2, జూన్ 2021, బుధవారం

సమస్య - 3740

3-6-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు”
(లేదా...)
“కడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్”

62 కామెంట్‌లు:

 1. తేటగీతి
  అక్కరోన బాధితులన నందినంత
  దోచుచుండఁగ వైద్యులు దుయ్యఁబట్టి
  ప్రభుత మేల్కొల్పిరే! కాని పనుల పట్ల
  కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మత్తేభవిక్రీడితము
   దడఁ బెట్టంగ కరోన, బాధితులతో దాక్షిణ్య హీనమ్ముగన్
   ముడుపున్ గుంజెడు వైద్య బృందములపై పోరన్ బలోపేతులై
   దడియన్ జేసిరి మేల్కొనన్ బ్రభుత! దుర్దాంతాదులన్ వంచగన్
   గడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. స్వార్థ మెరుగని వారు ని స్వార్థ పరులు
  ప్రగతి మార్గము పట్టెడు రాష్ట్ర జనులు
  అక్రమ పనులు గాంచియు నాగ్రహించు
  కఠిన చిత్తులు గద తెలంగాణ ప్రజలు

  రిప్లయితొలగించండి
 3. సౌమనస్యంబువిడనాడిసౌరులేక
  రోగతప్తులరానీనిరోగమంట
  కుందుచుండిరిభీతులైకుమతులటుల
  కఠినచిత్తులుగదతెలంగాణప్రజలు

  రిప్లయితొలగించండి
 4. దైత్యులు ముని జనులకునత్యంత శతృలు

  కఠినచిత్తులు గద ; తెలంగాణ ప్రజలు”

  కొలుచు ప్రహ్లాదు కాచిన కొండనున్న

  నారసింహుని సాక్షిగ నమ్మరయ్య

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 5. పడుగున్పేకలయట్టులన్కలియనాభాయీయెనాంధ్రుండునౌ
  విడిగామేమునునుండజాలమనచున్వేగంబభేదంబుతో
  వడిగావేరుగకాపురంబునకుఁబోవారంతకుట్రన్గడున్
  కడుకాఠిన్యమనస్కులౌదురుతెలంగాణప్రజల్సూడగన్

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  [తెలంగాణ ఉద్యమం కొనసాఁగుతున్న సందర్భాన ఒక సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను గూర్చి పలికిన సందర్భము]

  "విడువన్ నేరక రాష్ట్రలబ్ధి నెపుడున్, బ్రేమించుచున్ రాష్ట్రమున్,
  వడిగా నెన్నియొ నుద్యమమ్ము లొదవన్, బౌరుల్ దగన్ మేల్కొనన్,
  గడనల్ సేయఁగఁ గార్యదక్షతఁ దెలంగాణమ్మునుం గెల్చుచోన్

  గడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్!"

  రిప్లయితొలగించండి

 7. జ్ఞానులు విశేక శీలురు దానగుణము
  గలిగి చరియించు విబుధులు ఘనులు వారె
  మానవత్వమె లేని దుర్మతుల పట్ల
  కఠిన చిత్తులు గద తెలంగాణ ప్రజలు.


  చెడుభావంబుల చేరనీరట మదిన్ క్షేమంబు నే గోరుచున్
  బడుగుల్ పేదల బాధతీర్చుచు సదా వాత్సల్యమున్ జూపినన్
  గడెకారుల్ దురితమ్ములన్ సలుపినన్ గారుణ్యమున్ జూపకన్
  గడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణాప్రజల్ సూడగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   "...జూపకే.." అనండి.

