13, జూన్ 2021, ఆదివారం

సమస్య - 3751

14-6-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్"
(లేదా...)
"జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్"

43 కామెంట్‌లు:

  1. విపులముగాగనుపరమును
    సఫలముఁజెందుచుతపసునసాధకుడంతన్
    వపువునుమరచుచుభౌతిక
    జపతపయోగములువిడువసద్గతిదక్కున్

    రిప్లయితొలగించండి

  2. కపటము విడి శరణార్థుల
    ప్రపదనమిచ్చిననుచాలు పరమాత్ముడు మె
    చ్చు పరుల వంచింప కుటిల
    జపతప యోగములు విడువ సద్గతి దక్కున్.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. చపలతలేక నిత్యమును చక్కని మట్టివియౌ సుమమ్ములన్
      నిపుణత గొల్చుచుండు కడునిమ్నపు జాతికిజెందు భీముడా
      నృపుడగు తొండమానుడట నివ్వెరవోవగ జాటెభక్తినిన్
      జపతపముల్ ద్యజించిచను సాధకు డందును సద్గతిన్ వెసన్

      తొలగించండి
    3. అపమార్గమ్మున నడచుచు
      విపరీతపు ధోరణులను విచ్చలవిడిగా
      కపటపు చర్యల తాంత్రిక
      జపతపముల విడుచువాడు సద్గతి నందున్

      తొలగించండి
  4. శంకరయ్యగారికి నమస్సులు

    తపోయోగములు సకారాంతశబ్దం (తపస్) అవుతుంది కదండి

    తపము అకారాంతపుంలింగమైనచో వేడి అనే అర్థం వస్తుంది, (ఆతపకాలము) కదా! అని
    నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    జపతపయోగముల్ విడిచి
    సాధకు డందెను సద్గతిన్ వెసన్

    ( నారదమహర్షి తన శిష్యునికి కంచెర్ల గోపన్న
    రామభక్తి వైభవాన్ని వివరిస్తున్నాడు )

    ఉపగతమైన యంశమది
    యోర్పుగ శ్రద్ధగ నాలకింపుమా !
    అపగత మందనట్టి పర
    మాత్మపరంబగు భక్తి చాలులే !
    కపటము లేని గోపనయె
    కంజదళాక్షుని మీది భక్తిచే
    జపతపయోగముల్ విడిచి
    సాధకు డందెను సద్గతిన్ వెసన్ .

    ( ఉపగతమైన - అంగీకరింపబడిన ; అపగతము - అంతరించెడిది )

    రిప్లయితొలగించండి
  6. తపుడే చెప్పిన వీడకు

    జప తప యోగములు ; విడువ సద్గతి దక్కున్

    కపి రాజ నాధుని దురిత

    రిపుండు రావణుని సేవలించుక తెలివిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  7. కపటపు యోగియై సతము కల్లల నాడుచు తానొకండె ది
    వ్యపదము చూపువాడనని పల్కు వివర్ణుడు మారి బీదకున్
    ప్రపదన మందజేసి యనవద్యపు కార్యము జేయ నాలియౌ
    జపతప యోగముల్ విడిచి సాధకుడందెను సద్గతిన్ వెసన్.

    రిప్లయితొలగించండి
  8. అపవర్గము గోరు జనము
    విపరీతములెంచబోరు విశ్వమునందున్,
    కృప గలిగి, మనిషి కపటపు
    జప తపములవిడుచువాడు సద్గతినందున్

    రిప్లయితొలగించండి
  9. అపురూపపు భక్తుండై
    కృప జూపు మటంచు వేడి కీర్తన తోడన్
    విపరీతపు దైన కపట
    జప తప యోగములు విడువ సద్గతి దక్కున్

    రిప్లయితొలగించండి
  10. చపలముగానిభావనలసన్నుతశక్తినిమానసంబునన్
    అపరములేకయూపిరినియన్నిటబంధనఁజేయుకార్యమా
    తపననుయోగ్యమంచుననుతాఁజరియించునాత్మత
    జపతపయోగముల్విడిచసాధకుడందెనుసద్గతిన్వెసన్

    రిప్లయితొలగించండి
  11. కందం
    విపులమ్ముగ కౌశికుఁడున్
    దపసి వశిష్ఠునెదిరించ దక్కెనె బ్రహ్మ
    ర్షి పథము? కోప సహితమగు
    జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్

    చంపకమాల
    కుపిత పరత్వ కౌశికుడు క్రుంగె నశించి తపోబలమ్మునున్
    తపసి వశిష్ఠునిన్ దొడరు దారిన బ్రహ్మ సహోరుడయ్యెనే?
    యుపశమనాన సాధ్యపడె నున్నతి! కోప సమేతమయ్యెడున్
    జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      కపట మెఱుంగని తిన్నడు
      యపరాజితుఁ బుక్కిలించు నర్చన ముక్తిన్,
      సుపథిఁగొనె! మూఢ భక్తిని
      జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్

