26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

సమస్య - 3647

27-2-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా”
(లేదా...)
“పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్”
(ఈ సమస్యను పంపిన ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలు)

76 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    బరువౌ తీరున హైద్రబాదు నగరిన్ బంజార హిల్సందునన్
    కరవై యుండగ యోధులే సమరమున్, గాఢంపు ధైర్యమ్మునన్
    పరువుల్ పెట్టుచు కంబుకంఠులిచటన్ పౌషమ్మునన్ గెల్వగా
    పురుషాధిక్యత తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "శ్రీ రాముని దయ చేతను..."

      సరదా పూరణ:

      బరువౌ తీరున హైద్రబాదు నగరిన్ బంజార హిల్సందునన్
      కరవై యుండగ యోధులే సమరమున్, గాఢంపు ధైర్యమ్మునన్
      పరువుల్ పెట్టుచు కంబుకంఠులిచటన్ పౌషమ్మునన్ గెల్వగా
      పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్...

      తొలగించండి
    2. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. సిరులను కోరుచు కొబ్బరి

    తరువులు నాటెను పొలమున, తా నాటినవే

    మరి పోతు చెట్లు కనగన్

    పురుషాధిక్యతయె సిరులఁ బోగొట్టుఁ గదా”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. తరుణుల గరిమల నోర్వక
    సిరులను గూర్చెడి పలుకుల చింతయె లేకా
    త్వరపడి చిక్కుల పాలౌ
    పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా

    రిప్లయితొలగించండి
  4. అరియైభ్రుగువేతన్నెను
    వెఱపన్నదిలేకమదినివెన్నునిరాణిన్
    కరమలిగిసిరియువీడెను
    పురుషాధిక్యతయెసిరులఁబోగోట్టుగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుందండీ, మంచి పూరణ! 👏👏💐💐
      పదాల మధ్య అంతరాయంతో టైపుచేస్తే బాగుంటుంది!

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భృగువే' టైపాటు.

      తొలగించండి
  5. పరులను మోసము జేయుచు
    మురిపించె డి చేష్ట తోడ మోహ వశాన న్
    తరుణము దొరికిన దరి కా
    పురు షాధిక్య మ్మె సిరుల బోగొట్టును గదా !

    రిప్లయితొలగించండి
  6. నిరతము జూదమ్మాడుచు
    సురభిని గ్రోలెడు పతిగల సుభ్రువు తా మం
    థరమున పలికెను సభలో
    పురుషాధిక్యతయె సిరులఁ బోగొట్టు గదా!

    రిప్లయితొలగించండి
  7. కం.
    భరమున బలికెను ద్రౌపది
    "కురువృద్ధులు జూచుచుండ గుంతిసుతులకున్
    నెరసున్న మిగిలె తుదకును
    పురుషాధిక్యతయె సిరులఁ బోగొట్టు గదా!

    రిప్లయితొలగించండి
  8. ౧.
    పరువమునందున పురుషుడు
    కొరుకుడు బడనట్టిమాట కూర్మినిబలుకన్
    కరకున బల్కిన వాడగు
    పురుషాధిక్యతయె సిరులఁ బోగొట్టుఁ గదా!!

    ౨.
    వరమున బుట్టితి ననుచును
    పొరబాటు నుదిద్దుకొనక పోరగ రణమున్
    కొరవడు వీరత్వమ్మున
    పురుషాధిక్యతయె సిరులఁ బోగొట్టుఁ గదా!!

    రిప్లయితొలగించండి
  9. వరమైపుట్టినయాజ్ఞసేనిఁగనివీరానీకముల్సూడగా
    కురువంశంబునపుర్వునైబరగునాకౌటిల్యుదుశ్శాసనుం
    డరిషడ్వర్గపుచేష్టలున్ఁదరుమక్రీడన్నీడ్చెనాతల్లినిన్
    పురుషాధిక్యతతీవ్రరూపమగుచున్ఁబోగోట్టుసౌభాగ్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేష్టలున్' తరువాత అర్ధానుస్వాసం అవసరం లేదు.

