6, జూన్ 2021, ఆదివారం

సమస్య - 3744

7-6-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కల్లలాడువాఁడె బల్లిదుండు”
(లేదా...)
“కల్లల్ వల్కెడువాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వువాఁ డాప్తుఁడౌ”

59 కామెంట్‌లు:

  1. ఇల్లు నిల్లు దిరిగి యిల్లాళ్ళ వేధించి
    గొల్ల వనితలెల్ల గోలబెట్ట
    తల్లి చేతిదెబ్బ తప్పించు కోవంగ
    కల్లలాడు వాడు బల్లిదుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇల్లిల్లుల్ చరియించుచున్ వ్రజమునం దిల్లాళ్ళ నేగించుచున్
      కల్లోలంబు సృజించగా ననుజుతో కౌమార చాపల్యమున్
      ముల్లెల్ మూటల సర్దుకొంచు వెడలన్ బూనంగ
      నిర్దోషినన్
      గల్లల్ బల్కెడువాడె బల్లిదుడు వెన్కన్ నవ్వువా డాప్తుడౌ

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "తప్పించుకొనుటకై" అనండి.
      రెండవ పూరణలో 'అనుజుడు' అన్నాడు. నిజానికి 'అగ్రజుడు' కదా?

      తొలగించండి
    3. అవును గురువర్యా, సవరిస్తాను.🙏🙏🙏
      ధన్యవాదములు!

      తొలగించండి
    4. సవరణలతో

      ఇల్లు నిల్లు దిరిగి యిల్లాళ్ళ వేధించి
      గొల్ల వనితలెల్ల గోలబెట్ట
      తల్లి చేతిదెబ్బ తప్పించు కొనుటకై
      కల్లలాడు వాడు బల్లిదుండు

      ఇల్లిల్లుల్ చరియించుచున్ వ్రజమునం దిల్లాళ్ళ నేగించుచున్
      కల్లోలంబు సృజించ నగ్రజునితో కౌమార చాపల్యమున్
      ముల్లెల్ మూటల సర్దుకొంచు వెడలన్ బూనంగ
      నిర్దోషినన్
      గల్లల్ బల్కెడువాడె బల్లిదుడు వెన్కన్ నవ్వువా డాప్తుడౌ

      తొలగించండి
  2. ఆటవెలది
    కాంతల విషయాల కల్యాణములయందు
    వ్యాన మాన విత్తహూనమందు
    బెదరు గోవుఁ గావ విప్రుల రక్షింప
    కల్లలాడువాఁడె బల్లిదుండు

    (నన్నయ, పోతనామాత్యుల బాణీలో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      పల్లెల్ వట్నములందు నెల్లెడలఁ బెన్ ప్రాంతీయ తత్వాలు కో
      కొల్లల్వెర్గుచు నుండ భారతమునన్ గొంగ్రొత్త రూపమ్మునన్
      దల్లిన్ భారతి నిల్పగా నొకఁట సంధానింప పక్షమ్ములన్
      గల్లల్ వల్కెడువాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వువాఁ డాప్తుఁడౌ

      (బల్లిదుడు = మోదీ

      ఆ వెనుక సమర్థింపుగా నవ్వే ఆప్తుడు అమిత్ షా)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. గురువుఁగూల్చధరణికవిదుడైయని
    ధర్మజుండుపలికెతప్పుగాను
    అదియఁదెచ్చిపెట్టెయాపదనెదిరికి
    కల్లలాడువాడెబల్లిదుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి

  4. మంచిరోజులెల్ల మంటగలిసి పోయె
    పోలెవాడె నేడు పాలకుండు
    హలదు లిలను జూడనసమర్థు లైరంట
    కల్లలాడువాడె బల్లిదుండు.

    రిప్లయితొలగించండి
  5. తగిన శిక్ష పొందు ధర్మము వీడిన

    కల్లలాడువాఁడె , బల్లిదుండు

    నెల్ల వేళలందు నిజము పలుకునయ్య

    తెలుసు కోర నీతి తెరగులివియె

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెలుసుకోర' అన్నది వ్యావహారికం. "తెలుసుకొనుము" అనండి.

      తొలగించండి
  6. నిజము జెప్పు మనుచు నేర్పింతురింటను
    నరిగి బడిని జదువ నదియె తెలియు
    నిజము వెంట మనము నిలుచుటెట్లు? బయట
    కల్లలాడువాఁడె బల్లిదుండు.

