29, జూన్ 2021, మంగళవారం

సమస్య - 3767

30-6-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు”
(లేదా...)
“సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్”

70 కామెంట్‌లు:

  1. పరమునిర్వికారభావనయేగద
    మనసులేనిమగఁడుమగువమాయ
    లీలఁజూచుచుండులేదుగనితరము
    ప్రేమలేనిమగనిఁజూచిభామమురియు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి. మీరు ఆటవెలది వ్రాసారు.
      పరము నిర్వికారంపు భావనయె కాదె
      మనసు లేనట్టి పెనిమిటి మగువ శక్తి
      లీలఁ జూచుచునుండును లేదితరము
      ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు.

      తొలగించండి
    2. చూచుకోలేదుపోరపాటుజరిగిందిక్షమించండి

      తొలగించండి
    3. పరమనిస్సంగుడాయెనుపతియెతనకు
      అఖిలబ్రహ్మాండమంతటనతడెయుండు
      మాయఁదెలియనిదేవుడుమర్మయోగి
      ప్రేమలేనిమగనిజూచిభామమురియు

      తొలగించండి

  2. మగడె సర్వస్వ మనుచును మగువ తాను
    తల్లిదండ్రుల విడనాడి తరలి వచ్చు
    నంచు ధర్మభాగిని తప్ప యన్యులనిన
    ప్రేమ లేని మగని జూచి భామ మురియు.

    రిప్లయితొలగించండి
  3. ఊరు పొమ్మను వేళల ఊళ వేసి

    పయిట జార్చి కోరి పిలిచె పంకజాక్షి

    పరువము విడిన ముదుసలి పడతి పైన

    ప్రేమ లేని మగనిఁ జూచి , భామ మురియు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  4. సంఘ మందున గౌరవ స్థానమంది
    సకల భోగాలు సమకూర్చు శక్తి గలిగి
    మాన్యుడై వ్యసనము లన్న మనము నందు
    ప్రేమ లేని మగని జూచి భామ మరియు

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    సుంతయు బ్రేమ లేని పతి
    జూచి సతీమణి పొందు మోదమున్

    ( స్వాధీనభర్తృక అయిన భార్యామణి )

    ఉత్పలమాల
    ....................

    చెంతనె యుండి సంతసము
    చిందగ తీయని యూసులాడెడిన్ ;
    చింతలు జేరకుండ తన
    చెల్మిని నిత్యము బంచుచుండు ; నా
    వంతయు లోటు చేయకనె
    యాశల దీర్చుచు నన్యకాంతపై
    సుంతయు బ్రేమ లేని పతి
    జూచి సతీమణి పొందు మోదమున్ .

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    సతికి త్రికరణ శుద్ధిగ బ్రతుకుఁ బంచి
    యర్ధనారీశు తత్వాన నలరుచుండి
    నాటకమున కైన పరకాంతలన మదిని
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు

    ఉత్పలమాల
    సాంతము నమ్మినంత మనసా వచసా శిరసా ప్రవర్తనన్
    గాంతుడు నర్ధనారిగను కమ్మని జీవిక నోలలాడుచున్
    వింత వినోద నాటకపు వేడుకకైన పరాయి స్త్రీలపై
    సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
  7. చెంతనెఁజేరియుండుగదచిక్కడుభావనకెప్పుడున్వడిన్
    పంతముతోడసాధననుపండితలోకమువేటయాడినన్
    వింతగుమాయకెప్పుడునువేగనుదక్కడుశక్తియుండగా
    సుంతయుఁప్రేమలేనిసతిఁజూచిసతీమణిపోందుమోదమున్

    రిప్లయితొలగించండి
  8. సతతము తనకు జీతము సంతసముగ

    తెచ్చి యిచ్చుచు,నిరతము‌ తిరుగు మాట

    లాడక తన మాట నువిని రచ్చ నెపుడు

    చేయక తనవారల పైన చెలిమి జూపి

    మెట్టినింటి వారలపైన మిడిసి పడెడి

    ప్రేమ లేని మగని జూచి భామ‌ మురియు

    రిప్లయితొలగించండి

  9. చెంతన సుందరాంగులగు చేడియ లెందరొ తిర్గు చుండిన నే
    కాంతము కోరబోడు, మమకారము వీడడు పత్ని యన్న తా
    నింతులు పల్కరించినను హ్రీతము చెందుచు నన్య స్త్రీలపై
    సుంతయు ప్రేమలేని పతిఁ జూచిసతీమణి పొందు మోదమున్.

