27, ఫిబ్రవరి 2021, శనివారం

సమస్య - 3648

28-2-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆద్యంత రహిత కథ విన నానందమగున్”
(లేదా...)
“ఆద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా”

73 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పద్యంబందున పూరణన్ పలుకగా బ్రహ్మాండమౌ రీతినిన్👇
    సేద్యంబుల్ కడు జేసెడిన్ ప్రజలహో చెండాడగా నేతలన్
    చోద్యంబొప్పగ రాజకీయ సరణిన్ జోకుల్ సదా కూడునా
    యాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా...

    రిప్లయితొలగించండి
  2. పద్యముననాదికననా
    రాధ్యముసంవేద్యమునుగరాణింపంగా
    హ్రుద్యముకవులకుఁజూడగ
    ఆద్యంతరహితకథవిననానందమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పద్యంబనాది కన నా
      రాధ్యము సంవేద్యమగుచు రాణింపంగన్
      హృద్యము..." అనండి.

      తొలగించండి
    2. సరిదిద్దుకుంటానుగురువుగారు

      తొలగించండి
  3. పద్యమ్ము పల్కలేనయ

    గద్యమ్మును ఘోషగ పలుకంగలనటరా

    హృద్యంబుర హరుడా , నీ

    ఆద్యంత రహిత కథ విన నానందమగున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  4. పద్యముననాదికననా
    రాధ్యముసంవేద్యమునుగరాణింపంగా
    హ్రుద్యముకవులకుచూడగ
    ఆద్యంతరహితకథవిననానందమగున్

    రిప్లయితొలగించండి
  5. హృద్యంబౌకథనంబునద్భుతపుసాహిత్యాంశమున్నప్పుడే
    వేద్యంబౌననిబాలబాలికలువైవిధ్యంబువాంఛింతురం
    చాద్యుల్ జానపదంబు మెచ్చిరి మనస్తత్వజ్ఞులిట్లందురే
    *యాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా”*

    రిప్లయితొలగించండి
  6. సద్యోజాతమునట్టులన్వినగనాసామంబుగానంబులన్
    హ్రుద్యంబయ్యెనురాముగాధభువిలోరుగ్వేదసారంబిదే
    విద్యావంతులువేలుపుల్మనసునావాసంబుగానిల్చెగా
    ఆద్యంతంబులులేనిగాధవినబ్రహ్మానందమబ్బున్గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "హృద్యంబయ్యెను... ఋగ్వేదసారంబిదే..." అనండి.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సద్యశమును గూర్చెడినౌ
    హృద్యపు హరి లీలలెల్ల నెంచుచు తీరున్
    యుద్యమితమై దిసించెడు
    ఆద్యంత రహిత కథ విన నానందమగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీరున్+ఉద్యమిత' మన్నపుడు యడాగమం రాదు. 'దిసించెడు'?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. దిసించు= ప్రకాశించు/ అతిశయించు అనే అర్థంలో వాడాను.

      తొలగించండి
  8. సమస్య :
    ఆద్యంతంబులు లేని గాథ విన బ్ర
    హ్మానంద మబ్బున్ గదా

    ( మహావిష్ణుమహిమాభివర్ణనారమణీ
    యమూ , సర్వజీవసమభావకమనీయ
    మూ అయిన గాథ వింటే బ్రహ్మానందం లభిస్తుంది . )

    హృద్యంబైనది ; విష్ణుదేవుని మహా
    కృత్యాన్వితంబై సదా
    వేద్యంబైనది ; వెంట వెంట దలపన్
    వేదాంతవిజ్ఞాననై
    వేద్యంబైనది ; సర్వజీవసమభా
    వేచ్ఛాసమారూఢమౌ
    నాద్యంతంబులు లేని గాథ ; విన బ్ర
    హ్మానంద మబ్బున్ గదా !

