23, జూన్ 2021, బుధవారం

సమస్య - 3761

24-6-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంద్రసతి భానుమతి మ్రొక్కె నెల్లరకును”
(లేదా...)
“ఇంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్”

53 కామెంట్‌లు:

 1. తనయుపెండ్లినిఁజూడంగతరలివచ్చు
  రాజులందరియెదుటనురాజసముగ
  వీరురారాజుభార్యగావేడ్కనవని
  నింద్రసతిభానుమతిమ్రోక్కెనెల్లరకును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. కాని పూరణ యొక్క భావం అవగతం కాలేదు.

   తొలగించండి
  2. పెండ్లికివచ్చినఅతిధులకునమస్కరించుటఅనుభావములోవ్రాసితిని

   తొలగించండి
 2. క్రమముగా

  సంద్రము జిల్కబుట్టినది చక్కని వృక్షము గొన్నదెవ్వరో?
  ఇంద్రుని పుత్రునిన్ గెలువ నెంచిన వీరుని భార్యయెవ్వరో
  చంద్రుని మించుమోముగల చక్కని ద్రౌపది కృష్ణుడాదిగా
  ఇంద్రుని భార్య, భానుమతి ,యెల్లరకున్ బ్రణమిల్లె
  భక్తితోన్

  రిప్లయితొలగించండి

 3. మౌఖిక పరీక్ష యందున మగువ తెలిపె
  లక్ష్మి భర్తయె శ్రీ హరి, లలన గౌరి
  శంకరునిసతి యంచును శచియె కాదె
  ఇంద్రసతి, భానుమతి మ్రొక్కె నెల్లరకును
  చివర తనవిజయానికి చిహ్నముగను.

  రిప్లయితొలగించండి
 4. సమస్య :

  ఇంద్రుని భార్య భానుమతి
  యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

  ( కౌరవసభలో రారాజు పత్ని భానుమతి ప్రవేశించి ప్రజలకు అభివాదనం కావిస్తున్నది )

  ఉత్పలమాల
  ------------

  చంద్రుని వంశ్యుడై గదను
  జక్కగ ద్రిప్పు సుయోధనున్ ఘనుల్
  సాంద్రత జుట్టుముట్టి తమ
  సర్వసమర్పణ జేయు దమ్ములున్ ;
  సంద్రము నంత భక్తి గల
  సభ్యులు గాంచుచునుండ ; ధీరరా
  జేంద్రుని భార్య ; భానుమతి
  యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్ .

  రిప్లయితొలగించండి
 5. తెలుపుము రయముగా శచీ దేవి యెవరొ,

  రాజరాజు సతి యెవరు,రాము
  డేమి,

  చేసె మకుటమున్ బెట్టగా శిరము పైన

  ఇంద్రసతి, భానుమతి, మ్రొక్కె నెల్లరకను

  రిప్లయితొలగించండి
 6. నహుషుడు దరి చేరగ రాగ నలత చెందె

  ఇంద్రసతి ; భానుమతి మ్రొక్కె నెల్లరకును

  కురుకులాభి వృధ్ధిని కోరు వారలకును

  కౌరవ కుల వినాశకు కరము పట్టి

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 7. క్రమాలంకారంలో -----
  దేశికా !తెలుపు ము శచీ దేవి యెవరు?
  ఎవరు దుర్యోధనుని సతి యెఱుక పరచు?
  ఏమి చేసె రాముడు వని కేగు వేళ?
  ఇంద్ర సతి : భానుమతి : మ్రొక్కె నెల్లరకు ను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...దేవి యెవ్వ । రెవరు... పరచు । మేమి...వేళ। నింద్రసతి.." అనండి. (పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి)

   తొలగించండి
 8. రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. 1. సహదేవుని కురు వరేంద్రుఁ డన రాదండి. కౌరవేంద్రుఁ డన వచ్చును. కురువు చక్రవర్తి. యతని వంశము వారు కౌరవులు. ధర్మరా జాదులు దుర్యోధనాదు లిరువురుఁ గౌరవులే.
   2. ఈ సహదేవుని భార్య విజయ, యీమె యందుఁ బుట్టిన సుతుఁడు సుహోత్రుఁడు.