   తొలగించండి
 8. ఎన్ని యవరోధములు తమ కెదురు పడిన
  లెక్క చేయక ముందుకు మొక్కవోని
  పట్టుదలతోడ సాగెడు దిట్టలౌర!
  కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు

  రిప్లయితొలగించండి
 9. బడుగుల్ బెద్దలు నేకమై కదల సంప్రాప్తించె నీరాజ్యమే
  కడకా కేంద్రదయోపలబ్ధము తెలంగాణానె సాధింపగా
  కడకూహింపని రీతినన్ మనుషులాకాంగ్రేసు నోడించిరే!
  కడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సర్వజన మేకమగుచు నైజాము నడచి
   నటులె, మిడిమాలపుదొరల నైన బనిపి
   కడకు చరితహీనులఁజేయ గలరు, కనఁగ
   కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. సమస్య :

  కడు కాఠిన్య మనస్కులౌదురు తెలం
  గాణా ప్రజల్ సూడగన్

  ( సౌజన్యమూర్తులు తెలంగాణా ప్రజలు )

  ఇడుముల్ బెక్కుల బొందినారుగద దు
  ష్టేచ్ఛానియంతృత్వ మూ
  ఢుడు ధూర్తుండు నిజాముచే ; దలచినన్
  డోకుల్ మహాచింతలే ;
  నడతల్ మంచివి కాని యట్టి సమతా
  నాశంకరుల్ గన్పడన్
  గడు కాఠిన్యమనస్కులౌదురు తెలం
  గాణా ప్రజల్ సూడగన్ .

  రిప్లయితొలగించండి
 11. చెడు గావించెడు వారిపైన, గ
  లికమున్ శీలంబు లేనట్టి దో
  పిడి జేయించెడు వారిపై,ఖలుల
  పై ,విశ్వాసమున్లేని యీ
  పుడమిన్ ద్రోహమొనర్చు నే
  తలపయిన్, ముక్కోపులై వేగమే
  కడు కాఠిన్య మనస్కులౌదురు
  తెలంగాణా ప్రజల్ గాంచగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వారిపై గలికమున్" అనండి. లేకుంటే గణభంగం.

   తొలగించండి
 12. మ:

  తడ వాట్లెన్నియె దాటుచున్ కడకు సంధానించి పెక్కండ్రురున్
  సడలం జేయక పట్టు నల్ దిశల విశ్వంబెంచ సంబద్ధమై
  విడుపున్ బొందిన రాష్ట్రమై వెలుగ ; కవ్వించంగ పూర్వస్థితిన్
  కడు కాఠిన్య మనస్కు లౌదురు తెలంగాణా ప్రజల్ సూడగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 13. వడిగా వేరొక రాష్ట్ర సాధనమునన్ ప్రాప్తించు సౌఖ్యంబనిన్
  విడిగా సఖ్యతగామెలంగుటయె సంప్రీతంబుగా నెంచితా
  మెడబాటున్ మదినోర్చి సోదరులతో నీరీతి వేరైతిరే
  కడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

   తొలగించండి
  2. మారుస్తాను గురుదేవా!

   వడిగా వేరొక రాష్ట్ర సాధనమునన్వారొంద నభ్యున్నతిన్
   విడిగా సఖ్యతగామెలంగుటయె సంప్రీతంబుగా నెంచితా
   మెడబాటున్ మదినోర్చి సోదరులతోనీరీతి వేరైతిరే
   కడుకాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్

   తొలగించండి
 14. నిధులు నీరు నియామక నిర్ణయముల
  పయిన జాప్యమొనర్చెడి పాలకదొర
  కెంతయు శ్వాసను సలుప నీయకుండు
  కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు

  రిప్లయితొలగించండి
 15. తే.గీ//
  బుధజన విధేయులైనను పుణ్యభువిన
  మక్కువగలిగి రాష్ట్రపు మాన్యులందు !
  తిక్కగను మాటలాడెడి తీరునుగన
  కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు !!

  రిప్లయితొలగించండి
 16. విడువన్ నేరరు మంచివారి నెపుడున్, బీరమ్ములన్ దూలుచో
  అడుగంటన్ వడి ద్రొక్కుచో విడుతురే యత్యుగ్రయోధాళులై
  బడుగుల్ కుమ్రము భీము లైలమలునై భావించ కేస్యారులై
  కడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 17. పడిలేచెన్మునునుద్యమంబుఘనబార్శ్వంబైతెలంగాణలో
  వడిగాదిక్కులునొక్కటైఁబలుకసంపాదించెరాష్ట్రంబనన్
  విడిగాదెల్పగమానవత్వమునుసంవేదమ్ములన్వీడుచో
  కడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 18. ధన్యోస్మి గురుదేవా!
  తే.గీ//
  బుధజన విధేయులైనను పుణ్యభువిని
  మక్కువగలిగి రాష్ట్రపు మాన్యులందు !
  తిక్కగను మాటలాడెడి తీరునుగన
  కఠినచిత్తులు గద తెలంగాణ ప్రజలు !!

