20, జూన్ 2021, ఆదివారం

సమస్య - 3758

21-6-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్”
(లేదా...)
“మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్”

44 కామెంట్‌లు:

 1. సందరము చిలుకు వేళల

  పొందిక వీడి గిరి క్రుంగె , నందుని సుతుడున్

  పొందిన గాయము కాంచిన్

  మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 2. కందెనుకాంతలమనసే
  కుందేలాయెనుసుదతియుకుండలతోడన్
  చిందులువేసెనుకవ్వము
  మందరపర్వతమునోక్కమానినిఁదిట్టెన్

  రిప్లయితొలగించండి
 3. కందం
  విందొనరించును సుధనని
  యందరుఁ దెచ్చియు మధించ నంబుధి నా కీ
  యిందిరనిడె సవతిగనని
  మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

  మానిని = భూ దేవి

  ఉత్పలమాల
  విందొనరించు తా సుధను వేడుకఁ గ్రోలెద మంచు దెచ్చి య
  య్యందరు జుట్టి వాసుకిని నంబుధి జిల్కఁగ ముందె కుందఁగా
  నిందిర నొక్కతెన్ సవతి నేర్పడ జేసెనటంచుఁ జెచ్చెరన్
  మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్

  రిప్లయితొలగించండి
 4. సుందర కూర్మంబు హరిని
  మందర పర్వతము నొక్క , మానిని దిట్టెన్
  కొందలమందుచు సురలను
  నిందితులను జేసి పతికి నీడగనిల్చెన్

  రిప్లయితొలగించండి

 5. సందర మథనము సేయగ
  నందుండిప్రమాదకరపు హాహాలమ్మే
  మందరమణిజేర తొగను
  మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్.

  రిప్లయితొలగించండి

 6. సందరమున్ మథింపగ విషమ్ము ప్రమాదకరంబు నాభియే
  యందుననుద్భవించి యది యంబరకేశుని కంఠమందునన్
  మందది జేరివానికట మచ్చను జేసెనటంచు బాధతో
  మందర పర్వతంబునొక మానిని నిందయొనర్చె గిన్కతోన్.

  రిప్లయితొలగించండి
 7. అందపు క్షీ రాంబుధి లో
  సుందర శైలమ్ము క్రుంగ సురవరు లెల్లన్
  పొందుగ వేడగ హరి గని
  మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్

  రిప్లయితొలగించండి
 8. కందుటగానవచ్చెనటకాంతకుమోమునదర్విలాగగా
  చిందులుస్రుష్టిలీలయనిచెప్పెడినామెకుముందువెన్కగో
  విందుడుపట్టిలాగుననివెన్ననుభద్రముఁజేయువేడ్కతో
  మందరపర్వతమ్మునోకమానినినిందయోనర్చెకిన్కతోన్

  రిప్లయితొలగించండి
 9. మంధరగిరిసందర్శన
  సంధర్భమునన్ బడలిక సంరోధముతో
  కందిన పాదంబులతో
  మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

  రిప్లయితొలగించండి
 10. సందరమునుచిలుకుటకై
  మందరమును శౌరి కూర్మమై తలదాల్చన్
  సుందర దేహము కందగ
  మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్

  రిప్లయితొలగించండి
 11. సుందరుడై చెలంగు హరి' సొక్కుచు మూపున కూర్మ రూపుడై
  మందరమున్ ధరింప పలుమారులు త్రచ్చుచు నొవ్వజేయగా
  కందిన దేహమున్ తలచి క్రందనజేసిరి భక్తకోటి యా
  మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్

  రిప్లయితొలగించండి
 12. మందిరము చేసి పతిదౌ
  డెందము నందుండెడు సిరి డీలా పడుచున్
  కందగ హరి, వీపునగల
  మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

  రిప్లయితొలగించండి
 13. డెందములో స్త్రీ సొగసుకు,
  మందమునను,మోటుశిలల మలినంబులతో
  కుందైతి నేనను మిషను
  మందరపర్వతము, నొక్క మానిని దిట్టెన్”