    రిప్లయితొలగించండి
  9. మద్యము గ్రోలుచు జెప్పరె
    ఆద్యంత రహిత కథ విన :నానంద మగున్
    పద్యముల లో రచించిన
    హృద్యపు కథను చదువిన హితకర మగుచున్

    రిప్లయితొలగించండి
  10. మద్యము తాగిన వానిని
    పద్యము పుట్టుకనుగూర్చి పలుకుమనంగన్
    సద్యము కల్పించినదౌ
    ఆద్యంత రహిత కథ విన నానందమగున్

    రిప్లయితొలగించండి
  11. ఆధ్యాత్మిక మందుననా
    సద్యోజాతపుకథలను శ్రావ్యముగ వినన్
    హృద్యంబగునట్టిదగుట
    ఆద్యంత రహిత కథ విన నానందమగున్

    రిప్లయితొలగించండి
  12. కందం
    మద్యము గ్రోలుచు మిత్రులు
    విద్యాదుల మఱచి తూగి వృత్తాంతమనన్
    హృద్యమ్మన తమలో తమ
    యాద్యంత రహిత కథ విన నానందమగున్

    శార్దూలవిక్రీడితము
    మద్యమ్మందుచు గూడి మిత్రులహహోమైకమ్మునన్ దూలుచున్
    విద్యాదుల్ మది విస్మరించి వదరన్ వృత్తాంతముల్ బేనఁగా
    హృద్యమ్మంచునుఁ దామె తామెతమలో హేలాగతిన్ వారికే
    యాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. శా:

      విద్యాభ్యాసము నెంత జేసినను సంవేద్యమ్ము శేషించుచున్
      సద్యంబై వెలుగొందుచుండును గదా సాధించ సంప్రాప్తమై
      హృద్యమ్మీ విధి జీవితాంతమననై హెచ్చేమి కాకుండగా
      నాద్యంతంబులులేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హృద్యంబై వెలుగొందుచున్ ఘనముగా నీరేడు లోకాలలో
    నాద్యోతమ్ముల నొప్పగించుచు సదాచారాది ధర్మమ్ములన్
    విద్యోతించుచు శౌరి లీలలు సదా వెల్వుచ్చునుండంగనౌ
    నాద్యంతంబులు లేని గాధ విన బ్రహ్మానందమబ్బున్గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. హృద్యంబై వెలుగొందుచున్ ఘనముగా నీరేడు లోకాలలో
      నాద్యోతమ్ముల నొప్పగించుచు సదా న్యాయాది ధర్మమ్ములన్
      విద్యోతించుచు శౌరి లీలలు సదా వెల్వుచ్చునుండంగనౌ
      నాద్యంతంబులు లేని గాధ విన బ్రహ్మానందమబ్బున్గదా!

      తొలగించండి
  15. పాద్యము భాగవతమునకు
    సాధ్యమగును ముక్తినిలను, సాధకులకిలన్
    మాధ్యమము హరి పదములకు
    ఆద్యంత రహిత కథ విన నానందమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దధ ప్రాసను 1:3 నిష్పత్తిలో ప్రయోగించాలి. 2:2 నిష్పత్తిలో కాదు.

      తొలగించండి
    2. పాద్యము భాగవత కథకు,
      సాధ్యమగును పరమపదము సాధకులకిలన్,
      వైద్యము భవరోగమునకు,
      ఆద్యంత రహిత కథ విన నానందమగున్

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. 'సం।వేద్యంబై...' పాదానికి కొనసాగింపు లేదు. సవరించండి.

      తొలగించండి
  17. విద్యారంభముఁదొలుతన
    సద్యోజాతునిదలపగసద్యోంకారమ్,
    బద్యముగద్యముఁగవితల
    నాద్యంత రహిత కథ విన నానందమగున్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  18. హృద్యంబై పరభక్తిసంకలితసంశ్రేయఃప్రపన్నాప్తమై
    సద్యోరక్షణముక్తిదాయకసదాశ్చర్యప్రదాఖ్యానమై
    సద్యోగార్తిసులభ్యమానపృథువిశ్వాకారసాకారచో
    ద్యాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి


  19. చోద్యంబేను చినబ్బా!
    ఆద్యంత రహిత కథ విన నానందమగున్?
    వేద్యమ్ము కానిదయ్యా!
    పద్యమ్మును పూర్తి సేయ భళిసరి యంతే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. కె.వి.యస్. లక్ష్మి:

    సద్యసమగు హరి చరితము
    ఆద్యంతము పాడుచు మరి నాడుచు తెలుపన్
    హృద్యంబది కనగను మది
    ఆద్యంత రహిత కథవిన నానందమగున్.