  రిప్లయితొలగించండి
 19. మడులన్ దున్నుచు మంచిపంట గొనుచున్ మర్యాదగానుందు రే
  దుడుకున్ జూపరు భిన్నవర్గములపై, తోడ్పాటు నందింతు రె
  ప్పుడు క్షేత్రమ్ముల పొంది జీవితము పెంపొందింప, చిఱ్ఱూనినన్
  కడు కాఠిన్యమనస్కులౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్

  రిప్లయితొలగించండి
 20. కడు కష్టంబులకోర్చి నిల్చిరి తెలంగాణా ప్రజల్ పోరునన్
  కడు ప్రాణంబులు నష్టమాయెను గదా కాదన్ననవ్వారలే
  కడు కాఠిన్యమనస్కులౌదురు; తెలంగాణా ప్రజల్ సూడఁగన్
  కడు స్నేహప్రియులై చరింత్రు సతమాకాంక్షింతురభ్యున్నతిన్

  రిప్లయితొలగించండి
 21. మ:

  కలసాధించగ నెంచి పట్టు దలతో కార్యార్థులై ప్రాణముల్
  విడువంగన్ వెను దీయకుందురు గదా వేధింపులన్ సైచుచున్
  కడ దాకన్ తలలెత్తి పోరు సలుపన్ కౌ గట్టి వెన్నాడనై
  కడు కాఠిన్య మనస్కు లౌదురు తెలంగాణా ప్రజల్ సూడగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 22. స్వామి భక్తిని నిల్పుచు సంతతంబు
  వాని యాజ్ఞ దృఢమ్ముగ వఱల డెంద
  మందుఁ గర్తవ్య పాలన మందుఁ గాంచఁ
  గఠిన చిత్తులు గద తెలంగాణ ప్రజలు


  పుడమిం గాంచఁగ మానవౌఘము సతంబున్ స్వీయ లాభమ్మునే
  యెడఁదన్ నిల్పి చరించు నిక్కముగ లేదిం దెట్టి సందేహమే
  సడలం బ్రేముడి నాయకవ్రజపు వాక్చాతుర్య బద్ధాత్ములై
  కడు కాఠిన్య మనస్కు లౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్

  రిప్లయితొలగించండి
 23. అచ్చమైన మనము తోడ నాదరమ్ము
  గనబఱచెడి వారు; దురిత జనుల నడ్డ
  గించ స్వపర వ్యత్యాసము లేవి గొనని
  కఠిన చిత్తులు కద తెలంగాణ ప్రజలు!

  రిప్లయితొలగించండి
 24. దారి దోపిడి జేసెడువారి గురిచి
  యక్కడక్కడ నిఘాల నందుబాటు
  ననునిచితగుశిక్షవలన నయముజేయ
  కఠిన చిత్తులుగద తెలంగాణ ప్రజలు

  రిప్లయితొలగించండి
 25. పడిగాపుల్ బడి రోడ్లమీదననె సంభావ్యంపు టుద్యోగమున్
  నెడదన్ భక్తిని రక్తినిన్ నిలుపు నాయింపారు పోలీసులే
  విడువండెవ్వరినైనగానిమఱి వేవేలంగ బ్రార్ధించనౌ
  గడుగాఠిన్యమనస్కులౌదురుతెలంగాణా ప్రజల్ సూడగన్

  రిప్లయితొలగించండి
 26. స్వంతరాష్ట్రము కోరుచు శాంతి తోడ
  పోరు వీడకను సలిపి భూరి గాను
  కలను సాధించుకొనిరంతెకాని కారు
  కఠిన చిత్తులు, గద తెలంగాణ ప్రజలు

  రిప్లయితొలగించండి