      తొలగించండి
    2. అవునండితప్పుజరిగిందిక్షమించగలరు

      తొలగించండి
  10. పరుషంబౌ వచనమ్ములన్ బలుకుచున్ పాంచాలి చేలంబులన్
    దురమున్ లాగగ దుస్ససేనుడు మహాతోషంబుతో
    డన్ సభన్
    కురువృద్ధుల్ కనుగాంచుచున్ శిలలుగా కూర్చుండ
    వారింపకే
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వర గర్వాంధత పైకొని
      పరదారను దొంగలించ పాటున బడడే
      కరకౌ రాముని శరముల
      పురుషాధిక్యమ్మె సిరుల బోగొట్టుగదా

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  11. కందం
    సిరులీయ రాజసూయము
    దరుమయ్య వ్యసనమునోడెఁ దమ్ముల సతి వే
    సరె పల్వెతలన్ జూదరి
    పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా

    మత్తేభవిక్రీడితము
    సిరులున్ గూడఁగ రాజసూయమునఁ దా శ్రీమంతుఁడౌచున్ యుధి
    ష్టరుడున్ దుర్వ్యసనంపు జూదమునహో! సర్వమ్ముఁ గోల్పోయి వే
    సరె భ్రాతల్ సతి వెంట కాననములజ్ఞాతాల తద్ద్యూతకృ
    త్పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్

    రిప్లయితొలగించండి
  12. పురుషాహంకారముతో
    నరయక మంచియు చెడుగుల నతివల యెడలన్
    దురుసుగ పచరించెడు కా
    పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. మ:

      మొర నాలోకన చేయ కుందురటనో మొత్తంగ స్త్రీజాతినున్
      సరియై యొప్పగ సర్వకార్యములనున్ చక్కంగ సాగింపనై
      మరి చేకూర్చరు ? స్వేచ్ఛ నన్నిటను దామాషా న సారూప్యమున్
      పురుషాధిక్యత తీవ్ర శాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యముల్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి


  14. చిరునవ్వులపోగొట్టును
    పురుషాధిక్యమ్మె, సిరులఁ బోగొట్టుఁ గదా,
    గరితల యాడంబరమై
    న రివాజులు! సుదతి వినవె నాదుపలుకులన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. పరమశివు అర్ధభాగము
    నరలోకమునకు వెలుగులు నారీమణులే
    మెరుపులు వారివి కూడని
    పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా

    రిప్లయితొలగించండి
  16. సమస్య :
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్
    బోగొట్టు సౌభాగ్యమున్

    ( కేవలం మగవారే కావాలనుకొంటే ప్రపంచం నడచేనా ? )

    వరుసన్ బుత్రులె యోగ్యులంచుదమభా
    వంబందు నిర్దుష్టులై
    పరుషంబౌ క్రియ భార్యలన్ బరిపరిన్
    బాధించి వేధింతురే ?
    వరమౌ అక్కలు, నమ్మలున్, సుతలు, న
    వ్వల్ , నానమల్ లేనిచో
    బురుషాధిక్యము తీవ్రశాపమగుచున్
    బోగొట్టు సౌభాగ్యమున్ .

    రిప్లయితొలగించండి
  17. అరువుగనైన మనము బం
    గరు నగ బొందుదమనంగ గాతాళముగన్
    తరుణుల బెడచెవి బెట్టెడు
    పురుషాధిక్యతయె సిరులఁ బోగొట్టుఁ గదా

    రిప్లయితొలగించండి
  18. తరుణుల్ రాజ్యము లేలెడి
    తరుణమునన్ కొలువు నీకు తగదని భార్యన్
    వరుడడ్డగించు నెడ నా
    పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా”

    రిప్లయితొలగించండి
  19. మరి జన్మంబులునివ్వగా వలయు స్త్రీ , మందార మొగ్గంటి కా

    పుర పుష్పమ్ము వికాశమవ్వగను స్త్రీ మూర్తుల్ సదా కావలెన్

    నరుడా బిడ్డగ బాలికేల వలదో నాయమ్ము తెల్పంగరా

    పురుషాధిక్యత తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మొగ్గంటి'... వంటిని అంటి అనరాదు. 'కాపుర పుష్పమ్ము' సాధు సమాసం కాదు. సవరించండి.

      తొలగించండి



  20. జరగండీ! జరగండి! దెప్పుదురె పూజారుల్! జనుల్ స్వామి మో
    ము రవంతైనను చూడ సాధ్యమవదే! మూఢత్వమెంతేనియున్!
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్!
    సరియై నట్టి విధానమిద్దియకొ? మార్చంగన్ వరిష్ఠమ్మగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. చెరిసగమై నాకసమున
    సిరిజేఱగదిద్దినారుజిత్రపువసుధన్,
    భరియించనివక్రంబౌ
    పురుషాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సగమై యాకసమున' అనండి. 'సగమైన +ఆకసమున' అనుకుంటే సంధి లేదు. "సగమగు నాకసమున" అనవచ్చు.