    రిప్లయితొలగించండి
  7. సత్య మైన నదియు సజ్జను బాధించు
    వార్త యైన దాని వలదు దెలుప
    ననుచు మరుగు పరచు అలరింప జూడంగ
    కల్ల లాడు వాడె బల్లి దుండు

    రిప్లయితొలగించండి

  8. కల్లావెల్లి సమస్యనిచ్చె కద యాఖ్యాతుండు నేడెందుకో
    యుల్లాసంబది నీరుగారె గన నుత్సాహంబె లేకుండెనే
    కల్లున్ రూకలఁ బంచువాఁడె యిల పృథ్వీశుండుగా నెగ్గినన్
    కల్లల్ పల్కెడు వాఁడె బల్లిదుడు, వెన్కన్ నవ్వువాఁడాప్తుఁడౌ

    రిప్లయితొలగించండి
  9. బొంకులాడియొరులసంకటములుదీర్చు
    స్వార్థ రహితుడైన సజ్జనుడిని
    గాంచి జనులు గొప్పగౌరవంబిడియంద్రు
    కల్లలాడువాడు బల్లిదుండు

    రిప్లయితొలగించండి
  10. ఎల్లల్లేకనువామనుండువలికెన్నేర్వంగబుద్ధిన్గదా
    చల్లంగాయెడదానవుండుగనియెన్చాలంచువిష్ణుండనన్

    ఇల్లేగుల్లగమార్చెగానచటతానింకన్బలిన్జూడకే
    కల్లల్వల్కెడువాడెబల్లిదుడువెన్కన్నవ్వువాడాప్తుడౌ

    రిప్లయితొలగించండి
  11. వలయు సరకు లన్ని వసతుల వద్దకు
    నుచుత ముగనె బంచి యొసగె దనని
    యెల్ల జనుల ముందు నెన్నిక లందున
    కల్లలాడువాఁడె బల్లిదుండు

    రిప్లయితొలగించండి
  12. చల్లంగా బ్రతుకంగవచ్చుననుచున్ సాధింప, రాజ్యంబునన్
    పిల్లాపాపల తోడనుండు జనులం బీడించి హింసించి కో
    కొల్లల్ భూముల నాక్రమించి, తెగ సంకోచంబునేవీడుచున్,
    కల్లల్ వల్కెడువాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వువాఁ డాప్తుఁడౌ

    రిప్లయితొలగించండి
  13. నమస్కృతులతో

    తల్లీదండ్రుల విద్యనేర్వకను మెత్తంగాను మాట్లాడుచున్
    చెల్లీతల్లుల జూడకన్ మదముగా జేసేటి దుర్మార్గమున్
    చల్లంగా తన మాటలన్ పరులకున్ జట్టాల వక్రీకరన్
    కల్లల్ వల్కెడివాడె బల్లిదుడు వెన్కన్ నవ్వువాడాప్తుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వ్యావహారిక పదాలను ప్రయోగించారు.

      తొలగించండి
  14. శా:

    ముల్లెల్ మోయుచు మాయమాటలు సదా పుట్టించి యేమార్చుచున్
    చిల్లుల్ జేయుచు సంచులన్ పలుకనౌ చింతింపగా రాదనన్
    పిల్లుల్ మాదిరి గోడనెక్కి గనరే విడ్డూరమున్ తిన్నగా
    కల్లల్ వల్కెడి వాడె బల్లిదుడు వెన్కన్ నవ్వు వాడాప్తుడౌ

    సంచులు =జేబులు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. ఎన్నికలకు పూర్వమెన్నియో హామీలు
    కోటి బాసలిడుచు ఓటు నడుగు
    గద్దెనెక్కి నేత గతమెల్ల మరచును
    కల్లలాడువాఁడె బల్లిదుండు

    రిప్లయితొలగించండి
  16. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : కల్లలాడు వాడె బల్లిదుండు ||

    5)
    నిజము నిజము యనుచు నిందవేయుటనేల
    నిజము చెప్ప వచ్చు ? నీతి తప్ప |
    కల్ల కామధేను , కలియుగమ్మున, రామ !
    కల్లలాడు వాడె బల్లిదుండు ||

    - రాంబాబు కైప
    07-06-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : కల్లలాడు వాడె బల్లిదుండు ||

    6)

    నిజము నీకు రక్ష, నీడయై తానుండు
    కల్ల తెల్లమవును-కల్ల కాదు
    నిజము తెలియు వరకు నిలకడ లేకున్న,
    కల్లలాడు వాడె బల్లిదుండు

    - రాంబాబు కైప
    07-06-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : కల్లలాడు వాడె బల్లిదుండు ||

    7)

    నిజము తెలియకున్న నీకైన నాకైన
    కల్ల నిజము వోలె చల్లగుండు
    కల్ల లోని గుల్ల కనిపించు వరకు నా
    కల్లలాడు వాడె బల్లిదుండు

    - రాంబాబు కైప
    07-06-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : కల్లలాడు వాడె బల్లిదుండు ||

    8)

    కల్లకపట మాడు కన్నయ్య దేవుడే !
    కల్ల చెప్ప సులువు కాదు జూడ
    కలువ కన్నులందు కల్మషమే లేక
    కల్లలాడు వాడె బల్లిదుండు

    - రాంబాబు కైప
    07-06-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  17. చల్లంగా మనఁ బిల్లపాపలును రాజా లంకలో సర్వు లా
    తల్లిన్ సీతను రామమూర్తి కిడు చింత ల్మాని నీ బుద్ధినిం
    బొల్లు న్సేయగ నెంచి రెవ్వరొ రిపుల్ వోరామియౌ నీ కిసీ
    కల్లల్ వల్కెడు వాడె బల్లిదుడు వెన్కన్ నవ్వు వా డాప్తుడౌ.