      చంపకమాల
      విపినము నందు తిన్ననికి వేడుక జిక్కఁగ లింగరూపుడున్
      కపటము లేక తా నశుచి గాహన మాంసపుటారగింపులన్
      సుపథమనంగ ముక్తిఁగనె చోద్యము 'కన్నప'!మూఢ భక్తిమై
      జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

      తొలగించండి
  12. సపరిజనముగా నిత్యము
    చపల మనస్కులగుచు కొనసాగించగ నా
    కపటపు రీతిన సలిపెడు
    జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్

    రిప్లయితొలగించండి
  13. తపముని విశ్వామిత్రుడు
    చపలతతో దేవకన్య జతకూడగ నెం
    చి పరిపరి విధముల దలచె
    జప తప యోగములు విడువ సద్గతి దక్కున్

    రిప్లయితొలగించండి
  14. కపటపు మిషతో మేనక,
    జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్,
    అపసవ్య ము నీ తపమని,
    చపలత కౌశికునిజేరి సంతస పరిచెన్

    రిప్లయితొలగించండి
  15. కృప భగవంతుడే నిడుగ కృష్ణుని నామజపమ్ము చేసినన్
    అపరిమితంబె ధ్యానమున ఆపరమాత్మ సమింపజేసెడిన్
    చపలమనోవికారములు, సాధనచేయవలెన్ ,యభాగ్యులే
    జపతపముల్ ద్యజించి చను, సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  16. ఈనాటి శంకరాభరణం వారి సమస్య

    జపతప యోగములు విడువ సద్గతి దక్కున్

    ఇచ్చిన. పాదము కందము నా పూరణ సీసములో



    గ్రీష్మ ఋతువున యగ్ని నలు దిశలలోన నుండగా జపము చేయు

    చుంటివి నడుమ కూర్చుండి యీవు, శిశిర ఋతువులోన
    జివ్వున చలి

    గాలులు వీచ నగ్నమ్ముగ తపమును వీడక‌ సల్పుచు వేడ చుంటి

    వి గదా విరించిని, సొగసుగ నిను కోరి
    వచ్చితిని వసంత మొచ్చెనుగ స

    హోరుడా,జపతప యోగ ములు‌ విడువ సద్గతి దక్కున్,
    నిజమిది వినుము


    గాధి తనయుడా, యీ మేనక‌ యడు గిడెను,

    రతిసుఖమ్ము నిచ్చెదనుగా రమ్య గతిని

    తాపమును‌ తీర్చు ము రయమున్ తపము‌
    నాపి

    యనుచు మేనక పలికెను మునిని‌ గాంచి


    విశ్వామిత్రుని గాంచి మేనక పలుకులు

    రిప్లయితొలగించండి
  17. ఈనాటి శంకరాభరణం వారి సమస్య

    జపతపములు విడుచువాడు సద్గతి పొందున్

    ఇచ్చిన. పాదము కందము నా పూరణ సీసములో



    గ్రీష్మ ఋతువున యగ్ని నలు దిశలలోన నుండగా జపము చేయు

    చుంటివి నడుమ కూర్చుండి యీవు,శిశిర ఋతువులోన
    జివ్వున చలి

    గాలులు వీచ నగ్నమ్ముగ తపమును వీడక‌ సల్పుచు వేడ చుంటి

    వి గదా విరించిని, సొగసుగ నిను కోరి
    వచ్చితిని వసంత మొచ్చెను
    గద

    పరికించగ,జపతపములు‌ విడుచువాడు
    సద్గతి పొందున్
    నిజమిది వినుము


    గాధి తనయుడా, యీ మేనక‌ యడు గిడెను,

    రతిసుఖమ్ము నిచ్చెదనుగా రమ్య గతిని

    తాపమును‌ తీర్చు ము రయమున్ తపము‌
    నాపి

    యనుచు మేనక పలికెను మునిని‌ గాంచి


    విశ్వామిత్రుని గాంచి మేనక పలుకులు

    రిప్లయితొలగించండి
  18. విపణుల ప్రాణ వాయువును పేరిమి చిక్కక గాలి సాక్షిగన్

    శపధము చేసి మానవుల సాంబుని చెంతకు చేర్చు బాటలా

    కపటపు వైద్య శాలలను కాలుని శాలల చేరి కోరికన్

    జప తప యోగముల్ విడిచి సాధకుఁ డందెను సద్గతిన్ వెసన్"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  19. కపటంబదివేషమునై
    చపలపుజిత్తమునఁదానుజంచలమగుచున్
    నపరాధపుజపమాలల
    జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  20. అపగతమోహచిత్తుడయి యందరినిన్ సమదృష్టి జూచుచున్
    గృపగొని దీనమానసుల కీడును మాన్ప నిరంతరమ్ముగా
    కపటము లేక సాగగల కర్మఠుడై యవకాశశూన్యుడై
    జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  21. తపములు క్లిష్టయోగజపతర్పణముల్ విపరీతసాధనల్
    చపలత జేసెనే పరమసాధ్వి పలమ్ముల నమ్ము ధర్మయ
    క్తపథచరుండు నట్లు? సరికావవి చాలును శీలవర్తనన్
    జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  22. చపలత లేని చిత్తమున సన్నుతి చేయుచు శ్రీనివాసునిన్
    విపులపు భక్తి, దుర్బలుల వృద్ధికి నిత్యము ప్రాపునిచ్చుచున్
    కపటము లేని ప్రేమ నిజ కాంతకు పంచుచునున్న నింటిలో
    జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  23. అపకారికి సహితము తా
    నుపకారము సేయు నట్టి యోచన తోడన్
    నుపమించక సేయుచు నా
    జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్

