14, జనవరి 2021, గురువారం

సమస్య - 3604

15-1-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్”

(లేదా…)

“మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్”

72 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ముదమున పండుగందు కడు ముద్దుల గూర్చెడి కల్లుగ్రోలుచున్
    బెదరిన గోవులందు జని పెట్టులు బెట్టుచు కేకలేయగన్
    కుదురుగ నుండకే భళిగ కుమ్ముచు కొట్టుచు ముత్తుకూరునన్
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్...

    రిప్లయితొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి , వె లు గో డు ( కర్నూల్ ).
    ................................................................................


    * గు రు భ్యో న మః * నిన్నటి పూరణ గ్రహింప ప్రార్థన


    ఉన్మేషాద్భుత వృత్తపద్యరచనోద్యోగంబు గావించుచున్ ,

    సన్మాన్యోత్తమ గ్రంధముద్రణము తా సాగింప , కంఠంబునం

    దున్మాలన్ - కరమందు ఙ్ఞాపిక (న్) - సముద్బూషింతు రయ్యో ! యికన్

    సన్మానంబు లవే ----> లసత్కవులకున్ సంక్రాంతిపర్వంబునన్ |

    సన్మానంబునె గాక , నివ్వవలె ప్రోత్సాహమ్ము నొక్కింత | జీ

    వన్మార్గమ్మును జూపి సత్కవుల సంభావింప నౌచిత్యమౌ !

    { ఉన్మేష = వికాసవంతమైన : ఉద్యోగము = ప్రయత్నము :

    సన్మాన్య = చక్కగా గౌరవింపదగు : సముద్భూషించు =

    అలంకరించు : లసత్ = ప్రకాశించు : సంభావించు = ఆదరించు

    గౌరవించు }


    **********************************************








    గు రు మూ ర్తి ఆ చా రి , వె లు గో డు ( కర్నూల్ ).
    ................................................................................


    * గు రు భ్యో న మః * నిన్నటి పూరణ గ్రహింప ప్రార్థన


    ఉన్మేషాద్భుత వృత్తపద్యరచనోద్యోగంబు గావించుచున్ ,

    సన్మాన్యోత్తమ గ్రంధముద్రణము తా సాగింప , కంఠంబునం

    దున్మాలన్ - కరమందు ఙ్ఞాపిక (న్) - సముద్బూషింతు రయ్యో ! యికన్

    సన్మానంబు లవే ----> లసత్కవులకున్ సంక్రాంతిపర్వంబునన్ |

    సన్మానంబునె గాక , నివ్వవలె ప్రోత్సాహమ్ము నొక్కింత | జీ

    వన్మార్గమ్మును జూపి సత్కవుల సంభావింప నౌచిత్యమౌ !

    { ఉన్మేష = వికాసవంతమైన : ఉద్యోగము = ప్రయత్నము :

    సన్మాన్య = చక్కగా గౌరవింపదగు : సముద్భూషించు =

    అలంకరించు : లసత్ = ప్రకాశించు : సంభావించు = ఆదరించు }


    **********************************************










    రిప్లయితొలగించండి
  3. కుదురుగ మేయుచునుండగ

    మొదవులు :; కర్షకుల మోదమును దొలఁగించెన్

    మదమెక్కిన కురు సేనలు

    నదిలించుకు తోలుకొనుచునయ్యో కృష్ణా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సదమల హృత్తు వీడుచును జాస్తిగ పాలను కోరి రాతిరిన్
    నిదురను లేపి సూదులిడ నిండుగ డ్రమ్ముల పాలకోసమై
    చెదరిన నిద్దురందు కడు చీదర జూపుచు కాలితాపులన్
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్..

    రిప్లయితొలగించండి
  5. బెదరిన చెదరిన మందలు
    నదుపులు తప్పంగ వగచె నందరు నకటా!
    ఇది యేమి చోద్య మనగా
    మొదవులు కర్షకుల మోదమును తొలగించెన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    అదుననఁగఁ గోడె దూడల
    ముదమున నీనంగ దున్ను పొలమని కొనఁగా
    నెదపోయి పెయ్యలగనుచు
    మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్

    చంపకమాల
    అదునన నీనఁ గోడెల సహాయమొసంగు పొలమ్ము దున్నగన్
    బదులుగ దాని పెట్టుబడి పాత బకాయిలఁదీర్ప వాడినన్
    ముదమగు నంచు నెంచ నెదపోయిన వన్నియు పెయ్యలీనుచున్
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్

