2, జనవరి 2021, శనివారం

సమస్య - 3593

3-1-2021 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై”

(లేదా…)

“నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్”

68 కామెంట్‌లు:


 1. కాయల్ కూరల కోసమై వటుడ నే కంపించుచున్ కూర్చగా
  రాయల్ వారిది తీర్చలేక ఋణమున్ రాద్ధాంతమున్ జేయుచున్
  తీయన్ రీతిని కోరగా ముదమునన్ తీండ్రించుచున్ భామనున్
  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్...

  రిప్లయితొలగించండి
 2. పాయగనరకమునెరుకను
  చేయగధన్యముబ్రతుకునుఁజేరుదుతల్లిన్
  మాయమఁజూపుముశివుడా
  నీయాలినినాకోసగుమునీతిపరుడవై

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోయంబేడున పోవగా కొనగనున్ కోలాహలమ్మందునన్
  కాయల్ కూరలు పండుగన్ విరివిగా కంగారునన్ చెన్నయిన్
  మాయంబైనది నాదు భామ వరదన్ మాబాబు! గయ్యాళిదౌ
  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్...

  రిప్లయితొలగించండి
 4. భగ్నప్రేమికుని ఊహల్లోని లేఖ...

  కందం
  ప్రాయమ్మున ప్రేమంగొన
  మాయలతో నీకుఁ గట్ట మనువన దగునే?
  యాయమ జీవచ్ఛవమన
  నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై!


  శార్దూలవిక్రీడితము
  ప్రాయంబందున మానసమ్ములొకటైరంజిల్లఁగన్ ప్రేమలో
  మాయల్జేసియు నామె నీకు నిడె దుర్మార్గాన నా తండ్రియే
  కాయమ్ముల్ జతగూడగానగునొకో కల్యాణమీ భూమిపై?
  శ్రేయంబంచును వ్రాయుచుంటినిదియే జీవచ్ఛవంబైనదౌ
  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 5. ఓయీ! మూర్ఖుడ వీవుకాదె యట నత్యుత్సాహమున్ భ్రాతలన్
  జాయన్ పందెము గాను పెట్టితివి నీ సామ్రాజ్యమున్ సైతమున్
  మాయాజూదమటంచు పల్కుటది యేమాత్రంబు న్యాయంబురా
  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 6. (బాలుడు నాన్నతో అమ్మ తనదని చెప్పడం)

  తీయని మాటలు జెప్పుచు
  మాయల పడవేసి నాదె మగువన నొప్పన్
  మాయమ్మ నీది కాదిక
  నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. (దాహార్తి శివుడితో)

   హాయిగ హిమగిరి వెలసితొ
   మాయల యెండల వగచిన మాటలు రావే
   మాయమ్మ గంగ నిడవలె
   నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 7. కాయంబేమియుమేలుగాదిలనుతాకాలుష్యమేఁజూడగా
  హేయంబైనవిరక్తమాంసములుథూ, హేకర్తనేరోసితిన్
  మాయాజాలమువీడగానలువవైజ్ఞానాంబికన్ఁజూపుమా
  నీయాలిన్ఁదగనాకోసంగవలెనీనీతిజ్ఞతన్జూపుచున్

  రిప్లయితొలగించండి
 8. వ్రాయుటకు శక్తి కలుగగ
  సాయము గా నలువ ! నాకు సహకారముగా
  నే యాలోచన సేయక
  నీ యాలిని నా కొసగుము నీతి పరుడవై

  రిప్లయితొలగించండి


 9. మాయా మోహము లేలా!
  ప్రాయమ్మిది తప్పిదముల వరుసగ చేయన్!
  గాయాలను రేపకు! పో
  నీ! యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. సాయంబును చేయదలచి
  న్యాయంబగు పైకమిచ్చి యంగన గొంటిన్
  శ్రేయంబిదె సత్వరముగ
  నీయాలిని నాకొసగుము నీతిపరుడవై

  రిప్లయితొలగించండి
 11. సమస్య :
  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ
  నీతిజ్ఞతన్ జూపుచున్

  ( జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు తన బుద్ధుల నారోపిస్తున్న దుర్యోధనుడు )

  శార్దూలవిక్రీడితము
  ...........................

  నీ యాలోచన మెందుబోయెనయ ? నే
  నేమైన దుష్టుండనా ?
  నీ యాంతర్యము నేనెరుంగనదియా ?
  నీ గర్వ మింకేనులే ;
  నీ యాశాలతలన్ని యిప్డు గనుమా
  నిర్మూలనం బాయెలే ;
  నీ యాలిన్ దగ నా కొసంగవలె నీ
  నీతిజ్ఞతన్ జూపుచున్ .