      తొలగించండి
  22. వరమౌ నింతులె పూరుషాళికిల సంభావింప కౌద్ధత్యమున్
    పరుషంబౌ పదజాలమున్ నిరతమున్ బాధింపగా వారలన్
    పురుషార్థంబులు పుణ్యమున్నుడుగు వాపోవంగ నింకేటికిన్
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్

    రిప్లయితొలగించండి
  23. బరువులు మోయుచు నోర్పుగ
    నిరతము పరిచరముజేసి నిందలు పడి కా
    పురములు జేయు సతులపై
    పురుషాధిక్యమ్మె సిరుల బోగొట్టు గదా

    రిప్లయితొలగించండి
  24. గరువము నొందక విను,కా
    పురుషాధిక్యమె సిరుల బోగొట్టుగదా
    యెఱుగుము తక్కువ బలుకుచు
    నరయంగా జేయదగును నధికపు పనులన్

    రిప్లయితొలగించండి
  25. నిరతం బుండ వ్యయమ్మున
    నిరతి పరులఁ గని కడింది నెలఁతల కిల ని
    ష్కరుణ వెస పరిహరించినఁ
    బురు షాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా


    ఖర శిక్షానుచి తాన యాధిక కర గ్రామాది తాపమ్ములం
    బుర దేశ స్థిత మానవ ప్రకరమే మున్గంగఁ గ్లేశాబ్ధిలో
    నర నాథాన్వయ జాత దుష్ట తమ సంతాన వ్ర జాత్యంత కా
    పురు షాధిక్యము తీవ్ర శాప మగుచుం బోగొట్టు సౌభాగ్యమున్

    రిప్లయితొలగించండి
  26. ధరణిన్ స్త్రీలను సంతతమ్ముకని ప్రాధాన్యమ్ము నియ్యన్ దగున్
    స్థిరమౌ రీతిని సాగ సంసరణమీ క్షేత్రమ్ములో చక్కగా
    నరకమ్మున్ కలిగించి భార్యలకు, నన్యాయమ్ముగా సాగు నా
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్


    రిప్లయితొలగించండి
  27. ~~~~~~~~~~~~~~~~~
    కురు రాజేంద్రుడు ద్రౌపదీ వలు
    వలున్ గ్రూరాత్ముడై యందరున్
    బరమాశ్చర్యము జెంద విప్పె
    సభలో పాపాంధుడై సత్యమీ
    "పురుషాధిక్యము పూర్ణ శాప మ
    గుచున్ బోగొట్టు సౌభాగ్యముల్"
    మరణించె నతండాలమందు
    నిజమేమర్యాద పాటింపకన్.
    ~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  28. పరులన్ దూషణ జేయుచున్ నొగిని పాపాలన్ దగన్జేయు,కా
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్
    గరమున్ జేయుచు గర్మలన్ దనరగా గాఢంపుగా,గాక,దా
    సరసంబౌవిధమొప్పగా బలుక శాస్త్రార్ధంబులింపౌగదా

    రిప్లయితొలగించండి
  29. కరుణాహీనుడు ధూర్త మానసుడు భుక్తాయాస మాంసాశనుల్
    దరుణుల్వేవుర బెండ్లియాడి బలు వాదాడంభరాహార్యులై
    నెరులున్ దంష్ట్రలు మారి యూడినను ప్రాణేశుండు భోగించుచో
    *పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్”*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యంలో వచనదోషమున్నది. "కరుణాహీనులు ధూర్తమానసులు..." అనండి.

      తొలగించండి
  30. సురభిన్ గోలి భుజిష్యలన్ గలియుచున్ జూదమ్ములే యాడెడిన్
    మొరకుండొక్కడు భర్తగా గలిగి యా పూబోణియే నేడు తా
    బురుషద్వేషిగ మారి చెప్పెనిటులన్ భూగోళమందున్ గనన్
    పురుషాధిక్యము తీవ్రశాపమనుచున్ బోగొట్టు సౌభాగ్యమున్.

    రిప్లయితొలగించండి
  31. ధరలో నాలూ మగలును
    సరిసమముగ కష్టపడుచు సంపాదించన్
    భరియింపక నిందించిన పురుషాధిక్యముసిరులనుపోగొట్టుగదా

    రిప్లయితొలగించండి