   తొలగించండి
  3. కురు వరేంద్రుఁడు. ఒక విధముగా సాధువే. కురు వంశమందు గొప్ప వారిలో గొప్పవాఁడు. రఘువరుని వలె.

   తొలగించండి
  4. తేటగీతి
   వలచి సహదేవుఁడందరి పదములంటి
   చక్రి పినతండ్రి కూతును సతిగఁ గొనఁగ
   సంతసంబునందుచు జరాసంధ సుత వ
   రేంద్రసతి భానుమతి మ్రొక్కె నెల్లరకును

   ఉత్పలమాల
   ఉత్పలమాల
   సాంద్ర పరాక్ర మోన్నతుడు సద్గుణుడౌ సహదేవుడచ్చటన్
   చంద్ర ముఖాన్వితన్ గొనఁగ చక్రికి చెల్లెలి వావియౌననన్
   చంద్రిక జీవితానికను సంస్మరణన్, మగధంపురాజ పు
   త్రేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

   తొలగించండి

 9. ఇంద్రజ చిత్రరాజములనింపుగ పేర్చితి రమ్మనంగనే
  చంద్రిక యామె మిత్రులును సంతస మందుచు కాంచి రచ్చటన్
  చంద్రధరుండు పార్వతిని చక్రిని నాశచి దేవి యామెయే
  యింద్రుని భార్య, భానుమతి యెల్లరుకున్ బ్రణమిల్లె భక్తితోన్.

  రిప్లయితొలగించండి
 10. చంద్రునివంటిమోముగలచానకుతోడుగరాజసంబునన్
  సంద్రముఁజుట్టినట్టిధరసామమునేలెడిరాజరాజునై
  సాంద్రముగాగపౌరుషముచయ్యనజూపుసుయోధనున్ధరన్
  ఇంద్రునిభార్యభానుమతియెల్లరకున్బ్రణమిల్లెభక్తితోన్

  రిప్లయితొలగించండి
 11. ( వర లక్ష్మీ వ్రతమునకు వచ్చిన పేరంటాళ్ళకు, ఇంద్రుని భార్య, శచీ దేవి మరియు భాను మతి ఆహ్వానము పలపకుతున్నారు)

  చంద్రుని చెల్లి నోములను చక్కగ సేయగ వాణి పార్వతుల్

  మంద్రపు మంత్ర ఘోషలటనంబరమంటగ , పేరటాలుకున్

  సంద్రపు చల్ల గాలులును చక్కని పువ్వుల సౌరభమ్ముతో

  ఇంద్రుని భార్య , భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 12. విప్రనారాయణ నగాసు విస్తృతముగ
  సిరులు గురిపించ , జలన జిత్ర దర్శ
  కేంద్రసతి భానుమతి మ్రొక్కె నెల్లరకును
  శతదినోత్సవ పండుగ సమయమందు

  రిప్లయితొలగించండి
 13. భానుమతీ స్వప్నము.

  చంద్రుని వంశమంతయును సంగర మందున గూలిపోయి, క
  ర్మేంద్రియముల్ దెగ న్స్వపము నేర్పడ దెల్పుచు భీతిజెంది రా
  జేంద్రుల గావగా దలఁచి, చేతుల నెత్తి సుయోధనాధిరా
  జేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్.

  స్వపము-స్వప్నము (ఆం.భా)

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. అంగరంగవైభవమౌ కళింగ రాజ
  పుత్రికా స్వయంవరమును మిత్ర బృంద
  సహితయై గాంచనేతెంచె స్వర్గ రాజ్ఞి
  ఇంద్రసతి; భానుమతి మ్రొక్కె నెల్లరకును

  రిప్లయితొలగించండి
 16. ఉ:

  అంధ్రము నందు నొక్కనటి యాడుచు పాడుచు చిత్ర సీమలో
  మంద్రక మైన మాటలును మత్తును గొల్పెడి గాన మాధురిన్
  నింద్రుని భార్య తీరు నటియించిన చిత్రము ఖ్యాతి గాంచ నా
  యింద్రుని భార్య, భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

  అంధ్రము=తెలుగు దేశము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 17. ఇంద్రసుఖప్రదాఖిలమహీపరిపాలనగాఢవాంఛలన్
  సాంద్రదురాశయుండు ననుజన్ములు దోడ్పడ పాండుపుత్రరా
  జేంద్రుల డాగురించి యభిషిక్తుడునౌ తరి నట్టి సార్వభౌ
  మేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్.