    రిప్లయితొలగించండి
  21. మద్యము ద్రాగిన నతడనె
    నాద్యంతరహిత కధవిన నానందమగున్
    నాద్యంతరహిత మీయదు
    నాద్యంత సహిత కధవిన నానందమగున్

    రిప్లయితొలగించండి
  22. ఆద్యంతంబులు లేనిగాధ వినబ్రహ్మానంద మబ్బున్ గదా
    యాద్యంతంబులు లేనివానిపలుకే,యాశ్చర్యమున్ బోకుమా
    యాద్యంతంబులు గల్గుగాధ వినబ్రహ్మానంద మబ్బున్ గదా
    యాద్యంతంబులు లేని వస్తువులిలన్ హాచూచితేమీరెటన్

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. సద్యో వరప్రదా తా
      విద్యా సర్వఘ్న వేద విద్యా జ్ఞాన
      ప్రోద్యజ్జన రక్షణ నిర
      తాద్యంత రహిత కథ విన నానంద మగున్

      [ఆద్యంత రహితులు = శివకేశవులు]


      పద్యామ్నాయ సగద్య సంకలిత సద్భావైక చారిత్ర సం
      వేద్య జ్ఞానద మోక్ష కారక మహా విష్ణు స్తుతి ప్రోక్తమున్
      స ధ్యా నాత్మ నివేదనా కలిత సుస్వాంతప్రభా భక్తితో
      నాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      మీ వంటివారు కూడ స్వవర్గజ ప్రాస (ద-ధ) ప్రయోగించడం పానకంలో పుడకలా అనిపించింది.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      చాలా సేపు సందేహించితి నండి. కాని ధ్యానము పదమును వీడ లేక నన్నయ గారి పద్యమును జూచి వ్రాసితినండి.

      తొలగించండి
    4. స్వవర్గజ ప్రాసను బరిహరించి చేసిన పూరణము:

      పద్యామ్నాయ సగద్య సంకలిత సద్భావైక చారిత్ర సం
      వేద్య జ్ఞానద మోక్ష కారక మహా విష్ణు స్తుతి ప్రోక్తమున్
      హృద్య ధ్యాన నివేదనా కలిత చిత్తేద్ధ ప్రపత్తిన్ సదా
      యాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా

      తొలగించండి
  24. సద్యోజాతుడు లింగరూపమున విస్తారింపగానంతటన్
    ఆద్యంతంబుల నెంచగా విఫలమైరా బ్రహ్మ విష్ణ్వాదులే
    ప్రద్యోతంబగునా మహాశివుని భవ్యాద్వైత తత్వార్థముల్
    ఆద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా

    రిప్లయితొలగించండి
  25. హృద్యంబగు హరి లీలలు
    యాద్యంతములేనివానియవతార కథల్
    వేద్యంబౌ నిహముపరము
    నాద్యంత రహిత కథ విననానందమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'లీలలు+ఆద్యంతము' అన్నపుడు యడాగమం రాదు. "హృద్యంబగు లీలలు హరి । వాద్యంతము.." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  26. హృద్యమగు పద్యములతో
    మద్యము గ్రోలెడి తరుణము మైత్రుల తోడన్
    విద్యాహీనుడు చెప్పెడి
    యాద్యంత రహిత కథవిన నానందమగున్.

    రిప్లయితొలగించండి
  27. ఆద్యంతమ్ములు లేనివాడు శివుడవ్యక్తుండతండే కదా
    సద్యోజాతుడు చంద్రశేఖరుడు ప్రాజంగమ్ముఁగీర్తించుచున్
    విద్యావంతుడొకండు చెప్పెసభలో విశ్వేశ్వరున్ లీలలన్
    ఆద్యంతంబులు లేనిగాథవిన బ్రహ్మానందమబ్బున్ గదా!

    రిప్లయితొలగించండి
  28. విద్యాదా యనియైన శార దనునేవేడన్ వడిన్ మాతయున్
    సద్యస్ఫూ ర్తినికల్గజేయుచును శ్రీసంకర్షుణున్ గూర్చియున్
    చోద్యంబౌనటులన్సతంబువిడకన్ చూడంగ నేదెల్పగన్
    నాద్యంతంబులులేనిగాథవిన బ్రహ్మానందమబ్బున్ గదా.

    రిప్లయితొలగించండి
  29. హృద్యంబౌహరికథలవి
    చోద్యంబనిపిం చుచుండు శ్రోతల కెపుడున్
    సద్యస్ఫూర్తితొ చెప్పెడు
    నాద్యంత రహిత కథ విన నానంద మగున్

    రిప్లయితొలగించండి