    రిప్లయితొలగించండి
  7. ఉదయము నుండి యవసురము
    వదలక త్రాగిన మడియడు పక్కము తోడన్
    వదిరె మదముతో నిట్టుల
    మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్

    రిప్లయితొలగించండి
  8. విధములు లేని వాన విను వీధుల గర్జనసేయ భీతిలెన్

    మొదవులు ; కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్”

    పదునగు ధార పైరులను పంటను ధాన్యము డబ్బు దస్కముల్

    సదములు సర్వ రీతులగు సంపదలన్ ప్రళయమ్ము దోచగన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సదనమున పాల నొసగును
    మొదవులు; కర్షకుల మోదము తొలగించెన్
    అదనపు వానలు వఱదలు
    నొదుగుగ పండిన ఫలముల నొబ్బిడి తోడన్.

    రిప్లయితొలగించండి
  10. కుదరనిమాటలకలుగుచు
    కదనమురైతులువదలకక్రాలుచుమదిలో
    పదునుగకత్తులుదూసిరి
    మోదవులుకర్షకులమోదమునుతోలగించెన్

    రిప్లయితొలగించండి
  11. చెదరని విధమున బెంచును
    మొదవులు కర్షకుల మోదమును : దొలగించెన్
    ముదమును వారికి రిపులయి
    వదలక సస్యముల చీడ వర్ధిలి తినుచున్

    రిప్లయితొలగించండి
  12. పొదుగుల నిండుగ పాలను
    గుదిగుచ్చెడు నాలమంద గోష్ఠమునందున్
    గదియగ సర్పంబొక్కటి
    మొదవులు కర్షకుల మోదమును తొగించెన్

    పొదుగుల నిండ క్షీరమును పొంగులు వార్చెడు నాలమందనున్
    గదియగ సర్పమే నిశిని కాళ్ళను జుట్టుచు గోష్ఠమందునన్
    పదునగు దానికాటునకు ప్రాణము గోల్పడ మాతృరూపులౌ
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలగించె నొక్కటన్

    రిప్లయితొలగించండి
  13. చెదరకభారతావనినియాదరమింతయులేనిరైతునై
    కదలనిక్రాంతితోడుతవికావికలైనవిజీవనంబులున్
    బెదరకశాంతినీయకనుభాసురమౌతగునీతిఁజూపకన్
    మోదవులుకర్షకప్రకరమోదమునున్దోలగించెనోక్కటన్

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సదనమునందు బుద్ధిగ ప్రసన్నత గూడుచు పాలొసంగునౌ
    మొదవులు; కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్
    అదనమునైన వర్షములు నార్భటిజేయుచు పంట లన్నిటిన్
    సదమదమున్నొనర్చుచు నశాంతిని గూర్చెడి తీరుతోడుతన్.

    రిప్లయితొలగించండి
  15. నిదురను గాంచెను కలలో
    చదువులు కలి మహిమ జూప జార్చెను గుణముల్
    పదవులు నీతిని దునిమెను
    మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్ !!

    రిప్లయితొలగించండి
  16. వదలని వానకు పొలమున
    చెదరిన గాదము , దినుటకు చెందని వేళన్
    పొదుగుల పాలను జేపక
    మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్

    రిప్లయితొలగించండి


  17. ఇదిగో పెంపొందించెను
    మొదవులు కర్షకుల మోదమును, దొలఁగించెన్
    హృదిని వెతల కొంతైన నొ
    డుదుడుకుల కరోన బాదుడును శార్వరిలోన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. పదవులనందినాయకులుపాలితకోటిసమస్యదీర్చకే
    సదమలసీరవాహకులస్వాస్థ్యముసర్వమునీరుగార్చగా
    విదితులుబల్కిరిట్లుకనువేదుఱుజెందుచువేగియానతిన్
    *“మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్”*

    రిప్లయితొలగించండి
  19. కుదరకసైరికుండొకడుగోరెనుపట్నమువెళ్ళువానితో
    పదునగునౌషధంబొకటిపైకమొసంగెదదెత్తువాయనన్
    ముదమునదెచ్చియిచ్చెనదిమోసముసీసముగల్సెనందులో
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్

    రిప్లయితొలగించండి
  20. శ్రీకృష్ణుడు మధురానగరానికి వెళ్ళి పోయిన తరువాత పరిస్థితి...