  రిప్లయితొలగించండి
 12. ఆయన చెప్పినదడుగుము
  నీ యాలిని ; నాకొసఁగుము నీతిపరుఁడవై
  నాయన యిచ్చిన పొలమును
  పాయలు జేయుచు సమముగ , పద్ధతి సాగన్

  రిప్లయితొలగించండి
 13. శ్రీ గురుభ్యోనమః

  వాలితో సుగ్రీవుడు

  కం.
  నా యాలిని చెఱబట్టుట
  న్యాయంబౌనా? తగదిది! యన్నా నీవ
  న్యాయంబుగ బెండ్లాడిన
  నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై

  రిప్లయితొలగించండి
 14. మాయల పడితిని “బుధ్ధిని”

  నీ యాలిని నాకొసఁగుము ; నీతిపరుఁడవై

  నాయనను హద్దు దాటగ

  నీయని గౌరీ తనయుడ నీకు నమస్సుల్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 15. మాయా జూదమొ కాదొనోడుట నిజమ్మా కాద కాదేని , క్రీ

  డాయాసక్తుడు ధర్మ రాజు సఖు రాడాయడ్డుగన్ కాచ నా

  దాయాదిన్నిరతంబు సత్యముయెనాధారమ్ముగౌ పాండవా

  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కాదొ యోడుట... క్రీడాయాసమ్మున ధర్మరాట్సఖుడు రాడా...సత్యమె సదాధారమ్ముగన్/నౌ..." అనండి.

   తొలగించండి


 16. హేయంబియ్యది నీదు జీవితమురా హేరాళమీతప్పులున్
  గాయమ్మాయెను నాదు మానసము వక్కాణింతు నీ మేలుకై
  మాయామోహము లేల తప్పిదము సామాన్యంబు కాదోయి! పో
  నీ! యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఒకానొకసన్నివేశంలో శిశుపాలుని విషయమై కృష్ణుడు పార్థుని తో...

  శూలాత్యంతనిశాతశబ్దఘటనాశుంభద్వచోదుష్టుడై
  వాలాయమ్ముగ నోట వెల్వడిన దుర్భాషాదురాలాపవా
  చాలుండై కపటక్రుధామలినదుస్వాంతుండునై దూల,రా
  దేలా దుఃఖము దున్నపోతువని నిందింపన్ సభన్ మిత్రమా!

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాయాతీత! జగన్నివాస! కరుణన్ మమ్మేలు వాడౌదువే!
   నా యీ బీద తనమ్ముఁ బాపఁ దగు, నే నాకొంటి భక్తుండ ని
   ర్మేయాపారకృపావరిష్ఠజననిన్ మేకొంచు శ్రీమాతనున్
   నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. సాయమడగ నప్పుగ రూ
  పాయలనిచ్చితిని గాదె భామకు సత్యం
  బే, యడుగుము శంకింపక
  నీ యాలిని, నాకొసఁగుము నీతి పరుఁ డవై

  రిప్లయితొలగించండి
 19. మాయాజూదమునాడుచు
  సోయిన్దప్పిఁదొలుఁదొల్తసోదరులన్గో
  ల్పోయితానుండగఁగోఱెను
  నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. మాయాజూదమునాడుచు
   సోయిన్దప్పిఁదొలుఁదొల్తసోదరులన్గో
   ల్పోయినధర్మజుఁగోఱెను
   నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై

   తొలగించండి
 20. న్యాయంబియ్యదినాదుపుత్రికలనన్యాయంబుగాగొట్టినా
  యీయుల్లంబునుగాయపర్చితివియోయీహ్రీహరిశ్చంద్రుడా
  మాయప్పంతయుదీర్చలోహితునిసామ్రాజ్యంబునీలిబ్బులున్
  “నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్*


  మాయామోహజగంబుబుద్బుదముకామక్రోధలోభాదులన్
  ధ్యేయంబూడ్చితినన్నువీడితివిసంధింపంగబ్రహ్మంబునే
  హేయంబంటివియన్నమయ్యహృదయంబేమోక్షమర్థింపగా
  “నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్”

  వేంకటేశ్వరుడు అన్నమాచార్యుల భార్యలు దూరమైననే మోక్షమార్గపడునని యెంచుచు..

  రిప్లయితొలగించండి
 21. మాయా- జూదము నోడితి
  నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై
  ఖాయమిది సుయోధనుడివె
  న్యాయముగాధర్మనందనా!నీవే యున్

  రిప్లయితొలగించండి
 22. ధ్యేయమ్మున్ నిలబెట్టి నేచదివితిన్ దీక్షాంతరంగుండనై
  ఆయమ్మున్ గడియించు చుంటి స్థిరమౌ వ్యాపారమున్ చేయుచున్
  నీయమ్మాయిపయిన్ విరాళి కలిగెన్ నీపుత్రి, నొప్పించుచున్
  నీ యాలిన్ దగ, నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 23. మైలవరపు వారి పూరణ


  ఒక వైద్యుడు.. గ్రామీణునితో.

  ఈ యానందము వృద్ది బొందునిక రెండింతల్., ప్రభాతమ్మునన్
  జేయన్ శస్త్రచికిత్స నీ సతికి., నిశ్చింతన్ త్వరన్ జేర్చుమా!
  సాయంసంధ్యనె వైద్యశాలకు., చికిత్సన్ జేసి పంపించెదన్
  నీయాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 24. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన
  సమస్య

  నీ యాలిందగ నాకొసంగవలె నీతిజ్ఞతనన్ జూపుచున్

  పూరణ

  (అల్లుడు తల్లితో సహా పోయి మామనిట్లు వేడుకొనుచున్నాడు)

  శార్దూలము

  న్యాయంబెంచగ నాదితప్పు వినరో జ్ఞానోదయంబయ్యెడిన్
  వేయేండ్లైనను నిట్టి భార్య దొరికే వీలున్నదో లేదొలే
  మాయీవిన్నపమాలకించి దయతో మన్నించు కైమోడ్తు, పో
  నీ , యాలిందగ నాకొసంగవలె నీతిజ్ఞతనన్ జూపుచున్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దొరికే' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 25. గు రు మూ ర్తి ఆ చా రి వెలుగోడు
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఓయీ ! ధన మిచ్చితి , ప్రా

  ధేయపడగ > నిరుడు | మరచితివె ! నిజమో కా

  దో యడిగి కనుగొనుచు నీ

  నీ యాలిని , నాకొసగుము నీతిపరుడవై !

  *****************************

  రిప్లయితొలగించండి
 26. "నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్"
  హేయంబౌనిటువంటి బల్కులరరే హీనుండవై యివ్విధిన్
  కూయంగా దగదెన్నడైన నిటులన్ క్రూరత్వమున్ జూపుచున్
  వేయేలా విను నాదు మాట నియతిన్ వీడంగరాదెన్నడున్

  రిప్లయితొలగించండి
 27. ఓయీ సజ్జన వినుమా
  నీయాలికినాయువింక నిండుకొనెను నే
  నాయమఁగొనిపో వచ్చితి
  నీ యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై

  రిప్లయితొలగించండి
 28. అత్తగారు అల్లునితో

  ఓయీ! మోహమువీడు!మాసుతను
  సంకోచమ్ములేకే వడిన్
  మాయింటన్ దొలికాన్పు జేయగను
  సమ్మానించుచున్ బంపు పా
  పాయిన్ బొందిన పిమ్మటన్ గలుగు
  సౌభాగ్యమ్ములే యల్లుడా!
  నీయాలిన్ దగ నాకొసంగవలె నీనీతిజ్ఞతన్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 29. ఒక సంగీత దర్శకుడు తన మిత్రునితో మాట్లడిన మాటలుగా నా ప్రయత్నము :

  శా:

  సాయంకాలము వేళ వింటి నిటుగా శ్రావ్యంపు సంగీతమున్
  ప్రాయోజ్యం బననొప్పె నిశ్చయముగా పాడింప చిత్రాలనున్
  ఖాయంబౌ నన మిత్రమా కనుము ప్రఖ్యాతమ్ము యోచింపగా
  నీ యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 30. ఓ యన్నా వాలీ విను
  న్యాయమె యిది నీ యనుజున కలమట నీయన్
  నా యాలిని, నేలుకొనుచు
  నీ యాలిని, నా కొసఁగుము నీతిపరుఁడవై


  ఓయీ యోడితి వింక లెమ్ము వడి రాజోగ్రుండ జూదమ్ము నా
  నీ యుద్ధమ్మున మున్ను గెల్చినవి నా యీ సంపదోఘమ్ముతో
  మాయల్ మాని నరేంద్ర స్యందన తతుల్ మత్కుంజ రాశ్వంపు, రా
  నీ, యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్

  [ఆలి =పంక్తి]

  రిప్లయితొలగించండి
 31. ఓయీరామారావా!
  న్యాయంబేతెఱచిచూడ నైతికమిదియా?
  పాయుమయిటులుగ బలుకుట
  నీయాలినినాకొసగుము నీతిపరుడవై

  రిప్లయితొలగించండి
 32. నీయాలిన్ దగనాకొసంగవలె నీనీతిఙ్ఞతన్ జూపుచున్
  నోయీ యేమనిబల్కుచుంటివియిటన్ నోపంగరాదాయెగా
  మాయాజాలముగాదలంచితివే?మందుండ! యేమాయెరా?
  న్యాయంబొప్పెడురీతి మార్చుమిక నీయాలోచనామార్గమున్

  రిప్లయితొలగించండి
 33. మాయా జూదమున శకుని
  మాయపు చేష్టల నుచేసి మాయగ గెలువన్
  మాయీ సుయోధ నుపలికెను
  నీ యాలి ని నాకొసగుము నీతి పరుడవై

  రిప్లయితొలగించండి
 34. శార్దూల విక్రీడితము:
  ++++++++++++++++++++++++
  మాయామేయ జగంబె నిత్యమని సంభావించు లోకమ్ములో
  న్యాయాన్యాయవిచక్షణాదులవి తానాణ్యమ్ము గోల్పోవగా
  శ్రేయో మార్గములన్నివీడుటది యే ,శ్రీకారమౌ లంకలో
  నీ యాలిన్ దగనాకొసంగవలె నీనీతిజ్ఞతన్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 35. కందము:
  ++++++===
  ఓయీ రావణ వినుమా!
  నీయీలంకన యవనిజ నిలుపుట సబబా?
  శ్రేయోమార్గమువీడక
  నీ యాలినినాకొసగుమునీతిపరుడవై

  రిప్లయితొలగించండి