17, ఫిబ్రవరి 2021, బుధవారం

సమస్య - 3638

18-2-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు”
(లేదా...)
“రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో”

67 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    సామును చేసి టిక్కటులు చక్కగ చేర్చుచు బ్లాకు మార్కెటున్
    నీమము తప్పకే మిగుల నేతల గాంచుచు చిత్రసీమనున్
    గోముగ శాస్త్రి వర్యులిట గొప్పగ మెచ్చుచు నందమూరుడౌ
    రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "శ్రీ రాముని దయ చేతను..."

      సరదా పూరణ:

      సామును చేసి టిక్కటులు చక్కగ చేర్చుచు బ్లాకు మార్కెటున్
      నీమము తప్పకే మిగుల నేతల గాంచుచు చిత్రసీమనున్
      గోముగ శాస్త్రి వర్యులిట గొప్పగ మెచ్చుచు నందమూరి శ్రీ
      రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో..

      ...కంది వారి సవరణతో

      తొలగించండి


  2. విశ్వనాథ వారి విస్తృతమగు కల్ప
    వృక్ష ము చదివి యితివృత్త మిది తె
    లుంగు వారి దని పలువిధముల పొగిడి
    రామచంద్రుఁ డాంధ్రుఁ డనిరి బుధులు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    పేర్మి నటన విశ్వ విఖ్యాతి గాంచియు
    ముఖ్యమంత్రిగ జన సఖ్యత గొన
    వారె! నందమూరి తారక పూర్వక
    రామచంద్రుఁ డాంధ్రుఁ డనిరి బుధులు!!


    ఉత్పలమాల
    రాముడు కృష్ణుడున్ నరుడు రావణుడాది పురాణ పాత్రలన్
    భీముఁడనంగ సాంఘికపు వేషములందున ఖ్యాతి గాంచుచున్
    శేముషి ముఖ్యమంత్రిగను సేమము బంచిన నందమూరి యా
    రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో మొదటి పద్యము:

      ఆటవెలది
      పేర్మి నటన విశ్వ విఖ్యాతి గాంచియు
      ముఖ్యమంత్రిగ జన సఖ్యత గొన
      వారె నందమూరి తారక పూర్వక
      రాముఁడాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. బాలరాముభవితభావించెమౌనియు
    తనదుబిడ్డగానుతనివిఁదీర
    అంధకుండువలెనునాతనిబిడ్డగు
    రామచంద్రుడాంధ్రుడనిరిబుధులు

    రిప్లయితొలగించండి
  5. ఈ మహనీయ దేశమున నెట్టి మహాత్ములు జన్మనెత్తిరో
    యేమి మహోపకారముల నెట్టు లొనర్చిరొ చెప్పఁ బూనుచున్
    తాము లిఖింపఁ బూనిరి గదా పలు భాషలలోన 'పొట్టి శ్రీ
    రాముఁడు' దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గ్రామము గ్రామమందునను రాముని మందిరముల్ రహింపఁ, గా
      వ్యామృతపానమత్తులయి యాతత రామకథల్ వచింప, మా
      రామయ తండ్రి సీతమగ రమ్యపు భద్రగిరిన్ వసింపఁ ద
      ద్రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో.

      తొలగించండి
    2. నీమముఁ దప్పకుండ గణనీయపు భారత రాజకీయమం
      దీ మహనీయుఁ డొప్పెనన నెల్లరు నా నరసింహ రావు తాఁ
      బాములపర్తి వంశజుఁ డపారగుణాత్త సుహృద్ధృదంతరా
      రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో

      తొలగించండి
    3. ఆణిముత్యములండి మీ మూడు పద్యములు.
      నమస్సులండి.

      తొలగించండి


  6. పలుమార్లు పొగిడి రమ్మ ఘ
    నులు! రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి వి
    జ్ఞులు వంగభాషలో! ఓ
    జిలేబి! జీపియెసు వారు చెప్పినది సుమీ! :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. భద్రుని గిరి తీర పాకల వాసిగ

    స్థానికతను పొందె సతిని కూడి

    రాష్ట్రము విడి వడిన రాగము వీడక

    రామ చంద్రుఁ డాంధ్రుఁ డనిరి బుధులు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. మారు మూల పల్లె మా రాము జన్మంబు
    నటనకెక్క దాను నటనమందు,
    ముఖ్యమంత్రి యయ్యె ముచ్చట దీరంగ
    రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

    నటనకెక్కు-విలసిల్లు

    రిప్లయితొలగించండి
  9. ప్రాంత భేద మనుట పాటింప రాదంద్రు
    సర్వ వ్యాపి యనుట సత్య మె కద
    అట్టి వాని గూర్చి యను కోని విధముగ
    రాము డాంధ్రు డనిరి ప్రముఖ బుధులు

    రిప్లయితొలగించండి
  10. తెలుగు నటుల తోడ తీసిరే హిందిలో
    రమ్యమైన గాథ రామచరిత
    కంచిలోని జనులు కాంచియా చిత్రమున్
    రామచంద్రుడాంధ్రుడనిరి బుధులు.

