష్య కృతము = లక్ష్యీకృతము; గంగా కృతము: గంగీకృతము యిత్యాదులు.
కనుక “సాంగత్యీకృద్ధ్యాన” గా నుండ వలె నని నా యభిప్రాయము. పరిశీలించఁ గోరెదను.
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన
రిప్లయితొలగించండిసమస్య
*“తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్”*
(లేదా…)
*“తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముడై”*
పూరణ
1 ) కందము
వనమందున గాధి సుతుడు
ఘనతపమును జేయుచుండిఁ గనియెన్ లేమన్
మేనకఁ సునిశిత దేహన్
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్
మత్తేభము
మునివర్యుండు పరాశరుండుగనె నామోదంబు లేపారగా
వనితారత్నము మత్స్యగంధిఁ గడు దివ్యంబైన కన్యామణిన్
ఘనమౌ రీతిగ నావలో కలియ నాకాంక్షించి తాదాత్మ్యతన్
తనతోడన్ శయనింపఁ గోరె నొక కాంతన్ మౌని పుణ్యాత్ముడై
ఆదిభట్ల సత్యనారాయణ
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివనితా! భాగ్యపురాననొంటరిగ బోవన్ నిన్ను హింసింత్రు దు..
ర్జనులే క్రూరమృగమ్ములౌచు., నటవీప్రాంతమ్మునందాశ్రమం..
బున సింహమ్ములు వ్యాఘ్రముల్ మెలగుసద్బుద్ధిన్., గొనన్ భద్రతన్
తనతోడన్ శయనింప గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముడై!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తనతోడన్ నివసింప భావ్యమగును గాని శయనింప కాదు కదా!
తొలగించండివనితా వీడుము భోగభాగ్యములపై వ్యామోహమున్ ధాత్రిలో
రిప్లయితొలగించండిక్షణికంబీ నరజన్మమంచెఱఁగి సత్కార్యమ్ములన్ సల్పుచున్
ఘనుడాపోతన కావ్యమున్ జదువి నిష్కామ్యార్థివై విష్ణుచిం
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై
ఒక ముని ఆశ్రమము లో చూచిన సంగతిని వివరించే క్రమంగా నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిమ:
చనువున్ జేరగ బిల్వ నెంచితినహో సాక్షాత్తు దైవమ్ముగా
మనమున్, చింతనసేయ గన్పడెను నామాయావి దుష్కృత్యమే
మునియా! గోముఖ వ్యాఘ్రమా! కనగ నా మూర్ఖుండు విడ్డూరమై
తనతోడన్ శయనింప గోరె నొక కాంతన్ మౌని పుణ్యాత్ముడై
వై. చంద్రశేఖర్
తనవారెల్లరబాసి యొంటరిగసంతాపంబు నందుండ నా
రిప్లయితొలగించండివనితన్ జాలిగ చేరదీసి తనయావాసంబుకుం దోడ్కొనెన్
వనితా నీవిటులేడ్వబోకుమనుచున్ వాత్సల్య మేపార చే
తనతోడన్ శయనింపఁ గోరెనొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై
మనమున నింపుగ దైవ
రిప్లయితొలగించండిమ్మును నిల్పి త్యజించి కోపమును మఱి నిత్యం
బనయేషణ నదికిన్ రౌ
తన తో శయనింప మౌని తన్విం గోరెన్
[రౌతు+అన =రౌతన: రాతిచేఁ గట్టఁ బడిన యానకట్ట; రౌతు = రాయి; అన = ఆనకట్ట]
వనితా రత్నము వచ్చి వేఁడఁ జరణ ద్వంద్వమ్ములం దాఁకి భ
క్తిని శాంతిం దగఁ గూర్చు దేవ యని సంకీర్తించి తా నిల్వఁగా
ఘన పుణ్యప్రద నిత్య మంగళసతీ కాత్యాయనీ సక్త చిం
తన తోడన్ శయనింపఁ గోరె నొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై
మనసున మంచిని గోరుచు
రిప్లయితొలగించండితనువును వీడంగ దలచి తమకము తోడన్
కొన యూపిరి కాలమ్మున
తనతో శయనింప మౌని తన్విని గోరెన్!!
వనితయి నావను నడుపగా
రిప్లయితొలగించండిమనమున దృతియును సడలగ మరులే రేగన్
మనసిజు గెలువగ లేనని
తనతో శయనింప మౌని తన్విని గోరెన్!!
భారతం లో పరాశర ముని సత్యవతి వృత్తాంతం
రిప్లయితొలగించండివనమున నొంటిగ సాగెడు
రిప్లయితొలగించండివనితను గని పలకరించి భయమును డుపుచున్
మనమున దిగులును విడుమని
తనతో శయనింప మౌని తన్విని గోరెన్
[
మునిఁ గని వందనము నిడుచు
రిప్లయితొలగించండివనితామణి చక్కని సుతుఁ వరముగ గోరన్
మనమున శ్రీరాముని చిం
తనతో శయనింప మౌని తన్విన్ గోరెన్