25, జనవరి 2021, సోమవారం

సమస్య - 3615

26-1-2021 (మంగళవారం)

కవిమిత్రులారా,

“గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!”

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు”

(లేదా…)

“భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ”

59 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  మీరిన భక్తితో తనరి మేదిని దల్చుచు సొంతమైనదౌ
  కోరిక తీర హిందువులు కొబ్బరి కాయలు కొట్టి కోవెలన్
  గారవ మొప్ప పాకులది గండర గండుల దేశమందునన్
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ...

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  వైరి దేశంపు పైకమ్ము భూరిఁ గొనియు
  వెన్నుపోటునుఁ బొడవఁగ వెఱువకుండ
  దేశభక్తులముందట తీరుమార్చి
  భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు

  ఉత్పలమాల
  భూరి ధనమ్ముఁ గైకొనుచు ముష్కర మూకల పంచ జేరుచున్
  వైరి సమాగమాన మనవైన రహస్యములమ్ము ధూర్తుడై
  పేరిమి దేశభక్తులు ద్రవించెడు రీతిని రెచ్చి పైకిఁ దా
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ

  రిప్లయితొలగించండి
 3. స్వార్ధమెంచనిసైనికుస్వజనుడనుచు
  పలుకుపౌరుండునీనాడుపనికిరాడు
  మాయమర్మంబులేకనునయముతోడ
  భరతమాతకుజయమనువాడెఖలుఁడు

  రిప్లయితొలగించండి
 4. భారతీయుడెవడురయ్య తరచి చూడ
  తల్లి భారతి మరువక, తనివితీర
  భరతమాతకు జయ మనువాఁడె ; ఖలుఁడు
  చన్ను పాలు కుడిచియు విషమును చిందు

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 5. సతము దేశము ప్రేమించు సజ్జనుండు
  భరత మాతకు జయమను వాడె : ఖలుడు
  స్వార్థ పరుడ యి నేతల జంప బూని
  కుట్ర పన్నుచు నుండును కుపితు డగుచు

  రిప్లయితొలగించండి
 6. పొరుగు దేశాభి మానులు నిరతము మన
  భారతీయ సంస్కృతినెప్డు పరిహసించు
  బర్బరులగు మ్లేచ్ఛులిటుల పలికిరంట
  భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు

  రిప్లయితొలగించండి
 7. కారణమేదిగాని తన కార్యము సాధనకైన గోరడే
  భారమె భూమికిన్ కడు ప్రభంజన మయ్యెడు మాటలే వినన్
  వీరుడనంచుబల్కి పలు వేడ్కగ వేరగు దేశవాసులై
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ!!

  ***ఎవరి దేశం వారికి గొప్ప అనుకోవాలి.కాని తన దేశాన్ని కాకుండా వేరే దేశానికి జేజే లు పల్కేవారు ద్రోహులనే అర్థంలో...!

  రిప్లయితొలగించండి
 8. స్వార్ధమెంచనిసైనికుస్వజనుడనుచు
  పలుకుపౌరుండునీనాడుపనికిరాడ
  మాయమర్మంబులేకనునయముతో
  భరతమాతకుజయమనువాడెఖలుఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం, యతిదోషం. సవరించండి.

   తొలగించండి
 9. భారమునాయెగాపలుకుమాతకుచెప్పెడివందనంబునున్
  ఆరనిజ్వాలరేపెనుగనాంగ్లపుపాలనదేశమందునున్
  సారముగీతయందుగలసాధననేర్చినదేశభక్తుడై
  భారతమాతకున్జయమువల్కెడువాడెఖలుండుద్రోహియే

  రిప్లయితొలగించండి
 10. గీతపద్యము3వపాదంచివరతోడఅనిచూడండి

  రిప్లయితొలగించండి
 11. కారణమంచు లేక వికారపు బుద్ధిని చూపు మ్లేచ్ఛులీ
  ధారుణిలో వసించుచు సదా మన సంస్కృతిఁ వెక్కిరించు పె
  చ్చారులు జ్ఞానహీనులు ప్రచారము నందున పల్కిరిట్టులన్
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ

  రిప్లయితొలగించండి
 12. పికకుహుకూహురావములు వీనుల విందులఁ గూర్చుచుండగన్
  ప్రకటహృదంబుజమ్ములవి గ్రక్కున నూయల లూగె, నక్కటా!
  వికృతిరుతమ్ములై చెలగి బిట్టున నార్చుచు భీకరమ్ముగా
  బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 13. నెమ్మితోడ వందే మాతరమ్మటంచు
  పలుక నిచ్చగింపనివారు, కలుషమతులు,
  తుకుడ గ్యాంగులు పలుకరే దుష్టులగుచు
  "భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు"

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జనని వాసిని చక్కగా సరదు నటుల
  జన్మభూమిదౌ ఘనతను చాటు చుండు
  భరత మాతకు జయమను వాడె;ఖలుడు
  అమ్మ రొమ్మును గ్రుద్దు నసురు డగును.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణభంగం. "గ్రుద్దు తా నసురు డగుచు" అనండి.

