19, జూన్ 2021, శనివారం

సమస్య - 3757

20-6-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు”
(లేదా...)
“నెత్తురటంచుఁ ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్”

63 కామెంట్‌లు:

  1. కారము కలిపి ఇచ్చెను కరకు అత్త,

    నీరమునుఁ ద్రాగె జలజాక్షి , నెత్తురనుచు

    నూరు వాడలందున చాటె , నుర్విన

    కడు
    కఠినపు మగువలు కలరు కనుము దేవ

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  2. కొత్తగ నెట్టుగొల్పిరట కూడలినంగడి గాంచనచ్చటన్
    చెత్తని పారబోసెనొక చిన్నది యెర్రని పానకంబు దా
    నెత్తురటంచుఁ; ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్
    సత్తువనీయకున్ననది చక్కగ దీర్చెను దాహమామెకున్

    రిప్లయితొలగించండి
  3. అన్యాయంబగు పాపహేతువగు కామాధిక్యదుర్మార్గమౌ
    వన్యోజ్జీవనజంతుజాలసముడౌ పైశాచికౌద్థత్యమౌ
    మాన్యా! కూడని దేల వాకొనుదువో? మద్యమ్మునున్ గ్రోలితో?
    కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తి యౌ నందురే?

    కంజర్లరామాచార్య

    రిప్లయితొలగించండి
  4. సమస్య :
    నెత్తురటంచు ద్రాగె నొక
    నీరజలోచన స్వచ్ఛనీరమున్

    ( ఎదురుతిరగవనే పొగరుతో పక్షులనీ పశువులనీ దేవికి బలికావించే కఠినాత్ములను మందలిస్తున్న వనితామణి )

    " మెత్తని గుండె యున్న కడు
    మేలిమితల్లిని గాంచరేలొకో ?
    మత్తును మాని కాళి కిక
    మల్లెల మాలల పూజసేయుడీ !
    కత్తుల గొంతు గోయకుడు
    కాల్వలు గట్టగ మూగజీవి క్రొ
    న్నెత్తు " రటంచు ద్రాగె నొక
    నీరజలోచన స్వచ్ఛనీరమున్.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. తేటగీతి
      భామ నరసింహునిగ నొక్క పాత్రవైచి
      కనక కశిపుని వధియించు ఘట్టమందుఁ
      ద్రాగుమనుచు దోసిట నింప దర్శకుండు
      నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు

      ఉత్పలమాల
      అత్తరి భక్తినాటకము నంగన దీరెను నారసింహుఁడై
      మిత్తిగ నుద్భవించి యట మీరిన దైత్యుని బొట్టఁ జీల్చెడున్
      గుత్తపు సన్నివేశమునఁ గూర్చగ దోసిట దర్శకుండటన్
      నెత్తురటంచుఁ ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ఒకసుదతి మందబుద్ధియు నుండె నకట!
    జలము గ్రోలంగ నేగెను నలిని కడకు
    నెర్ర నైనట్టి దోసిళ్లు పెట్టి తాను
    నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  7. అరుణవర్ణంపుశోభనునవనిపుత్రి
    కాంతులీనుచుసరసునకానఁబడగ
    రక్తదాహమునందినరాక్షసపుడు
    నీరమునుఁద్రాగెజలజాక్షినెత్తురనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాక్షసి+అపుడు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "రాక్షసి యదె" అనండి.

      తొలగించండి
  8. జారి పడియెను కుంకుమ సలిలమందు
    రంగు మారుట దెలియక రాత్రి యందు
    నీరమును ద్రాగె జలజాక్షి నెత్తురనుచు
    భ్రాంతి జెందియు నయ్యెడ భయము నందె

    రిప్లయితొలగించండి

  9. సత్తెనపల్లి గ్రామమున చక్కని నాటక మేయ నెంచుచున్
    క్రొత్త కథాంశమొక్కటిని కూటమిగా నట వేయు వేళలో
    నెత్తురు గ్రోలు దయ్యముగ నృత్యము జేయుచు నాటకమ్ములో
    నెత్తురటంచు ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛనీరమున్.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. మత్తున ద్రోల వాహనము మార్గమునందున రాత్రివేళలో
      తత్తరపాటునన్ గదిసి దారినబోయెడు మానిసిన్ వడిన్
      కుత్తుక చీల్చగా నచటి ఘోరపు దృశ్యము గానలేను నీ
      నెత్తురటంచు, ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛనీరమున్

