22, ఫిబ్రవరి 2021, సోమవారం

సమస్య - 3643

 23-2-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హలము విడువఁ బంట లధికమగును”
(లేదా...)
“హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్”

76 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    వలపులు మీరగా మిగుల బంగరు భూముల సాగు చేయుటన్
    పలువురు రైతులాదటను పండుగ జేయుచు చేర్చి రూకలన్
    తెలివిగ ట్రాక్టరుల్ గొనుచు తేలిక తీరున పాతకాలపుం
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పాతకాలపున్" అనండి. అక్కడ ద్రుతకార్యం జరుగలేదు కనుక ద్రుతం బిందురూపాన్ని పొందదు.

      తొలగించండి
  2. మెఱయుశాస్త్రమందుమీసంబుమెలిఁబెట్టి
    అన్నరైతుగూడయందగించె
    సాగుభూమియందుసహకారిమిషనయ్యె
    హలమువిడువపంటలధికమగును

    రిప్లయితొలగించండి
  3. పొలమున వేయు సారములు పుష్కలమీ కలియందు క్ష్వేళముల్
    ఫలితము నేటి పంటలవి పామువిషమ్ముల బోలి యుండగా
    వలదని సేంద్రియమ్ములను వాడుచు క్షేమము కోరుచున్ *హలా*
    *హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  4. చిన్న కమతములను చేసి వేరు పడిరి
    నీటి పంపకముల పోటి పడిరి
    పైరులెండవెట్టె భ్రాతలు కినుకను
    హలము విడువఁ బంట లధికమగును

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    (హలము= తగవు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      'హలము'నకు తగవు అన్న అర్థాన్ని కేవలం పర్యాయపద నిఘంటువు ఇచ్చింది. అది అంత ప్రామాణికం కాదు.

      తొలగించండి
  5. హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్

    నా ప్రయత్నం:
    చం.
    సలసల కాల్చు టెండలను సైతము సైచుచు బైరు నాటుచున్
    జలజల వానలే కురియ సాంతము ముద్దయి నీరు దీయుచున్
    చలికిని పంచబాణుడటు సందడి జేయఁగ దాము, హర్షదో
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.

    హర్షదోహలము-కామము

    రిప్లయితొలగించండి
  6. విలువల గౌరవింపక నవీన విధానములంచుఁ బెక్కు రీ
    తులుగ జనాళి స్వాస్థ్యమును దూరమొనర్చు గుణంబు లెన్నియో
    కలిగిన పుర్వు మందులను గాఢముగా వెదజల్లఁ బూను దో
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.

    రిప్లయితొలగించండి
  7. జగతి మేలు గోరి శాస్త్ర వేత్తల కృషి
    వలన వచ్చె నూత్న పరికరములు
    వాటి విలువ దెలిసి వాడచు రైతన్న
    హలము విడువ బంట లధిక మగును

    రిప్లయితొలగించండి
  8. ఆధునిక యుగమ్ము నందున కలవుగా
    సేద్యమునకు వివిధ శీఘ్ర సాధ
    నములు ట్రాక్టరువలె, నావిధమ్ముగనిల
    హలము విడువఁ బంట లధికమగును

    రిప్లయితొలగించండి
  9. ఆటవెలది
    పదును వాన గురియ నదునుకు రైతన్న
    మడక దున్ని విత్తు పడినదాది
    రీతి దప్పు సోమరితనమునన్ కుతూ
    హలము విడువఁ బంట లధికమగును

    చంపకమాల
    తొలకరి నాటి నుండి మడి దున్నుచు సిద్ధముఁ జేసి పంటకున్
    మెలకువ లెన్నొ నేర్చి విని మేలొన రించెడు సూచనాదులన్
    బొలముల ధాన్యలక్ష్మిఁ గని బొంగెడు దాక వినోదమన్ గుతూ
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్


    రిప్లయితొలగించండి
  10. అలజడి రేపి రైతులట నందరి పావుల జేసి వారటన్
    విలవిలలాడుచుండ గని వీగిరి శాంతిని గోరు ధీరులున్
    వలదిక రాజకీయమన పంతము వీడుచు పోరుటల్ కుతూ
    హలముల మూల బెట్టిరట హాలికు లెక్కువ పంట దీయగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలడిల పద్య హాలికుడు కైతల గూర్చెడి *కందిశంకరుల్*
      కలమిక నూత్నమౌ హలము గాగ విరించిగ పద్య సేద్యమున్
      బలువిధ నవ్య రీతులను పంచి వివేకము బెంచ; పాతవౌ
      హలముల మూల బెట్టిరట హాలికు లెక్కువ పంట దీయగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. నరుల బలము కన్న మరయంత్రముల శక్తి
    యధిక మంచు నెరుగు మన్న దాత!
    భద్రములవి లాగు వ్యవసాయ మదియేల
    హలము విడువఁ బంట లధిక మగును.

