28, జూన్ 2021, సోమవారం

సమస్య - 3766

29-6-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె”
(లేదా...)
“వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా”

56 కామెంట్‌లు:

  1. సమస్య :
    వరముల నిచ్చి దుష్టులకు
    వాసి గడించితి వెట్లు శంకరా

    ( భస్మాసురునికి పమమేశ్వరుని వరప్రసాదం )

    చంపకమాల
    .................

    సరగున వచ్చినావు గద !
    సంయమనంబు లవంబు లేని దు
    ర్విరసుడు భస్మదానవుని
    విస్తృతమూఢతపంబు మెచ్చుచున్ ;
    జెరపుదలంపున న్నడిగె
    జేతిని జేర్చిన భస్మ మౌనటుల్ ;
    వరముల నిచ్చి దుష్టులకు
    వాసి గడించితి వెట్లు శంకరా ?

    రిప్లయితొలగించండి
  2. నెత్తిమీదనెక్కినటననేర్చెగంగ
    సిరికితమ్ముఁడుసిగఁజేరిచిందులేసె
    చిప్పచేతికివచ్చెగాశివుడనీకు
    వరములిడిదుష్టులకువాసిగంటె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని గంగా చంద్రులు దుష్టులెలా అయ్యారు?

      తొలగించండి
    2. గంగ, చంద్రుడు, శివునికితిండిపెట్టలేదు, అందుకేశవుడుభిక్షువుగామారాడుఆశ్రయమిచ్చినవానినిఆదరింపలేదు

      తొలగించండి

  3. హరహర శరణమీవని యసురుడైన
    నా గజాసురు గోరిక నాదరమున
    దీర్చ వానికుక్షిని జొచ్చితివట గదర
    వరములిడి దుష్టులకు శివ వాసి గంటె.



    పరమ దయాళువీవనుచు భక్తవశంకరు వీవెయంచు నీ
    చరణము వీడనంచు కడు స్వార్థము తోడ నుతింప నేమిరా
    సరియని యట్టి దానవ గజాసురుఁ గుక్షిని వాసముంటివే
    వరములనిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా!

    రిప్లయితొలగించండి
  4. వరములిడిదుష్టులకుశివవాసిగంటె

    రిప్లయితొలగించండి
  5. ( విష్ణువు అవతారములకు శివుడిచ్చిన వరములు కారణమను భావనతో)

    తపము చేసిరి సుర వైరి దళ పతులును

    తగని ఫలములనిచ్చెను దక్ష వైరి

    అవతరించి హరి దునిమెనసురవరుల

    అవతరణల మూలము కదరయ్య హరుడు

    వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    కోరినంత గజాసుర కుక్షిఁజేరి
    తరుణి నినునమ్ము గిరిజను మరచి నావె
    మహిని బోళా మనుజునిగ సహనశీలి!
    వరము లిడి దుష్టులకు శివ! వాసిఁ గంటె!

    చంపకమాల
    మరచియు పార్వతిన్ హర! యమాయకుడౌచు గజాసురోదర
    మ్మరిగితె భావ్యమే? తపమునందలి యౌచితి విచ్చవిచ్చలీ
    వెరుగవె? రాక్షసత్వమున వేడిన తోడ నుదారవాదివై
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు? శంకరా!

    రిప్లయితొలగించండి
  7. భక్త సులభుడు రుద్రుని భావమందు
    నిల్పి జపియించి వేడగా నిక్కువముగ
    నెట్టి కోర్కెల నైననీ విత్తువు గద
    వరములిడి దుష్టులకు శివ వాసి గంటె !

    రిప్లయితొలగించండి
  8. పరమముగాగభక్తినటపాయకనీవరమందెయేనుగున్
    సరగునవానిఁజంపగనుశౌరియవచ్చెనుసందడిన్తుదిన్
    పిఱికిగఁబారఁనీగతినిపేరునుఁబోయెనుదేవగంటివే
    వరములనిచ్చిదుష్టులకువాసిగడించితివెట్లుశంకరా

    రిప్లయితొలగించండి
  9. కరుణకు నాలయంబయిన కంతువిరోధికి లేదు వేరిమే
    స్థిరమగు భక్తిభావనను తీవ్రతపంబున వేడ దీర్చు దా
    దురమున వారికోరికల, దూషణయౌనుగ నిట్లుబల్కుటే
    వరములనిచ్చి దుష్టులకు వాసిగడించితి వెట్టుల శంకరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరగును నీదుమానసము కావర ఈశ్వరయన్న వెంటనే
      సరగున నిచ్చివేయుదవు సర్వము నెంచక ముందువెన్కలన్
      హరికిని తప్పదెప్పుడును హానినిబాపగ వేడదేవతల్
      వరములనిచ్చి దుష్టులకు వాసిగడించితి వెట్టుల శంకరా?