    రిప్లయితొలగించండి
  11. ఆ మమతా బెనర్జికి విషయమ్ముల తెల్పు చరిత్రకారులా
    భామకు ముఖ్య నేతలఁ విభావము జేయదలంచి యంజి యా
    రా మహనీయునిన్ దమిళుడంచు జనాళియె మెచ్చినట్టి యా
    రాముడుదెల్గువాడనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బెనర్జి విషయమ్ముల..' అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  12. సమస్య :
    రాముడు దెల్గువా డనుచు
    వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో

    ( బసవరామతారకప్రాణేశ్వరుడైన రాముడు , బహుముఖప్రతిభాభాస్వంతుడైన రాముడు తెలుగువాడేగా !)

    ఉత్పలమాల
    ....................

    సోముడు నందమూరి ఘన
    సుందరవంశపు సాగరంబునన్ ;
    ధాముడు సర్వపౌరజన
    ధార్మికరంజకపాలనంబునన్ ;
    కాముడు సాధ్వి యైన తన
    కామిని " బస్వసురామతారకా "
    రాముడు - దెల్గువా డనుచు
    వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో .

    రిప్లయితొలగించండి
  13. రామయతండ్రియేతనకురక్షగపోతనవ్రాసెకావ్యమున్
    భూమిజకాలుపెట్టెనిటపూచెనుశీలముకాంతలందునన్
    ఏమరపాటులేదుగదనేయెడతారకమంత్రముల్మదిన
    రాముఁడుతెల్గువాడనుచువ్రాసిరివిజ్ఞులువంగభాషలో

    రిప్లయితొలగించండి
  14. వంగ భాషను నేర్పించే క్రమంగా నా ప్రయత్నము:

    ఉ:

    కామిత మెంచి నేర్పుటకు క్లాసులు నేర్పడ జేయ చక్కగా
    గ్రామరు గూడి వాక్యములు రాగము తోడుత నాలపించగన్
    రాముడి పేరు వచ్చునటు వ్రాత రచింపు మటన్న వెంటనే
    రాముడు దెల్గు వాడనుచు వ్రాసిరి విజ్ఞులు వంగ భాషలో

    Class & Grammer = అన్యభాషా పదాలు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. తామర నేత్రుడై యడరి, తారక రాముడు చిత్రసీమలో
    రాముడు, కృష్ణ భీముడును, రావణ వేషము లంత మెచ్చగాఁ
    ధీమత నేలె, రాష్ట్రమును దిట్టతనంబున నందమూరి మా..
    రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో.

    రిప్లయితొలగించండి
  16. రామ చరిత్ర రమ్యముగ వ్రాసెను వాల్మికి సంస్కృతాన యా
    రాముడు భద్రశైలమున రాజిలె గౌతమి తీరమందునన్
    మేమట గాంచినట్టి నిజమెల్లను నేడిదె తెల్పుచుంటి మీ
    రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంస్కృతాన నా రాముడు..." అనండి.

      తొలగించండి
  17. తండ్రిమాటను జవదాటని తనయుడే
    ధర్మమార్గమన్న తనకు ప్రియము
    ఊరునందు"రవికుమారు"ని పొగిడె,ఆ
    రామచంద్రుడాంధ్రుడనిరి బుధులు.

    రిప్లయితొలగించండి
  18. రాజుల కునురాజు రారాజు రామచం
    ద్రుడు తెలుగు జనులను బ్రోవు నెపుడు
    తెలుగు సీమ కెపుడు దేవర రాముడు
    రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు


    దేవర = రాజు
    ఆంధ్రుఁడు = ఆంధ్రదేశపురాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజు లకును రాజు రారాజు రామచం
      ద్రుడు తెలుగు జనులను బ్రోవు నెపుడు
      తెలుగు పురము గూడ తీర్చిదిద్డెడి ఱేడు
      రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

      తొలగించండి
  19. ఆంధ్రదేశమందు నావిర్భవించగ
    నచటి రామచంద్రుఁడాంధ్రుఁ డనిరి
    బుధులు , రాముడెవరి పొత్తమోతెలియక
    వింతగొలుపుచుండు విషయమిదియ

    రిప్లయితొలగించండి
  20. ఆ.వె.
    తిరుగులేని దైన తీయదనము తెన్గు
    విన్నవారి చెవుల విందుజేయు
    రామనామమహిమ రమణీయతనుగాంచి
    రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ.వె.
      తిరుగులేని దైన తీయదనము తెన్గు
      విన్నవారికెల్ల విందుజేయు
      రామనామమహిమ రమణీయతనుగాంచి
      రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

      తొలగించండి
  21. మనసు దోచు వారు మనవారు గదెపుడు
    బద్దరగిరి మనది భక్తి మనది
    గూడు గట్టితిమిగ గుండెలె నెలవుగ
    రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భద్రగిరియె మనది... గూడు గట్టితిమిదె..." అనండి.