   తొలగించండి
 15. ధారుణి స్వేచ్ఛకోసరము త్యాగ మహింసలె యస్త్ర శస్త్రమై
  బోరిన భారతీయులకు పూర్ణ స్వరాజ్య విభూతి ధీ ధృతిన్
  గోరి తృణంబు జీవమని గొప్పగ జాటగ ,బానిసత్వపున్
  *“భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ”*

  ధారుణి ధర్మకార్యమిది స్థైర్యము ధైర్య పరాక్రమార్జితం
  బారయ స్వేచ్ఛవాయువులె భవ్య వసంతము, పాయ సాన్న మం
  చా రవి యస్తమించని విశాల బ్రిటీషు కబంద హస్తయౌ
  *“భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ”*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శస్త్రమై పోరిన' అనండి.

   తొలగించండి
 16. నేరుపుమీర చక్కగను నిత్యము నీతుల వల్లెవేయుచున్
  మీరుచు ధర్మమార్గమును మేటలువేయగ నక్రమార్జనల్
  సారెకు దేశభక్తినట జాటుచు వీనుల బూలుబెట్టుచున్
  భారతమాతకున్ జయము వల్కెడువాడె ఖలుండు ద్రోహియౌ

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరగు రీతినిన్ జనని తేకువ నచ్చుగ చాటునట్లుగన్
  గౌరవమిచ్చుచుండి నొడికమ్మును బంచును జన్మభూమియౌ
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె; ఖలుండు ద్రోహియౌ
  క్రూరుడు తల్లి రొమ్ములను గ్రుద్దుచు ధాత్రిని దానవుండగున్.

  (ఒడికము=ప్రేమ)

  రిప్లయితొలగించండి
 18. సమస్య :

  భారతమాతకున్ జయము
  వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ

  ( విదగ్ధుడు - దుర్విదగ్ధుడు )

  ఉత్పలమాల
  ...................
  ఆరని దేశభక్తి తను
  వంతట మెండుగ నిండియుండగా
  పౌరుషవాక్కులన్ గ్రియల
  వైనము గల్గెడివాడె శ్లాఘ్యుడౌ
  భారతమాతకున్ జయము
  వల్కెడువాడె ; ఖలుండు ద్రోహియౌ
  తేరగ భాగ్యమంతటిని
  తిన్నగ మెక్కెడి దుర్విదగ్ధుడే !

  రిప్లయితొలగించండి
 19. తీరని రక్త దాహమున దేలెడి ఆ పర దేశమందునన్
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ
  పారవు వారి పాచికలు వైరములెంతగ రేప జూచినన్
  భారత జాతి యైక్యముగ వర్ధిలు వీడక శాంత్యహింసలన్

  రిప్లయితొలగించండి


 20. ప్రియమగును భరతమాతకు
  జయ మనువాఁడె, ఖలుఁడు తన జయమును మదిలో
  సయితము తలవని వాడే
  జయహో భారతనవే విజయమిక మనదే!  శుభాకాంక్షలతో
  జిలేబి

  రిప్లయితొలగించండి


 21. సఖి! వాడే భక్తుడు బా
  యక భారతమాతకున్ జయము వల్కెడువాఁ
  డె! ఖలుండు ద్రోహియౌ సూ
  వె ఖండితము కీడు తలచు వెధవయె సుదతీ


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   స్వవర్గజ ప్రాసలో క-ఖ లను చెప్పలేదు.

   తొలగించండి
 22. అసలయిన దేశ యభిమాని యనవరతము
  భరతమాతకు జయ మనువాఁడె ; ఖలుఁడు
  తెలచునారీతి గణతంత్ర దినమునందె
  తీరుతెలుసుకు మనుమయ్య తెలుగువాడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దేశ+అభిమాని=దేశాభిమాని' అవుతుంది. యడాగమం రాదు. 'తెలచు'?