    రిప్లయితొలగించండి
  12. పలువిధ మైన పద్ధతులు వాసిగ జేరెను సేద్యమందునన్
    తొలకరి పల్కరింపగనె దుక్కిని దున్నగ గోరి కృంతమున్
    బలదము గట్టకుండ బలవర్ధక యంత్రము వాడ నెంచుచున్
    హలముల మూలబెట్టిరఁట హాలికి లెక్కువ పంటఁ దీయఁగన్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    విలసదశేషపుణ్యఫలవిశ్రుతకర్షకవృత్తి జాతికే
    బలమని.,లాభనష్టముల భావన యుక్తము గాదటంచు., పు..
    ర్వులహరియించు మందు గొను పూర్వపుపద్ధతివీడి యా హలా
    హలముల మూల బెట్టిరట హాలికులెక్కువ పంటఁ దీయగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. పూర్వకాలమందుపుడమిని దున్నంగ
    పండెపంటకొంతె,బలము పెరిగె
    హలము విడువఁ బంట లధికమగునుగాని,
    యంత్రమందు పండి,వ్యాధి ప్రబలె

    రిప్లయితొలగించండి

  15. చెలువము చెంగలించ దమ
    జీవనమున్ పెనుపొంద జేయుచున్
    హలముల జేత బట్టి రట
    యాతన నెంచక రైతు లత్తరి
    న్నలమిన శాస్త్రజ్ఞాన ఫల
    మందున నేడు కృషిన్వరించగన్
    హలముల మూలఁ బెట్టిరఁట
    హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్!

    ("దుక్కి దున్ని మోటలాగు
    బక్క ఎడ్ల మొరవినెనో
    అవతరించె ట్రాక్టర్లు
    ఆయిలు యింజనులు")
    డా.జె.బాపురెడ్డిగారి అద్భుతగీతం ఉన్నది....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శాస్త్రజ్ఞాన' మన్నపుడు 'స్త్ర' గురువై గణభంగం. సవరించండి.

      తొలగించండి
  16. సమస్య :
    హలముల మూలబెట్టిరట
    హాలికు లెక్కువపంట దీయగన్

    ( వ్యవసాయం వల్ల నష్టపోతున్నామనే తలంపుతో ఉన్న భూమి నమ్మి వ్యాపారం చేయదలచుకున్న రైతులు )

    " చలనముతోడ నెంతయును
    శ్రామికకష్టము సల్పుచుండినన్
    ఫలమది చేరకున్నయది ;
    బానిసజీవిత మెన్నినాడులో ?
    నిలనిపు డమ్మి వర్తకము
    నింపుగ జేయుద " మంచు నెంచుచున్
    హలముల మూలబెట్టిరట
    హాలికు ; లెక్కువపంట దీయగన్ .
    ( పంట - ఫలితము )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "చేరకున్న నది... నాడులో యిల..." అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  17. చం:

    కలమును బట్టి విద్యలను కాలము నెంచుచు నేర్వ హాలికుల్
    కొలువున జేర నార్జనము గొప్పగు రీతిని బొందుచుండగన్
    ఫలములు హెచ్చుమీరగను పాతగు సేద్యము రోతయై కుతూ
    హలముల మూల బెట్టిరట హాలికులెక్కువ పంట దీయగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. అందరు గలిసి సేద్యము నాచరించ
    బూని , వలసిన సామగ్రి మొగ్గరముగ
    గొనుచు, వాడుటకై పంచుకొనెడి వేళ
    హలము విడువఁ బంట లధికమగును

    మొగ్గరము = సమూహము
    హలము = కలహము

    రిప్లయితొలగించండి
  19. కలుముల నిచ్చునంచు వెనుకంజను వేయక దున్ను
    యంత్రముల్
    జెలిమిని జేయుచున్ మిగుల చెల్వము తోడుత
    సాగుబాటలో
    జెలగుచు సేంద్రియంపువిధి సేద్యము సేయగ నుద్యమించుచున్
    హలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగన్

    రిప్లయితొలగించండి
  20. సులువుగ సాగు జేయుటకు జూపి విదేశపు యంత్ర రీతులన్
    దెలుపగ నూత్న పద్ధతుల తెల్లముగా మన పల్లెలందునన్
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
    వెలుగులు నిండె నిండ్లనిక పెంపెసలారెను భోగ భాగ్యముల్

    రిప్లయితొలగించండి


  21. పిలుపిదె యాప్యాయముగా
    నలుపెరుగక మీరు నడుపు హలము విడువఁ బం
    ట లధికమగును! పసిడి పం
    టలు రొయ్యలు! వేయుడీ కటకటలు తొలగున్



    జిలేబి

    రిప్లయితొలగించండి


  22. అవసరముల కొరకై విను
    రవి! హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లె
    క్కువ పంటఁ దీయఁగన్! విడు
    వ్యవసాయము! రొయ్య పంట పసిడి మనకగున్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. కలములు లేక సత్కృతులు కాగితమందున వ్రాయజాలునా!
    ఉలు లవి లేక సుందరమహోన్నతశిల్పము చెక్క జాలునా!
    గళమది లేక గీతముల కమ్మగ పాడుదురే! అహా! ఒహో!
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. సమస్యా పూరణం

    హలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగా

    నా పూరణ

    1చంపకమాల

    పొలములు దున్ను యంత్రముల పోడిమి హెచ్చిన సౌఖ్యముండగా
    జలముల పైకిదీసి కడు సక్రమ పద్ధతి నందజేయుచున్
    కలుపులఁ దీయుచున్ యెరువు కాలము మీరక వేయు చుండగా
    హలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీయుచున్+ఎరువు' అన్నపుడు యడాగమం రాదు. "కలుపుల దీసి తా మెరువు కాలము మీరక..." అందామా?

      తొలగించండి
  25. యంత్ర పరికరములు వ్యవసాయమందున
    వాడుకొనిన హెచ్చు ఫలమునిచ్చు
    పాత పద్ధతులకు భరతవాక్యముబల్కి
    హలము విడువఁ బంట లధికమగును

    రిప్లయితొలగించండి
  26. ఆ.వె.
    సంపదలను గూర్చు సహకార సేద్యము
    చిన్నకమతములను చేరదీసి
    కష్టమైన పనులు కలబోసి జేసిన
    హలము విడువఁ బంట లధికమగును

    రిప్లయితొలగించండి
  27. కలముపట్టినకవికంప్యూటరునుపట్టె
    పద్యపాదమునకు పదమువెదక,
    వ్యయము తగ్గియంత్రపరికరములతోటి
    హలము విడువఁ బంట లధికమగును

    రిప్లయితొలగించండి
  28. యంత్ర యుగము గాన వ్యవసాయము నకు
    రైతు లంద రిపుడు హలము మాన
    పాతపరికర మన బడునట్టి యాపాత
    హలము విడువ బంట లధికమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "వ్యవసాయమునకును" అనండి.

      తొలగించండి
  29. కలమునుబట్టికావ్యమునుకావ్యులువ్రాయగసైరికుండునా
    హలమునుబట్టిక్షేత్రమునుహాయిగదున్నగబండెసస్యముల్
    తలువనిరీతివచ్చిపడెదయ్యపురోగముపాతవైనయా
    *హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్”*

    రిప్లయితొలగించండి
  30. యంత్రములను వాడి యధునాతనంబగు
    పరికరములు వాడి పద్ధతి గను
    నన్నదాత లెల్ల రనయము వాడెడు
    హలము విడువ బంట లధిక మగును



    రిప్లయితొలగించండి
  31. లోక మందు వచ్చె వీఁకను మార్పులు
    కాలపు వృథ యింక నేల వినుమ
    నూతనంపు గతులఁ జూతము వడి పాత
    హలము విడువఁ బంట లధికమగును


    అలసట మేన లేదు మఱి హాయిగ నాసన మందు నిల్చియుం
    బొలమును వేగవంతముగ ముచ్చట లాడుచు దున్న వచ్చు నాఁ
    గులుకుచు యంత్ర రాజముల గొప్పగఁ బట్టిరి కర్షణార్థమై
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. సులువగు యంత్రముల్ గనుటచొప్పును జూచెను గారణంబుగా
      హలములుమూలబెట్టిరటహాలికులెక్కువ పంటదీయగన్
      బలువిధయంత్రరాజములు బారులుదీరిచియుండె యంగడిన్
      హలములు మానిసేద్యమును హాలికులిప్పుడు జేయువీటితోన్

      తొలగించండి
  32. ~~~~~~~~~~~~~~~~~

    "హలముల మూల బెట్టిరట

    హాలికు లెక్కువ పంటదీయగన్."



    కాలము మారి పోయినది క

    ర్షకు లెల్లరు పాతపద్ధతుల్

    మూలకు పెట్టి పంటలను

    ముచ్చటగా తగు క్రొత్త పద్ధతే

    మేలొన గూర్చుమాకనుచు మే

    దిని టాక్టరుతోడ దున్నుచున్

    హలముల మూల బెట్టిరట

    హాలికు లెక్కువ పంటదీయగన్.

    ~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  33. ఆ.వె//
    పైరు పెరుగకున్న నీరుపోసి తుదకు
    పొలముదున్ని మరల కలుపుబీకి !
    కమిలిన మొలకలకు క్రిములసంహర, హాల
    హలము విడువఁ బంట లధికమగును !!

    రిప్లయితొలగించండి
  34. కలవిల పెక్కు యంత్రములు కర్షక మిత్రులు నూత్నమైన రీ
    తుల వ్యవసాయమున్ సలుప తోషముతోడుత శీఘ్రమౌ గతిన్
    కలుగును హెచ్చు పంటలును కాసులు హెచ్చుగ రాలు నందుచే
    హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్

    రిప్లయితొలగించండి