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  11. కత్తినిదాల్చిరుద్రమయుకానలదిర్గుచుశత్రుమూకలన్
    మిత్తినిబోలిదాడులనుమేనులద్రుంచెనువైరమూనుచున్
    చిత్తముశాంతినందనికచింతనుబాసెనుసేదఁదీరుచున్
    నెత్చరరటంచుఁద్రాగెనోకనీరజలోచనస్వచ్ఛనీరమున్

    రిప్లయితొలగించండి
  12. ~~~~~~~~~~~~~~~~~~~
    బిత్తరపాటు జెందకను భీకర
    క్రోధముతోడనున్న వో
    పుత్తడి బొమ్మనీరమును
    ముట్టక వీడెను భీతితోడ తా
    నెత్తురటంచు, ద్రావెనొక నీరజ
    లోచన స్వచ్ఛనీరమున్
    అత్తరి దాహమేయ వడి,
    నాగజ గామిని తృప్తిదీరగా
    ~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక'ను 'వో' అనరాదు. "... నున్న నా పుత్తడిబొమ్మ" అనండి.

      తొలగించండి

  13. రాక్షసులరాజ్య మదియంట రాణిగారి
    ప్రియసఖి యొకతి బంగారు బిందెలోన
    నల్ల నిచ్చెడు దృశ్యమున్ నాటకమున
    నీరమును ద్రాగె జలజాక్షి నెత్తురనుచు.

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    మత్తుగ తూలుచున్ మగని మాటలు గట్టిగ తూలనాడుచున్
    నత్తను మామనున్ తుదకు నందని దూరము నాశ్రమమ్మునన్
    మొత్తము మీద జేర్చు మన, బుద్ధిగ కాదను భర్త నొచ్చనై
    నెత్తురటంచు ద్రాగె నొక నీరజ లోచన స్వచ్ఛ నీరమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. క్షుద్ర పూజల సినిమాలు చూచి చూచి
    చిన్న మెదడున నరములు చిట్లినట్లు
    వింత చేష్టలు చేయుచు వెర్రివోలె
    నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు

    రిప్లయితొలగించండి
  16. నవ్య పోకడలను బోవు నవ వధువుకు
    యడుగుల పయిన పారాణి నద్దినంత
    గుఱ్ఱుగగని యా మిగిలిన యెఱ్ఱనైన
    నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు

    రిప్లయితొలగించండి
  17. నిత్తెము చెత్త పొత్తముల నెత్తురు సాహితి నెత్తికెక్కగా
    చిత్తము చంచలించి బహు చిత్రపు చేష్టల నెల్లవారలన్
    బిత్తరపోవు చందమున భీతినిగొల్పుచు భీకరంబుగా
    నెత్తురటంచుఁ ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్

    రిప్లయితొలగించండి
  18. కత్తులు వాడి చంపుకొను ఘట్టము చూపగ దర్శకుండు గ
    మ్మత్తును చేసే చిత్రమున, మాటున నెర్రని కాంతి పంపగా
    నెత్తురటంచుఁ ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్
    కుత్తుక గోసి నొక్కరుని క్రోధము తోడుత తాన్ నటించు చున్

    రిప్లయితొలగించండి
  19. ఇంద్రజాలమునేర్చిన యిందువదన
    వేదికనధిరోహించెను వేడ్క తోడ
    ఎరుపు రంగుద్రవముజూపెనెల్లరకును
    నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు

    రిప్లయితొలగించండి
  20. పలువ పడతిని బట్టెను పాడు చేయ
    కత్తి చేబూని బొడిచె ను కంబు కంఠి
    కలను, భయము చేతను లేచి కలత పడుచు
    నీరమునుఁ ద్రాగె, జలజాక్షి నెత్తురనుచు.