      తొలగించండి
  22. 18.02.2021
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ప్రయత్నం..

    *ఉ*

    రాముని పేరు తోడ పలు రమ్యత నొందిన చిత్ర రాజ్యముల్
    రాముడు భీముడంచు మరి డ్రైవరు రాముడు తానెయంచు నా
    నామము నిండుగా జనులు నమ్ముచు నిట్టుల ఖచ్చితంబుగా
    *“రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  23. ప్రేమపంచునెపుడు, వేదవిద్యచదువు
    తెలుగు భాష యనిన తేనెలొలుకు
    పట్టుపట్టె నెగ్గు పంతము నిచటనీ
    రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

    రిప్లయితొలగించండి
  24. తిక్కన తీర్చిన తెలుగు సీతమ్మను, గోపన్న కట్టిన భద్రాచలం గురించి ఆకళింపు చేసుకొని దానిని వంగకవి వంగభాషలో....

    శ్రీమహనీయమూర్తియెవసించెనుతిక్కనతెన్గుసీతమా
    రామముపర్ణశాలరఘురామునిభద్రగిరీశునాలయం
    బామహనీయగోపనశుభంకరక్షేత్రముబాడనెంచిశ్రీ
    *రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో”*

    రిప్లయితొలగించండి
  25. త్రాఁగ గౌతమీ జలమ్ము, డాసితిమి యా
    హ సఖి! నేటి పల్లె నంచుఁ దెలుప,
    రాముఁ డుండ నాఁడు రమ్య భద్రగిరిని
    రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు

    [ముచ్చటగా మూడు కారణములు!]


    ఏ మహనీయు నైన భువి నెక్కటి వారును గౌరవమ్మునం
    బ్రేముడిఁ దల్తు రింపుగను వేమఱు డెందము నందు నిచ్చలున్
    నీమపు దీక్ష స్వర్గము ననింద్యుఁడు గాంచిన పొట్టి యైన శ్రీ
    రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో

    రిప్లయితొలగించండి
  26. భద్రగిరియె తనకు వాసము కనుకన
    రాముడాంధ్రుడనిరి ప్రముఖ బుధులు
    కానియిపుడు భద్ర నగముక లదుతెలం
    గాణమందు నార్య! గణుతి జెందె

    రిప్లయితొలగించండి
  27. నీమముతోడ రాష్ట్రమునునిచ్చలుమోదము గోరుపొట్టిశ్రీ
    రాముడుదెల్గువాడనుచు వ్రాసిరి విఙ్ఞులు వంగభాషలో
    నామరణంబునాతడుపహారముమానుచు నేకదీక్షతో
    నేమరుపాటునున్గనక యైక్యతనొందగ జేసె రాష్ట్రమున్

    రిప్లయితొలగించండి
  28. ఆ మహనీయ భవ్య దరహాస మనోహర దివ్య మూర్తి శ్రీ
    రాముని చిత్రముల్ గని విరాళి జనావని కోల్కతా పురిన్
    తామరసాక్షు రూపమున తారక రాముని ప్రజ్ఞ మెచ్చగా
    రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో

    రిప్లయితొలగించండి
  29. తరతమములు మనకు తగవు, అల్పులెనిల
    రాముఁ డాంధ్రుఁ డనిరి, ప్రముఖ బుధులు
    రాముడు జగదాభిరాముడందరి వాడు
    యనియన వలె నెపుడు యందురుగద

    రిప్లయితొలగించండి
  30. తరతమములు మనకు తగవు, అల్పులెనిల
    రాముఁ డాంధ్రుఁ డనిరి, ప్రముఖ బుధులు
    రాముడు జగదాభిరాముడందరి వాడు
    ప్రాంత భేధ మేల పధము ననిరి

    రిప్లయితొలగించండి
  31. రామనామ మహిమ రహితోడ తలచుచు
    రంగనాథుడాదిరాజకవులు
    ఆతుకూరిమొల్లయాదికవులతోడ
    రాముడాంధ్రుడనిరిప్రముఖబుధులు

    రిప్లయితొలగించండి