      తొలగించండి
    2. బిరుదును బొందినావుగద పిల్చినవెంటనె బ్రోతువంచు నా
      గరళము మ్రింగినావుగద కాంతయునొచ్చక సమ్మతించగన్
      విరళముగాగ నీదుదయ విజ్ఞతెరుంగని మాటయౌనుగా
      వరములనిచ్చి దుష్టులకు వాసిగడించితి వెట్టుల శంకరా?

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
  10. చం:

    శరణము గోరినంతటనె సన్నిధి నిల్చి వికల్ప మెంచకన్
    దురమున దీర్చు చుందువట దొబ్బులు పెట్టక నేది కోరినన్
    స్థిరమగు కారణంబు లయ చేయుటె లక్ష్య మటన్న రీతి, నా
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. కడు భయంకర రాక్షస కామితములు
    తీర్చు రీతిన నీకృప తేజరిల్ల
    దర్శనంబిడితివిగదా తక్షణమ్ము
    వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రీతిని" అనండి.

      తొలగించండి
    2. సవరణతో....

      కడు భయంకర రాక్షస కామితములు
      తీర్చురీతిని నీకృప తేజరిల్ల
      దర్శనంబిడితివిగదా తక్షణమ్ము
      వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె

      తొలగించండి
  12. అరయక మంచి చెడ్డలసురాధము గోర్కెను దీర్చినంతనే
    సరగున నీ శిరంబునిడ జాచెను చేతిని బూది సేయగా
    హరి యరుదెంచి మోహినిగ వానినడంచుటవశ్యమాయెగా
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా

    రిప్లయితొలగించండి
  13. మునుల నబలల బాధల ముంచి వేయు
    దుష్ట దుర్మార్గ వర గర్వ దురిత జనుల
    హతము జేయుట ప్రశ్నయౌ హరికి ; మిగుల
    వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె.

    రిప్లయితొలగించండి
  14. అసురుల తపములను మెచ్చి యతిసులువుగ
    వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె ,
    సంకటములబడుచు చక్రి సాయ మొందె
    పాత్రము నెరుగకుండిన ఫలితమిదియె

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు
    అందరి పూరణలూ అలరించు చున్నవి
    అలరించనున్నవి

    B01)
    వెనక ముందులు మంచి చెడ్డల నాలోచింపకయే దుష్టుల
    క్రూరమైన కోర్కెలు దీర్చుటేగా శంకరుని పని
    _____________________________________________

    హర హర నీలకంఠ యగ - జాపతి యీశ్వర బ్రోవ మన్నచో
    సరి సరి మంచి చెడ్డ గన - జాలక క్రూరపు కోర్కె దీర్చి, కా
    వరమది హెచ్చు రీతిగ, ప్ర - పంచమదెంతయొ చేటునొందగన్
    వరముల నిచ్చి దుష్టులకు - వాసి గడించితి వెట్లు శంకరా ???
    _____________________________________________
    శంకరార్యా
    హమ్మయ్య
    2021 కి life certificate సమర్పించాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు శంకరాభరణంలో మీ పూరణ! సంతోషం.
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. నరులను కష్ట నష్టముల నాదిని చేర్చెను పార్వతీశుడున్

    వరముల నిచ్చి దుష్టులకు ; వాసి గడించితి వెట్లు శంకరా

    గరళము మ్రింగినాడనచు , కాంచగ సర్వము నీదు సృష్టియే

    హరి హరి నీదు వంటకము హాయిన మ్రింగుట గొప్పలౌనురా

    పరుగున వచ్చి మ్రింగవయ పాడు కరోనల మాయ రోగముల్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  17. నీవా గజాసురునికి ముదముగ వర ములనిడకున్నచో లలన గిరిజ

    నలుగు బొమ్మకు కడు చెలిమితో ప్రాణమ్ము
    నొసగ జాలదు గదా మిసిమి తోడ

    నాడు భస్మాసురు నకు నీవు వరముల
    నిడనిచో శ్రీహరి నెపుడు చూడ

    గలరా ఘనముగ జ గన్మోహనావతా
    రమును జగమ్ము పరవశముగను


    నాడా భగీరథునకు నీవు
    వరముల
    నివ్వ కున్న భువిపై నెటుల పుణ్య

    గంగమ్మ వేగమ్ము గా పరుగులిడుచు
    జనులు కిడగలదా
    సంతసమ్ము


    నాడు సాగర మధనమున గరళముద్భ
    వించగా నెల్లరున్ వేడు కొనగ

    నీవు వరము లిడని యెడల
    యమృతము
    జన్మించ గలదా నిజమ్ముగాను


    తరచి చూడ శిష్టులకును వరము లొసగి

    నాదు కొంటివి సతతము‌ నమ్మకముగ,

    వరము లిడి దుష్టులకు శివ వాసి గంటి

    వెల్ల కాలము లందును చల్ల ‌గాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..యెడల నమృతము... లొసగి యాదుకొంటివి..." అనండి.

      తొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. పరమకృపారసప్రచురవాసితకీర్తివిరాజివై మహ
    ద్వరముల నిత్తివే దనుజభక్తుల కయ్యవి వాస్తవమ్ముగా
    మరణము గూర్చు నట్లకట! మార్పు వహించె దురాశయమ్ములై,
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  20. భక్త జనులపై కృపతోడ వారికి దగు
    వరము లిడి ; దుష్టులకు శివ వాసిఁ గంటె
    దగిన శాస్తి జరుపుచుండు దప్పకుండ
    ననుచు , సాటి లేరుగద యీ యంబ నెఱికి

    శివ = పార్వతి

    రిప్లయితొలగించండి
  21. నిరతము జన్నముల్ జెఱచి నిర్మల చిత్తుల మౌని వర్యులన్
    కరుణ యొకింతలేక కడు కర్కశ బుద్ధిని హింస పెట్టుచున్
    నరులను చంపి క్రూరముగ నంజుడు గాగొను చుండ నీవు పల్
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా?

    రిప్లయితొలగించండి
  22. ధరగజాసురునకు దయ వరమునిచ్చి
    ప్రాణ హానికి గుఱియయి భయప డితివి
    యేమి ఫలితము గలిగెను నేమి నీకు
    వరములిడి దుష్టులకు శివ వాసిగంటె

    రిప్లయితొలగించండి
  23. అరమరి కల్ గనంగకను నర్హత కానటువంటి వారికిన్
    విరివిగ నిచ్చుచుంటివిల వేలకువేలు వరంబు లొక్కెడన్
    ఖరులగు వారలెప్పుడును ఖర్కశ వృత్తిని జేటు జేతురే
    వరములనిచ్చి దుష్టులకు వాసిగ డించితి వెట్లు శంకరా!

    రిప్లయితొలగించండి
  24. శరణని కోరి వచ్చినను జక్కగ నక్కున జేర్చుకుందువే
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా
    యరయగ హేతువేమనగ నంతయు నీదు మహాత్మ్యమేను, నీ
    కరుణయె లేనిచో నిలను గామయె కుట్టగ జాలదే గనన్

    (గామ-చీమ)

    రిప్లయితొలగించండి
  25. అడుగ వాధార పత్రమ్ము నసమ నేత్ర!
    నిత్తెపు నగదు లెక్కయు నీలకంఠ!
    వఱలి ముఖ చిత్ర మడుగవు పంచవక్త్ర!
    వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె

    [దుష్టులకు (న్); నిత్తెపు నగదు లెక్క (నినలె) = PAN]


    పరమ శివా నుతింతు నని ప్రార్థన సేసినఁ జాలుఁ బొంగుదే
    పరఁగితి వీవు బాణునకుఁ బ్రాణ సఖుండవునై గిరీశ్వరా
    నిరతము భస్మ దైత్యునకు నెమ్మి దశాస్య ముఖాసు రాలికిన్
    వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా

    రిప్లయితొలగించండి
  26. భక్తి యందున వేడిన శక్తి నొసగు
    వరము లొసగెడి హరుడని మరువబోక
    తపముజేసినఫలమిడు తత్వమందు
    వరములిడు దుష్టులకుశివ!వాసిగంటె.

    రిప్లయితొలగించండి
  27. తపముజేసిన మాత్రాన తామసులగు
    రక్కసులకు నీవెప్పుడు రక్ష జేసి
    భక్త సులభుడవని పేరుబడయు కొఱకు
    వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె

    రిప్లయితొలగించండి
  28. తపముచేయగమెచ్చుచు దండిగాను
    వరములిడి దుష్టులకు శివ వాసిగంటె
    నావరమ్ములె నీకట హాని కూర్చ
    కాపు కాచెను నిన్నట కంబుపాణి
    మరొక పూరణ

    కరములు జోడ్చి మ్రొక్కగనెకమ్మగ కోర్కెలు దీర్చుచుం దువే
    హరహరనీదువత్సలతయెంచగనేరికిసాధ్యమౌనయా
    శరణముకోరినంతనటసందియమొందకసంతసమ్ముతో
    వరములనిచ్చిదుష్టులకువాసిగడించితవెట్లు శంకరా

    రిప్లయితొలగించండి