    రిప్లయితొలగించండి
  10. ఇంతులఁ జాడఁ జూడడు విహీనదురీక్షణసాయకమ్ములం
    జెంతనె నంటియుండె లమి చీరచెఱంగును వీడఁ బోడు క
    వ్వింతల శాంతిఁ గూర్చి మురిపించు సుశీలుడు మత్తుఁ గ్రోలుటన్
    సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  11. రామ! రామ! రామ! రమణులన్నను సిగ్గు
    ఆడ వార లన్న చూడ నొల్ల
    డేదియైననేమి యితర లేమల పైన
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి. మీరు ఆటవెలది వ్రాసారు.
      రామ! రామ! రామా! సిగ్గు రమణులన్న
      నాడువారలన్న నెవరి జూడనొల్ల
      డేది యైననేమి లేత లితరులందు
      ప్రేమ లేని మగని జూచి భామ మురియు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు! పద్యాన్ని చక్కగా మార్చారు.

      తొలగించండి
  12. సంతత ప్రేమభావమున చక్కని తోడును జోడునైసదా
    పంతము లాడకే ప్రణయ బంధమునిల్పెడు యత్నశీలు డా
    వంతయు కోపగించకయె వాంఛల దీర్చుచు నన్యకాంతపై
    సుంతయు ప్రేమలేని పతిజూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    ఎంతయు నాకలిన్ సయిచు నెంచడు సత్రము నారగించగా
    నింతియె వండగా వలయు నిచ్ఛగు రీతిని నింటి పట్టునే
    పంతము నిల్చు పస్తుగను, పక్కిలి వారిది పుల్లగూరనన్
    సుంతయు ప్రేమ లేని పతి జూచి సతీమణి పొందు మోదమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. సంతసమొంద బత్ని పతి సన్మతి
    గా లము గడ్పుచుంద్రు వా
    రింతయు చింతలేకను జరింతురు
    మిక్కిలి ప్రేమ పక్షులై
    స్వాంతము నందునన్ యొరుల
    సాధ్విపయిం గడునమ్మకంగ తా
    సుంతయు ప్రేమ లేని పతి జూచి
    సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "లేకయె చరింతురు... స్వాంతము నందునన్ పరుల సాధ్వి.." అనండి. (అందునన్+ఒరుల.. యడాగమం రాదు)

      తొలగించండి
  15. సద్గుణంబులతో గూడి సందడించి
    యామె మీదను తప్పించి యంతకుమితి
    మీరి పుట్టింటి యాస్తుల మీద మనసు,
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు

    రిప్లయితొలగించండి
  16. అత్త యింటికి వచ్చిన కొత్త జామి ,
    యరుదయిన భోజ్యములనగ నల్పమైన
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు
    తాను వండెడగత్యము దప్పెననుచు

    రిప్లయితొలగించండి
  17. భర్త నదుపులోనుంచెడి వ్రతము నెరిగి
    పుణ్యకవ్రతదీక్షను మొదలు పెట్టి
    సత్యభామ కలగనియెన్; సవతులందు
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు

    రిప్లయితొలగించండి
  18. సంతల లోన జాతరల చావడు లందున యాత్రలందునన్
    కంతుడు వీడెపో యనగ కాంతలు కొందరు చాటు మాటునన్
    గంతకుతగ్గబొంత సతికైమను,చెంతకు చేరు స్త్రీలపై
    సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
  19. పంతము పట్టె పార్వతియె శంకరు చేయిని పట్టు కోరికన్

    అంతమునాది లేని పరమాత్ముడు , బిచ్చమునెత్తు వాడు , ధీ

    మంతుడు , శుల్కమున్నొదలి పెండిలియాడెను కట్న రాశిపై

    సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  20. ఎన్ని సిరులున్న సంపదలెన్నియున్న
    మగని ప్రేమను వాంఛింత్రు మగువలెపుడు
    బరగ నిసుమంత పరసతి పైన తనకు
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు

    రిప్లయితొలగించండి
  21. తే.గీ.అత్తమామల సొమ్ములకాశఁబడక
    తల్లిదండ్రుల ప్రేమనుదనరుఁగొనుచు,
    నతిశయించకఁదనపైననతివినయపు
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు”

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  22. సవరణతో
    కంతునిబోలు రూపమున కాసులకింతయు లోటులేక ధీ
    మంతుడు సత్యవాగ్విభవ మాన్యుడు కీర్తియుతుండు నేర్పరిన్
    సంతతతృప్త మానసుడు శౌరికిభక్తుడు పాపచింతపై
    సుంతయు ప్రేమలేని పతిజూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పునః సవరణతో

      కంతునిబోలు రూపమున కాసులకింతయు లోటులేక ధీ
      మంతుడు సత్యవాగ్విభవ మాన్యుడు కీర్తియుతుండు దక్షుడున్
      సంతతతృప్త మానసుడు శౌరికిభక్తుడు పాపచింతపై
      సుంతయు ప్రేమలేని పతిజూచి సతీమణి పొందు మోదమున్

      తొలగించండి
    2. సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  23. వింతగు వల్వలందు కనువిందుగనందములారబోయుచున్
    కంతుని కోలలై తనువు గాల్చెడి కీలల రేపు చానలే
    చెంతకు జేర రమ్మనుచు చిన్నెలు జూపిననట్టి వారిపై
    సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
  24. అన్య కాంతలు గోరిన నైచ్ఛికంపు
    ప్రేమ లేనిమగని జూచి భామ మురియు
    దనకు తోడుగా దనభర్త మనగ వలయు
    ననుచు గోరుకొందురుగద యతివలెపుడు

    రిప్లయితొలగించండి
  25. చింతను బొందుదా మీగుల జీవిత మెట్లుగ నీడ్తునంచికన్
    సుంతయు బ్రేమలేని పతిజూచి సతీమణి,పొందు మోదమున్
    వంతలు లేక జీవితము బాగుగ సాగుట కారణంబుగా
    చింతలు లేక యుండుటయ శ్రేయము పృధ్విని నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  26. సంతతము తన్ను సేవించు సతినిఁ గాంచి
    భర్త యుప్పొంగు మిక్కిలి స్వాంత మందు
    నుల్ల మందు నారయ సుంతయుఁ గపటంపుఁ
    బ్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు


    ఇంతికిఁ బ్రీతి మిక్కుటమ యీక్షిత వస్తు గణ క్రయమ్ముపై
    సంతత మట్టు లైన మఱి చాలునె పైకము లెన్ని యున్ననున్
    వింతఁగ స్వీయ భర్తయును విశ్వమునం దని దుర్వ్యయమ్ములన్
    సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
  27. పంతము తోడ నెప్పుడును వర్తిల నెంచక, చిత్తశుద్ధి నా
    సాంతముఁ బంచుచున్ వలపు, సఖ్యతతోఁ గని యత్తమామలన్,
    చింతిలు నట్లు వాదములఁ జేయక, కన్పడు యన్యకాంతపై
    సుంతయుఁ బ్రేమ లేని, పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్

    రిప్లయితొలగించండి
  28. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ఉ:

    వంతున కాశిలో విడచి వచ్చెను మెచ్చిన పండు, కాయ తా
    నంతట మెక్క రాదనుచు నంచుకు నిక్కము సమ్మతింపడౌ
    యెంతటి దీక్షనో గనగ నింతయు ముచ్చట, నాశ జూపడీ
    సుంతయు ప్రేమ లేని పతి, జూచి సతీమణి పొందు మోదమున్

    వంతుఁన=,ఆచారము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. తే.గీ..
    అర్ధభాగము ననుచును ననునయముగ
    కంటిపాపగ జూచుచు వెంటనంటి
    కలను నైన నెదురు కంజముఖులపైన
    ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు!!!

    రిప్లయితొలగించండి
  31. ఉత్పలమాల:
    చెంతకు రాడు సున్నితపుఁజెక్కిలి మీటడు కన్ను గీఁటడీ
    వింత మొగుండు?! కారణము పెద్ద పరీక్ష కు సిద్ధమౌటయే!
    పంతము పూని విద్యపయి పట్టు బిగించుట యక్కరే యనన్
    *సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి, సతీమణి పొందు మోదమున్!!*

    రిప్లయితొలగించండి
  32. చదువు‌సంధ్యలు నేర్చి తా చక్కనైన
    కొలువు నందియనంతమౌ కూర్మి తోడ
    కన్నవారిని మెప్పించి కట్న మందు
    ప్రేమలేని మగని జూచి భామమురియు

    రిప్లయితొలగించండి