21, జూన్ 2021, సోమవారం

సమస్య - 3759

22-6-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”
(లేదా...)
“కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే”

80 కామెంట్‌లు:

  1. కోడి పందెములకు పెంచె కోడి యొకటి
    వాడి గోళ్ళు, శక్తి కొరకు వారు పెట్ట,
    జీడి పప్పును వేసిన వేడియగు ప
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    రిప్లయితొలగించండి
  2. వంటలను జేయు చొక చోట వనిత యొకతె
    అవసరమ్ముగ చరవాణి నందు కొనియు
    వెడల వాసన జూచిన వెంటనే ప
    కోడినిన్ మ్రింగె నొకకోడి సూ డ జనులు

    రిప్లయితొలగించండి
  3. పిల్ల చేపను మ్రింగును పెద్ద చేప

    సాటి మనిషిని చంపును మేటి వాడు

    సాటి కోడిని మ్రింగను జాలక ఇల

    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( ఇలకోడి = ఒక పురుగు)

    రిప్లయితొలగించండి
  4. నిద్రలేపగజనులనునిగ్గుఁదెలిపి
    నేతలిరువురుప్రతిపక్షనేరములను
    వెలికిఁదీయంగచూచెడివింతయందు
    కోడినిన్మ్రింగెనోకకోడిసూడజనులు

    రిప్లయితొలగించండి
  5. వేడుక తోడ బందుగులు వేకువజామున జూడ రాగ న
    చ్చేడులు పిండిపాకముల చెల్వము మీరగ జేసివెట్టగా
    పాడుది యింటిలో దిరిగి, పాత్రను జూచుచు మూతివెట్టి, ప
    క్కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాడు కరోన కాలమిది పాలకు లేమియు బట్టనట్లుగా,
      వాడల వాడలన్ దెరువ బారుల, పబ్బుల వైనుషాపులన్
      మూఢులు జేరి నంజుకొని ఫుల్లుగ మత్తున దూలిపోవ, ప
      క్కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే?

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. నాడును నేడునున్ సహజన్యాయము రాజ్యము వీరభోజ్యమౌ
    ఓడుచు నెన్నికన్ బ్రజల యోటుల బొందగలేక పైకమున్
    వీడగ దేశహద్దులను వెల్లడియాయెను రాజకీయపుం
    గోడిని కోడిమ్రింగె, గనుగొన్న జనుల్ సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  7. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య: “కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే”

    2)
    కోడిని పెంచి పందెముల కోట్లకు డబ్బును ఖర్చు పెట్టగా
    వాడిగ గోళ్ళు పెంచుటకు, వండిరి వంటలు, పిండి వంటలున్
    వేడిపకోడి, జీళ్ళనిడి విందులు జేయగ, వారి చేతి , చే
    “కోడినిఁ గోడి మ్రింగెఁ, గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే”

    -రాంబాబు కైప
    21-06-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి

  8. బంధువులు వచ్చిరంచును పడతి యొకతె
    పిండి వంటలు చేయగా పేర్మి తోడ
    పిల్లలు తినుచును విసిరి వేయ నొక ప
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడజనులు.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దొడ్డిలోన పిల్లలతోడ దొరలు చుండి
    గింజలు పురుగులనుబట్టి నంజు జుండ
    చెత్తలోన గోచరమైన చిటిపొటి యిల
    కోడినిన్ మ్రింగె నొకకోడి సూడ జనులు.

    రిప్లయితొలగించండి
  10. వాడలవాడలందునటవాడిగవేడిగకోనసీమలో
    చూడగకోడిపందెములచూడ్కికివిందుగసోయగమ్ముతో
    వేడుకసందళింపగనువేగమెకుర్కురమాజిచూడగా
    కోడినికోడిమ్రింగెఁగనుగోన్నజనుల్సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  11. సమస్య :-
    “కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”

    *తే.గీ**

    పొలము పనులు జేయగ రైతు పొలము బోవ
    పిల్లలేడ్వ చెకోడీలు పెట్టిరింట
    చిన్న పిల్లలు తినుచుండ చేతిలో చె
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు
    .......‌.............✍️చక్రి

    రిప్లయితొలగించండి
  12. పర్వదినమంచు జేసిరి
    పలు రకాల
    పిండి వంట లనేకము
    ప్రియముతోడ
    గారె బూరెలు లడ్డూలు
    కమ్మనైన
    యర్షలను జేయ గనుగొని
    నచటగల ప
    కోడినిన్ మ్రింగె నొక కోడ
    సూడ జనులు

    రిప్లయితొలగించండి


  13. వాడిశరవ్యమొక్కటదె పందెము నందున గెల్చుటంచు తా
    కోడిని పెంచసాగె కడు కూరిమి జూపుచు జీడిపప్పు నా
    క్రోడుల మేపగన్ బొలము గొంపల నమ్మ వచించి రంట బ
    క్కోడినిఁ గోడిమ్రింగెఁ, గనుఁ గొన్న జనుల్ సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  14. వేడుకలొచ్చె పండుగల వేళలు యల్లుని తెచ్చె, విందుకై