    రిప్లయితొలగించండి
  21. ఇత్తఱి భావులన్ జలములింకెను వేసవి మండుచుండగా
    విత్తములేదు నీరమును విక్రయ దారుని నుండి పొందగా
    చిత్తడినేలలో మునుపు చేరిన యెఱ్ఱని నీరు చిక్కగా
    నెత్తురటంచుఁ ద్రాగెనొక నీరజ లోచన స్వచ్ఛనీరమున్
    (భావులింకి నప్పుడు సున్నపురాయి నేలలో నీరు తెల్లగా, ఎర్రనేలలో ఎర్రగా ఉంటాయి. మేము పొలంలో అవేత్రాగి ఆరోగ్యంగా ఉండేవారము)

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  23. ఉత్తమురాలు కన్య కడు నున్నత విద్యల నేర్చెనంచు, దా
    చిత్తమునం దలంపుచు విశేష గతిన్ వివహంబునాడి, తా
    కొత్తగ గాపురంబునను కోవిడు పేర వియోగ బాధతో,
    నెత్తురటంచుఁ ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్.

    రిప్లయితొలగించండి
  24. పూర్వ జన్మము రాకాసి భూత మేమొ
    కళ్ళు కామెర్లుగ్రమ్మగ గానబడక
    నీరమునుద్రాగె జలజాక్షి నెత్తురనుచు
    జన్మ ఫలితమ్ము గనిటుల జరిగెనిపుడు

    రిప్లయితొలగించండి
  25. మెత్తని చేతివేళ్ళు గల మెచ్చిన నిచ్చెలి చిన్ననాట తా
    నొత్తుచు బొమ్మ గీయు తరి, యోరగ జూచుచు సైన్సులాబులో
    కత్తిని వాడి పెన్సిలును గట్టిగ జెక్కగ వేలిగాయమై
    నెత్తురటంచు, ద్రాగెనొక నీరజలోచన స్వచ్ఛనీరమున్

    రిప్లయితొలగించండి
  26. నెత్తురటంచు ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛనీరమున్
    నెత్తురు ద్రాగగోరుచును నీరముద్రాగెను జిత్రమయ్యెడిన్
    చిత్తము నందు జూడగను జిత్రమ యాయెను రాక్షసాంగనౌ
    మత్తున నుండుచున్ నటుల మార్చుచు ద్రాగెను దైవమోపెడున్

    రిప్లయితొలగించండి
  27. మీనములఁ దిన నెదఁ దల్చె మీన నయన
    కాన రాకున్న వెదకంగ మేను బడలె
    నుస్సు రంచును గుండలో నున్నయట్టి
    నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తు రనుచు

    [జల జాక్షి = చేపల జంట; జలజము = చేప; అక్షి = రెండు]


    మత్తున నుండు సంతతము మానక నా పతి యంచు నేడ్చుచున్
    నిత్తెము దాను గ్రూరముగ నింద లిడంగ సహింప నేరకే
    యత్తఁ దలంచి డెందమున నక్కసుతోఁ బగ దాని యెఱ్ఱనౌ
    నెత్తు రటంచుఁ ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛ నీరమున్

    రిప్లయితొలగించండి
  28. కారె నెత్తురు యేరులు కాగ, నిచట
    దుర్మదుల దుర్గుణముల ఘాతుకము మీర
    దుర్గ రూపము దాల్చి మృత్యువును జూపి
    నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తురనుచు

    రిప్లయితొలగించండి
  29. రంగునందున్న డ్రింకును తొంగిజూడ
    మరద లంజూసి బావనె మరుపునందు
    నీరమును ద్రాగె జలజక్షి నెత్తురనుచు
    పలికె కలయందు నవ్వుచు పళ్లుగొరికి!

    రిప్లయితొలగించండి
  30. కత్తినిబట్టికూరలను కాయును కోయగ కత్తిదెబ్బకున్
    నెత్తురు కారు చుండగను నెవ్వగ తోడనునేడ్చుచున్ వడిన్
    మెత్తగ వ్రేలునోటనిడి మెల్లగ చీపుచు భీతితో నటన్
    నెత్తు రటంచు త్రాగెనొకనీరజ లోచన స్వచ్ఛ నీరమున్
    [

    రిప్లయితొలగించండి
  31. కత్తినిబట్టికూరలను కాయును కోయగ కత్తిదెబ్బకున్
    నెత్తురు కారు చుండగను నెవ్వగ తోడనునేడ్చుచున్ వడిన్
    మెత్తగ వ్రేలునోటనిడి మెల్లగ చీపుచు భీతితో నటన్
    నెత్తు రటంచు త్రాగెనొకనీరజ లోచన స్వచ్ఛ నీరమున్

    రిప్లయితొలగించండి