   తొలగించండి
 23. దేశకాలమ్ములందున దివ్యమైన
  భావముల చక్కగ తెలుపు భారతీయ
  గ్రంథసారమ్ము గసిబూని మంటగలిపి
  మధుర సంస్కృతి సౌరభాల్ మరచి నేడు
  భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు

  రిప్లయితొలగించండి
 24. దేశభక్తుడ నేనంచు దెప్పరముగ
  దోచుకొని దేశ సంపద దొరక కుండ
  దేశములుబట్టి తిరుగుచు ద్రిమ్మరిగను
  భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు

  రిప్లయితొలగించండి
 25. గణతంత్రదినోత్సవశుభాకాంక్షలతో..

  వీరుడు సైనికోత్తముడు విశ్రుతభారతపుత్రరత్నమై
  మేరలు దాటి వైరల నమేయబలమ్మున దార్కొనన్ లస
  ద్ధీరభటాగ్రభూషణుడు ధిక్కరణీయపు
  పాకుసీమలో
  భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 26. ప్రకటతరస్వతంత్రకృతభారతజాతిసమైక్యతార్భటిన్
  జకితులునై బ్రిటిష్విభులు చత్తుమటంచును వెన్నుఁజూపరే
  క్రకచగళధ్వనుల్
  జెలగ కంఠములున్ శకలమ్ములౌ గతిన్
  బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 27. తెల్ల వారికి వేగును, తెలుపు వాడు
  వెనుక గోతులు త్రవ్వుచు, వీలు గాను
  యొధు లెదుటన తడబడక యుక్తిగాను
  భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు

  రిప్లయితొలగించండి
 28. ఉ:

  దారుణ మైన యుక్తి కసి దాగిన కృత్యము లెంచి చూడగన్
  చేరగ దీయు లోకులను చిక్కిన మార్గములందు పెక్కుగన్
  నూరుచు నుండు ద్వేషమును నోట విధేయుడ నంచు తెక్కలిన్
  భారత మాతకున్ జయము వల్కెడు వాడె ఖలుండు ద్రోహియౌ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 29. స్వీయ దేశ మెల్లర కెంచ విశ్వ మందు
  మాత నాఁ బిలువంబడుఁ బ్రీతితో వి
  వాద సంజనక మహోగ్ర వాద సౌర
  భ రత మాతకు జయ మనువాఁడె ఖలుఁడు


  ఆరయ సత్య ధర్మ నిర తావని సంతత శాంతి కామి యీ
  భారత దేశ మున్నతము పన్నుగఁ గొల్వుమ చిత్త శుద్ధితో
  నీరిత దుష్ట భావమున నిద్ధర శాత్రవ దేశ మైనచో
  భారత మాతకున్ జయము వల్కెడు వాఁడె ఖలుండు ద్రోహియౌ

  రిప్లయితొలగించండి
 30. భావిభారతపౌరుడే పృధివియందు
  భరతమాతకుజయమనువాడె,ఖలుడు
  దేశసంపదకెపుడువినాశనమ్ము
  గోరుమనుజుడునౌనుగ కువలయమున

  రిప్లయితొలగించండి
 31. శంకరాభరణం

  ఈరోజు పూరింపవలసిన సమస్య

  *“భరతమాతకు జయ మనువాఁడె ఖలుఁడు”*
  (లేదా…)
  *“భారతమాతకున్ జయము వల్కెడువాఁడె ఖలుండు ద్రోహియౌ”*

  నాపూరణ

  తే.గీ.

  నేత వస్త్రాల ధరియించి నేర్పుతోడ
  పంచతంత్రాలఁ వంచించి ప్రజల ధనము
  దోచు చున్నట్టి నాయక దోషు లార!
  భరత మాతకు జయమను వాడె ఖలుడు

  ఉత్పలమాల

  చేరుచు రాజకీయముల సేవలఁ జేయగ దేశభక్తితో
  మీరిన వారసత్వపు కడు మేలిమి రంగుల పూతఁబూయుచున్
  నేరముఁజేయుచున్ ప్రజలఁ నేర్పున దోపిడి చేయువాడు తాఁ
  భారత మాతకున్ జయము వల్కెడు వాడు ఖలుండు దోషియౌ

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 32. ఆరయదేశభక్తుడుగనాదరమందునునెల్లవేళలన్
  భారతమాతకున్జయమువల్కెడువాడె,ఖలుండుద్రోహియౌ
  నేరములెన్నియోతఱచునేర్పునజేసెడుమానవుండుగా
  చీరగరాదువారినికజీవితమంతయునెట్టిచోటికిన్

  రిప్లయితొలగించండి