    రిప్లయితొలగించండి
  18. కల్ల లాడు వాడె బల్లిదుండు నిజము
    మోసగాడె ముఖ్యు డీసు రభికి
    కాల మహిమ యిదియ కలికాల మగుటన
    వీరబ్రహ్మ ముడివె వివిధ గతులు

    రిప్లయితొలగించండి
  19. పల్లెల్ పట్టణవాసులందరొకటై పట్టంబునే గట్టగా
    కల్లోలంబుగ మార్చె రాజ్య ప్రగతిన్ గర్వాంధుడౌ రేడహా
    తెల్లంబౌ గననట్టి మూర్ఖుడభివృద్ధిన్ గోరడవ్వానికిన్
    కల్లల్ వల్కెడువాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వువాఁ డాప్తుఁడౌ

    రిప్లయితొలగించండి
  20. 2వ పూరణ:

    శా:

    ఎల్లల్ దాటిన చిర్రు, గాధికుడు తా నిక్ష్వాకు వంశోత్తమున్
    కల్లల్ వాక్కున నుగ్గడించు నటులన్ గావింప నొట్టెట్ట నై
    కొల్లన్ గొట్టగ రాజ్యమున్ వదలకై గూర్చంగ నో శిష్యునిన్
    కల్లల్ వల్కెడి వాడె బల్లిదుడు వెన్కన్ నవ్వు వాడాప్తు డౌ

    ఇక్ష్వాకు వంశోత్తముడు =హరిష్చంద్రుడు
    శిష్యుడు= నక్షత్రకుడు.

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  21. సుల్ల లన్ని జెప్పి సులభంబుగారంకు
    లంటగట్టి నగుచు నాటలాడు
    పచ్చ కళ్ళ జనము పసుపన్న నమ్మరా!
    కల్లలాడువాఁడె బల్లిదుండు.

    రిప్లయితొలగించండి
  22. నల్ల పిల్లి వోలె మెల్ల మెల్లగ దూరి
    గొల్లలిండ్ల వెన్న కొల్లగొట్టు
    నల్లరెరుగనంచు దల్లి దరిని జేరి
    కల్లలాడువాఁడె బల్లిదుండు

    రిప్లయితొలగించండి
  23. అల్లా! యేమని జెప్పనోపుదును మాయాజాలమేయౌటయా
    కల్లల్ వల్కెడు వాడె బల్లిదుడు వెన్కన్ నవ్వువాడాప్తుడౌ
    కుళ్ళాయించక మంచిజేయుచు నికన్ గూర్పాసమేగానకన్
    నుల్లంబంతట మంచి నింపుచు మఱిన్ నోర్పుంద గన్ జూడుమా

    రిప్లయితొలగించండి
  24. కండ బలము మిన్న యండ కలదు వాని
    కర్థ మందు ధనదుఁ డౌను భువిని
    నిజము సెప్ప కన్న నేర్పున నోర్పునఁ
    గల్ల లాడు, వాఁడె బల్లిదుండు


    ఉల్లం బందును నిల్పి శ్రేయమును సద్యోగమ్ము నాశించుచుం
    గల్లోలం బిడు సత్యవాక్కులను బల్కన్ వాఁడు శత్రుండు సూ
    సల్లాపంబుల నిత్య మాత్మ కతి హర్షం బిచ్చు ప్రీత్యుక్తులౌ
    కల్లల్ వల్కెడు వాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వు వాఁ డాప్తుఁడౌ

    రిప్లయితొలగించండి
  25. తొల్లిన్ కర్ణుడు కల్లలన్ బలికె మిత్రుండైన రారాజుతో
    చెల్లున్ జేసెద నర్జునున్ యనుచు భాషించున్ గదానెప్పుడున్
    ఇల్లున్ పంచక నవ్వెపో శకుని దుష్టేచ్ఛల్ జనింపన్ మదిన్
    కల్లల్ వల్కెడువాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వువాఁ డాప్తుఁడౌ

    ఇల్లు=ఆస్తి

    రిప్లయితొలగించండి
  26. 1కల్లిబొల్లి వైన కబురులు చెప్పుచు
    రాజకీయమందురాటుదేలి
    ప్రజల నెల్ల తన దు వాగ్ధాటి తో గెల్చి
    కల్లలాడువాడుబల్లిదుండు


    2కానిపనులుచేసికప్పిపుచ్చుకొనుచు
    నడిగినట్టివాని హడలగొట్టి
    యవసరార్థమిలనుననువుగానెప్పుడున్
    కల్ల లాడు వాడె బల్లి దుండు.


    3తప్ప త్రాగి వచ్చి తరుణినివెదుకుచు
    నెచటదాగెననుచు నెదుటి వాని
    నడుగ తనకు తెలియ దనుచు తెలివిచూపి
    కల్ల లాడు వాడె బల్లిదుండు


    రిప్లయితొలగించండి