    రిప్లయితొలగించండి
  24. మల్లెల.నాగరాజ


    చపలత వీడి మానసము సజ్జన బుద్ధిని జేర్చి సాగుచో
    విపినములందు నిల్చిన పవిత్ర చరిత్ర గడించు కోర్కె ని
    ష్కపట నిరంజనాకృతి సఖా! పెరవారికి సేవ చేయుచో
    జపతపముల్ త్యజించి చను సాధకుఁ డందును సద్గతుల్ వెసన్!

    రిప్లయితొలగించండి
  25. కుపితుడు వేధయైన తన కోపపు చేష్టల చేత వ్యర్థుడై
    నుపగతి పొందలేడతడు, యూరక నుండక, జీవకోటికిన్
    నుపకర మైనసేవలొక యున్నత రీతిని చేసి ధన్యుడై
    జప తపముల్ ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  26. చపలత్వమె పొందునెపుడు
    జప తపముల విడుచువాఁడు; సద్గతి నందున్
    కపటము లేక మది పరం
    తపునే ధ్యానించు వాడు ధర్మపరుండున్

    రిప్లయితొలగించండి
  27. అపమార్గమ్మున నడువక
    ఉపకారము జేయబూని నోపగ కష్టం
    బుపమార్గంబెంచుకొనగ
    జప తపముల విడుచువాఁడు సద్గతి నందున్!!

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు

    1. అజామిళుడు ఎంత నీచుడై నప్పటికిని అంత్య కాలమందు 'నారాయణా' అని తలచినపుడు సద్గతిని పొందుతాడు. ఆ సందర్బంగా నా ప్రయత్నము:

      చం:

      అపశదుడైన వాడనుచు నా యమదూత లజామిళాఖ్యునిన్
      తపనము నంద జేతుమన ధర్మము కాదన విష్ణుదూతలై
      కపటము లేక శ్రీ హరిని, కాలము తీరుట నెంచి, గొల్వనై
      జపతపముల్ ద్యజించి చను సాధకు డందును సద్గతిన్ వెసన్

      ఆపశదుడు= నీచుడు

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  29. అపవిత్రు డగును బృధివికి
    జపతపములు విడుచువాడు,సద్గతినందున్
    చపలత భావము వీడుచు
    జపతపములు సేయునతడు శంకరు కృపచేన్

    రిప్లయితొలగించండి
  30. అపకారమ్ములు సేసెడు
    నెపమునఁ జేయకుమ మేదినిని నే పూజల్
    విపరీతమ్ములు ఘోర కు
    జపతపముల విడుచు వాఁడు సద్గతి నందున్


    విపుల దయాగుణుండు నగు వెన్నునిఁ గొల్వ సతం బపారపుం
    గృప నొసఁగంగ మాధవుఁడు హీన భవౌఘము నాశ మందఁగా
    నృపవర! యింద్రి యార్థముల నెల్లను నిష్ఠను, మానకుండఁగా
    జప తపముల్, ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  31. కుపితుడు గాక యెప్పుడును గూర్మిని నెల్లరి మానసంబులన్
    గపటము లేని పద్ధతిని గర్మఠు వోలెను జూరగొన్నచో
    నపగత మత్సరంబునన నందఱి సేమముజూడగల్గుచో
    జపతపముల్ త్యజించి చను సాధకుడందును సద్గతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  32. విపినమున మౌని వోలెను
    జపముసలుపనేల ముక్తి సాధింపంగా
    నుపకారముచేయగతన
    జపతపముల విడుచువాఁడుసద్గతి నందున్

    రిప్లయితొలగించండి
  33. కపటపు బుద్ధి నిపూనుచు
    విపరీతముగా నితరుల వేధించక తా
    తపమును పేరును తాంత్రిక
    జప తప యోగములు విడువ సద్గతి కలుగున్

    రిప్లయితొలగించండి

  34. అపరిమితంపు కాలమున
    నాకృతి దాల్చెడి జీవరాశిలో
    నుపమితు లేల జీవనము
    నుత్సుకత న్గమియింప జేయు నా
    కృపనిడు దేవదేవుని స
    కీన ప్రభాద్యుతి నందు బంధమున్
    జప తపముల్ ద్యజించి చను
    సాధకుఁ డందును సద్గతిన్ వెసన్!

    రిప్లయితొలగించండి