    కోడిని తెచ్చి వండెనట గుడ్డిది వేడి పకోడి ముక్కలున్

    చూడగ కన్ను కానకను సొంపుగ పెట్టెను కోడి పుంజుకున్

    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. 'వేళలు+అల్లుని' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  15. తేటగీతి
    కొక్కొరోయన నాకలి కూతయనుచు
    మేడ పైనుండి బాలుఁడు మ్రింగుచుండి
    జాలి పొంగారఁ గ్రిందకున్ జార్చఁ గని ప
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    ఉత్పలమాల
    వేడుక రామమూర్తి యను వీరుడు 'కోడి' యె యింటి పేరుగా
    నోడుట లన్నవే కనని యోధుడు 'భారత హెర్క్యులస్' వినన్
    వాడిమగండె! విందున సవాదుగ వండగ మిక్కుటమ్ముగన్
    కోడినిఁ 'గోడి' మ్రింగెఁ !గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే!

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    కోడి రామ్మూర్తి యోధుని కోడి యనఁగఁ
    బేర్మి యిండియన్ హెర్క్యులస్ బిరుదునందె
    విందు భోజనమ్మందున వేడుక యన
    కోడినిన్ మ్రింగె నొక 'కోడి' సూడ జనులు

    రిప్లయితొలగించండి
  17. సమస్య :

    కోడిని గోడి మ్రింగె గను
    గొన్న జనుల్ సహజమ్మటందురే

    ( కోడిపేరే యింటిపేరైన గొప్పదర్శకుడు భోజనసమయంలో చేసిన పని )

    ఉత్పలమాల
    ..................

    వేడుక మీర జిత్రముల
    వెల్లువగా నొక నూరు తీసెనే
    యోడక నెన్ని కష్టముల
    నోర్పు వహించుచు రామకృష్ణయే ;
    కోడిని యింటిపేరు గల
    గొప్ప సుధీమణి విందువేళలో
    గోడిని గోడి మ్రింగె గను
    గొన్న జనుల్ సహజమ్మటందురే !

    రిప్లయితొలగించండి
  18. అనుగయిన తావి బసిగట్టి యచటగల ప
    కోడినిన్ మ్రింగె నొక కోడి ; సూడ జనులు
    దాని వెంటబడి దరుమ దౌడుదీయ
    గాలు విరిగె నొక సొబగు కాంతకపుడు

    రిప్లయితొలగించండి
  19. ఉ:

    చూడు మటంచు మాంత్రికుడు చోద్యము కోడిని గోడి మ్రింగనై
    యాడుచు పాడుచున్ తనర యాశల రేపుచు సంభ్రమమ్ముగన్
    కూడిన లోకులెల్లరకు గొప్పగు గారడి విద్య జూపనై
    కోడిని గోడి మ్రింగె, గను గొన్న జనుల్ సహజమ్మటందురే ?

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2వ పూరణ

      ఉ:

      ఏడుపు నాప తల్లి నొక యెత్తుగ బాలుడి కివ్వజూపగన్
      కోడిని బోలు బిస్కిటులు; కోపము నెచ్చగ రువ్వి వేయ న
      వ్వాడకు దిర్గు కుక్కటము వాటము నెంచి హరించి మేయగా
      కోడిని గోడి మ్రింగె గను గొన్న జనుల్ సహజమ్మటందురే !

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు ; కుక్కటము / కుక్కుటము గా చదువగలరు

      తొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెండ్లి వారింట వండిరి ప్రీతి తోడ
      పలు రకములగు చక్కని వంటకములు
      కారపుపదార్థములలోనికమ్మనగుప
      కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

      తొలగించండి
  21. వేడిగ నొక్క వంటకము విందుకు సిద్ధము జేయబూనుచున్
    నాడుచు బాడుచుండి యొక యాడుది మాడ్చిన గుండ్రమైన జే
    గోడినిఁ గోడిమ్రింగెఁ ; గనుఁగొన్నజనుల్ సహజమ్మటందురే ?
    కోడికి ప్రీతి యౌనుగద కోమల మైనటువంటి తిండియే

    రిప్లయితొలగించండి
  22. దోమ లొక్క ప్రక్క‌న రొద,తోడు కీచు

    రాయి రవముల తో భంగ మాయె నిదుర

    తట్ట క్రిందకు పరుగిడి దాగిన ఎల

    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    సంత సించి నిదుర లోకి జారి రపుడు

    రిప్లయితొలగించండి
  23. వచ్చె సంక్రాంతి పర్వము పల్లెయందు
    కత్తి కట్టిరి కోళ్ళకు కదనమునకు
    పోరు నందున రుధిరమ్ము పారెనచట
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    రిప్లయితొలగించండి
  24. వేడిగ సాగుచుండెనట వేడుక మీరగ కోళ్ళ పందెముల్
    కోడికి కోడికిన్ నడుమ క్రోథము హెచ్చెను పందె మందునన్
    వాడిగనున్న కత్తిమొన వాటముగా తగులంగ నత్తరిన్
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. చేడియ యొక్కరోజునను స్వీయ గృహాంగణమందు భక్ష్యముల్
    పోడిమి పందెమందునను బూర్తిగ దెల్పు డటంచు వేసి తా
    జూడగ దిండిపోతనెడి చొప్పున వంచన చేసి యన్యమౌ
    కోడినిఁ, గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే”