    పొదుగును నోటబట్టి బొలపొందగఁ బాలను ద్రావ నేర్పె లే
    చిదుముల మోమునం దిడుచు చెచ్చెర నేర్పె తృణమ్ము మేయటన్
    కదులుట నేర్పె దూడవలె కన్నయ క్రేల కటంచు నార్తలై
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  21. ఇదియేమి జాడ్యమకటా
    బెదరుచుకొమ్ములు విసరుచు బేజారగుచున్
    వదలక బిట్టుగనరచుచు
    మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్

    రిప్లయితొలగించండి
  22. విధులనిమర్చి పాలకులు, విందు వినోదములందు దేలగా
    కదిలెనురైతులంతనొక ,కట్టగ పోరగ రాజధానికై
    పదవులుబట్టి వీడకను,పాపులుధాత్రిచరిత్రహీనులై
    మొదవులు కర్షకప్రకరమోదము,నందొలగించెనక్కటన్
    ++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  23. వదలని ప్రేమ సాధువులు బాధలు సైపక మాధవాజ్ఞ సం
    పదలన గోవు మందలని పాలన సేయగ కౌరవుల్ విరా
    టధిపతి దక్షిణోత్తరపు టావుల బట్టగ బెట్టుసేయుచున్
    *“మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్”*

    రిప్లయితొలగించండి
  24. అదువదిగాదె రైతుల ధనార్జన సేద్యమునందు గావునన్
    బొదుపుగ పాడినిచ్చి యిల భూరిగ సంపద పెంచి పొందవే
    మొదవులు కర్షకప్రకర మోదమునుం, దొలఁగించె నొక్కటన్
    వ్యధలను పల్విధమ్ములుగ పాడిపరిశ్రమ తోడ గాదుటె

    రిప్లయితొలగించండి
  25. వదలని తోడైనను గన
    మొదవులు, కర్షకుల మోదమును దొలఁగించెన్
    వదలని వానలు పైరుల
    చెదరించెను బ్రతుకుల నిటు చీకటి జేసెన్

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. సంకరజాతి ఆవుల పెంపకము ఎంతో ఖర్చు తో కూడుకొన్నది. దాని ఆధారంగా ఈ నా ప్రయత్నము:

      చం:

      సదమల మెంచి యావులగు సంకరజాతిని పెంపుసేయగన్
      వదిలెను త్రుప్పు గ్రాసముగ వంతులవారి నమర్చ నిత్యమై
      యదనుగ వట్టు బోయెనట యల్లన కృత్రిమ గర్భ ధారణన్
      మొదములు కర్షకప్రకర మోదమునుం దొలగించె నొక్కటన్

      వదిలెను త్రుప్పు=భారీ వ్యయము

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  27. పదిలము కావని యక్కట
    చదువమె వాడఁగ నొకట రసాయనము లిటుల్
    పది మంది యీయక ఫలిత
    మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్

    [ఒదవు (విశేష్యముగ)= ఉపయోగము]


    మది దయ నుంచ కింతయును మర్త్యులు భూతల జీవ కోటికిం
    బదిలము గాంచ కించుకయు వర్తిలఁ గల్గు విపత్తు లిట్టులే
    కుదురును గోలు పోయి కట ఘోర విషాప్పులఁ ద్రాగఁ జావఁగా
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్

    రిప్లయితొలగించండి
  28. పొదుగుల నిండ క్షీరమును పొంగులు వార్చెడు నాలమందనున్
    వదలుచు నొక్కగోవచట వల్మికమందున పాలువార్చగా
    నదుపును దప్పు నాగ్రహము నావును గొడ్డలి గొట్ట బూన నా
    సదమల వేంకటేశ్వరుని సన్నుత శీర్షము దాకి శాపమై
    మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలగించె నొక్కటన్

    రిప్లయితొలగించండి
  29. పొదుగులలో పయంబులను మోదము నించి ముకుందు కీయ నె
    మ్మది మొదవుల్ యదూత్తము సమాదరణంబన వేచియుండ నా
    మధురిపు డేగె హస్తినకు మందలు గుందె దృణంబు మెక్కవా
    *“మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్”*

    రిప్లయితొలగించండి


  30. మొద లయ్యెను వేదనలట
    వదలక వెన్నంట కరువు పల్లెలయందున్
    బిదికినపాలనొసంగని
    మొదవలు కర్షకుల మోదమును తొలగించెన్.

    రిప్లయితొలగించండి