  చిందర బందరైన వన శీర్షముతోడ మహోన్నతంబులౌ
  మోదము నివ్వలేనిపెను మోటగు బండలు గుండ్లు తప్ప లే
  దందము, సౌష్టవం బు గల యంగజ సోయగ మొప్పు, మందమౌ
  మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చె, గిన్కతోన్

  రిప్లయితొలగించండి
 14. కొందరకమృతంబిడి మరి
  కొందరికిడి కల్పకంబు కోర్కెలు దీరన్
  ఎందుకు నాకేమిడవని
  మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

  రిప్లయితొలగించండి
 15. కందుకము వోలె నుండును
  మందరపర్వతము,నొక్కమానిని దిట్టెన్
  నందఱు నుండగ సభలో
  మందుడు మూర్ఖుడు నగునొక మంత్రిని బాధన్

  రిప్లయితొలగించండి
 16. మందర పర్వతంబిడెను మాన్యత నొప్పగ నమృతంబునున్
  నందఱి దేవతాళికిని నాయతరీతిని నంచుబల్కుచున్
  నందఱి కన్నియిచ్చి,దనుహర్షము నొందగ నీయకుండగా
  మందరపర్వతము నొకమానిని నింద యొనర్చె గిన్కతోన్

  రిప్లయితొలగించండి
 17. ఇందఱిలో నేల శివుని
  నంద ఱడుగ వలె నలసమె యా యద్రి విషం
  బందేల పుట్ట వలె నని
  మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

  [ఇక్కడ మానిని పార్వతీ దేవి చెలికత్తెలలో నొకతె]


  అందఱు చూచు చుండగ ననర్హను నిందల కేను మిన్నయౌ
  సుందర వృత్తి నుండ నిలఁ జోద్య మకారణ మక్క టక్కటా
  కంద మనమ్ము మిక్కుటము కర్కశ రీతిని నన్ను జూడు మా
  మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్

  రిప్లయితొలగించండి
 18. ఉ:

  బృందము కొండ జేరెనట విందును బొంద విలాసయాత్ర కై
  సుందరి యూరకుండకయె చుక్కలు చెక్కెను మందరాగ్రిగన్
  తొందరలోన *మందు* ర గ దోషము దొర్లగ సిగ్గునొందనై
  మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 19. అందరి బాగుకై విషము నాని యుమాపతి యుల్లసమ్ముతో
  కంధరమందునన్ నిలుపగా నది నల్లగ మాడ్చె చెచ్చెరన్
  కందిన నట్టిదౌ మగని కంఠము గన్గొని బాధ నొందుచున్
  మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్

  రిప్లయితొలగించండి
 20. బందరు లడ్డులన్ వడల భారిగ మెక్కుచు నింటినుండియే
  కందక కార్యభారమును కంప్యుటరందున నిర్వహించగా
  సుందరుడైన భర్త కడు చోద్యముగా గనుపట్ట బోలచున్
  మందర పర్వతంబు, నొక మానిని నిందయొనర్చెను గిన్కతో

  రిప్లయితొలగించండి
 21. సుందరమైనసంద్రమును , జుట్ట
  యు వాసుకి మందరాద్రికిన్,
  గుందుచు రత్నగర్భ పడు గోడు
  ను గాంచియు , ద్రచ్చుచుండగా
  మందుడ ! బాధకోర్చెగద మా
  నిని సాగరు భార్యయంచు నా
  మందర పర్వతంబునొక మానిని
  నిందయొనర్చె గిన్కతో
  ~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 22. మందర పర్వతము సముద్ర మధ్యము గా అతి సుందర ప్రదేశము. శివపార్వతులు ఇక్కడ కాపురం చేశారని ప్రసిద్ధి. ఇట్టి ప్రదేశంలో తిరుగాడే ఒక నాయిక ఈ విధంగా తలుస్తుందనే భావనగా నా ప్రయత్నము:

  ఉ:

  అందము చింద వేచితిని యామని వేళన పొందుగోరనై
  సందడి పిల్ల తెమ్మెరలు చక్కని వెన్నెల రాత్రులందు ; నా
  చందము గానకుంటి నిను చప్పున తోడ్కొన మంథనమ్ము, హే
  మందర పర్వతంబు ,నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి