7, జూన్ 2021, సోమవారం

సమస్య - 3745

8-6-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్”
(లేదా...)
“భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్”

45 కామెంట్‌లు:

 1. ఆర్యుడు రాముని పత్నిని
  చౌర్యముజేసిన నసురుడు చచ్చెను గాదే
  మర్యాద మరచి యితరుల
  భార్యను బ్రేమించువాడు భ్రష్టుండె యగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పర్యవసానమున్ గనక పాండవ పత్నిని జూసినంతనే
   ధైర్యము మీరగా దనదు తాపము దీర్చగ తొందరించగా
   కార్యము జక్కబెట్టె నిజకాంతుడు వచ్చి పరాయివారిదౌ
   భార్యను బ్రేమతోడ గనువాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్

   తొలగించండి
 2. ఆర్యుల వచనములు వినక
  కార్యము తో పరుల పట్ల గర్వ యుతుండై
  క్రౌర్యము గన బరచుచు పర
  భార్యను బ్రేమించు వాడె భ్రష్టుo డె యగున్

  రిప్లయితొలగించండి
 3. ధైర్యము జూపి యోగ్యమగు దండన చేయకయుండి, నిచ్చలున్
  గ్రౌర్యము జూపుచున్ బహుముఖంబుల గష్టములందు ముంచుచున్
  జౌర్యము శీలహీనత యసాధుగుణంబుల నందియున్నదౌ
  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్.

  రిప్లయితొలగించండి
 4. సమస్య :-
  “భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్”

  *కందం**

  సూర్యుని తేజము వెలిగెడు
  భార్య గృహము నుండగన్ చపలచిత్తమునన్
  ఆర్యులు జెప్పిరిల పరుని
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్
  ‌....................✍️ చక్రి

  రిప్లయితొలగించండి
 5. కార్యములెన్నైన సలుప
  ధైర్యము తనకుండి కూడ ధరణిన స్త్రీ యాం
  తర్యమెరుగనట్టి నరుడు,
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్.

  రిప్లయితొలగించండి
 6. శౌర్యము చూపెను వాలియె

  ధైర్యము కోల్పోయి భ్రాత దైన్యతనుండన్

  సూర్యుని సాక్షిగ తమ్ముని

  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి

 7. ఆర్యా! నా మాటల విను
  భార్యను ప్రేమించు భర్త ప్రాగ్రసురుడె యౌ
  మర్యాద మరచి మిత్రుని
  భార్యను ప్రేమించు వాడు భ్రష్టుండె యగున్.

  రిప్లయితొలగించండి
 8. సమస్య :
  భర్యను బ్రేమతోడ గను
  వాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్

  ( అర్ధాంగి ఆరాధనీయ )

  ఉత్పలమాల
  .................

  ధైర్యము నిచ్చు నెంతయును
  దైన్యము నందిన క్లిష్టవేళలో ;
  గార్యము లన్ని జేయుటకు
  గాంతయె తోడ్పడు నర్ధదేహమై ;
  క్రౌర్య మసూయయున్ గలిగి
  కాలము బుచ్చెడివారి దృష్టిలో
  భార్యను బ్రేమతోడ గను
  వాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్ .

  రిప్లయితొలగించండి

 9. ఆర్యులు పూజ్యులౌ మన మహాత్ములు నాడె వచించిరే భువిన్
  భార్యను బ్రేమతోడ గనువాడు ధురీణుడు దాత్తుడౌను సౌం
  దర్యము గాంచి కామమున ధర్మము వీడుచు నందివర్ధనున్
  భార్యను బ్రేమతోడ గనువాడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్.

  రిప్లయితొలగించండి
 10. శౌర్యముచూపగనతడని
  వార్యమునైననుతెగబడిపారుటమేలే
  ఆర్యముగాదదినితరుల
  భార్యనుప్రేమించువాడుభ్రష్టుడెయగున్

  రిప్లయితొలగించండి
 11. వర రఘు రాముని భార్యను మోహించి
  రావణుడనిలో మరణమొందె,

  మునిపత్ని పొందుకై పోయిన యింద్రుడు
  వేలకన్నుల తోడ వెతను‌బడిసె,


  తమ్ముని‌ భార్యను నెమ్మితో కూడిన
  వాలియున్ పొందెను భంగపాటు

  శంకరుని సతిని వంకర జూపుతో
  కాంచ శిరము పోయె కమలజునకు,


  ముదమున్‌ తన సతికి ముచ్చట తీర్చక
  కామ దాహముతో జగమున పరుల


  భార్యను ప్రేమించు‌ వాడు భ్రష్డుండె య
  గున్, వినవలె కీచకుండ, సతము

  కాచు గంధర్వు లైదుగుర్‌ ఘనత‌తోడ

  నన్ను నిండోల‌గము లోన కన్ను మిన్ను

  కానక కుల కాంతల నవ మాన పరచ

  కలిమి నిడదని సైరంధ్రి పలికె నపుడు

  రిప్లయితొలగించండి
 12. భార్యావిధేయుడైనన్
  సూర్యుని తేజస్సుగలుగు సుందరుడైనన్
  ఆర్యావర్తమున పరుల
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్

  రిప్లయితొలగించండి
 13. భార్యావిధేయుడైనన్
  సూర్యుని తేజస్సుగలుగు సుందరుడైనన్
  ఆర్యావర్తమున పరుల
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. గురుదేవుల సూచించిన సవరణలతో...

   కందం
   దుర్యోచని మేనకఁ గొని
   తిర్యగ్గతి మౌని పొందె దివిరాణ్మహిమన్
   కార్యోన్ముఖుఁడై యటులన్
   భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్

   ఉత్పలమాల
   ఆర్యుని గాధిజున్ గులిశి యప్సర మేనక పొందుఁ జిక్కఁగన్
   బర్యవసానమెంచి బనుపన్ పదివత్సరమట్లు మోహమై
   కార్య విహీనుడై మిగిలె! కామిని, వృద్ధి వినాశమెంచెడున్
   భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్

   తొలగించండి
 15. ధైర్యము సాహసంబు మరి
  దాస్యమొనర్చుచు నెల్లవేళలన్
  కార్యములందు తోడుపడు
  కామిని ముద్దుల భార్యయుండగా
  క్రౌర్యము తోడ నెప్పుడును
  గన్నలు గానక నన్య మానవుం
  భార్యను బ్రేమతోడ గనువాడు
  నిజంబుగ భ్రష్టుడేయగున్

  రిప్లయితొలగించండి
 16. భార్య యొక కాపు, తన చా
  తుర్యముతో తీర్చునిల్లు, తోడై నిలుచున్
  ధైర్యము నింపును; మోసపు
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్.

  రిప్లయితొలగించండి
 17. ఉ:

  ఆర్యుల కాలమెంచి నొక యాచరణమ్మది పెండ్లి యంచనన్,
  స్థైర్యము తోడ భర్త చను దారిన దన్నుగ నిల్చి సర్వమౌ
  చర్యలు చక్కబెట్టనట, చప్పున మెచ్చని యత్త దృష్టిలో
  భార్యను బ్రేమతోడ గనువాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్

  స్థైర్యము =ఓపిక

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 18. వర్యుండగుగా జగతిని
  భార్యను బ్రేమించువాఁడు; భ్రష్టుండె యగున్
  నిర్యత్నుండై నిరతము
  భార్యను వేధించు పరమపాపాత్ముడిలన్

  రిప్లయితొలగించండి
 19. భార్యా సమేతముగ తా
  మర్యాద గొని జగమందు మనగలిగెడి సౌ
  కర్యము వీడి మఱియొకని
  భార్యను బ్రేమించు వాడు భ్రష్టుండె యగున్

  రిప్లయితొలగించండి
 20. కె.వి.యస్. లక్ష్మి:

  క్రౌర్యము మోహము పెరుగగ
  మర్యాదను వీడియుండి మధుకరుడగుచున్
  ఆర్యుడునగు తన మిత్రుని
  భార్యను బ్రేమించువాడు భ్రష్టుండె యగున్.
  (మధుకరుడు=కాముకుడు)

  రిప్లయితొలగించండి
 21. ఆర్యులు పలికిరిటుల “పర
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్”
  సూర్యుని పుత్రుడు వాలికి
  పర్యవసానమిది యనుజు బడతిని పట్టన్

  రిప్లయితొలగించండి
 22. క్రౌర్యము చూపి పుర్వులవి గందర గోళము సేయ, వైద్యులే

  ధైర్యము చెప్పి రోగులకు దైవములయ్యిరి, వైద్య శ్రేష్టులై

  కార్యము వీడి మానవుల కాసువునందు మురారి ప్రాణమౌ

  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  ( కాసువు = రోగము)

  రిప్లయితొలగించండి
 23. కార్యములందునదోడుగ
  ధైర్యమునిచ్చుచుజయముగఁధర్మమునిలుపన్
  క్రౌర్యముజూపుచునింకొక
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్”

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. కార్య మకార్యమా యనుచు గాంచడు పత్ని వచించుచో శిరో
   ధార్యమె, తూచ తప్పని విధాయక మట్లు నొనర్చు, కన్న వా
   రార్యులు మంచి నుడ్వ జెవి నానని యట్లె చరించు వాడు నై
   భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 25. మర్యాదస్తుడు భువిలో
  భార్యను బ్రేమించువాఁడు, భ్రష్టుండె యగున్
  భార్యనుబానిసగతలచి
  క్రౌర్యము చూపించు దుష్ట కర్ముండెపుడున్

  రిప్లయితొలగించండి
 26. క్రౌర్యము చూపి నిత్యమును కాంతుని వేదన పాలు చేయుచున్
  కార్యము లందు నడ్డుపడి, కంతుని క్రీడల రాత్రివేళ మా
  ధుర్యము పంచకుండ కడు దూరుచు మాటలతోడ నున్న యా
  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్

  రిప్లయితొలగించండి
 27. ధైర్యమొకింత లేక పదదాసునిగా నిజకాంత చెంత ని
  ర్వీర్యునిగా చరించు విపరీతమనస్కుడు మానహీనుడున్
  క్రౌర్యతనత్తమామలను కక్కసవెట్టెడి రజ్జులాడియౌ
  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్

  రిప్లయితొలగించండి
 28. ఆర్యులు గంగకున్ పుత్రులు, నావసువుల్ హతులైరి తల్లియౌ
  క్రౌర్యపు గంగతాన్దునుమ, కారణజన్ములు వీరు!వేరు!ఈ
  కార్యమసంగతంబవదు,కాని జగంబున గంగలాంటిదౌ
  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్

  రిప్లయితొలగించండి
 29. వీర్యాతిశ యోద్ధత దు
  ష్కార్యాసక్తుండు నయి విషయ లోలుండై
  మర్యాద గణింపక పర
  భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్


  కార్యము విస్మరింపగను గాదు నిజాంబను భార్య వచ్చినన్
  ధైర్యము తోడ సాఁకుమ సతమ్మును నిద్దఱి నొక్క తీరు నౌ
  దార్యము వీడి నొవ్వు లిడఁ దల్లికి నిత్యము క్రూరురాలునౌ
  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్

  రిప్లయితొలగించండి
 30. ఆర్యుల మాటవినక పర
  భార్యను బ్రేమించువాడు భ్రష్టుండెయగున్
  గ్రౌర్యమునిలవిడ నాడుచు
  మర్యాదగ నుండునతడు మాన్యుడు పుడమిన్

  రిప్లయితొలగించండి
 31. భార్యను బ్రేమతోఁ గనుట భర్తకు ధర్మము తోడునీడయై
  ధైర్యము నిచ్చి దుర్భవము దాటగఁ దోడ్పడు సర్వమైన స
  త్కార్యములందు నాథునకు, కాని వివేకము మాసి యన్యయౌ
  భార్యను బ్రేమతోడఁ గనువాడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్.

  రిప్లయితొలగించండి
 32. ఆర్యులు నెంతజెప్పినను హద్దులు దాటుచు సంచరించి,నీ
  భార్యను బ్రేమతోడగనువాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్
  ధైర్యము గూడగట్టుకొని దేవరకొండ రమాపతీ!యికన్
  క్రౌర్యుని శిక్షగూరిచిని గొందలమందక జింతజేయుమా

  రిప్లయితొలగించండి
 33. తూర్యపు సద్దువోలె సతి దూకుచు గెంతుచు చెమ్మగిల్లుచున్
  శౌర్యము తోడ చేయుపని సాటిగ వచ్చెడి వారు లేరు ఆ
  ధైర్యము నిచ్చు భార్యకును దాస్యము చేయుట మేలు; ధూర్తయౌ
  భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్

  రిప్లయితొలగించండి
 34. మర్యాదగ నుండు నెపుడు
  భార్యనుప్రేమించువాడు; భ్రష్టుండెయగున్
  పర్యవసానము నెంచని
  చర్యల చరియించ నెపుడు జాగృతిలేకన్!

  రిప్లయితొలగించండి
 35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 37. ధైర్యముగలవాడయినను
  శౌర్యము,తేజము కలిగిన సమర్థుడైనన్
  మర్యాదనువీడి పరుని
  భార్యను ప్రేమించువాఁడు భ్రష్టుండె యగున్

  రిప్లయితొలగించండి
 38. ఆర్యావర్తమునందున
  చౌర్యముచేయుచునితరులసంపదలెల్లన్
  మర్యాదను విడియన్యుల
  భార్యల ప్రేమించువాడు భ్రష్టుండెయగున్


  రిప్లయితొలగించండి