    రిప్లయితొలగించండి
  27. దూడకువచ్చెగొమ్ములనిదూర్తులుగొందరురచ్చజేయగన్
    మూడగుగన్నులున్నవనిమూర్ఖులుగొందరుబెంపుసేయగన్
    వాడిగవార్తలయ్యెనవివాస్తవమెంచనిమాధ్యముల్భళీ!
    గోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  28. కోడిపందెములకు నొకకోడినేరి
    బలముకై ప్రతిదిన జీడిపప్పుదెచ్చి
    నోటికందించె వేయించి మేటిగా, ప
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    రిప్లయితొలగించండి
  29. వేడుక నొప్పఁ బర్వమున పిల్లలకోసము పిండివంటలన్
    వాడుకఁ బల్విధమ్ములగు పక్వపదార్థము పాయసమ్ములన్
    చేడియ చేయు చుండ నట, చెంగటనే తిరుగాడు చుండి చే
    కోడినిఁ గోడి మ్రింగెఁ, గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  30. ఏడ విచిత్రమియ్యది మహిం గను గొంటివొ? జాగిలమ్మునుం
    గూడి మరొక్క జాగిలము కూర్మి మెలుంగును గాని మ్రింగునే?
    తోడుగ నుండగం గనవొ? దూకొని యొండొరు జంపుకున్నవో?
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  31. బుర్రు మని వచ్చినొక కోడిపుంజు, నంజు
    కొనగ మందుబాబులు తెచ్చుకొన్న దొకటి
    పెట్ట కోడి కొరకు తెచ్చి పెట్ట నా ప
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు




    రిప్లయితొలగించండి
  32. వాడుక లాయె పెక్కులగు వంటలు గూగులు గాంచి వండగన్
    వేడుక వచ్చెనంతటను వేగమె సాధన తోడుతన్ గనన్
    వేడిగ జేయగా నతివ వింత పదార్థము రూపునున్నదౌ
    కోడినిఁ, గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  33. నాడొక పండుగంచునొక నా
    యుడి గేహమునందు ప్రేమతో
    కూడియు నింటివారలును
    గొప్పగ జేసిరి పిండివంటలున్
    పోడిమితో దినంగ నొక పోరడు
    నేలపయిన్ బడ వేసినట్టి చే
    గోడిని గోడి మ్రింగె గనుగొన్న
    జనుల్ సహజంబటందురే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  34. ఈయఁగ సమస్య నొక్కటి నివ్విధముగఁ
    “గోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”
    చెలఁగి బూరింతు రివ్విధి శీఘ్రముగఁ “బ
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”

    [నేను బూరింప నేల యనినఁ బకోడి యన్య దేశ పదము]


    వేడుక మీఱ నొక్కటిని వే దిగి తమ్ముల యింట నేర్పునన్
    గోడను దూకి యన్యమును గొక్కొకొ యంచును మోసపుచ్చుచుం
    బాడిగ వండ నింటఁ దమిఁ బట్టఁగ నీటిని నేల రెంటి నీ
    ర్కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  35. గ్రద్ద యొక్కటి ధరదిరు గాడునట్టి
    కోడినిన్ మ్రింగె,నొకకోడి సూడజనులు
    గ్రుడ్లు వెట్టెను దెల్లటి రంగు గలవి
    మెఱయు చున్నవి దళదళ మెఱుపు తోడ

    రిప్లయితొలగించండి
  36. కోడిని గోడిమ్రింగె గనుగొన్న జనుల్ సహజమ్మటందురే
    చూడగ నిట్టులే ధరను జోద్యము లెన్నియొ జర్గుచుండు,నే
    నాడొవచించె గా మనకు నైతిక గుర్వులు వీరబ్రహ్మమున్
    బాడియ నంగ గానమిక వ్యర్ధుల రాజ్యము సాగునీ ధరన్

    రిప్లయితొలగించండి

  37. 3వ పాదములో
    గువుగారు గణభంగమైనట్లు తెలియడంలేదు
    వివరించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  38. వేడుకగాను జేరిరట పెండ్లికి పెద్దలు పిన్నలందరున్
    వాడుకటంచు దెమ్మనగ వండిన భక్ష్యములన్ని వేగమే
    చేడియ చేయి జారి యట చిందె పదార్థములందునొక్క చే
    కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

    రిప్లయితొలగించండి
  39. అండములకొరకనుచును నాదరమున
    పెంచనటునిటుతిరుగుచు పెరటియందు
    మొలచినట్టి యాపచ్చని పూత నుల్లి
    కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు

    రిప్లయితొలగించండి