  కంజర్ల రామాచార్య‌.

  రిప్లయితొలగించండి
 18. ~~~~~~~~~~~~~~~~~~~~
  సంద్రము రీతి రాజులును సజ్జ
  నులున్ దృతరాష్టు పుత్రుడా
  చంద్రకులోన్నతుండతని చక్క
  ని పెండ్లికి వచ్చిరెందరో
  మంద్రపు కంఠనాదమున మా
  న్యులకున్ కమలాక్షి రాజ రా
  జేంద్రుని భార్య భానుమతి
  యెల్లరకున్ బ్రణమిల్లె భక్తితోన్
  ~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 19. విను శచీదేవియేగద విమల చరిత!
  యింద్రసతి, భానుమతి మ్రొక్కె నెల్లరకును
  దనదు పెండ్లికి మోదాన తరలి వచ్చు
  దేశ దేశాల ప్రభువులు,తెరువరులకు

  రిప్లయితొలగించండి
 20. బలరిపుం డింద్రు వీక్షింప వచ్చినట్టి
  దేవమునులను గని శచీ దేవి నిత్య
  తరుణి పౌలోమియె పతివ్రతా మతల్లి
  యింద్రసతి భానుమతి మ్రొక్కె నెల్లరకును

  [భానుమతి = ప్రకాశించునది]


  ఇంద్ర సతీ సమాన తరళేక్షణ సువ్రత చారుశీల దే
  వేంద్ర పురాభ పట్టణవ రేశ్వర వల్లభ గాంచి వ్యాస మౌ
  నీంద్ర వరద్విజావలిని నింపుగ నంతట ధార్తరాష్ట్రు రా
  జేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

  రిప్లయితొలగించండి
 21. మంద్ర మనోజ్ఞ గానమున మానినులందరు స్వాగతింపనా
  చంద్రముఖిన్ శుభాంగినభిజాతను వేడ్కగ రాణివాసమున్
  చంద్రకులోద్భవుండమితశక్తియుతుండు సుయోధనాఖ్య రా
  జేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

  రిప్లయితొలగించండి
 22. చంద్రుని బింబమున్ వలెను జక్కటి రూపుననుండునామెయే
  యింద్రునిభార్య,భానుమతి యెల్లరకుంబ్రణమిల్లె భక్తితోన్
  నింద్ర సమాన తేజులగు హైందవరాజుల రాకతోనొగిన్
  చంద్రముఖారవిందయయి సంతస మప్పుడు పిక్కటీల్లగన్

  రిప్లయితొలగించండి
 23. రాజ రాజు చేయించెను రవ్వ నగలు
  సభను పుట్టిన దినమున సతికి నిచ్చె
  తోసిరాజను చింద్రుని వాసి, కుమిలె
  నింద్రసతి, భానుమతి మ్రొక్కె నెల్లరకును.

  రిప్లయితొలగించండి

 24. ఇంద్రుడు, జంద్రుడీతడన నిమ్ముగ జేకొనె నంచు నెంచుచున్
  చంద్ర కులోద్భవున్ మదిని సన్నుతి జేసి సమాగమమ్మునన్
  మంద్రముగా ధ్వనించు రస మాధురి వో లె వచించి రాజ రా
  జేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తి తోన్!
  -మాచవోలు శ్రీధరరావు

  రిప్లయితొలగించండి

 25. ఉ: చంద్రుని బోలు నాననము చక్కని నాసిక శ్రోణి యందమున్
  సాంద్రపు నీలి ముంగురులు శంఖు గళమ్మును కల్గి మించుచున్
  మంద్ర గళమ్ముఁ గల్గు యభిమానధనుండుగు హస్తి వీడు రా
  జేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

  రిప్లయితొలగించండి
 26. భద్రత లేదు భర్త కని, పాండవ సైన్యము తోడయుద్ధమున్
  ఛిద్రము చేయు వంశమని, చేటని స్వప్నము కాంచెనిట్టులన్
  నిద్రను జారి స్వర్గమున నిశ్చలతత్వము నేర్చె చెప్పగా
  ఇంద్రుని భార్య, భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్

  రిప్లయితొలగించండి